QVEdutech
QVEdutech
BookMyDarshan
Varanasi Tour Package! Starting from 3000/- Download Bookmydarshan App from App Store
Now! Book Movie tickets from us!
Bookmydarshan Bahubali 2 (The Conclusion)

ఫిలింనగర్

వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ

-- Hyderabad Published:13 April 2017 05:33:55 PM

ప్రేమ‌ను పంచే `మిస్ట‌ర్` - వ‌రుణ్‌తేజ్‌ మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడిగా మెగా బ్యాక్‌గ్రౌండ్‌తో తెలుగు ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టాడు వ‌రుణ్‌తేజ్‌. అత‌ను న‌టించిన తొలి చిత్రం ముకుంద టౌన్‌లో సాగే ల‌వ్ స్టోరీ. రెండో చిత్రం కంచె రెండో ప్ర‌పంచం నేప‌థ్యంలో సాగిన ల‌వ్‌స్టోరీ. ఆ మ‌ధ్య విడుద‌లైన లోఫ‌ర్ మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో సాగిన చిత్రం. తాజాగా వ‌రుణ్ న‌టంచిన `మిస్ట‌ర్‌` జ‌ర్నీ బేస్డ్ ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ. క‌థ‌కూ, క‌థ‌కూ మ‌ధ్య పోలిక‌లు లేకుండా స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు వ‌రుణ్‌. ఆయ‌న న‌టించిన `మిస్ట‌ర్‌` ఈ నెల 14న విడుద‌ల కానుంది. శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. బేబి భ‌వ్య స‌మ‌ర్పిస్తుండ‌గా న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి వ‌రుణ్‌తేజ్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* `మిస్ట‌ర్‌` గురించి చెప్పండి? -

ఇదొక ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ అండీ. జ‌ర్నీని ఇష్ట‌ప‌డే వ్య‌క్తిగా చేశాను. ఎవ‌రికి ఎలాంటి సాయం కావాల‌న్నా ముందుండే పాత్ర నాది. మ‌రి అలాంటిది నాకు ఏదైనా ప్రాబ్ల‌మ్ వ‌స్తే ఎవ‌రు ముందుంటార‌న్న‌ది ఆస‌క్తిక‌రం. ఇందులో.. నాకూ, హీరోయిన్స్ కి త‌లా ఒక క‌థ ఉంటుంది. మా ముగ్గురికీ క‌లిపి మ‌రో క‌థ ఉంటుంది. అదేంట‌న్న‌ది ఆస‌క్తిక‌రం.

* శ్రీనువైట్ల‌తో కాంబినేష‌న్ గురించి చెప్పండి? -

ఆయ‌న్ని క‌లిసి ఏడాద‌వుతోంది. ఆయ‌న‌తో జ‌ర్నీని ఎంజాయ్ చేస్తున్నాను. ఆయ‌న‌తో స్టోరీ డిస్క‌ష‌న్ జ‌రిగిన‌ప్పుడు, షూటింగ్ జ‌రిగిన‌ప్పుడు చాలా మెమ‌ర‌బుల్ మొమెంట్స్ ఉన్నాయి.

* మీతో శ్రీనువైట్ల కొత్త‌గా ట్రై చేసిన‌ట్టున్నారు? -

నిజ‌మే.. నాతో కొత్తే కానీ, ఆయ‌న‌కు ఇలాంటి సినిమాలు చేయ‌డం అల‌వాటే. ఆయ‌న కెరీర్ ప్రారంభంలో ఇలాంటి సినిమాలే చేశారు. కానీ మ‌ధ్య‌లో కొన్ని క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు చేసి హిట్ కొట్టారు. దాంతో అలాంటి చిత్రాల‌నే ఆయ‌న నుంచి చాలా మంది ఆశించారు. ఈ మ‌ధ్య ఆ ఫార్ములా కాసింత బ్రేక్ కావ‌డంతో మ‌ర‌లా త‌న ఒరిజిన‌ల్ ఫార్ములాతోనే సినిమా చేశారు.

* ఇందులో మీరు చాలా కొత్త‌గా క‌నిపిస్తార‌ట క‌దా?

- అవునండీ. నా గ‌త చిత్రాల‌కు భిన్నంగా ఉంటాను. గ‌త సినిమాల్లో ఇంటెన్సిటీ ఉంటుంది. ఇందులో జోవియ‌ల్‌గా ఉంటాను. రొమాంటిక్‌గా క‌నిపిస్తాను.

* శ్రీనువైట్ల కామెడీ, డైలాగ్ టైమింగ్ పెక్యూలియ‌ర్‌గా ఉంటాయి క‌దా.. ఎలా మేనేజ్ చేశారు?

- నిజ‌మే. అలాంటి విష‌యాలు నాకు కొత్త‌. అయినా ప‌ట్టుకోగ‌లిగాను. మానిట‌ర్‌లో చూసుకున్న‌ప్పుడు బాగానే చేశాన‌ని అనిపించింది.

* వ‌రుస‌గా పెద్ద డైర‌క్ట‌ర్ల‌తోనే సినిమాలు చేస్తున్నారు?

- కొత్తా పాతా అని తేడా ఏం లేదు. మంచి స్టోరీ ఎవ‌రు చెప్పినా చేస్తున్నాను. త్వ‌ర‌లో వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్నా.

* సీనియర్ ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డం వ‌ల్ల ప్ర‌త్యేకంగా ఏమైనా ఫ‌లితాలుంటాయా?

 - ఉంటాయండీ. ఒక్కో ద‌ర్శ‌కుడికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. అవ‌న్నీ మ‌న‌కు అల‌వాట‌వుతాయి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది.

* మీ తొలి చిత్రం, మూడో చిత్రం అనుకున్నంత స్థాయి విజ‌యం సాధించ‌లేద‌ని ఏమైనా బాధ‌గా అనిపించింది?

- అవి ప‌ట్టించుకోనేండీ. నా ప్ర‌య‌త్నం సిన్సియ‌ర్‌గా చేస్తాను. రిజ‌ల్ట్ నా చేతిలో ఉండ‌దు. నా ప్ర‌య‌త్నం సిన్సియ‌ర్ న‌మ్మిన ద‌ర్శ‌కులు నాతో సినిమాలు చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నారు. శ్రీనువైట్ల‌గారు ఈ క‌థ‌ను ఎవ‌రితోనైనా తీసి ఉండ‌వ‌చ్చు. కానీ నేను స‌రిపోతాన‌ని ఫీల‌య్యి నాతో చేయ‌డం నాకు హ్యాపీగా అనిపించింది.

మీ బ్యాన‌ర్‌లో సినిమా ఎప్పుడు చేస్తున్నారు?

- క‌థ‌లు వింటున్నాం. అన్నీ స‌వ్యంగా కుదిరితే చేయాలి. అలాగే గీతా ఆర్ట్స్ లోనూ ఓ సినిమా చేయాలి. మంచి క‌థ కోసం ఎదురుచూస్తున్నాం. ఇటీవ‌ల బ‌న్ని బ‌ర్త్ డే కు నాన్న‌గారు వెళ్లిన‌ప్పుడు అర‌వింద్‌గారు కూడా ఆ సినిమా గురించి మాట్లాడార‌ట‌.

* ఫిదా ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింది?

- ఇంకో షెడ్యూల్ ఉందండీ. 20-25 రోజులు ప‌నిచేస్తే పూర్త‌వుతుంది. ప్ర‌స్తుతం మిస్ట‌ర్ మీద ఫోక‌స్ చేస్తున్నా. ఇది పూర్తికాగానే ఫిదా మీద దృష్టి పెడ‌తా.

* ఫిదా ఏ త‌ర‌హా చిత్రం?

- అది కూడా ల‌వ్‌స్టోరీనే అండీ. కాక‌పోతే అది కాస్త క్లాస్ ల‌వ్ స్టోరీ. కామెడీ పెద్ద‌గా ఉండ‌దు. ఆనంద్‌, గోదావ‌రి త‌ర్వాత ఆయ‌న ఆ త‌ర‌హా సినిమాను నాతో చేస్తున్నారు.

* మ‌ల్టీస్టార‌ర్స్ కు సిద్ధమ‌ని ఇదివ‌రకే చెప్పారు.. ఏమైనా క‌థ కుదిరిందా?

- లేదండీ. కానీ చ‌ర‌ణ్‌, తేజ్‌, బ‌న్నీ.. ఎవ‌రితోనైనా చేయ‌డానికి సిద్ధ‌మే. కాక‌పోతే మంచి క‌థ దొరికితే. ఏదో చేశామంటే చేశామ‌న్న‌ట్టు ఉండ‌కూడ‌దు.

QV ERP

news

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సూచ‌న‌లు

అనంత‌పురం జిల్లాలోని ఎర్ర‌తిమ్మ‌రాజు చెరువులో తెప్ప బోల్తా ప‌డి ఒకే కుటుంబంలోని 13 మంది చ‌నిపోయిన దుర్ఘ‌ట‌న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. చెరువు లోతు ప్రాణాలు తీసేంత‌గా ఉన్న‌ప్పుడు స్థానిక పాల‌కులుగానీ, అధికార గ‌ణం కానీ స‌రైన ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవ‌ని విమ‌ర్శించారు. ఇక‌నైనా ప్ర‌జా ప్ర‌తినిధులు మేల్కొనాల‌ని అన్నారు. ఇటువంటి విషాద ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న తెలిపారు. బాధితుల కుటుంబానికి వెంట‌నే సాయం చేయాల‌ని ఆయ‌న సూచించారు.

సి.బి.ఐ కోర్టులో జ‌గ‌న్‌కు ఊర‌ట‌..

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సి.బి.ఐ ప్ర‌త్యేక‌కోర్టులో ఊర‌ట ల‌భించింది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ సిబిఐ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కోర్టు కొట్టేసింది. సిబిఐ వాద‌న‌లు విన్న కోర్టు వారి వాద‌న‌ల‌ను తిరస్క‌రించింది. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారంటూ సిబిఐ త‌ర‌పున న్యాయ‌వాది కోరిన బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌ను కొట్టేసింది. ఆక్ర‌మాస్థుల కేసులో సాక్షిగా ఉన్న మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌మాకాంత్ రెడ్డి సాక్షి ఛానెల్‌లో ఇచ్చిన ఇంట‌ర్వ్యూను వివాదానికి కార‌ణ‌మైంది. జ‌గ‌న్ కావాల‌నే విచార‌ణ తీరును త‌ప్పు ప‌ట్టించేలా మాట్లాడించార‌ని సిబిఐ త‌ర‌పున లాయ‌ర్ వాదించారు. అయితే ఛానెల్ ఎడిట‌ర్ తీసుకునే నిర్ణ‌యాలకు, జ‌గ‌న్‌కు సంబంధం లేదంటూ కోర్టు తెలిపింది. ఇరు ప‌క్షాల వాద‌న‌ను విన్న కోర్టు సిబిఐ పిటీష‌న్‌ను కొట్టేసింది

కాంగ్రెస్ నేత‌ల‌ను నిల‌దీయండి - కె.సి.ఆర్‌

తెలంగాణ 16వ ఆవిర్భావ స‌భ వ‌రంగ‌ల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. భ‌విష్య‌త్, 2019లో జ‌రిగబోయే ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ విజ‌యం సాధించే దిశ‌గా అంద‌రూ కృషి చేయాల‌ని కేడ‌ర్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాజెక్టులు క‌డుతుంటే, కాంగ్రెస్ నాయ‌కులు అడ్డు త‌గులుతున్నారు. కాబ‌ట్టి వారిని గ్రామ ప్ర‌జ‌లు నిల‌దీయాల‌ని సూచించారు. కాంగ్రెస్ పాల‌న కాలంలో ముఖ్య‌మంత్రులు వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, కిర‌ణ్‌కుమార్ రెడ్డిలు తెలంగాణ ప్ర‌జ‌లు, నాయ‌కుల‌ను కించ‌ప‌రిచినా ప‌ట్టించుకోని కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు మాత్రం ఎందుకు అడ్డు త‌గులుతున్నార‌ని ప్ర‌శించారు. ఇలాంటి కాంగ్రెస్ నాయ‌కుల కార‌ణంగా తెలంగాణ పరిస్థితి దారుణంగా త‌యార‌య్యింద‌ని, ప్ర‌జ‌లు పొట్ట కూటి కోసం వేరే ప్రాంతాల‌కు వ‌ల‌స‌లు వెళ్ళార‌ని కూడా అన్నారు.

ఫోన్‌కు రెస్పాండ్ కాకుండే చ‌ర్య‌లు త‌ప్ప‌వు..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కొత్త ముఖ్య‌మంత్రి యోగి అదిత్య‌నాథ్ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను స‌రైన ట్రాక్‌లో పెట్ట‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బయోమెట్రిక్ విధానంలో అటెండెన్స్ ఉండాల‌న్న నిర్ణ‌యం త‌ర్వాత ఆక‌స్మిక చ‌ర్య‌లు చేప‌ట్టారు. అంతంటితో ఆగ‌కుండా ఏ స‌మ‌యంలోనైనా ఉద్యోగులు విధుల్లో ఉన్నారో లేదో తెలుసుకోవ‌డానికి సీఎం సంబంధిత అధికారి ఆఫీస్ ల్యాండ్ లైన్‌కు ఫోన్ చేస్తాన‌ని, ఉద‌యం 9 గంట‌లు నుండి సాయంత్రం 6 గంట‌లు వ‌ర‌కు ఫోన్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఫోన్‌కు స‌మాధానం ఇవ్వ‌కుంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీనియ‌ర్ మినిష్ట‌ర్ శ్రీకాంత్ శ‌ర్మ తెలిపారు. త‌నిఖీలు, సూప‌ర్‌వైజింగ్‌లో ఉండే పోలీసు అధికారులు, ఇత‌ర ఫీల్డ్ వ‌ర్క్‌లోని ఉద్యోగుల‌కు ఇందులో మిన‌హాయింపు ఉంటుంద‌ని పెర్కొన్నారు.

వినోద్ ఖ‌న్నా క‌న్నుమూత‌

సీనియ‌ర్ బాలీవుడ్ హీరో వినోద్ ఖ‌(70)న్నా క్యాన్స‌ర్‌తో క‌న్నుమూశారు. 1968లో మ‌న్ కా మీత్ చిత్రంతో తెరంగేట్రం చేసిన వినోద్ ఖ‌న్నా2015 వ‌ర‌కు విల‌న్‌గా, హీరోగా 140 చిత్రాల‌కు పైగా న‌టించారు. ‘మేరే గావ్‌ మేరా దేశ్‌’, ‘గ‌ద్దార్‌’(1973), ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’, ‘రాజ్‌పుత్‌’, ‘ఖుర్బానీ’, ‘దయావన్‌’ తదితర చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచుకున్నారు. వినోద్ ఖ‌న్నా న‌టించిన చివ‌రి చిత్రం దిల్‌వాలే. సినీ రంగంతో పాటు రాజ‌కీయ రంగంలో కూడా వినోద్ ఖ‌న్నా త‌న‌దైన ముద్ర వేశారు. ప్ర‌స్తుతం గురుదాస్ పూర్ పార్ల‌మెంట్ స‌భ్యుడుగా కొన‌సాగుతున్నారు. 141 చిత్రాల్లో పలు పాత్రల్లో కన్పించిన వినోద్‌ ఖన్నా.. ఫిలింఫేర్‌ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఫిలింఫేర్‌ అవార్డు, స్టార్‌ డస్ట్‌ అవార్డు, జీ సినిమా లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నటించిన మేరే అప్నే అనే హిందీ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు.

స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌పై సుప్రీం కొర‌డా

స్వ‌చ్ఛంద సంస్థ‌ల నిధుల దుర్వినియోగంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ అన్నా హజారే అధ్వ‌ర్యంలో హింద్ స్వ‌రాజ్ ట్ర‌స్ట్ దాఖ‌లు చేసిన ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీం కోర్టు స్వ‌చ్ఛంద సంస్థ‌ల నియంత్ర‌ణ‌పై నూత‌న చ‌ట్టం తీసుకు రావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది. సంస్థ‌ల‌కు నిధులు మంజూరు, నిధులు మిగ‌లుపై తీసుకోవాల్సిన చర్య‌లు త‌దిత‌ర అంశాల‌పై ఎనిమిది వారాల్లో నివేదిక స‌మ‌ర్పించాల‌ని జ‌స్టిస్ జె.ఎస్‌.ఖెహ‌ర్‌, డి.వై.చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ ఎస్‌.కె.కౌల్‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఉత్త‌ర్వులు కోరింది. కౌన్సిల్ ఫ‌ర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ పీపుల్ యాక్ష‌న్ అండ్ రూర‌ల్ టెక్నాల‌జీ(క‌పార్ట్‌) నివేదిక నిధులు దుర్వినియోగం చేసిన 159 సంస్థ‌లపై కేసులు న‌మోదు చేయాల‌ని సిపార్స్ చేసిన‌ట్టు తెలిపింది. నిషిద్ధ జాబితాలోని 718 సంస్థ‌ల్లో వ్య‌య వివ‌రాలు సమ‌ర్పించిన 15 సంస్థ‌ల‌ను జాబితా నుండి తొల‌గించామ‌ని తెలిపాం.

హుగ్లీలో కూలిన బ్రిడ్జ్‌..

ప‌శ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. భ్రందేశ్వ‌ర్ ప్రాంతంలో ఓడ‌లో ఎక్కేందుకు నిర్మించిన బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మ‌ర‌ణించ‌గా 65 మంది గ‌ల్లంత‌య్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లాన్ని చేరుకుని స‌హాయ చర్య‌లు చేప‌ట్టారు. స‌ముద్రంలో భారీ అల‌లు కార‌ణంగా వంతెన కూలిపోయింద‌ని అధికారులు పెర్కొన్నారు. గ‌ల్లంతైన వారి కోసం గ‌జ ఈత‌గాళ్ళు గాలింపు చర్య‌లు చేప‌ట్టారు

2014 త‌ర్వాత టీచ‌ర్ డిగ్రీలు చెల్ల‌వు

2014లో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండ‌లి జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం తెలుగు పండిత, ఉర్దూ, హిందీ పండిత శిక్ష‌ణ కోర్సులేవీ చెల్ల‌వు. 2014కు ముందు ఎస్‌సిఇటి గుర్తింపు క‌లిగి ఉండే మాత్ర‌మే మిన‌హాయింపు ఉంటుంది. ఈ డిగ్రీతో స‌మానంగా ఉన్న 16 ర‌కాల కోర్సులు కూడా చెల్లుబాటు కావ‌ట‌. తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్‌, గురుకుల టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీకి దర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొత్త పేర్ల‌తో డిగ్రీలు పెట్టిన ద‌ర‌ఖాస్తులు వ‌స్తుండ‌టంతో ఎస్‌సిఇఆర్‌టి నుండి స్ప‌ష్ట‌త తీసుకురావాల‌ని టిఎస్‌పీఎస్పీ స్ప‌ష్టం చేసింది. అభ్య‌ర్థులు దీనిపై విద్యాశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రంజీవి్ ఆర్ ఆచార్య‌, పాఠ‌శాల విద్య డైరెక్ట‌ర్ కిష‌న్‌, ఎస్‌సిఇఆర్‌టి డైరెక్ట‌ర్ జ‌గ‌న్నాథ‌రెడ్డిని క‌లిశారు. యూజిసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. ఆ కోర్సుల్లో 16 డిగ్రీల‌కు యూజిసి గుర్తింపు లేద‌ని, మ‌రో 7 ర‌కాల డిగ్రీల‌పై సందేహాలున్నాయ‌ని తెలిపారు. దీంతో డిగ్రీల విష‌యంలో ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా మెల్కొనాల‌ని విద్యాశాఖ వ‌ర్గాలు పెర్కొన్నాయి.

latest videos

ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్ 9 మోషన్ పోస్టర్ విడుదల

అమీ తుమీ టీజర్

కొబ్బరి మట్టా, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు 2017

శ్రీ ముఖి డబ్ స్మాష్ ఓ సక్కనోడా గురు మూవీ సాంగ్

వాట్ ఏ ఇంస్పైరింగ్ స్పీచ్ !! # రితిక సింగ్

ఏదో ఏదో బాగుందే పూర్తీ సాంగ్ || మిస్టర్ మూవీ ||వరుణ్ తేజ్ హెబ్భా పటేల్ ||మిక్కీ జె మేయర్