QVEdutech
QVEdutech
BookMyDarshan
Varanasi Tour Package! Starting from 3000/- Download Bookmydarshan App from App Store
Now! Book Movie tickets from us!
Bookmydarshan Bahubali 2 (The Conclusion)

ఫిలింనగర్

ఇండియ‌న్ సినిమా అంటే బాహుబ‌లి అనే రేంజ్‌కు చేర‌డం గ‌ర్వంగా ఉంది - ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి

-- Hyderabad Published:27 April 2017 05:30:34 PM

బాహుబలితో తెలుగు సినిమాకు కొత్త సొబగులు అద్దారు దర్శకుడు రాజమౌళి. తెలుగు వాడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. బాహుబలి స్వప్నాన్ని నెరవేర్చుకోవడానికి ఐదేళ్ల పాటు మహా యజ్ఞమే చేశారాయన. ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు... అన్నింటిని దాటుకొని బాహుబలి ది బిగినింగ్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రాజమౌళి. దేశంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలబెట్టారు. ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన చిత్రం బాహుబలి ది కన్‌క్లూజన్‌. ఆర్కా మీడియా పతాకంపై రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందఠంగా దర్శకుడు రాజమౌళి బుధవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ సంగతులివి...

బాహుబలి ప్రపంచ స్థాయి గుర్తింపుకు కారణం?

 - సాధారణ సినిమాలతో పోలిస్తే ఈ కథలో ఉన్న భారీతనం, గ్రాఫిక్స్‌, పోరాట ఘట్టాలతో పాటు పలు అంశాలు సినిమా పట్ల అందరిలో ఆసక్తిని పెంచాయి. అన్నింటి కంటే ముఖ్యంగా పాత్రల్లో ఉన్న బలం ప్రేక్షకుల మనసుల్లో బాహుబలిని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది. ఓ సినిమాను చూస్తూ ఎంజాయ్‌ చేస్తే అది మంచి సినిమా అవుతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అందులోని పాత్రలను మరచిపోలేక పోతే అది గొప్ప సినిమా అవుతుంది. బాహుబలి రెండో కోవకు చెందిన సినిమా.

బాహుబలి కోసం ఐదేళ్ళు సమయం కేటాయించే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది?

- బాహుబలి సినిమా ప్రారంభించిన రోజు ఐదేళ్లు పడుతుందని ఊహించలేదు. ఒకసారి మొదలుపెట్టిన తర్వాత వెనక్కి వెళ్లలేము కదా..అందుకు ముందుకెళ్ళాం. అయితే మంచి టీం దొరికింది. ప్రొడ్యూసర్‌ నుంచి లైట్‌బాయ్‌ వరకు కుటుంబంలా కలిసిపోయి పనిచేశాం. అందుకే నాపై చాలా భారం ఉన్నా ఎప్పుడూ దానిని బరువుగా ఫీలవ్వలేదు.

కట్టప్ప బాహుబలిని చంపాడనే ప్రశ్న ఇన్ని రోజులు ఆసక్తిని క్యారీ చేస్తుంని అనుకున్నారా?

-బాహుబలిని ప్రారంభించినపుడు ఆ ఆలోచన లేదు. ఎలాంటి గందరగోళం లేకుండా బాహుబలిని అందరూ కీర్తించే సన్నివేశంతో తొలి భాగాన్ని ముగించాలని అనుకున్నాం. కానీ సాదాసీదా ముగింపు కాకుండా సినిమాలోని ప్రధాన పాత్రలను చూపిస్తూ జనాలకు ఓ ట్విస్ట్‌లాంటిది ఇస్తే బాగుంటుందని అనిపించింది. ఆ ఆలోచనతోనే కట్టప్ప బాహుబలిని చంపే సన్నివేశాన్ని చూపించాం. అది మంచి జలక్‌ అవుతుందని అనుకున్నాం కానీ ఆటంబాంబులా పేలి జనాల మనసులో బలంగా నిలిచిపోతుందని ఊహించలేదు.

బాహుబలి 2 విడుదలకు దాదాపు రెండేళ్ళ సమయం పట్టినట్టు ఉంది?

-రెండు భాగాల మధ్య పద్దెనిమిది నెలల పాటు గ్యాప్‌ వస్తుందని ఊహించలేదు. తొలి భాగాన్ని విడుదల చేసిన నాలుగు నెలల తర్వాతగానీ ఆరు నెలలు తర్వాతగానీ రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించాం. కానీ బాహుబలి ది బిగినింగ్‌తోనే మా వద్ద ఉన్న డబ్బులు మొత్తం అయిపోవడంతో సెకండ్‌ పార్ట్‌ చిత్రీకరణ ఆలస్యమైంది. ప్రేక్షకులు గుర్తించుకుంటారో లేదో అనే ఆలోచనలకు తావులేకుండా మేము నమ్మింది చేసుకుంటూ వెళ్లాం.

దర్శకుడిగా, కథకుడిగా బాహుబలి మీకు సంత ప్తిని మిగిల్చిందా?

-ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలతో పోలిస్తే కథకుడిగా బాహుబలి నాకు ఎక్కువ సంత ప్తిని మిగిల్చింది. నా గత సినిమాలన్నీ హీరోయిజం నేపథ్యంలో రూపొందాయి. కానీ వాటికి భిన్నంగా ఐదారు బలమైన పాత్రల ఆధారంగా బాహుబలి సినిమా చేశాను. నాకు బాగా ఇష్టమైన హీరోయిజాన్ని ఉన్నతంగా చూపించే అవకాశం ఈ సినిమాతో దొరికింది.

దర్శకుడిగా అనుకున్నదాన్ని తెరపై చూపించగలిగారా?

-ఏ దర్శకుడు తన మస్తిష్కంలో ఉన్న ఆలోచనలను హండ్రెడ్‌ పర్సెంట్‌ తెరపై చూపించలేదు. మనసులో చాలా ఆలోచనలు ఉంటాయి. కానీ వాస్తవంగా వాటిని తెరపై చూపించే విషయంలో హీరోలు, బడ్జెట్‌, డేట్స్‌.. ఇలా పలు అంశాల ప్రభావం వాటిపై ఉంటుంది. ఆ పరిధిలను ద ష్టిలో పెట్టుకునే మనం అనుకున్న అంశాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేయాలి. బాహుబలి-2 విషయంలో నా మనసులో ఉన్న కథను దాదాపు చూపించానని అనుకుంటున్నాను. స్టోరీ టెల్లర్‌గా, డైరెక్టర్‌గా బాహుబలి నాకు శాటిస్పాక్షన్‌ ఇచ్చిన సినిమా.

బాహుబలి మొదలుపెట్టినపుడు ఈ స్థాయికి చేరుకుంటుందని ఊహించారా?

-ఈ సినిమా విషయంలో మేము ఊహించిన దానికంటే ప్రేక్షకులు ఎన్నో రేట్లు ఎక్కువ తిరిగిఇచ్చారు. సినిమా హిట్టవుతుందని అనుకున్నాం కానీ ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుందని ఊహించలేదు. భిన్న భాషలకు చేరువ అవుతుందని, పలు దేశాల వారు మమ్మల్ని గౌరవించే స్థాయికి తీసుకెళ్తుందని ఊహించలేదు.

పార్ట్‌ 1కు వచ్చిన రెస్పాన్స్‌ చూసి పార్ట్‌ 2 కథలో మార్పులేమైనా చేశారా?

- నా దృష్టిలో బాహుబలి మొత్తం ఒకే కథ. ప్రేక్షకుడికి సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పాలనే ఉద్దేశ్యంతోనే రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందించాం.ఇప్పటికే సగం చెప్పాను. మిగతా దానిని రెండో భాగంలో చూపించబోతు న్నాననే ఆలోచనే ఎప్పుడూ నా మనసులో ఉండేది. అంతే తప్ప తొలి భాగం విజయవంతమైందని రెండో భాగంలో ప్రేక్షకుడిని మెప్పించడం కోసం ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. కథ అనుకున్నప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానో దానినే చూపించాను. కథలో బలం ఉంది కాబట్టి ఎప్పుడూ భయపడలేదు.

బాహుబలితో దర్శకుడిగా మీ లక్ష్యం నెరవేరిందా?

-నా లక్ష్యాలు, గమ్యాలు అన్ని ఎప్పుడో నెరవేరాయి. పెద్ద దర్శకుడిని కావాలని అనుకొని చిత్రసీమలో అడుగుపెట్టాను. తొలి నాళ్లలోనే ఆ కోరిక నెరవేరింది. మహాభారతాన్ని తెరకెక్కించాలన్న లక్ష్యమొక్కటే మిగిలింది. కానీ ఇంకో పదేళ్ల వరకు ఆ సినిమా చేయలేను కావచ్చు.

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం ఎలా అనిపిస్తుంది?

-తెలుగుతో పాటు దక్షిణాది చిత్రసీమ అంటూ ఒకటుందని ప్రపంచంలో చాలా దేశాల వారికి తెలియదు. ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ మాత్రమే గుర్తుకువస్తుంది. కానీ అసలైన భారతీయ సినిమా అంటే బాహుబలి అని చెప్పుకునే స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లినందుకు గర్వపడుతున్నాను.

ఇంతటి భారీ చిత్రాన్ని రూపొందించడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలేవి?

-నిర్మాతలు, ప్రభాస్‌తో పాటు కుటుంబ ప్రోత్సాహంతోనే ఈ సినిమా పూర్తి చేయగలిగాను. నన్ను, నా కథను, ప్రతిభను నమ్మి వారి జీవితాల్ని రిస్క్‌లో పెట్టి మరో ఆలోచన లేకుండా నిర్మాతలు ముందుకు వచ్చారు. మా కుటుంబం నన్ను ఐదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడింది. నేను కన్న కలను సాకారం చేసుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ నాకు అండగా నిలిచారు.కుటుంబం లేనిదే నేను లేను. అలాగే ప్రభాస్‌ సినిమాను పెద్ద స్థాయిలో నిలబెట్టడం కోసం చాలా కష్టపడ్డాడు.

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌..?

- ఇంకా ఏం ఆలోచించలేదే. హాలీడే ట్రిప్‌ వెళ్ళి వచ్చి ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తాను.

QV ERP

news

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సూచ‌న‌లు

అనంత‌పురం జిల్లాలోని ఎర్ర‌తిమ్మ‌రాజు చెరువులో తెప్ప బోల్తా ప‌డి ఒకే కుటుంబంలోని 13 మంది చ‌నిపోయిన దుర్ఘ‌ట‌న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. చెరువు లోతు ప్రాణాలు తీసేంత‌గా ఉన్న‌ప్పుడు స్థానిక పాల‌కులుగానీ, అధికార గ‌ణం కానీ స‌రైన ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవ‌ని విమ‌ర్శించారు. ఇక‌నైనా ప్ర‌జా ప్ర‌తినిధులు మేల్కొనాల‌ని అన్నారు. ఇటువంటి విషాద ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న తెలిపారు. బాధితుల కుటుంబానికి వెంట‌నే సాయం చేయాల‌ని ఆయ‌న సూచించారు.

సి.బి.ఐ కోర్టులో జ‌గ‌న్‌కు ఊర‌ట‌..

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సి.బి.ఐ ప్ర‌త్యేక‌కోర్టులో ఊర‌ట ల‌భించింది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ సిబిఐ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కోర్టు కొట్టేసింది. సిబిఐ వాద‌న‌లు విన్న కోర్టు వారి వాద‌న‌ల‌ను తిరస్క‌రించింది. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారంటూ సిబిఐ త‌ర‌పున న్యాయ‌వాది కోరిన బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌ను కొట్టేసింది. ఆక్ర‌మాస్థుల కేసులో సాక్షిగా ఉన్న మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌మాకాంత్ రెడ్డి సాక్షి ఛానెల్‌లో ఇచ్చిన ఇంట‌ర్వ్యూను వివాదానికి కార‌ణ‌మైంది. జ‌గ‌న్ కావాల‌నే విచార‌ణ తీరును త‌ప్పు ప‌ట్టించేలా మాట్లాడించార‌ని సిబిఐ త‌ర‌పున లాయ‌ర్ వాదించారు. అయితే ఛానెల్ ఎడిట‌ర్ తీసుకునే నిర్ణ‌యాలకు, జ‌గ‌న్‌కు సంబంధం లేదంటూ కోర్టు తెలిపింది. ఇరు ప‌క్షాల వాద‌న‌ను విన్న కోర్టు సిబిఐ పిటీష‌న్‌ను కొట్టేసింది

కాంగ్రెస్ నేత‌ల‌ను నిల‌దీయండి - కె.సి.ఆర్‌

తెలంగాణ 16వ ఆవిర్భావ స‌భ వ‌రంగ‌ల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. భ‌విష్య‌త్, 2019లో జ‌రిగబోయే ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ విజ‌యం సాధించే దిశ‌గా అంద‌రూ కృషి చేయాల‌ని కేడ‌ర్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాజెక్టులు క‌డుతుంటే, కాంగ్రెస్ నాయ‌కులు అడ్డు త‌గులుతున్నారు. కాబ‌ట్టి వారిని గ్రామ ప్ర‌జ‌లు నిల‌దీయాల‌ని సూచించారు. కాంగ్రెస్ పాల‌న కాలంలో ముఖ్య‌మంత్రులు వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, కిర‌ణ్‌కుమార్ రెడ్డిలు తెలంగాణ ప్ర‌జ‌లు, నాయ‌కుల‌ను కించ‌ప‌రిచినా ప‌ట్టించుకోని కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు మాత్రం ఎందుకు అడ్డు త‌గులుతున్నార‌ని ప్ర‌శించారు. ఇలాంటి కాంగ్రెస్ నాయ‌కుల కార‌ణంగా తెలంగాణ పరిస్థితి దారుణంగా త‌యార‌య్యింద‌ని, ప్ర‌జ‌లు పొట్ట కూటి కోసం వేరే ప్రాంతాల‌కు వ‌ల‌స‌లు వెళ్ళార‌ని కూడా అన్నారు.

ఫోన్‌కు రెస్పాండ్ కాకుండే చ‌ర్య‌లు త‌ప్ప‌వు..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కొత్త ముఖ్య‌మంత్రి యోగి అదిత్య‌నాథ్ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను స‌రైన ట్రాక్‌లో పెట్ట‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బయోమెట్రిక్ విధానంలో అటెండెన్స్ ఉండాల‌న్న నిర్ణ‌యం త‌ర్వాత ఆక‌స్మిక చ‌ర్య‌లు చేప‌ట్టారు. అంతంటితో ఆగ‌కుండా ఏ స‌మ‌యంలోనైనా ఉద్యోగులు విధుల్లో ఉన్నారో లేదో తెలుసుకోవ‌డానికి సీఎం సంబంధిత అధికారి ఆఫీస్ ల్యాండ్ లైన్‌కు ఫోన్ చేస్తాన‌ని, ఉద‌యం 9 గంట‌లు నుండి సాయంత్రం 6 గంట‌లు వ‌ర‌కు ఫోన్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఫోన్‌కు స‌మాధానం ఇవ్వ‌కుంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీనియ‌ర్ మినిష్ట‌ర్ శ్రీకాంత్ శ‌ర్మ తెలిపారు. త‌నిఖీలు, సూప‌ర్‌వైజింగ్‌లో ఉండే పోలీసు అధికారులు, ఇత‌ర ఫీల్డ్ వ‌ర్క్‌లోని ఉద్యోగుల‌కు ఇందులో మిన‌హాయింపు ఉంటుంద‌ని పెర్కొన్నారు.

వినోద్ ఖ‌న్నా క‌న్నుమూత‌

సీనియ‌ర్ బాలీవుడ్ హీరో వినోద్ ఖ‌(70)న్నా క్యాన్స‌ర్‌తో క‌న్నుమూశారు. 1968లో మ‌న్ కా మీత్ చిత్రంతో తెరంగేట్రం చేసిన వినోద్ ఖ‌న్నా2015 వ‌ర‌కు విల‌న్‌గా, హీరోగా 140 చిత్రాల‌కు పైగా న‌టించారు. ‘మేరే గావ్‌ మేరా దేశ్‌’, ‘గ‌ద్దార్‌’(1973), ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’, ‘రాజ్‌పుత్‌’, ‘ఖుర్బానీ’, ‘దయావన్‌’ తదితర చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచుకున్నారు. వినోద్ ఖ‌న్నా న‌టించిన చివ‌రి చిత్రం దిల్‌వాలే. సినీ రంగంతో పాటు రాజ‌కీయ రంగంలో కూడా వినోద్ ఖ‌న్నా త‌న‌దైన ముద్ర వేశారు. ప్ర‌స్తుతం గురుదాస్ పూర్ పార్ల‌మెంట్ స‌భ్యుడుగా కొన‌సాగుతున్నారు. 141 చిత్రాల్లో పలు పాత్రల్లో కన్పించిన వినోద్‌ ఖన్నా.. ఫిలింఫేర్‌ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఫిలింఫేర్‌ అవార్డు, స్టార్‌ డస్ట్‌ అవార్డు, జీ సినిమా లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నటించిన మేరే అప్నే అనే హిందీ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు.

స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌పై సుప్రీం కొర‌డా

స్వ‌చ్ఛంద సంస్థ‌ల నిధుల దుర్వినియోగంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ అన్నా హజారే అధ్వ‌ర్యంలో హింద్ స్వ‌రాజ్ ట్ర‌స్ట్ దాఖ‌లు చేసిన ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీం కోర్టు స్వ‌చ్ఛంద సంస్థ‌ల నియంత్ర‌ణ‌పై నూత‌న చ‌ట్టం తీసుకు రావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది. సంస్థ‌ల‌కు నిధులు మంజూరు, నిధులు మిగ‌లుపై తీసుకోవాల్సిన చర్య‌లు త‌దిత‌ర అంశాల‌పై ఎనిమిది వారాల్లో నివేదిక స‌మ‌ర్పించాల‌ని జ‌స్టిస్ జె.ఎస్‌.ఖెహ‌ర్‌, డి.వై.చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ ఎస్‌.కె.కౌల్‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఉత్త‌ర్వులు కోరింది. కౌన్సిల్ ఫ‌ర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ పీపుల్ యాక్ష‌న్ అండ్ రూర‌ల్ టెక్నాల‌జీ(క‌పార్ట్‌) నివేదిక నిధులు దుర్వినియోగం చేసిన 159 సంస్థ‌లపై కేసులు న‌మోదు చేయాల‌ని సిపార్స్ చేసిన‌ట్టు తెలిపింది. నిషిద్ధ జాబితాలోని 718 సంస్థ‌ల్లో వ్య‌య వివ‌రాలు సమ‌ర్పించిన 15 సంస్థ‌ల‌ను జాబితా నుండి తొల‌గించామ‌ని తెలిపాం.

హుగ్లీలో కూలిన బ్రిడ్జ్‌..

ప‌శ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. భ్రందేశ్వ‌ర్ ప్రాంతంలో ఓడ‌లో ఎక్కేందుకు నిర్మించిన బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మ‌ర‌ణించ‌గా 65 మంది గ‌ల్లంత‌య్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లాన్ని చేరుకుని స‌హాయ చర్య‌లు చేప‌ట్టారు. స‌ముద్రంలో భారీ అల‌లు కార‌ణంగా వంతెన కూలిపోయింద‌ని అధికారులు పెర్కొన్నారు. గ‌ల్లంతైన వారి కోసం గ‌జ ఈత‌గాళ్ళు గాలింపు చర్య‌లు చేప‌ట్టారు

2014 త‌ర్వాత టీచ‌ర్ డిగ్రీలు చెల్ల‌వు

2014లో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండ‌లి జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం తెలుగు పండిత, ఉర్దూ, హిందీ పండిత శిక్ష‌ణ కోర్సులేవీ చెల్ల‌వు. 2014కు ముందు ఎస్‌సిఇటి గుర్తింపు క‌లిగి ఉండే మాత్ర‌మే మిన‌హాయింపు ఉంటుంది. ఈ డిగ్రీతో స‌మానంగా ఉన్న 16 ర‌కాల కోర్సులు కూడా చెల్లుబాటు కావ‌ట‌. తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్‌, గురుకుల టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీకి దర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొత్త పేర్ల‌తో డిగ్రీలు పెట్టిన ద‌ర‌ఖాస్తులు వ‌స్తుండ‌టంతో ఎస్‌సిఇఆర్‌టి నుండి స్ప‌ష్ట‌త తీసుకురావాల‌ని టిఎస్‌పీఎస్పీ స్ప‌ష్టం చేసింది. అభ్య‌ర్థులు దీనిపై విద్యాశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రంజీవి్ ఆర్ ఆచార్య‌, పాఠ‌శాల విద్య డైరెక్ట‌ర్ కిష‌న్‌, ఎస్‌సిఇఆర్‌టి డైరెక్ట‌ర్ జ‌గ‌న్నాథ‌రెడ్డిని క‌లిశారు. యూజిసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. ఆ కోర్సుల్లో 16 డిగ్రీల‌కు యూజిసి గుర్తింపు లేద‌ని, మ‌రో 7 ర‌కాల డిగ్రీల‌పై సందేహాలున్నాయ‌ని తెలిపారు. దీంతో డిగ్రీల విష‌యంలో ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా మెల్కొనాల‌ని విద్యాశాఖ వ‌ర్గాలు పెర్కొన్నాయి.

latest videos

ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్ 9 మోషన్ పోస్టర్ విడుదల

అమీ తుమీ టీజర్

కొబ్బరి మట్టా, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు 2017

శ్రీ ముఖి డబ్ స్మాష్ ఓ సక్కనోడా గురు మూవీ సాంగ్

వాట్ ఏ ఇంస్పైరింగ్ స్పీచ్ !! # రితిక సింగ్

ఏదో ఏదో బాగుందే పూర్తీ సాంగ్ || మిస్టర్ మూవీ ||వరుణ్ తేజ్ హెబ్భా పటేల్ ||మిక్కీ జె మేయర్