రేటింగ్ః 4/5

"/> రేటింగ్ః 4/5

"/> రేటింగ్ః 4/5

" /> telugunewsreel.com
QVEdutech
QVEdutech
BookMyDarshan
Varanasi Tour Package! Starting from 3000/- Download Bookmydarshan App from App Store
Now! Book Movie tickets from us!
Bookmydarshan Bahubali 2 (The Conclusion)

సినిమా సమీక్షలు

బాహుబలి 2 రివ్యూ

-- Hyderabad Published:29 April 2017 10:47:29 AM

సమర్పణ: కె.రాఘవేంద్రరావు

నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్‌  

తారాగణం: ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా, సత్యరాజ్‌, నాజర్‌, రమ్యకృష్ణ , సుబ్బరాజు తదితరులు

సంగీతం: ఎం.ఎం.కీరవాణి

సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌కుమార్‌

కథ: వి.విజయేంద్రప్రసాద్‌

ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబుశిరిల్‌

వి.ఎఫ్‌.ఎక్స్‌: కమల్‌ కణ్ణన్‌

కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు

యాక్షన్‌: కింగ్‌ సాల్మాన్‌

సౌండ్‌ డిజైనర్‌: పి.ఎం.సతీష్‌

క్యాస్టూమ్స్‌: రమారాజమౌళి, ప్రశాంతి త్రిపురినేని

లైన్‌ ప్రొడ్యూసర్‌: శ్రీవల్లీ

నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని

దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌నే ప్ర‌శ్న బాహుబ‌లి 2తో ఎట్ట‌కేల‌కు విడిపోయింది. గ‌త రెండేళ్ళుగా అంద‌రూ ఎదురుచూసిన స‌మాధానం. అయితే ఒక సీన్‌తో ముగిసిపోయే సమాధానం కాదు, ప్రీ క్లైమాక్స్‌లో వ‌చ్చే స‌న్నివేశం కావ‌డంతో సినిమా అంతా చూసేలా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి బాహుబ‌లి 2 చిత్రాన్ని తెర‌కెక్కించాడు. రాజాజ్ఞ‌ను పాటించే క‌ట్ట‌ప్ప రాజునే ఎందుకు చంపాడు. మొద‌టి పార్ట్‌లో నా త‌ప్పుల‌ను క్ష‌మించు అని శివ‌గామి ఎందుకు చెప్పింది? ఇంత‌కు ఆమె చేసిన త‌ప్పేంటి? మ‌రి క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని చంపేంత ఎం వ‌చ్చింది? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కావాలంటే బాహుబ‌లి 2 చూడాల్సిందే. విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన బాహుబ‌లి రెండో భాగం కోసం సినీ ప్ర‌పంచంతో పాటు అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూశారు. తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి తెలియ‌జేసిన బాహబ‌లి సినిమా గురించి తెలుసుకోవాలంటే ముందు క‌థ తెలుసుకుందాం...

క‌థః

మ‌హిష్మ‌తి రాజ్యానికి వార‌సుడు అయిన మ‌హేంద్ర బాహుబ‌లి( ప్ర‌భాస్‌), శివుడుగా అట‌వికుల‌తో పెంచ‌బ‌డుతాడు. అవంతిక ప్రేమ కోసం మ‌హిష్మ‌తి రాజ్యంలోకి ప్రవేశించిన బాహుబ‌లి, త‌న త‌ల్లి ఎవ‌రో తెలియ‌కుండానే ఆమెను ర‌క్షిస్తాడు. దేవ‌సేన‌ను ర‌క్షించే ప్ర‌య‌త్నంలో భాగంగా క‌ట్ట‌ప్ప‌(స‌త్య‌రాజ్‌)తో గొడ‌వ‌ప‌డ‌తాడు. మ‌హిష్మ‌తి మ‌హారాజు భ‌ళ్ళాలదేవుడు(రానా) త‌న‌యుడు భ‌ద్ర‌ను చంపేస్తాడు. మ‌హేంద్ర బాహుబ‌లి చూసిన క‌ట్ట‌ప్ప వారి రాజు, దైవం అమ‌రేంద్ర బాహుబ‌లి గురించి క‌థ చెబుతాడు.

కాళ‌కేయుల‌ను యుద్ధంలో ఓడించిన అమ‌రేంద్ర బాహుబ‌లి మ‌హారాజుగా నిర్ణ‌యింప‌బ‌డ‌తాడు. రాజ‌మాత శివ‌గామి మాట‌పై క‌ట‌ప్ప‌తో క‌లిసి దేశాట‌న బ‌య‌లుదేరుతాడు. కుంత‌ల దేశం చేరుకున్న అమరేంద్ర బాహుబ‌లి యువ‌రాణి దేవ‌సేన‌(అనుష్క‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె ప్రేమ పొంద‌డం కోసం బాహుబ‌లి కుంత‌ల రాజ్యంలోనే ఉండిపోతాడు. ఈలోపు దేవ‌సేన అందచందాలు, తెలివి తేట‌లు గురించి తెలుసుకున్న భ‌ళ్ళాల‌దేవుడు, దేవ‌సేనను త‌న భార్య‌గా చేయ‌మ‌ని త‌ల్లి శివ‌గామిని కోరుతాడు. శివ‌గామి కూడా స‌రేన‌ని మాట ఇచ్చేసి కోడ‌లు క‌మ్మని దేవ‌సేన‌కు వ‌ర్త‌మానం పంపుతుంది. భ‌ళ్ళాల‌దేవుడు కుతంత్రం తెలియ‌ని దేవ‌సేన, శివ‌గామికి ఎదురుచెబుతుంది. దాంతో కోపం తెచ్చుకున్న శివ‌గామి దేవ‌సేన‌ను బంధించ‌మ‌ని కుంత‌ల రాజ్యంలోని బాహుబ‌లికి వ‌ర్త‌మానం పంపుతుంది.

తాను భార్య‌గా ఎంతదూరం అయినా వ‌స్తాను కానీ ఆత్మమాభినం చంపుకుని బంధీగా రాలేన‌ని దేవ‌సేన‌, బాహుబ‌లితో అంటుంది. దేవ‌సేన మాన ప్రాణాల‌ను బాధ్య‌త‌గా తీసుకున్న బాహుబ‌లి ఆమెకు మాట ఇచ్చి, దేవ‌సేన‌ను మ‌హిష్మ‌తికి తీసుకుని వ‌స్తాడు. రాజ్య‌స‌భ‌లో బాహుబ‌లి దేవ‌సేన వైపు నిల‌వ‌డంతో శివ‌గామి దేవ‌సేన కావాలంటే మ‌హారాజుగా ఉండ‌కూడ‌ద‌నే ష‌ర‌తు పెడుతుంది. దేవ‌సేన‌కు ఇచ్చిన మాట కోసం త‌న మ‌హారాజ ప‌ద‌వినే వ‌దులుకుని స‌ర్వ సైన్యాధ్య‌క్షుడుగా ప‌నిచేయ‌డానికి సిద్ద‌ప‌డ‌తాడు బాహుబ‌లి. అయితే భ‌ళ్ళాల‌దేవుడు కుటిల బుద్ధితో శివ‌గామికి, బాహుబ‌లిపై అనుమానం వ‌చ్చేలా సృష్టించడంతో, శివ‌గామి, బాహుబ‌లిని చంప‌మ‌ని క‌ట్ట‌ప్ప‌కు ఆదేశం ఇస్తుంది.

ఆమె ఆదేశాన్ని అమ‌లు చేసిన క‌ట్ట‌ప్ప‌, అస‌లు విష‌యాన్ని శివ‌గామికి చెప్ప‌డంతో ఏమవుతుంది? భ‌ళ్ళాలదేవుడు ఏం చేస్తాడు? చివ‌ర‌కు త‌న తండ్రి అమ‌రేంద్ర బాహుబ‌లి క‌థ‌ను తెలుసుకున్న మ‌హేంద్ర బాహుబ‌లి ఏం చేస్తాడు? భ‌ళ్ళాల‌దేవుడుని మ‌హేంద్ర బాహుబ‌లి ఏం చేస్తాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

బలాలు:

- కథనం

- ఎమోషనల్‌ డ్రామా

- సంగీతం

- బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్

- సినిమాటోగ్రఫీ

- విఎఫెక్స్‌

బలహీనతలు:

- నిడివి ఎక్కువగా ఉండటం

స‌మీక్షః

ప్ర‌భాస్‌, అనుష్క‌, రానా, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్‌, స‌త్య‌రాజ్ స‌హా న‌టీన‌టులంద‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో చక్క‌గా న‌టించారు. గ్రాఫిక్స్ ఫ‌స్ట్ పార్టును త‌ల‌ద‌న్నేలా ఉన్నాయి. పాట‌లు బావున్నాయి. రీరికార్డింగ్ కూడా బావుంది. మాహిష్మ‌తి రాజాస్థానం, భ‌ల్లాల‌దేవుడి పాల‌న‌, ప్ర‌జ‌లు, సినిమా ప్రారంభంలో అమ‌రేంద్ర బాహుబ‌లి ఏనుగు పొగ‌రు అణ‌చే స‌న్నివేశం వంటివ‌న్నీ ఆక‌ట్టుకుంటాయి. దానికి తోడు ఎద్దుల కొమ్ముల‌కు నిప్పంటించి చేసిన ఫైటు, కుంత‌ల సామ్రాజ్యాన్ని కాపాడ‌టం కోసం ఆన‌క‌ట్ట‌ను ప‌గ‌ల‌కొట్టే విధానం, బాహుబ‌లికి వైజ్ఞానిక శాస్త్రం పట్ల ఉన్న అభిలాష వంటివ‌న్నీ మెప్పిస్తాయి. అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ ఉన్న స‌న్నివేశాల్లో పోటాపోటీగా న‌టించిన వైనం క‌నిపిస్తుంది. చాలా కాలం త‌ర్వాత ఇద్ద‌రు మ‌హిళ‌లు ఎదురెదురుగా త‌ల‌ప‌డి న‌టించిన‌ట్టు అనిపిస్తుంది.

కుంత‌ల దేశం చూడ‌చ‌క్క‌గా అనిపిస్తుంది. కుంత‌ల సామ్రాజ్యంలో స్త్రీలు జ‌రుపుకునే గోపిక పూర్ణిమ పండుగ బావుంది. క‌న్న‌య్య‌ను నిద్ర‌పుచ్చుతూ పాడే పాట‌లో అనుష్క చాలా అందంగా క‌నిపించింది. అనుష్క‌, ప్ర‌భాస్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల్లో రొమాన్స్ గుంభ‌నంగా ఉంది. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడిని మెచ్చుకోవాలి. న‌టులంద‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో చక్క‌గా న‌టించారు. గ్రాఫిక్స్ ఫ‌స్ట్ పార్టును త‌ల‌ద‌న్నేలా ఉన్నాయి. పాట‌లు బావున్నాయి. రీరికార్డింగ్ కూడా బావుంది. మాహిష్మ‌తి రాజాస్థానం, భ‌ల్లాల‌దేవుడి పాల‌న‌, ప్ర‌జ‌లు, సినిమా ప్రారంభంలో అమ‌రేంద్ర బాహుబ‌లి ఏనుగు పొగ‌రు అణ‌చే స‌న్నివేశం వంటివ‌న్నీ ఆక‌ట్టుకుంటాయి. దానికి తోడు ఎద్దుల కొమ్ముల‌కు నిప్పంటించి చేసిన ఫైటు, కుంత‌ల సామ్రాజ్యాన్ని కాపాడ‌టం కోసం ఆన‌క‌ట్ట‌ను ప‌గ‌ల‌కొట్టే విధానం, బాహుబ‌లికి వైజ్ఞానిక శాస్త్రం పట్ల ఉన్న అభిలాష వంటివ‌న్నీ మెప్పిస్తాయి. అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ ఉన్న స‌న్నివేశాల్లో పోటాపోటీగా న‌టించిన వైనం క‌నిపిస్తుంది. చాలా కాలం త‌ర్వాత ఇద్ద‌రు మ‌హిళ‌లు ఎదురెదురుగా త‌ల‌ప‌డి న‌టించిన‌ట్టు అనిపిస్తుంది. సినిమాలో మైన‌స్ పాయింట్లు అని వేలెత్తి చూపించ‌ద‌గ్గ‌వి పెద్ద‌గా ఉండ‌వు. కాక‌పోతే ఈ రెండో భాగంలో అక్క‌డ‌క్క‌డా కొంద‌రికి, ప్ర‌త్యేకించి అనుష్క‌కు త‌ప్ప కాస్ట్యూమ్ డిజైన‌ర్స్ ప్ర‌త్యేకంగా చేసిందేమీ లేదు.

కుమార‌వ‌ర్మ పాత్ర ద్వారా న‌వ్వు తెప్పించాల‌నుకున్నారు కానీ ఆ ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైన‌ట్టు అనిపిస్తుంది. ఆ పాత్ర స‌రిగా న‌వ్వించ‌లేక‌పోయింద‌న్న‌ది వాస్త‌వం. తొలిస‌గంలో `ఇది నా మాట‌. నా మాటే శాస‌నం` అని అన్నీ తెలుసుకుని మ‌స‌లుకున్న శివ‌గామి ఇందులో చెప్పుడు మాట‌లు వింటూ, త‌న చుట్టూ ఏం జ‌రుగుతుందో తెలుసుకోలేని అశ‌క్తురాలిగా క‌నిపిస్తుంది. అప్ప‌టిదాకా ప్రాణంగా చూసుకున్న క‌ట్ట‌ప్ప కేవ‌లం రాజాజ్ఞ కోసం బాహుబ‌లిని చంప‌డం అనేది ఎవ‌రూ ఊహించ‌రు. ప‌దుల బాణాలు గుచ్చుకున్నా లెక్క‌చేయ‌ని బాహుబ‌లి కట్ట‌ప్ప క‌త్తితో పొడ‌వ‌గానే చ‌నిపోవ‌డం చాలా పేల‌వంగా అనిపిస్తుంది. క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడ‌న్న‌ది ఊరించి ఊరించి చివ‌రికి ద‌ర్శ‌కుడు తేల్చేసేశాడ‌న్న‌ది ఇట్టే అర్థ‌మైపోతుంది. ప్రేక్ష‌కుడికి ద‌ర్శ‌కుడు చెప్పిన కార‌ణం పెద్ద మెప్పించేలా అనిపించ‌లేదు.

దాదాపు మూడు గంటల నిడివి ఇప్ప‌టి ప్రేక్ష‌కుడిని కాస్తా ఇబ్బంది పెట్టేదే. అయితే తెలుగు సినిమా అయిన బాహుబ‌లి ఒక మామూలు సినిమా స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగింది. తాజాగా బాహుబ‌లి ది కంక్లూజ‌న్ కూడా ఆ స్థాయిని చేరుకునేలా తెర‌కెక్కింది. తొలి భాగంలో మాహిష్మ‌తి సామ్రాజ్యం మాత్ర‌మే క‌నిపించింది. కానీ పార్ట్ 2 లో కుంత‌ల సామ్రాజ్యం కూడా క‌నుల‌పండువ‌గా అనిపించింది. ప్ర‌భాస్‌, అనుష్క జంట‌గా ఇంత‌కు ముందు చిత్రాల్లో క‌న్నా ఈ సినిమాలో మ‌రింత‌గా అల‌రించారు. ప్ర‌భాస్‌, రానా ఇద్ద‌రూ యుద్ధ స‌న్నివేశాల్లో ఒక‌రిని మించేలా మ‌రొక‌రు క‌నిపించారు. అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు పోటాపోటీగా అనిపించాయి.

ఫ‌స్ట్ పార్ట్ ను శ్ర‌ద్ధ‌గా చూసిన ఎవ‌రైనా సెకండ్ పార్ట్ ను ఇట్టే ఊహించేయ‌వ‌చ్చు. కేవ‌లం రెండు డైలాగుల మీద సెకండాఫ్‌ను అల్లుకున్నారు. కొన్ని సీన్లు ర‌క్తి క‌ట్టించాయి. బిజ్జ‌ల‌దేవుడిగా ఎడ‌మ‌చేయి బాగాలేనివాడిగా నాజ‌ర్ న‌ట‌న కూడా అద్భుతం. ఇందులో ఏ పాత్రా వృథాగా అనిపించ‌లేదు. రాజ‌ప్రాసాదాల‌కు, రాజ స‌భ‌ల‌కు, అంతఃపురాల‌కు సంబంధించి సాబు సిరిల్ ఎక్కువ‌గా ఆగ్రా ఫోర్ట్ ను మోడ‌ల్‌గా తీసుకున్న‌ట్టు ఇట్టే తెలిసిపోతుంది. అహంకారం వ‌ల్ల‌, త‌న మాట నెగ్గాల‌నుకోవ‌డం వ‌ల్ల‌, ఈర్ష్య‌, అసూయ‌ల వ‌ల్ల రాజ్యాలు కూలిపోయాయ‌ని చ‌రిత్ర చెబుతోంది. దాన్ని ఊహాత్మ‌కంగా జాన‌ప‌దానికి జోడించి ఈ క‌థ‌ను అల్లారు. అక్క‌డ‌క్క‌డా భావోద్వేగాలు పండాయి. క‌థ‌ను, స‌న్నివేశాల బ‌లాన్ని, సినిమా నిడివిని ప‌క్క‌న‌పెడితే తొలిస‌గంలో ప్రేక్ష‌కుడికి క‌లిగిన ప్ర‌శ్న‌ల‌కు ఈ చిత్రం స‌మాధాన‌మ‌వుతుంది. విజువ‌ల్ వండ‌ర్‌గా ప్రేక్ష‌కుడిని థియేట‌ర్‌లో క‌ట్టి ప‌డేస్తుంది. చివ‌రాఖ‌రుగా....భ‌ళిరా బాహుబ‌లి..సాహోరే రాజ‌మౌళి...

 

రేటింగ్ః 4/5

QV ERP

news

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సూచ‌న‌లు

అనంత‌పురం జిల్లాలోని ఎర్ర‌తిమ్మ‌రాజు చెరువులో తెప్ప బోల్తా ప‌డి ఒకే కుటుంబంలోని 13 మంది చ‌నిపోయిన దుర్ఘ‌ట‌న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. చెరువు లోతు ప్రాణాలు తీసేంత‌గా ఉన్న‌ప్పుడు స్థానిక పాల‌కులుగానీ, అధికార గ‌ణం కానీ స‌రైన ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవ‌ని విమ‌ర్శించారు. ఇక‌నైనా ప్ర‌జా ప్ర‌తినిధులు మేల్కొనాల‌ని అన్నారు. ఇటువంటి విషాద ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న తెలిపారు. బాధితుల కుటుంబానికి వెంట‌నే సాయం చేయాల‌ని ఆయ‌న సూచించారు.

సి.బి.ఐ కోర్టులో జ‌గ‌న్‌కు ఊర‌ట‌..

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సి.బి.ఐ ప్ర‌త్యేక‌కోర్టులో ఊర‌ట ల‌భించింది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ సిబిఐ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కోర్టు కొట్టేసింది. సిబిఐ వాద‌న‌లు విన్న కోర్టు వారి వాద‌న‌ల‌ను తిరస్క‌రించింది. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారంటూ సిబిఐ త‌ర‌పున న్యాయ‌వాది కోరిన బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌ను కొట్టేసింది. ఆక్ర‌మాస్థుల కేసులో సాక్షిగా ఉన్న మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌మాకాంత్ రెడ్డి సాక్షి ఛానెల్‌లో ఇచ్చిన ఇంట‌ర్వ్యూను వివాదానికి కార‌ణ‌మైంది. జ‌గ‌న్ కావాల‌నే విచార‌ణ తీరును త‌ప్పు ప‌ట్టించేలా మాట్లాడించార‌ని సిబిఐ త‌ర‌పున లాయ‌ర్ వాదించారు. అయితే ఛానెల్ ఎడిట‌ర్ తీసుకునే నిర్ణ‌యాలకు, జ‌గ‌న్‌కు సంబంధం లేదంటూ కోర్టు తెలిపింది. ఇరు ప‌క్షాల వాద‌న‌ను విన్న కోర్టు సిబిఐ పిటీష‌న్‌ను కొట్టేసింది

కాంగ్రెస్ నేత‌ల‌ను నిల‌దీయండి - కె.సి.ఆర్‌

తెలంగాణ 16వ ఆవిర్భావ స‌భ వ‌రంగ‌ల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. భ‌విష్య‌త్, 2019లో జ‌రిగబోయే ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ విజ‌యం సాధించే దిశ‌గా అంద‌రూ కృషి చేయాల‌ని కేడ‌ర్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాజెక్టులు క‌డుతుంటే, కాంగ్రెస్ నాయ‌కులు అడ్డు త‌గులుతున్నారు. కాబ‌ట్టి వారిని గ్రామ ప్ర‌జ‌లు నిల‌దీయాల‌ని సూచించారు. కాంగ్రెస్ పాల‌న కాలంలో ముఖ్య‌మంత్రులు వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, కిర‌ణ్‌కుమార్ రెడ్డిలు తెలంగాణ ప్ర‌జ‌లు, నాయ‌కుల‌ను కించ‌ప‌రిచినా ప‌ట్టించుకోని కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు మాత్రం ఎందుకు అడ్డు త‌గులుతున్నార‌ని ప్ర‌శించారు. ఇలాంటి కాంగ్రెస్ నాయ‌కుల కార‌ణంగా తెలంగాణ పరిస్థితి దారుణంగా త‌యార‌య్యింద‌ని, ప్ర‌జ‌లు పొట్ట కూటి కోసం వేరే ప్రాంతాల‌కు వ‌ల‌స‌లు వెళ్ళార‌ని కూడా అన్నారు.

ఫోన్‌కు రెస్పాండ్ కాకుండే చ‌ర్య‌లు త‌ప్ప‌వు..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కొత్త ముఖ్య‌మంత్రి యోగి అదిత్య‌నాథ్ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను స‌రైన ట్రాక్‌లో పెట్ట‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బయోమెట్రిక్ విధానంలో అటెండెన్స్ ఉండాల‌న్న నిర్ణ‌యం త‌ర్వాత ఆక‌స్మిక చ‌ర్య‌లు చేప‌ట్టారు. అంతంటితో ఆగ‌కుండా ఏ స‌మ‌యంలోనైనా ఉద్యోగులు విధుల్లో ఉన్నారో లేదో తెలుసుకోవ‌డానికి సీఎం సంబంధిత అధికారి ఆఫీస్ ల్యాండ్ లైన్‌కు ఫోన్ చేస్తాన‌ని, ఉద‌యం 9 గంట‌లు నుండి సాయంత్రం 6 గంట‌లు వ‌ర‌కు ఫోన్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఫోన్‌కు స‌మాధానం ఇవ్వ‌కుంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీనియ‌ర్ మినిష్ట‌ర్ శ్రీకాంత్ శ‌ర్మ తెలిపారు. త‌నిఖీలు, సూప‌ర్‌వైజింగ్‌లో ఉండే పోలీసు అధికారులు, ఇత‌ర ఫీల్డ్ వ‌ర్క్‌లోని ఉద్యోగుల‌కు ఇందులో మిన‌హాయింపు ఉంటుంద‌ని పెర్కొన్నారు.

వినోద్ ఖ‌న్నా క‌న్నుమూత‌

సీనియ‌ర్ బాలీవుడ్ హీరో వినోద్ ఖ‌(70)న్నా క్యాన్స‌ర్‌తో క‌న్నుమూశారు. 1968లో మ‌న్ కా మీత్ చిత్రంతో తెరంగేట్రం చేసిన వినోద్ ఖ‌న్నా2015 వ‌ర‌కు విల‌న్‌గా, హీరోగా 140 చిత్రాల‌కు పైగా న‌టించారు. ‘మేరే గావ్‌ మేరా దేశ్‌’, ‘గ‌ద్దార్‌’(1973), ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’, ‘రాజ్‌పుత్‌’, ‘ఖుర్బానీ’, ‘దయావన్‌’ తదితర చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచుకున్నారు. వినోద్ ఖ‌న్నా న‌టించిన చివ‌రి చిత్రం దిల్‌వాలే. సినీ రంగంతో పాటు రాజ‌కీయ రంగంలో కూడా వినోద్ ఖ‌న్నా త‌న‌దైన ముద్ర వేశారు. ప్ర‌స్తుతం గురుదాస్ పూర్ పార్ల‌మెంట్ స‌భ్యుడుగా కొన‌సాగుతున్నారు. 141 చిత్రాల్లో పలు పాత్రల్లో కన్పించిన వినోద్‌ ఖన్నా.. ఫిలింఫేర్‌ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఫిలింఫేర్‌ అవార్డు, స్టార్‌ డస్ట్‌ అవార్డు, జీ సినిమా లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నటించిన మేరే అప్నే అనే హిందీ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు.

స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌పై సుప్రీం కొర‌డా

స్వ‌చ్ఛంద సంస్థ‌ల నిధుల దుర్వినియోగంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ అన్నా హజారే అధ్వ‌ర్యంలో హింద్ స్వ‌రాజ్ ట్ర‌స్ట్ దాఖ‌లు చేసిన ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీం కోర్టు స్వ‌చ్ఛంద సంస్థ‌ల నియంత్ర‌ణ‌పై నూత‌న చ‌ట్టం తీసుకు రావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది. సంస్థ‌ల‌కు నిధులు మంజూరు, నిధులు మిగ‌లుపై తీసుకోవాల్సిన చర్య‌లు త‌దిత‌ర అంశాల‌పై ఎనిమిది వారాల్లో నివేదిక స‌మ‌ర్పించాల‌ని జ‌స్టిస్ జె.ఎస్‌.ఖెహ‌ర్‌, డి.వై.చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ ఎస్‌.కె.కౌల్‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఉత్త‌ర్వులు కోరింది. కౌన్సిల్ ఫ‌ర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ పీపుల్ యాక్ష‌న్ అండ్ రూర‌ల్ టెక్నాల‌జీ(క‌పార్ట్‌) నివేదిక నిధులు దుర్వినియోగం చేసిన 159 సంస్థ‌లపై కేసులు న‌మోదు చేయాల‌ని సిపార్స్ చేసిన‌ట్టు తెలిపింది. నిషిద్ధ జాబితాలోని 718 సంస్థ‌ల్లో వ్య‌య వివ‌రాలు సమ‌ర్పించిన 15 సంస్థ‌ల‌ను జాబితా నుండి తొల‌గించామ‌ని తెలిపాం.

హుగ్లీలో కూలిన బ్రిడ్జ్‌..

ప‌శ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. భ్రందేశ్వ‌ర్ ప్రాంతంలో ఓడ‌లో ఎక్కేందుకు నిర్మించిన బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మ‌ర‌ణించ‌గా 65 మంది గ‌ల్లంత‌య్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లాన్ని చేరుకుని స‌హాయ చర్య‌లు చేప‌ట్టారు. స‌ముద్రంలో భారీ అల‌లు కార‌ణంగా వంతెన కూలిపోయింద‌ని అధికారులు పెర్కొన్నారు. గ‌ల్లంతైన వారి కోసం గ‌జ ఈత‌గాళ్ళు గాలింపు చర్య‌లు చేప‌ట్టారు

2014 త‌ర్వాత టీచ‌ర్ డిగ్రీలు చెల్ల‌వు

2014లో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండ‌లి జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం తెలుగు పండిత, ఉర్దూ, హిందీ పండిత శిక్ష‌ణ కోర్సులేవీ చెల్ల‌వు. 2014కు ముందు ఎస్‌సిఇటి గుర్తింపు క‌లిగి ఉండే మాత్ర‌మే మిన‌హాయింపు ఉంటుంది. ఈ డిగ్రీతో స‌మానంగా ఉన్న 16 ర‌కాల కోర్సులు కూడా చెల్లుబాటు కావ‌ట‌. తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్‌, గురుకుల టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీకి దర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొత్త పేర్ల‌తో డిగ్రీలు పెట్టిన ద‌ర‌ఖాస్తులు వ‌స్తుండ‌టంతో ఎస్‌సిఇఆర్‌టి నుండి స్ప‌ష్ట‌త తీసుకురావాల‌ని టిఎస్‌పీఎస్పీ స్ప‌ష్టం చేసింది. అభ్య‌ర్థులు దీనిపై విద్యాశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రంజీవి్ ఆర్ ఆచార్య‌, పాఠ‌శాల విద్య డైరెక్ట‌ర్ కిష‌న్‌, ఎస్‌సిఇఆర్‌టి డైరెక్ట‌ర్ జ‌గ‌న్నాథ‌రెడ్డిని క‌లిశారు. యూజిసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. ఆ కోర్సుల్లో 16 డిగ్రీల‌కు యూజిసి గుర్తింపు లేద‌ని, మ‌రో 7 ర‌కాల డిగ్రీల‌పై సందేహాలున్నాయ‌ని తెలిపారు. దీంతో డిగ్రీల విష‌యంలో ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా మెల్కొనాల‌ని విద్యాశాఖ వ‌ర్గాలు పెర్కొన్నాయి.

latest videos

ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్ 9 మోషన్ పోస్టర్ విడుదల

అమీ తుమీ టీజర్

కొబ్బరి మట్టా, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు 2017

శ్రీ ముఖి డబ్ స్మాష్ ఓ సక్కనోడా గురు మూవీ సాంగ్

వాట్ ఏ ఇంస్పైరింగ్ స్పీచ్ !! # రితిక సింగ్

ఏదో ఏదో బాగుందే పూర్తీ సాంగ్ || మిస్టర్ మూవీ ||వరుణ్ తేజ్ హెబ్భా పటేల్ ||మిక్కీ జె మేయర్