QVEdutech
QVEdutech
BookMyDarshan
Varanasi Tour Package! Starting from 3000/- Download Bookmydarshan App from App Store
Now! Book Movie tickets from us!
Bookmydarshan Bahubali 2 (The Conclusion)

తాజా వార్తలు

లంక రివ్యూ...

-- Hyderabad Published:29 April 2017 03:48:27 PM

నిర్మాత‌లుః నామ‌న దినేష్‌, నామ‌న విష్ణుకుమార్‌

క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః శ్రీముని

నిర్మాణ సంస్థః రోలింగ్ రాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌

తారాగ‌ణంః రాశి, సాయి రోన‌క్‌, ఐనా సాహ‌, సిజ్జు, సుప్రీత్‌, లీనా సిద్ధు, స‌త్యం రాజేష్‌, స‌త్య త‌దిత‌రులు

సంగీతంః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌

సినిమాటోగ్ర‌ఫీః వి.ర‌వికుమార్‌

క‌ళః హ‌రివ‌ర్మ‌

సీనియ‌ర్ హీరోయిన్స్ అంద‌రూ ఇప్పుడు యంగ్ జ‌న‌రేష‌న్ హీరో, హీరోయిన్స్‌కు అమ్మ‌లుగా, నాన్న‌లుగా, అంటీ, అంకుల్‌గానో క‌న‌ప‌డుతున్నారు. క‌ళ్యాణ వైభోగ‌మే చిత్రంతో ఆ జాబితాలోకి చేరింది సీనియ‌ర్ హీరోయిన్ రాశి. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పుడు రాశి చేసిన కొత్త ప్ర‌య‌త్నం `లంక‌`. మ‌నిషి మెదడుని చ‌దివి కంట్రోల్ చేసే టెలిప‌తి అనే విద్యను ఎలా ఉప‌యోగించ‌వ‌చ్చు అనే పాయింట్‌లో చేసిన `లంక‌` చిత్రం మ‌రి రాశికి ఎలాంటి గుర్తింపు తెస్తుందో తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థః ఓ ఇంట్లో ఒంటిరిగా నివ‌సిస్తూ ఉంటుంది రెబెకా విలియ‌మ్స్‌(రాశి). రెబెకా టెలిప‌తిలో నిపుణురాలు. ద‌ర్శకుడిగా రాణించాలంటే షార్ట్ ఫిలిం ద్వారా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకోవాల‌నుకునే సాయిరోన‌క్ రెబెకా ఇంటి ద‌గ్గ‌ర‌కు షార్ట్ ఫిలిం చేయ‌డానికి స్వాతి(ఐనా సాహా), త‌న మిత్రులు స‌త్య‌, సుద‌ర్శ‌న్‌ల‌తో క‌లిసి వ‌స్తాడు. వారం రోజులు పాటు జ‌రిగే షూటింగ్‌లో రెబెకా, స్వాతి మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డుతుంది. షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత అమెరికా వెళ్ళడానికి కంటే ముందుగానే స్వాతిని, సాయి క‌ల‌వాల‌నుకుంటాడు. కానీ స్వాతి రాదు. స్వాతికి ఫోన్ చేస్తే, మొబైల్ స్విచ్చాప్ అని వ‌స్తుంది. రెండు రోజుల త‌ర్వాత స్వాతి మ‌ల‌యాళంలో పెద్ద హీరోయిన్ కావ‌డంతో పోలీసులు వ‌స్తారు. స్వాతి కేసును ఇంటార‌గేట్ చేస్తారు. అయితే రెబెకా కార‌ణంగానే స్వాతి క‌న‌ప‌డ‌కుండా పోయింద‌ని, స్వాతి పాండిచ్చేరిలో ఉంద‌ని పోలీసుల‌కు తెలుస్తుంది. పాండిచ్చేరి చేరుకున్న పోలీసుల‌కు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. అస‌లు రెబెకా ఎవ‌రు? శ‌ర‌త్ ఎవ‌రు? స్వాతి, రెబెకా, శ‌ర‌త్ మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏంటి అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

బ‌లాలుః -

క‌థ‌ 

సినిమాటోగ్ర‌ఫీ 

రాశి పెర్‌ఫార్మెన్స్‌

బ‌ల‌హీన‌త‌లు

- క‌థ‌నం

- ఎడిటింగ్

- సీన్స్‌సాగ‌తీత‌గా అనిపించ‌డం

స‌మీక్షః ద‌ర్శ‌కుడు శ్రీముని టెలిప‌తి అనే టెక్నాల‌జీకి, హ్యుమ‌న్ ట్రాఫికింగ్‌కు లింక్ పెడుతూ రాసుకున్న క‌థ బావుంది. ఈ లింక్‌ను క్లైమాక్స్‌లో రివీల్ చేసిన తీరు ఇంకా బావుంది. సినిమాను ప్రేక్ష‌కులు ప‌సిగ‌ట్ట‌లేని విధంగా తీయాల‌నే త‌ప‌న కొద్ది చేసిన ట్విస్టులు సినిమాలో తిక‌మ‌క‌ను క్రియేట్ చేశాయి. నెరేష‌న్ విష‌యంలో ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాడు. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ , సెకండాఫ్‌లోసీన్స్ కొన్ని అన‌వ‌స‌రంగానూ, సాగ‌దీత‌గానూ క‌నిపిస్తాయి. థ్రిల్ల‌ర్ సినిమాలు ప‌రుగు పెట్టేలా ఉండాలి. కానీ లంక నిడివి ఎక్కువ కావ‌డం కూడా పెద్ద మైన‌స్. ర‌వికుమార్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ప్ర‌తీ సీన్ ను కెమెరాలో ర‌వికుమార్ చిత్రీక‌రించిన తీరు మెచ్చుకోలుగా ఉంది. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూప‌ర్బ్ అని చెప్ప‌లేం కానీ ప‌రావాలేదు అనొచ్చు. ఇక సినిమా అంత‌టినీ రాశి త‌న భుజాల‌పై వేసుకుని న‌డిపించింది. సిజ్జు, సుప్రీత్, గిరిబాబు, ఐనా సాహా, సాయి రోన‌క్, స‌త్య‌, సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. హీరో, హీరోయిన్ అండ్ గ్యాంగ్‌ను రాశి చంపేలా వ‌చ్చే క‌ల‌, సెకండాఫ్‌లో హీరోయిన్ పోలీసులు వెంట‌ప‌డే స‌న్నివేశాలు అన‌వ‌ర‌సంగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు క‌థ‌నంపై కాస్తా శ్ర‌ద్ధ పెట్టి ఉంటే బావుండేద‌నిపించింది. టెలిప‌తి అనే కాన్సెప్ట్ సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు ఏ మేర అర్థం అవుతుందో చెప్ప‌లేం.

చివ‌రాఖ‌రుగా..మోతాదు మించిన ట్విస్టుల‌తో `లంక` గంద‌రగోళం

 

రేటింగ్ః 2.25/5

బాహుబలి 2 రివ్యూ

-- Hyderabad Published:29 April 2017 10:47:29 AM

సమర్పణ: కె.రాఘవేంద్రరావు

నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్‌  

తారాగణం: ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా, సత్యరాజ్‌, నాజర్‌, రమ్యకృష్ణ , సుబ్బరాజు తదితరులు

సంగీతం: ఎం.ఎం.కీరవాణి

సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌కుమార్‌

కథ: వి.విజయేంద్రప్రసాద్‌

ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబుశిరిల్‌

వి.ఎఫ్‌.ఎక్స్‌: కమల్‌ కణ్ణన్‌

కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు

యాక్షన్‌: కింగ్‌ సాల్మాన్‌

సౌండ్‌ డిజైనర్‌: పి.ఎం.సతీష్‌

క్యాస్టూమ్స్‌: రమారాజమౌళి, ప్రశాంతి త్రిపురినేని

లైన్‌ ప్రొడ్యూసర్‌: శ్రీవల్లీ

నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని

దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌నే ప్ర‌శ్న బాహుబ‌లి 2తో ఎట్ట‌కేల‌కు విడిపోయింది. గ‌త రెండేళ్ళుగా అంద‌రూ ఎదురుచూసిన స‌మాధానం. అయితే ఒక సీన్‌తో ముగిసిపోయే సమాధానం కాదు, ప్రీ క్లైమాక్స్‌లో వ‌చ్చే స‌న్నివేశం కావ‌డంతో సినిమా అంతా చూసేలా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి బాహుబ‌లి 2 చిత్రాన్ని తెర‌కెక్కించాడు. రాజాజ్ఞ‌ను పాటించే క‌ట్ట‌ప్ప రాజునే ఎందుకు చంపాడు. మొద‌టి పార్ట్‌లో నా త‌ప్పుల‌ను క్ష‌మించు అని శివ‌గామి ఎందుకు చెప్పింది? ఇంత‌కు ఆమె చేసిన త‌ప్పేంటి? మ‌రి క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని చంపేంత ఎం వ‌చ్చింది? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కావాలంటే బాహుబ‌లి 2 చూడాల్సిందే. విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన బాహుబ‌లి రెండో భాగం కోసం సినీ ప్ర‌పంచంతో పాటు అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూశారు. తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి తెలియ‌జేసిన బాహబ‌లి సినిమా గురించి తెలుసుకోవాలంటే ముందు క‌థ తెలుసుకుందాం...

క‌థః

మ‌హిష్మ‌తి రాజ్యానికి వార‌సుడు అయిన మ‌హేంద్ర బాహుబ‌లి( ప్ర‌భాస్‌), శివుడుగా అట‌వికుల‌తో పెంచ‌బ‌డుతాడు. అవంతిక ప్రేమ కోసం మ‌హిష్మ‌తి రాజ్యంలోకి ప్రవేశించిన బాహుబ‌లి, త‌న త‌ల్లి ఎవ‌రో తెలియ‌కుండానే ఆమెను ర‌క్షిస్తాడు. దేవ‌సేన‌ను ర‌క్షించే ప్ర‌య‌త్నంలో భాగంగా క‌ట్ట‌ప్ప‌(స‌త్య‌రాజ్‌)తో గొడ‌వ‌ప‌డ‌తాడు. మ‌హిష్మ‌తి మ‌హారాజు భ‌ళ్ళాలదేవుడు(రానా) త‌న‌యుడు భ‌ద్ర‌ను చంపేస్తాడు. మ‌హేంద్ర బాహుబ‌లి చూసిన క‌ట్ట‌ప్ప వారి రాజు, దైవం అమ‌రేంద్ర బాహుబ‌లి గురించి క‌థ చెబుతాడు.

కాళ‌కేయుల‌ను యుద్ధంలో ఓడించిన అమ‌రేంద్ర బాహుబ‌లి మ‌హారాజుగా నిర్ణ‌యింప‌బ‌డ‌తాడు. రాజ‌మాత శివ‌గామి మాట‌పై క‌ట‌ప్ప‌తో క‌లిసి దేశాట‌న బ‌య‌లుదేరుతాడు. కుంత‌ల దేశం చేరుకున్న అమరేంద్ర బాహుబ‌లి యువ‌రాణి దేవ‌సేన‌(అనుష్క‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె ప్రేమ పొంద‌డం కోసం బాహుబ‌లి కుంత‌ల రాజ్యంలోనే ఉండిపోతాడు. ఈలోపు దేవ‌సేన అందచందాలు, తెలివి తేట‌లు గురించి తెలుసుకున్న భ‌ళ్ళాల‌దేవుడు, దేవ‌సేనను త‌న భార్య‌గా చేయ‌మ‌ని త‌ల్లి శివ‌గామిని కోరుతాడు. శివ‌గామి కూడా స‌రేన‌ని మాట ఇచ్చేసి కోడ‌లు క‌మ్మని దేవ‌సేన‌కు వ‌ర్త‌మానం పంపుతుంది. భ‌ళ్ళాల‌దేవుడు కుతంత్రం తెలియ‌ని దేవ‌సేన, శివ‌గామికి ఎదురుచెబుతుంది. దాంతో కోపం తెచ్చుకున్న శివ‌గామి దేవ‌సేన‌ను బంధించ‌మ‌ని కుంత‌ల రాజ్యంలోని బాహుబ‌లికి వ‌ర్త‌మానం పంపుతుంది.

తాను భార్య‌గా ఎంతదూరం అయినా వ‌స్తాను కానీ ఆత్మమాభినం చంపుకుని బంధీగా రాలేన‌ని దేవ‌సేన‌, బాహుబ‌లితో అంటుంది. దేవ‌సేన మాన ప్రాణాల‌ను బాధ్య‌త‌గా తీసుకున్న బాహుబ‌లి ఆమెకు మాట ఇచ్చి, దేవ‌సేన‌ను మ‌హిష్మ‌తికి తీసుకుని వ‌స్తాడు. రాజ్య‌స‌భ‌లో బాహుబ‌లి దేవ‌సేన వైపు నిల‌వ‌డంతో శివ‌గామి దేవ‌సేన కావాలంటే మ‌హారాజుగా ఉండ‌కూడ‌ద‌నే ష‌ర‌తు పెడుతుంది. దేవ‌సేన‌కు ఇచ్చిన మాట కోసం త‌న మ‌హారాజ ప‌ద‌వినే వ‌దులుకుని స‌ర్వ సైన్యాధ్య‌క్షుడుగా ప‌నిచేయ‌డానికి సిద్ద‌ప‌డ‌తాడు బాహుబ‌లి. అయితే భ‌ళ్ళాల‌దేవుడు కుటిల బుద్ధితో శివ‌గామికి, బాహుబ‌లిపై అనుమానం వ‌చ్చేలా సృష్టించడంతో, శివ‌గామి, బాహుబ‌లిని చంప‌మ‌ని క‌ట్ట‌ప్ప‌కు ఆదేశం ఇస్తుంది.

ఆమె ఆదేశాన్ని అమ‌లు చేసిన క‌ట్ట‌ప్ప‌, అస‌లు విష‌యాన్ని శివ‌గామికి చెప్ప‌డంతో ఏమవుతుంది? భ‌ళ్ళాలదేవుడు ఏం చేస్తాడు? చివ‌ర‌కు త‌న తండ్రి అమ‌రేంద్ర బాహుబ‌లి క‌థ‌ను తెలుసుకున్న మ‌హేంద్ర బాహుబ‌లి ఏం చేస్తాడు? భ‌ళ్ళాల‌దేవుడుని మ‌హేంద్ర బాహుబ‌లి ఏం చేస్తాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

బలాలు:

- కథనం

- ఎమోషనల్‌ డ్రామా

- సంగీతం

- బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్

- సినిమాటోగ్రఫీ

- విఎఫెక్స్‌

బలహీనతలు:

- నిడివి ఎక్కువగా ఉండటం

స‌మీక్షః

ప్ర‌భాస్‌, అనుష్క‌, రానా, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్‌, స‌త్య‌రాజ్ స‌హా న‌టీన‌టులంద‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో చక్క‌గా న‌టించారు. గ్రాఫిక్స్ ఫ‌స్ట్ పార్టును త‌ల‌ద‌న్నేలా ఉన్నాయి. పాట‌లు బావున్నాయి. రీరికార్డింగ్ కూడా బావుంది. మాహిష్మ‌తి రాజాస్థానం, భ‌ల్లాల‌దేవుడి పాల‌న‌, ప్ర‌జ‌లు, సినిమా ప్రారంభంలో అమ‌రేంద్ర బాహుబ‌లి ఏనుగు పొగ‌రు అణ‌చే స‌న్నివేశం వంటివ‌న్నీ ఆక‌ట్టుకుంటాయి. దానికి తోడు ఎద్దుల కొమ్ముల‌కు నిప్పంటించి చేసిన ఫైటు, కుంత‌ల సామ్రాజ్యాన్ని కాపాడ‌టం కోసం ఆన‌క‌ట్ట‌ను ప‌గ‌ల‌కొట్టే విధానం, బాహుబ‌లికి వైజ్ఞానిక శాస్త్రం పట్ల ఉన్న అభిలాష వంటివ‌న్నీ మెప్పిస్తాయి. అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ ఉన్న స‌న్నివేశాల్లో పోటాపోటీగా న‌టించిన వైనం క‌నిపిస్తుంది. చాలా కాలం త‌ర్వాత ఇద్ద‌రు మ‌హిళ‌లు ఎదురెదురుగా త‌ల‌ప‌డి న‌టించిన‌ట్టు అనిపిస్తుంది.

కుంత‌ల దేశం చూడ‌చ‌క్క‌గా అనిపిస్తుంది. కుంత‌ల సామ్రాజ్యంలో స్త్రీలు జ‌రుపుకునే గోపిక పూర్ణిమ పండుగ బావుంది. క‌న్న‌య్య‌ను నిద్ర‌పుచ్చుతూ పాడే పాట‌లో అనుష్క చాలా అందంగా క‌నిపించింది. అనుష్క‌, ప్ర‌భాస్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల్లో రొమాన్స్ గుంభ‌నంగా ఉంది. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడిని మెచ్చుకోవాలి. న‌టులంద‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో చక్క‌గా న‌టించారు. గ్రాఫిక్స్ ఫ‌స్ట్ పార్టును త‌ల‌ద‌న్నేలా ఉన్నాయి. పాట‌లు బావున్నాయి. రీరికార్డింగ్ కూడా బావుంది. మాహిష్మ‌తి రాజాస్థానం, భ‌ల్లాల‌దేవుడి పాల‌న‌, ప్ర‌జ‌లు, సినిమా ప్రారంభంలో అమ‌రేంద్ర బాహుబ‌లి ఏనుగు పొగ‌రు అణ‌చే స‌న్నివేశం వంటివ‌న్నీ ఆక‌ట్టుకుంటాయి. దానికి తోడు ఎద్దుల కొమ్ముల‌కు నిప్పంటించి చేసిన ఫైటు, కుంత‌ల సామ్రాజ్యాన్ని కాపాడ‌టం కోసం ఆన‌క‌ట్ట‌ను ప‌గ‌ల‌కొట్టే విధానం, బాహుబ‌లికి వైజ్ఞానిక శాస్త్రం పట్ల ఉన్న అభిలాష వంటివ‌న్నీ మెప్పిస్తాయి. అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ ఉన్న స‌న్నివేశాల్లో పోటాపోటీగా న‌టించిన వైనం క‌నిపిస్తుంది. చాలా కాలం త‌ర్వాత ఇద్ద‌రు మ‌హిళ‌లు ఎదురెదురుగా త‌ల‌ప‌డి న‌టించిన‌ట్టు అనిపిస్తుంది. సినిమాలో మైన‌స్ పాయింట్లు అని వేలెత్తి చూపించ‌ద‌గ్గ‌వి పెద్ద‌గా ఉండ‌వు. కాక‌పోతే ఈ రెండో భాగంలో అక్క‌డ‌క్క‌డా కొంద‌రికి, ప్ర‌త్యేకించి అనుష్క‌కు త‌ప్ప కాస్ట్యూమ్ డిజైన‌ర్స్ ప్ర‌త్యేకంగా చేసిందేమీ లేదు.

కుమార‌వ‌ర్మ పాత్ర ద్వారా న‌వ్వు తెప్పించాల‌నుకున్నారు కానీ ఆ ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైన‌ట్టు అనిపిస్తుంది. ఆ పాత్ర స‌రిగా న‌వ్వించ‌లేక‌పోయింద‌న్న‌ది వాస్త‌వం. తొలిస‌గంలో `ఇది నా మాట‌. నా మాటే శాస‌నం` అని అన్నీ తెలుసుకుని మ‌స‌లుకున్న శివ‌గామి ఇందులో చెప్పుడు మాట‌లు వింటూ, త‌న చుట్టూ ఏం జ‌రుగుతుందో తెలుసుకోలేని అశ‌క్తురాలిగా క‌నిపిస్తుంది. అప్ప‌టిదాకా ప్రాణంగా చూసుకున్న క‌ట్ట‌ప్ప కేవ‌లం రాజాజ్ఞ కోసం బాహుబ‌లిని చంప‌డం అనేది ఎవ‌రూ ఊహించ‌రు. ప‌దుల బాణాలు గుచ్చుకున్నా లెక్క‌చేయ‌ని బాహుబ‌లి కట్ట‌ప్ప క‌త్తితో పొడ‌వ‌గానే చ‌నిపోవ‌డం చాలా పేల‌వంగా అనిపిస్తుంది. క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడ‌న్న‌ది ఊరించి ఊరించి చివ‌రికి ద‌ర్శ‌కుడు తేల్చేసేశాడ‌న్న‌ది ఇట్టే అర్థ‌మైపోతుంది. ప్రేక్ష‌కుడికి ద‌ర్శ‌కుడు చెప్పిన కార‌ణం పెద్ద మెప్పించేలా అనిపించ‌లేదు.

దాదాపు మూడు గంటల నిడివి ఇప్ప‌టి ప్రేక్ష‌కుడిని కాస్తా ఇబ్బంది పెట్టేదే. అయితే తెలుగు సినిమా అయిన బాహుబ‌లి ఒక మామూలు సినిమా స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగింది. తాజాగా బాహుబ‌లి ది కంక్లూజ‌న్ కూడా ఆ స్థాయిని చేరుకునేలా తెర‌కెక్కింది. తొలి భాగంలో మాహిష్మ‌తి సామ్రాజ్యం మాత్ర‌మే క‌నిపించింది. కానీ పార్ట్ 2 లో కుంత‌ల సామ్రాజ్యం కూడా క‌నుల‌పండువ‌గా అనిపించింది. ప్ర‌భాస్‌, అనుష్క జంట‌గా ఇంత‌కు ముందు చిత్రాల్లో క‌న్నా ఈ సినిమాలో మ‌రింత‌గా అల‌రించారు. ప్ర‌భాస్‌, రానా ఇద్ద‌రూ యుద్ధ స‌న్నివేశాల్లో ఒక‌రిని మించేలా మ‌రొక‌రు క‌నిపించారు. అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు పోటాపోటీగా అనిపించాయి.

ఫ‌స్ట్ పార్ట్ ను శ్ర‌ద్ధ‌గా చూసిన ఎవ‌రైనా సెకండ్ పార్ట్ ను ఇట్టే ఊహించేయ‌వ‌చ్చు. కేవ‌లం రెండు డైలాగుల మీద సెకండాఫ్‌ను అల్లుకున్నారు. కొన్ని సీన్లు ర‌క్తి క‌ట్టించాయి. బిజ్జ‌ల‌దేవుడిగా ఎడ‌మ‌చేయి బాగాలేనివాడిగా నాజ‌ర్ న‌ట‌న కూడా అద్భుతం. ఇందులో ఏ పాత్రా వృథాగా అనిపించ‌లేదు. రాజ‌ప్రాసాదాల‌కు, రాజ స‌భ‌ల‌కు, అంతఃపురాల‌కు సంబంధించి సాబు సిరిల్ ఎక్కువ‌గా ఆగ్రా ఫోర్ట్ ను మోడ‌ల్‌గా తీసుకున్న‌ట్టు ఇట్టే తెలిసిపోతుంది. అహంకారం వ‌ల్ల‌, త‌న మాట నెగ్గాల‌నుకోవ‌డం వ‌ల్ల‌, ఈర్ష్య‌, అసూయ‌ల వ‌ల్ల రాజ్యాలు కూలిపోయాయ‌ని చ‌రిత్ర చెబుతోంది. దాన్ని ఊహాత్మ‌కంగా జాన‌ప‌దానికి జోడించి ఈ క‌థ‌ను అల్లారు. అక్క‌డ‌క్క‌డా భావోద్వేగాలు పండాయి. క‌థ‌ను, స‌న్నివేశాల బ‌లాన్ని, సినిమా నిడివిని ప‌క్క‌న‌పెడితే తొలిస‌గంలో ప్రేక్ష‌కుడికి క‌లిగిన ప్ర‌శ్న‌ల‌కు ఈ చిత్రం స‌మాధాన‌మ‌వుతుంది. విజువ‌ల్ వండ‌ర్‌గా ప్రేక్ష‌కుడిని థియేట‌ర్‌లో క‌ట్టి ప‌డేస్తుంది. చివ‌రాఖ‌రుగా....భ‌ళిరా బాహుబ‌లి..సాహోరే రాజ‌మౌళి...

 

రేటింగ్ః 4/5

పిల్ల‌ల గురించి చెప్పిన స‌మంత‌!

-- Hyderabad Published:29 April 2017 10:09:11 AM

ఆక‌లైతే అన్నం పెడ‌తారు.. పేద‌ల‌కు ఇంకోర‌కంగానో, ఇంకో ర‌కంగానో సాయం చేస్తారు. కానీ స‌మంత మాత్రం త‌ను ద‌త్త‌త తీసుకున్న పిల్ల‌ల‌కు కొత్త త‌ర‌హా గిఫ్ట్ ఇచ్చింది. శుక్ర‌వారం పుట్టిన‌రోజు జ‌రుపుకున్న స‌మంత త‌న ద‌త్త‌త తీసుకున్న పిల్ల‌ల‌తో హ్యాపీగా గ‌డిపింది. అదీ బిగ్ సినిమాస్‌లో. బిగ్ సినిమాస్‌కు త‌ను ద‌త్త‌త తీసుకున్న అనాథ పిల్ల‌ల‌ను తీసుకెళ్లింది. వారికి బాహుబ‌లి ది కంక్లూజ‌న్‌ను చూపించింది. స‌మంత మాట్లాడుతూ ``పిల్ల‌ల క‌ళ్ల‌ల్లో ఆనందం చూశాను. ఇంట్లో పిల్ల‌ల‌ను సినిమాల‌కు తీసుకెళ్ల‌డానికి అమ్మానాన్న‌లుంటారు . కానీ అనాథ పిల్ల‌ల‌ను థియేట‌ర్ల‌కు ఎవ‌రు తీసుకెళ్తారు? అందుకే నేను తీసుకెళ్లాను. పెద్ద‌ల క‌న్నా చిన్న పిల్ల‌ల‌కే ఫాంట‌సీ సినిమాల‌మీద మోజు ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే నేను పిల్ల‌ల‌ను సినిమాల‌కు తీసుకొచ్చి వారి కోరిక తీర్చాను`` అని చెప్పింది స‌మంత‌.

వ‌రుణ్ చిత్రంలో అత‌నేం చేస్తాడు?

-- Hyderabad Published:29 April 2017 10:04:07 AM

వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టిస్తున్న సినిమా ఫిదా. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. ఈ సినిమాలో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. సాయిప‌ల్ల‌వి నాయిక‌. ఎన్నారై అబ్బాయికి, తెలంగాణ అమ్మాయికి మ‌ధ్య జ‌రిగే ప్రేమ క‌థ ఇది. ఇందులో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే పాత్ర ఏంటి? ఆరా తీశాం.. ``నేను తెలుగబ్బాయిగా మాత్రం న‌టించ‌డం లేదు. తెలుగు అబ్బాయిగా క‌నిపించ‌కూడ‌ద‌నే న‌న్ను శేఖ‌ర్ క‌మ్ముల‌గారు ఈ రోల్‌కి తీసుకున్నారు. నేను ఇంత‌కు ముందు అనామిక కోసం ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేశాను. ఇప్పుడు ఈ సినిమా కోసం శేఖ‌ర్ నాకు ఫోన్ చేయ‌గానే ``ఎవ‌రో, ఏంటో నాకు అన‌వ‌స‌రం. మీరు ఫోన్ చేశారు. అంతే చాలు.. నేను వ‌చ్చి న‌టిస్తాను` అని అన్నా. కొన్నాళ్ల త‌ర్వాత ఇప్పుడు హైద‌రాబాద్‌కి రావ‌డం ఆనందంగా ఉంది`` అని అన్నారు. త‌న పాత్ర మొత్తం చిత్రానికే కొత్త క‌థ‌లా అనిపిస్తుంద‌ని కూడా హ‌ర్ష చెప్పారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సూచ‌న‌లు

-- Hyderabad Published:29 April 2017 10:03:34 AM

అనంత‌పురం జిల్లాలోని ఎర్ర‌తిమ్మ‌రాజు చెరువులో తెప్ప బోల్తా ప‌డి ఒకే కుటుంబంలోని 13 మంది చ‌నిపోయిన దుర్ఘ‌ట‌న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. చెరువు లోతు ప్రాణాలు తీసేంత‌గా ఉన్న‌ప్పుడు స్థానిక పాల‌కులుగానీ, అధికార గ‌ణం కానీ స‌రైన ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవ‌ని విమ‌ర్శించారు. ఇక‌నైనా ప్ర‌జా ప్ర‌తినిధులు మేల్కొనాల‌ని అన్నారు. ఇటువంటి విషాద ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న తెలిపారు. బాధితుల కుటుంబానికి వెంట‌నే సాయం చేయాల‌ని ఆయ‌న సూచించారు.

కాంగ్రెస్ నేత‌ల‌ను నిల‌దీయండి - కె.సి.ఆర్‌

-- Hyderabad Published:28 April 2017 05:24:03 PM

తెలంగాణ 16వ ఆవిర్భావ స‌భ వ‌రంగ‌ల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. భ‌విష్య‌త్, 2019లో జ‌రిగబోయే ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ విజ‌యం సాధించే దిశ‌గా అంద‌రూ కృషి చేయాల‌ని కేడ‌ర్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాజెక్టులు క‌డుతుంటే, కాంగ్రెస్ నాయ‌కులు అడ్డు త‌గులుతున్నారు. కాబ‌ట్టి వారిని గ్రామ ప్ర‌జ‌లు నిల‌దీయాల‌ని సూచించారు. కాంగ్రెస్ పాల‌న కాలంలో ముఖ్య‌మంత్రులు వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, కిర‌ణ్‌కుమార్ రెడ్డిలు తెలంగాణ ప్ర‌జ‌లు, నాయ‌కుల‌ను కించ‌ప‌రిచినా ప‌ట్టించుకోని కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు మాత్రం ఎందుకు అడ్డు త‌గులుతున్నార‌ని ప్ర‌శించారు. ఇలాంటి కాంగ్రెస్ నాయ‌కుల కార‌ణంగా తెలంగాణ పరిస్థితి దారుణంగా త‌యార‌య్యింద‌ని, ప్ర‌జ‌లు పొట్ట కూటి కోసం వేరే ప్రాంతాల‌కు వ‌ల‌స‌లు వెళ్ళార‌ని కూడా అన్నారు.

సి.బి.ఐ కోర్టులో జ‌గ‌న్‌కు ఊర‌ట‌..

-- Hyderabad Published:28 April 2017 05:23:26 PM

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సి.బి.ఐ ప్ర‌త్యేక‌కోర్టులో ఊర‌ట ల‌భించింది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ సిబిఐ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కోర్టు కొట్టేసింది. సిబిఐ వాద‌న‌లు విన్న కోర్టు వారి వాద‌న‌ల‌ను తిరస్క‌రించింది. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారంటూ సిబిఐ త‌ర‌పున న్యాయ‌వాది కోరిన బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌ను కొట్టేసింది. ఆక్ర‌మాస్థుల కేసులో సాక్షిగా ఉన్న మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌మాకాంత్ రెడ్డి సాక్షి ఛానెల్‌లో ఇచ్చిన ఇంట‌ర్వ్యూను వివాదానికి కార‌ణ‌మైంది. జ‌గ‌న్ కావాల‌నే విచార‌ణ తీరును త‌ప్పు ప‌ట్టించేలా మాట్లాడించార‌ని సిబిఐ త‌ర‌పున లాయ‌ర్ వాదించారు. అయితే ఛానెల్ ఎడిట‌ర్ తీసుకునే నిర్ణ‌యాలకు, జ‌గ‌న్‌కు సంబంధం లేదంటూ కోర్టు తెలిపింది. ఇరు ప‌క్షాల వాద‌న‌ను విన్న కోర్టు సిబిఐ పిటీష‌న్‌ను కొట్టేసింది

భార‌త్ డిమాండ్‌ను తోసిపుచ్చిన పాక్‌...

-- Hyderabad Published:28 April 2017 05:21:59 PM

ముంబై ఉగ్ర‌వాది దాడిపై మ‌ళ్ళీ విచార‌ణ జ‌ర‌పాల‌న్న భార‌త్ డిమాండ్‌ను పాకిస్థాన్ తోసిపుచ్చింది. దాడికి కార‌ణ‌మైన కీల‌క సూత్ర‌ధారి జ‌మాత్ ద‌వా చీఫ్ హ‌ఫీజ్ సయీద్ పాత్ర‌పై వాస్త‌వ‌మైన ఆధారాలుంటే త‌ప్ప విచార‌ణ చేయాలేమ‌ని పాక్ తోసిపుచ్చింది. తొమ్మిదేళ్ళ క్రితం జ‌రిగిన ముంబై దాడిలో 24 మంది భారత సాక్షుల‌ను విచారించి వారి వాంగ్మూలాల‌ను న‌మోదు చేయ‌డం మిన‌హా, కేసు విచార‌ణ మొత్తం పూర్త‌య్యిందని పాక్ తెలిపింది. ముంబై ఉగ్ర‌వాది దాడిలో 166 మంది మ‌ర‌ణించారు. స‌యీద్ ఈ దాడికి ప‌థ‌కం ర‌చించాడ‌ని భార‌త్ ఆరోపిస్తుంది.

ఉత్త‌ర‌కొరియాలో ఐరాస క‌మిటీ ప‌ర్య‌ట‌న‌..

-- Hyderabad Published:28 April 2017 05:21:26 PM

ఎట్ట‌కేల‌కు ఉత్త‌ర కొరియా దేశంలో ఐక్య‌రాజ్య‌స‌మితి ఆధ్వ‌ర్యంలో మాన‌వ హ‌క్కుల బృందం ప‌ర్య‌టించ‌నుంది. కేట‌లినా అగిల‌ర్ నేతృత్వంలో హ‌క్కుల బృందం దేశంలోని వివిధ కార‌ణాల‌తో వైక‌ల్యం పొందిన పౌరుల స్థితిగ‌తుల‌పై అధ్య‌యనం చేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌ర్జాతీయ స్థాయిలో ఓ పౌర హ‌క్కుల సంఘాన్ని త‌మ దేశ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తించ‌లేదు. ఆరురోజుల పాటు ఐక్య‌రాజ్య స‌మితి బృందం ప‌ర్య‌ట‌న చేయ‌నుంది. ప‌ర్య‌ట‌న నివేదిక‌ను ఉత్త‌ర‌కొరియా రాజ‌ధాని ప్యాంగ్ యాంగ్‌లో మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు.

ఫోన్‌కు రెస్పాండ్ కాకుండే చ‌ర్య‌లు త‌ప్ప‌వు..

-- Hyderabad Published:28 April 2017 05:09:27 PM

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కొత్త ముఖ్య‌మంత్రి యోగి అదిత్య‌నాథ్ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను స‌రైన ట్రాక్‌లో పెట్ట‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బయోమెట్రిక్ విధానంలో అటెండెన్స్ ఉండాల‌న్న నిర్ణ‌యం త‌ర్వాత ఆక‌స్మిక చ‌ర్య‌లు చేప‌ట్టారు. అంతంటితో ఆగ‌కుండా ఏ స‌మ‌యంలోనైనా ఉద్యోగులు విధుల్లో ఉన్నారో లేదో తెలుసుకోవ‌డానికి సీఎం సంబంధిత అధికారి ఆఫీస్ ల్యాండ్ లైన్‌కు ఫోన్ చేస్తాన‌ని, ఉద‌యం 9 గంట‌లు నుండి సాయంత్రం 6 గంట‌లు వ‌ర‌కు ఫోన్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఫోన్‌కు స‌మాధానం ఇవ్వ‌కుంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీనియ‌ర్ మినిష్ట‌ర్ శ్రీకాంత్ శ‌ర్మ తెలిపారు. త‌నిఖీలు, సూప‌ర్‌వైజింగ్‌లో ఉండే పోలీసు అధికారులు, ఇత‌ర ఫీల్డ్ వ‌ర్క్‌లోని ఉద్యోగుల‌కు ఇందులో మిన‌హాయింపు ఉంటుంద‌ని పెర్కొన్నారు.

అమ్మాయి ప్రేమలో పడితే ప్రారంభం

-- Hyderabad Published:27 April 2017 05:43:47 PM

హర్షవర్ధన్ ప్రొడక్షన్ హౌస్ లో హర్షవర్ధన్ నిర్మాతగా మణి దర్శకత్వం వహించి నటించిన చిత్రం `అమ్మాయి ప్రేమలో పడితే`. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ప్రముఖ నిర్మాత కె.ఎల్‌.దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు వీరశంకర్ క్లాప్ నివ్వడం తో ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. ఈ సందర్బంగా దర్శకుడు మణి మాట్లాడుతూ నాకు ఇది రెండవ సినిమా.. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత హర్ష కు ప్రత్యేక కృతఙ్ఞతలు. ఒక జంట ప్రేమలో ఉంటే ఎలా ఉంటారు ప్రేమలో లేకపోతే ఎలా ఉంటారు అనే ట్రూ లవ్ పైన ఈ చిత్ర కాన్సెప్ట్. మంచి కథ మరియు మంచి మ్యూజిక్ తో ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యం తో సినిమాను చేస్తున్నాం. మే లో అరకు ప్రాంతాలల్లో షూటింగ్ ప్రారంభిస్తామ‌ని తెలిపారు. ఈ చిత్రం లో 5 పాటలుంటాయి. తప్పకుండా సంగీతం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం తో ఉన్నానంటూ ఈ చిత్ర సంగీత దర్శకుడు భాను ప్రసాద్ తెలిపారు. ఇక ఈ చిత్ర కెమెరామెన్ ఫణి మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రుడు మణి కు నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా లో విసువల్ పరంగా చాలా అద్భుతంగా తెరకెక్కించాలని అనుకుంటున్నా.. అది ఈ సినిమా కు ప్లస్ అవుతుందని భావిస్తున్నా అని చెప్పారు. ఇంకా ఈ ప్రారంభిత్సవం లో హీరోయిన్ షాను తో పాటు నిర్మాత హర్షవర్ధన్, శ్రీనివాసరెడ్డి లు పాల్గొని అభినందనలు మరియు అభిప్రాయాలను తెలియ చేసారు.

ఈ చిత్రానికి హీరో - మణి, హీరోయిన్- షాను, సంగీతదర్శకుడు- భానుప్రసాద్, రైటర్- బండోజి, కెమరామెన్ - ఫణి, కారియోగ్రఫర్ -సూర్య, నిర్మాతలు -హర్షవర్ధన్ మరియు రమేష్ ,దర్శకుడు- మణి.

వినోద్ ఖ‌న్నా క‌న్నుమూత‌

-- Hyderabad Published:27 April 2017 05:34:14 PM

సీనియ‌ర్ బాలీవుడ్ హీరో వినోద్ ఖ‌(70)న్నా క్యాన్స‌ర్‌తో క‌న్నుమూశారు. 1968లో మ‌న్ కా మీత్ చిత్రంతో తెరంగేట్రం చేసిన వినోద్ ఖ‌న్నా2015 వ‌ర‌కు విల‌న్‌గా, హీరోగా 140 చిత్రాల‌కు పైగా న‌టించారు. ‘మేరే గావ్‌ మేరా దేశ్‌’, ‘గ‌ద్దార్‌’(1973), ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’, ‘రాజ్‌పుత్‌’, ‘ఖుర్బానీ’, ‘దయావన్‌’ తదితర చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచుకున్నారు. వినోద్ ఖ‌న్నా న‌టించిన చివ‌రి చిత్రం దిల్‌వాలే. సినీ రంగంతో పాటు రాజ‌కీయ రంగంలో కూడా వినోద్ ఖ‌న్నా త‌న‌దైన ముద్ర వేశారు. ప్ర‌స్తుతం గురుదాస్ పూర్ పార్ల‌మెంట్ స‌భ్యుడుగా కొన‌సాగుతున్నారు. 141 చిత్రాల్లో పలు పాత్రల్లో కన్పించిన వినోద్‌ ఖన్నా.. ఫిలింఫేర్‌ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఫిలింఫేర్‌ అవార్డు, స్టార్‌ డస్ట్‌ అవార్డు, జీ సినిమా లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నటించిన మేరే అప్నే అనే హిందీ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు.

ఇండియ‌న్ సినిమా అంటే బాహుబ‌లి అనే రేంజ్‌కు చేర‌డం గ‌ర్వంగా ఉంది - ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి

-- Hyderabad Published:27 April 2017 05:30:34 PM

బాహుబలితో తెలుగు సినిమాకు కొత్త సొబగులు అద్దారు దర్శకుడు రాజమౌళి. తెలుగు వాడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. బాహుబలి స్వప్నాన్ని నెరవేర్చుకోవడానికి ఐదేళ్ల పాటు మహా యజ్ఞమే చేశారాయన. ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు... అన్నింటిని దాటుకొని బాహుబలి ది బిగినింగ్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రాజమౌళి. దేశంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలబెట్టారు. ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన చిత్రం బాహుబలి ది కన్‌క్లూజన్‌. ఆర్కా మీడియా పతాకంపై రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందఠంగా దర్శకుడు రాజమౌళి బుధవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ సంగతులివి...

బాహుబలి ప్రపంచ స్థాయి గుర్తింపుకు కారణం?

 - సాధారణ సినిమాలతో పోలిస్తే ఈ కథలో ఉన్న భారీతనం, గ్రాఫిక్స్‌, పోరాట ఘట్టాలతో పాటు పలు అంశాలు సినిమా పట్ల అందరిలో ఆసక్తిని పెంచాయి. అన్నింటి కంటే ముఖ్యంగా పాత్రల్లో ఉన్న బలం ప్రేక్షకుల మనసుల్లో బాహుబలిని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది. ఓ సినిమాను చూస్తూ ఎంజాయ్‌ చేస్తే అది మంచి సినిమా అవుతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అందులోని పాత్రలను మరచిపోలేక పోతే అది గొప్ప సినిమా అవుతుంది. బాహుబలి రెండో కోవకు చెందిన సినిమా.

బాహుబలి కోసం ఐదేళ్ళు సమయం కేటాయించే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది?

- బాహుబలి సినిమా ప్రారంభించిన రోజు ఐదేళ్లు పడుతుందని ఊహించలేదు. ఒకసారి మొదలుపెట్టిన తర్వాత వెనక్కి వెళ్లలేము కదా..అందుకు ముందుకెళ్ళాం. అయితే మంచి టీం దొరికింది. ప్రొడ్యూసర్‌ నుంచి లైట్‌బాయ్‌ వరకు కుటుంబంలా కలిసిపోయి పనిచేశాం. అందుకే నాపై చాలా భారం ఉన్నా ఎప్పుడూ దానిని బరువుగా ఫీలవ్వలేదు.

కట్టప్ప బాహుబలిని చంపాడనే ప్రశ్న ఇన్ని రోజులు ఆసక్తిని క్యారీ చేస్తుంని అనుకున్నారా?

-బాహుబలిని ప్రారంభించినపుడు ఆ ఆలోచన లేదు. ఎలాంటి గందరగోళం లేకుండా బాహుబలిని అందరూ కీర్తించే సన్నివేశంతో తొలి భాగాన్ని ముగించాలని అనుకున్నాం. కానీ సాదాసీదా ముగింపు కాకుండా సినిమాలోని ప్రధాన పాత్రలను చూపిస్తూ జనాలకు ఓ ట్విస్ట్‌లాంటిది ఇస్తే బాగుంటుందని అనిపించింది. ఆ ఆలోచనతోనే కట్టప్ప బాహుబలిని చంపే సన్నివేశాన్ని చూపించాం. అది మంచి జలక్‌ అవుతుందని అనుకున్నాం కానీ ఆటంబాంబులా పేలి జనాల మనసులో బలంగా నిలిచిపోతుందని ఊహించలేదు.

బాహుబలి 2 విడుదలకు దాదాపు రెండేళ్ళ సమయం పట్టినట్టు ఉంది?

-రెండు భాగాల మధ్య పద్దెనిమిది నెలల పాటు గ్యాప్‌ వస్తుందని ఊహించలేదు. తొలి భాగాన్ని విడుదల చేసిన నాలుగు నెలల తర్వాతగానీ ఆరు నెలలు తర్వాతగానీ రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించాం. కానీ బాహుబలి ది బిగినింగ్‌తోనే మా వద్ద ఉన్న డబ్బులు మొత్తం అయిపోవడంతో సెకండ్‌ పార్ట్‌ చిత్రీకరణ ఆలస్యమైంది. ప్రేక్షకులు గుర్తించుకుంటారో లేదో అనే ఆలోచనలకు తావులేకుండా మేము నమ్మింది చేసుకుంటూ వెళ్లాం.

దర్శకుడిగా, కథకుడిగా బాహుబలి మీకు సంత ప్తిని మిగిల్చిందా?

-ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలతో పోలిస్తే కథకుడిగా బాహుబలి నాకు ఎక్కువ సంత ప్తిని మిగిల్చింది. నా గత సినిమాలన్నీ హీరోయిజం నేపథ్యంలో రూపొందాయి. కానీ వాటికి భిన్నంగా ఐదారు బలమైన పాత్రల ఆధారంగా బాహుబలి సినిమా చేశాను. నాకు బాగా ఇష్టమైన హీరోయిజాన్ని ఉన్నతంగా చూపించే అవకాశం ఈ సినిమాతో దొరికింది.

దర్శకుడిగా అనుకున్నదాన్ని తెరపై చూపించగలిగారా?

-ఏ దర్శకుడు తన మస్తిష్కంలో ఉన్న ఆలోచనలను హండ్రెడ్‌ పర్సెంట్‌ తెరపై చూపించలేదు. మనసులో చాలా ఆలోచనలు ఉంటాయి. కానీ వాస్తవంగా వాటిని తెరపై చూపించే విషయంలో హీరోలు, బడ్జెట్‌, డేట్స్‌.. ఇలా పలు అంశాల ప్రభావం వాటిపై ఉంటుంది. ఆ పరిధిలను ద ష్టిలో పెట్టుకునే మనం అనుకున్న అంశాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేయాలి. బాహుబలి-2 విషయంలో నా మనసులో ఉన్న కథను దాదాపు చూపించానని అనుకుంటున్నాను. స్టోరీ టెల్లర్‌గా, డైరెక్టర్‌గా బాహుబలి నాకు శాటిస్పాక్షన్‌ ఇచ్చిన సినిమా.

బాహుబలి మొదలుపెట్టినపుడు ఈ స్థాయికి చేరుకుంటుందని ఊహించారా?

-ఈ సినిమా విషయంలో మేము ఊహించిన దానికంటే ప్రేక్షకులు ఎన్నో రేట్లు ఎక్కువ తిరిగిఇచ్చారు. సినిమా హిట్టవుతుందని అనుకున్నాం కానీ ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుందని ఊహించలేదు. భిన్న భాషలకు చేరువ అవుతుందని, పలు దేశాల వారు మమ్మల్ని గౌరవించే స్థాయికి తీసుకెళ్తుందని ఊహించలేదు.

పార్ట్‌ 1కు వచ్చిన రెస్పాన్స్‌ చూసి పార్ట్‌ 2 కథలో మార్పులేమైనా చేశారా?

- నా దృష్టిలో బాహుబలి మొత్తం ఒకే కథ. ప్రేక్షకుడికి సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పాలనే ఉద్దేశ్యంతోనే రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందించాం.ఇప్పటికే సగం చెప్పాను. మిగతా దానిని రెండో భాగంలో చూపించబోతు న్నాననే ఆలోచనే ఎప్పుడూ నా మనసులో ఉండేది. అంతే తప్ప తొలి భాగం విజయవంతమైందని రెండో భాగంలో ప్రేక్షకుడిని మెప్పించడం కోసం ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. కథ అనుకున్నప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానో దానినే చూపించాను. కథలో బలం ఉంది కాబట్టి ఎప్పుడూ భయపడలేదు.

బాహుబలితో దర్శకుడిగా మీ లక్ష్యం నెరవేరిందా?

-నా లక్ష్యాలు, గమ్యాలు అన్ని ఎప్పుడో నెరవేరాయి. పెద్ద దర్శకుడిని కావాలని అనుకొని చిత్రసీమలో అడుగుపెట్టాను. తొలి నాళ్లలోనే ఆ కోరిక నెరవేరింది. మహాభారతాన్ని తెరకెక్కించాలన్న లక్ష్యమొక్కటే మిగిలింది. కానీ ఇంకో పదేళ్ల వరకు ఆ సినిమా చేయలేను కావచ్చు.

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం ఎలా అనిపిస్తుంది?

-తెలుగుతో పాటు దక్షిణాది చిత్రసీమ అంటూ ఒకటుందని ప్రపంచంలో చాలా దేశాల వారికి తెలియదు. ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ మాత్రమే గుర్తుకువస్తుంది. కానీ అసలైన భారతీయ సినిమా అంటే బాహుబలి అని చెప్పుకునే స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లినందుకు గర్వపడుతున్నాను.

ఇంతటి భారీ చిత్రాన్ని రూపొందించడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలేవి?

-నిర్మాతలు, ప్రభాస్‌తో పాటు కుటుంబ ప్రోత్సాహంతోనే ఈ సినిమా పూర్తి చేయగలిగాను. నన్ను, నా కథను, ప్రతిభను నమ్మి వారి జీవితాల్ని రిస్క్‌లో పెట్టి మరో ఆలోచన లేకుండా నిర్మాతలు ముందుకు వచ్చారు. మా కుటుంబం నన్ను ఐదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడింది. నేను కన్న కలను సాకారం చేసుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ నాకు అండగా నిలిచారు.కుటుంబం లేనిదే నేను లేను. అలాగే ప్రభాస్‌ సినిమాను పెద్ద స్థాయిలో నిలబెట్టడం కోసం చాలా కష్టపడ్డాడు.

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌..?

- ఇంకా ఏం ఆలోచించలేదే. హాలీడే ట్రిప్‌ వెళ్ళి వచ్చి ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తాను.

భార‌త్‌,శ్రీలంక మ‌ధ్య సంబంధాలు మ‌రింత మెరుగు...

-- Hyderabad Published:27 April 2017 10:51:22 AM

భార‌త్ పొరుగు దేశ‌మైన శ్రీలంక ప్ర‌ధాని ర‌ణిల్ విక్ర‌మ సింఘె భార‌త్‌లో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో రెండు దేశాల మ‌ధ్య సంబంధ బాంధ‌వ్యాల గురించి ప్ర‌ధానుల మ‌ధ్య విస్తృత‌మైన చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఆర్ఢిక ప‌ర‌మైన సంబంధాల‌ను మెరుగు ప‌రుచుకునేందుకు ఒప్పందాలు కుదిరాయి. ఇదే సంద‌ర్భంలో భార‌త జాల‌ర్ల ప‌ట్ల మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించాల‌ని భార‌త విదేశాంగ శాఖ తెలిపింది. ప్ర‌ధాని మోదీ ఏర్పాటు చేసిన విందును శ్రీలంక ప్ర‌ధాని ర‌ణిల్ విక్ర‌మ్ సింఘె స్వీక‌రించారు. ద‌క్షిణాసియాలో ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్ర‌వాద సంస్థ‌తో ఉన్న ముప్పును ఎలా ఎదుర్కొవాల‌నే దానిపై భార‌త హోం మంత్రి, విక్ర‌మ సింఘె మ‌ద్య చర్చ‌లు జ‌రిగాయి. ఐఎస్ ముప్పైపై ఇరు దేశాల భ‌ద్ర‌త సంస్థ‌ల మ‌ధ్య సంప్ర‌దింపులు నిరంతరొ కొన‌సాగాల‌ని ఇద్ద‌రు నాయ‌కులు తెలిపారు.

స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌పై సుప్రీం కొర‌డా

-- Hyderabad Published:27 April 2017 10:49:00 AM

స్వ‌చ్ఛంద సంస్థ‌ల నిధుల దుర్వినియోగంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ అన్నా హజారే అధ్వ‌ర్యంలో హింద్ స్వ‌రాజ్ ట్ర‌స్ట్ దాఖ‌లు చేసిన ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీం కోర్టు స్వ‌చ్ఛంద సంస్థ‌ల నియంత్ర‌ణ‌పై నూత‌న చ‌ట్టం తీసుకు రావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది. సంస్థ‌ల‌కు నిధులు మంజూరు, నిధులు మిగ‌లుపై తీసుకోవాల్సిన చర్య‌లు త‌దిత‌ర అంశాల‌పై ఎనిమిది వారాల్లో నివేదిక స‌మ‌ర్పించాల‌ని జ‌స్టిస్ జె.ఎస్‌.ఖెహ‌ర్‌, డి.వై.చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ ఎస్‌.కె.కౌల్‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఉత్త‌ర్వులు కోరింది. కౌన్సిల్ ఫ‌ర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ పీపుల్ యాక్ష‌న్ అండ్ రూర‌ల్ టెక్నాల‌జీ(క‌పార్ట్‌) నివేదిక నిధులు దుర్వినియోగం చేసిన 159 సంస్థ‌లపై కేసులు న‌మోదు చేయాల‌ని సిపార్స్ చేసిన‌ట్టు తెలిపింది. నిషిద్ధ జాబితాలోని 718 సంస్థ‌ల్లో వ్య‌య వివ‌రాలు సమ‌ర్పించిన 15 సంస్థ‌ల‌ను జాబితా నుండి తొల‌గించామ‌ని తెలిపాం.

హుగ్లీలో కూలిన బ్రిడ్జ్‌..

-- Hyderabad Published:27 April 2017 10:46:31 AM

ప‌శ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. భ్రందేశ్వ‌ర్ ప్రాంతంలో ఓడ‌లో ఎక్కేందుకు నిర్మించిన బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మ‌ర‌ణించ‌గా 65 మంది గ‌ల్లంత‌య్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లాన్ని చేరుకుని స‌హాయ చర్య‌లు చేప‌ట్టారు. స‌ముద్రంలో భారీ అల‌లు కార‌ణంగా వంతెన కూలిపోయింద‌ని అధికారులు పెర్కొన్నారు. గ‌ల్లంతైన వారి కోసం గ‌జ ఈత‌గాళ్ళు గాలింపు చర్య‌లు చేప‌ట్టారు

2014 త‌ర్వాత టీచ‌ర్ డిగ్రీలు చెల్ల‌వు

-- Hyderabad Published:27 April 2017 10:42:23 AM

2014లో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండ‌లి జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం తెలుగు పండిత, ఉర్దూ, హిందీ పండిత శిక్ష‌ణ కోర్సులేవీ చెల్ల‌వు. 2014కు ముందు ఎస్‌సిఇటి గుర్తింపు క‌లిగి ఉండే మాత్ర‌మే మిన‌హాయింపు ఉంటుంది. ఈ డిగ్రీతో స‌మానంగా ఉన్న 16 ర‌కాల కోర్సులు కూడా చెల్లుబాటు కావ‌ట‌. తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్‌, గురుకుల టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీకి దర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొత్త పేర్ల‌తో డిగ్రీలు పెట్టిన ద‌ర‌ఖాస్తులు వ‌స్తుండ‌టంతో ఎస్‌సిఇఆర్‌టి నుండి స్ప‌ష్ట‌త తీసుకురావాల‌ని టిఎస్‌పీఎస్పీ స్ప‌ష్టం చేసింది. అభ్య‌ర్థులు దీనిపై విద్యాశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రంజీవి్ ఆర్ ఆచార్య‌, పాఠ‌శాల విద్య డైరెక్ట‌ర్ కిష‌న్‌, ఎస్‌సిఇఆర్‌టి డైరెక్ట‌ర్ జ‌గ‌న్నాథ‌రెడ్డిని క‌లిశారు. యూజిసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. ఆ కోర్సుల్లో 16 డిగ్రీల‌కు యూజిసి గుర్తింపు లేద‌ని, మ‌రో 7 ర‌కాల డిగ్రీల‌పై సందేహాలున్నాయ‌ని తెలిపారు. దీంతో డిగ్రీల విష‌యంలో ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా మెల్కొనాల‌ని విద్యాశాఖ వ‌ర్గాలు పెర్కొన్నాయి.

స‌మ్మ‌ర్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న రాజ‌శేఖ‌ర్‌, ప్ర‌వీణ్ స‌త్తారు పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ 126.18M

-- Hyderabad Published:27 April 2017 10:31:25 AM

అంకుశం, అగ్ర‌హం, మ‌గాడు వంటి ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మేన్‌గా వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన డా.రాజ‌శేఖ‌ర్ ట‌ఫ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా జ్యోస్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ చిత్రం``పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ 126.18M``. పూజా కుమార్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. రీసెంట్‌గా శృంగార తార స‌న్నిలియోన్‌పై చిత్రీక‌రించిన స్పెష‌ల్ సాంగ్ పూర్త‌వ‌డంతో ఈ చిత్రం ఏడు రోజులు మిన‌హా షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను స‌మ్మ‌ర్ సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.                                   చంద‌మామ క‌థ‌లు, గుంటూరుటాకీస్ వంటి విల‌క్ష‌ణ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు రూపొందిస్తున్న ఈ చిత్రం కోసం ముంబై పిలింసిటీలో భారీ సెట్ వేసి స‌న్నిలియోన్‌పై స్పెష‌ల్ సాంగ్‌ను చిత్రీక‌రించారు. గందిబాత్‌...`, `రాం చాహే లీల చాహే...` వంటి బాలీవుడ్ సూప‌ర్‌హిట్స్‌కు కొరియోగ్ర‌ఫీ అందించిన విష్ణుదేవా నేతృత్వంలో 50 డ్యాన్స‌ర్స్‌తో మూడు రోజుల పాటు సాంగ్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రిపారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు, యాంగ్రీ యంగ్ మేన్ రాజ‌శేఖ‌ర్‌ను స‌రికొత్త లుక్‌లో ప్రెజంట్ చేస్తున్నారు. అల్రెడి విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌కు ఆడియెన్స్‌ను నుండి మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. క్రేజీ కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రం మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు స‌న్నిలియోన్ స్పెష‌ల్ సాంగ్ చేయ‌డం గ‌రుడ వేగ‌పై అంచ‌నాల‌ను ఇంకా పెంచుతుంది. డా.రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, అరుణ్ అదిత్‌, కిషోర్‌, ర‌వివ‌ర్మ‌, చ‌ర‌ణ్ దీప్‌, నాజ‌న్‌, షాయాజీ షిండే, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఆర్ట్ః శ్రీకాంత్‌, సినిమాటోగ్ర‌ఫీః అంజి, మ్యూజిక్ః శ్రీచ‌ర‌ణ్‌, జ్యోస్టార్ ఎంట‌ర్ ప్రైజెస్, నిర్మాతః కోటేశ్వ‌ర‌రాజు, ద‌ర్శ‌క‌త్వంః ప్ర‌వీణ్ స‌త్తారు.

కె.విశ్వ‌నాథ్ 12 చిత్రాల డిస్క్ విడుద‌ల చేస్తార‌ట‌.

-- Hyderabad Published:26 April 2017 03:30:28 PM

క‌ళా త‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్‌కు దాదా సాహెబ్ పాల్కే అవార్డు రావ‌డం ప‌ట్ల తెలుగు ఇండ‌స్ట్రీ అంతా సంతోషాన్ని వ్య‌క్తం చేస్తుంది. జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కె.విశ్వ‌నాథ్‌ను క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కూడా ప‌వ‌న్‌తో కలిసి కె.విశ్వ‌నాథ్ ఇంటికి వెళ్ళారు. విశ్వ‌నాథ్‌కు దాదా సాహెబ్ పాల్కే అవార్డు రావ‌డం తెలుగువారికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్న ప‌వ‌న్‌, తాను శంక‌రాభ‌ర‌ణం సినిమాను చాలా సార్లు చూశాన‌ని, విశ్వ‌నాథ్ తీసిన శుభ‌లేఖ‌, స్వాతిముత్యం, శంక‌రాభ‌ర‌ణం త‌న‌కు చాలా ఇష్ట‌మైన చిత్రాల‌నీ అన్నారు. విశ్వ‌నాథ్ తీసిన 12 చిత్రాల‌తో ఓ డిస్క్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు కూడా ప‌వ‌న్ తెలిపారు.

అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌పై సౌదీ కొర‌డా...

-- Hyderabad Published:26 April 2017 03:26:41 PM

దేశంలోని అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌పై సౌదీ అరేబియా కొర‌డా ఝులిపించింది. జూన్ 30 వ‌ర‌కు నిర్ణీత గ‌డువును విధించిన సౌదీ ఆలోపు దేశంలోని అక్ర‌మ వ‌ల‌స‌దారులందరూ వెళ్ళిపోవాల‌ని ఆర్డ‌ర్ జారీ చేసింది. దీంతో ఇప్ప‌టికే 12000 వేల మంది బంగ్లాదేశీయులు స్వదేశానికి ప‌య‌నం కావ‌డానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇచ్చిన గ‌డువులోగా వెళ్ల‌ని వారికి జైలు శిక్ష‌తో పాటు, జ‌రిమానా కూడా విధిస్తామ‌ని సౌదీ ప్ర‌క‌టించింది. ఇటువంటి వారి కోసం ప్ర‌త్యేక‌మైన జైళ్ళ‌ను కూడా సిద్ధం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. అనుకున్న గ‌డువులోగా ప‌ది ల‌క్ష‌ల మందిని దేశం బ‌య‌ట‌కు పంపాల‌నే కృత నిశ్చ‌యం తీసుకుంది.

స్లొవేనియా వెళ్తున్న గంటా రవి, జయంత్‌ సి. పరాన్జీల జయదేవ్‌

-- Hyderabad Published:26 April 2017 03:23:59 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్‌'. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే చివరి వారంలో విడుదల చేయడానికి నిర్మాత కె.అశోక్‌కుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

ఏప్రిల్‌ 27న 'జయదేవ్‌' టీజర్‌

నిర్మాత కె.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ - ''జయంత్‌ దర్శకత్వంలో ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్‌ తర్వాత మూడో చిత్రంగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుగారి తనయుడు గంటా రవి హీరోగా పరిచయం చేస్తూ పవర్‌ఫుల్‌, పర్పస్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా 'జయదేవ్‌' చిత్రాన్ని నిర్మిస్తున్నాము. వివిధ లొకేషన్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ భారీ లెవ్‌ల్‌లో చేశాం. ఏప్రిల్‌ 27 సాయంత్రం గం 4.25లకు 'జయదేవ్‌' టీజర్‌ను విడుదల చేస్తున్నాం. అలాగే ఏప్రిల్‌ 30న ఈ చిత్రంలోని ఫస్ట్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేస్తున్నాం. ఏప్రిల్‌ 30 నుంచి మే 8 వరకు స్లొవేనియాలో రెండు పాటల్ని చిత్రీకరించడం జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. మే చివరి వారంలో చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ మాట్లాడుతూ - ''అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఎలిమెంట్స్‌ ఈచిత్రంలో వున్నాయి. ఇది ఒక సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కథ. విధి నిర్వహణ కోసం తమ కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసే ఎంతో మంది పోలీస్‌ ఆఫీసర్ల ఇన్‌స్పిరేషన్‌తో 'జయదేవ్‌' క్యారెక్టర్‌ని డిజైన్‌ చెయ్యడం జరిగింది. ఈ చిత్రంలో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే పది భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ వున్నాయి. కథతో లింక్‌ అయి వున్న ఈ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ సినిమాకి హైలైట్‌ అవుతాయి. అశోక్‌కుమార్‌గారి బేనర్‌లో 'ఈశ్వర్‌'తో ప్రభాస్‌ని హీరోగా పరిచయం చేశాం. మళ్ళీ ఇదే బేనర్‌లో 'జయదేవ్‌' చిత్రంతో గంటా రవిని హీరోగా నా దర్శకత్వంలో ఇంట్రడ్యూస్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.

గంటా రవి, మాళవిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్‌కుమార్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్‌, హరితేజ, శ్రావణ్‌, సుప్రీత్‌, కోమటి జయరామ్‌, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్‌, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్‌, అరవింద్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి

సంగీతం: మణిశర్మ,

సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి,

మూల కథ: అరుణ్‌కుమార్‌,

రచన: పరుచూరి బ్రదర్స్‌,

ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌,

ఫైట్స్‌: వెంకట్‌,

ఆర్ట్‌: కృష్ణమాయ, స్టిల్స్‌ నారాయణ,

కో-డైరెక్టర్‌: ప్రభాకర్‌ నాగ్‌,

ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి.రామమోహన్‌రావు,

నిర్మాత: కె.అశోక్‌కుమార్‌,

దర్శకత్వం: జయంత్‌ సి. పరాన్జీ.

విడుదలకు ముస్తాబవుతున్న సందీప్ కిషన్ నక్షత్రం

-- Hyderabad Published:26 April 2017 03:14:12 PM

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”.

'నక్షత్రం' చిత్రం ఒక్క పాట మినహా పూర్తయింది. ఈ గీతాన్ని ఓ ప్రముఖ కథానాయిక పై త్వరలోనే చిత్రీకరించ నున్నామని చిత్ర నిర్మాతలు తెలిపారు.అలాగే చిత్రం టీజర్ విడుదల ను ఓ వేడుకగా నిర్వహించనున్నామని తెలిపారు. ఈ చిత్రం లో సుప్రీం హీరో 'సాయి ధరమ్ తేజ్' పోషిస్తున్న పాత్ర అభిమానులను ఎంతగానో అలరిస్తుందన్నారు. మే నెలలో ఆడియో, అదేనెలలో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తు న్నట్లు తెలిపారు. 'పోలీస్ 'అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ 'నక్షత్రం' చిత్రమని తెలిపారు దర్శకుడు కృష్ణవంశీ. సందీప్ కిషన్, రెజీనా,ప్రగ్య జైస్వాల్,తులసి,జె.డి.చక్రవర్తి,ప్రకాష్ రాజ్,శివాజీరాజా, రఘుబాబు,తనీష్,ముఖ్తర్ ఖాన్,సాయికిరణ్, ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి

మాటలు: తోట ప్రసాద్,పద్మశ్రీ,కిరణ్ తటవర్తి,

సంగీతం: భీమ్స్,భారత్,

పాటలు: అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్,

కెమెర:శ్రీకాంత్ నారోజ్,

ఎడిటర్: శివ.వై.ప్రసాద్,

కొరియోగ్రఫీ: గణేష్,స్వామి;

పోరాటాలు:జాషువా మాస్టర్,జాలి బాస్టియన్,శ్రీధర్;

ఆర్ట్: పురుషోత్తం,

పబ్లిసిటీ: ఓంకార్ కడియం,

స్టిల్స్: మల్లిక్

నిర్మాతలు:ఎస్.వేణుగోపాల్,సజ్జు,కె.శ్రీనివాసులు

కధ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం; కృష్ణవంశీ

ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న అంటూ బెదిరిస్తున్న బిజెపి నాయ‌కులు

-- Hyderabad Published:26 April 2017 12:53:35 PM

ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేసిన బిజెపి..ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కుల‌కు గాలం వేస్తుంది. ఈ విష‌యాన్ని చాందిని చౌక్ ఎమ్మెల్యే అల్కా లంబా ఆరోపించారు. త‌న‌కు కూడా లోక్‌స‌భ సీటు ఇస్తామ‌ని ఆశ చూపార‌ని ఆమె మీడియా స‌మావేశంలో తెలిపారు. ఆప్ ప‌నైపోయిందంటూ బిజెపి నాయ‌కులు ఫోన్లు చేస్తున్నార‌ని, ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధిస్తామ‌ని కూడా చెబుతూ బెదిరింపులకు పాల్ప‌డుతున్నారంటూ అల్కా లంబా ఆరోపించారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో క‌మ‌లం విజ‌యం ఈవీఎంల మోసం వ‌ల్లే అని ఆరోపిస్తున్నారు.

సైనా నెహ్వాల్ ఎవ‌రో తెలిసిపోయింది..

-- Hyderabad Published:26 April 2017 12:48:59 PM

బాడ్మింట‌న్ స్టార సైనా నెహ్వాల్ జీవిత క‌థ‌తో సినిమా రూపొంద‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతుంది. ద‌ర్శ‌కుడు అమోల్ గుప్తా తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాను భూష‌ణ్ నిర్మిస్తున్నారు. సైనా నెహ్వాల్ బ‌యోపిక్‌కు బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ అయితే న్యాయం చేస్తుంద‌ని భావించిన ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెను సంప్ర‌దించార‌ట‌. శ్ర‌ద్ధా కూడా ఏ మాత్రం ఆలోచించ‌కుండా న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ట‌. ఎంతో మందికి ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచిన సైనా నెహ్వాల్ బ‌యోపిక్ చేయ‌డం అదృష్టం అంటూ శ్ర‌ద్ధా త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసింది.

సందీప్ కిష‌న్‌తో బాలీవుడ్ హీరోయిన్...

-- Hyderabad Published:26 April 2017 11:21:22 AM

ధ‌నుష్‌తో అనేకుడు(త‌మిళంలో అనేగ‌న్‌) చిత్రంలో న‌టించి మెప్పించిన హీరోయిన్ అమైరా ద‌స్త‌ర్, త‌ర్వాత జాకీచాన్ కుంగ్‌ఫూ యోగ చిత్రంలో కూడా న‌టించింది. తెలుగులో మంచు విష్ణు స‌ర‌స‌న న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చినా ఏవో కార‌ణాల‌తో వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో అమైరా ఆ సినిమాల‌ను చేయ‌లేదు. అయితే తెలుగులో అమైరా ద‌స్త‌ర్ తొలి చిత్రం సందీప్ కిష‌న్ స‌ర‌స‌న న‌టించ‌నుంద‌ని స‌మాచారం. ముందుగా మంజుల ద‌ర్శ‌కత్వంలో రూపొంద‌నున్న ఈ సినిమాలో ముందుగా సాయిప‌ల్ల‌విని హీరోయిన్‌గా అనుకున్నారు కానీ సాయిప‌ల్ల‌బి బిజీ షెడ్యూల్ కార‌ణంగా డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోవ‌డంతో యూనిట్ వ‌ర్గాల అమైరాను సంప్ర‌దించాయట‌. త్వ‌ర‌లోనే అధికార‌క స‌మాచారం రావ‌చ్చు.

హ్యుజ్ రెస్పాన్స్ రాబ‌ట్టుకున్న రాజ్‌త‌రుణ్ అంధ‌గాడు టీజ‌ర్

-- Hyderabad Published:26 April 2017 10:30:28 AM

ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధ‌గాడు`. కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం-ఆడోర‌కం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర‌ప్రసాద్ కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు `అంధ‌గాడు` అల్రెడి విడుద‌లైన పోస్ట‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. తొలిసారి రాజ్‌త‌రుణ్ గుడ్డివాడి పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. నిన్న‌ విడుద‌లైన టీజ‌ర్‌కు హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. కంప్లీట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కామెడి, ల‌వ్‌, యాక్ష‌న్‌, సస్పెన్స్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ స‌మ‌పాళ్ళ‌లో ఉండేలా ద‌ర్శ‌కుడు వెలిగొండ శ్రీనివాస్ డిఫ‌రెంట్ స్క్రిప్ట్‌తో తెర‌కెక్కించారు. స్ట్రాంగ్ అండ్ ఎగ్జ‌యిట్‌మెంట్ పాయింట్‌తో సినిమా అంతా ర‌న్ అవుతుంది. మే 26న సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర‌, షాయాజీ షిండే, స‌త్య‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న

ఈ చిత్రానికి

కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌,

సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌,

ఆర్ట్ః కృష్ణ మాయ‌,

చీఫ్ కోడైరెక్ట‌ర్ః సాయి దాసం,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గ‌రికిపాటి,

స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌,

నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌,

క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు,దర్శ‌క‌త్వంః వెలిగొండ శ్రీనివాస్‌.

వ్యోమ‌గామి పాత్ర‌లో ప్రియాంక చోప్రా...

-- Hyderabad Published:26 April 2017 10:25:40 AM

భార‌త సంత‌తికి చెందిన తొలి మ‌హిళా వ్యోమ‌గామి కల్ప‌నా చావ్లా జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొంద‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా టైటిల్ పాత్ర‌లో న‌టించ‌నుందని సినీ వ‌ర్గాల స‌మాచారం. ప్రియా మిశ్రా అనే డెబ్యూ డైరెక్ట‌ర్ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ఈ సినిమాపై ప్రియా మిశ్రా ఏడేళ్ళుగా ప‌నిచేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే సినిమాను కొత్త నిర్మాణ సంస్థ నిర్మించ‌నుంది. క్వాంటికో సిరీస్‌తో పాటు హాలీవుడ్ మూవీ బేవాచ్‌లో ప్రియాంక న‌టిస్తుంది.

ఎన్టీఆర్ మూవీ శాటిలైట్ హ‌క్కులు అమ్ముడైపోయాయి...

-- Hyderabad Published:26 April 2017 10:22:32 AM

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం `జై ల‌వ‌కుశ`. సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్‌ను జ‌రుపుకుంటుంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రంలో రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్‌, నందిత‌రాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. జ‌న‌తాగ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా చిత్రీక‌ర‌ణలో ఉండ‌గానే శాటిలైట్ హ‌క్కులు అమ్ముడైపోవ‌డం సినిమాపై అంచ‌నాల‌కు తార్కాణం. టాలీవుడ్‌లో వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం జెమిని టీవీ, సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను 14 కోట్ల‌కు కోనుగోలు చేసింద‌ట‌.

ర‌ష్య‌న్ మూవీలో రానా..

-- Hyderabad Published:26 April 2017 10:20:58 AM

న‌టుడుగా ఏడేళ్ళ కెరీర్‌ను పూర్తి చేసుకున్న ద‌గ్గుబాటి రానా రీసెంట్‌గా `ఘాజీ`తో ఈ ఏడాది స‌క్సెస్ కొట్టాడు. ఏప్రిల్ 28న `బాహుబ‌లి2` కూడా రానుండ‌టం విశేషం. స్టార్ ప్రొడ్యూస‌ర్ మ‌న‌వ‌డైనా హీరోగానే నిల‌దొక్కుకోవాల‌ని కాకుండా విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా విభిన్న‌మైన పాత్ర‌ల్లో మెప్పించాడు. బాహుబ‌లిలో భ‌ళ్ళాల‌దేవుడుగా అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రానా ఓ ర‌ష్య‌న్ సినిమాలో న‌టించ‌బోతున్నాడు. ఆదిత్యాచార్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మూమెంట‌రీ లాప్స్ ఆఫ్ రీజ‌న్ అనే హాలీవుడ్ మూవీలో న‌టించ‌బోతున్న రానా త్వ‌ర‌లోనే ర‌ష్య‌న్ సినిమాలో న‌టించే ఆలోచ‌న‌లు చేస్తున్నాడు. ఈ సినిమాలో రానా ఓ వారియర్ పాత్ర‌లో క‌న‌పిస్తాడ‌ని స‌మాచారం.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకే నిండుద‌నం వ‌చ్చింది: మెగాస్టార్ చిరంజీవి

-- Hyderabad Published:26 April 2017 10:16:32 AM

క‌ళాత‌ప‌స్వీ కె. విశ్వ‌నాథ్ కు ప్ర‌తిష్టాత్మ‌క దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు ఉద‌యం స్వ‌యంగా కె. విశ్వ‌నాథ్ ఇంటికి వెళ్లి ఆయ‌న్ను అభినందించారు.

అనంత‌రం చిరంజీవి మాట్లాడుతూ, `నాకు విశ్వ‌నాథ్ గారితో ఉన్న అనుబంధం న‌టుడు, ద‌ర్శ‌కుడ‌ని కాకుండా కుటంబ ప‌రంగాను మంచి రిలేషన్ ఉంది. ఆయ‌న‌కు ఈ అవార్డు రావ‌డం చాలా గ‌ర్వంగా ఉంది. మాట‌ల్లో చెప్ప‌లేని అనుభూతికి లోన‌వుతున్నా. అవార్డు రావాల్సిన స‌మ‌యంలో వ‌చ్చిందా? లేదా అన్న దానిపై ఇప్పుడు మాట‌లు అన‌వ‌స‌రం. ఈ అవార్డు ఆయన్ను ఎప్పుడో వ‌రించాల్సింది. కానీ కాస్త ఆల‌స్య‌మైన అవార్డు ఆయ‌నకు రావ‌డం సంతోషంగా ఉంది. ఆయ‌న ఎలా ఫీల్ అవుతున్నారో తెలియ‌దు గానీ, మేము మాత్రం చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం. ఆయ‌న‌కు అవార్డు రావ‌డం తో ఆ అవార్డుకే నిండుద‌నం వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు మ‌న‌స్ఫూర్తిగా శుభాబివంద‌నాలు తెలుపుతున్నా. ఎప్ప‌టికీ ఆయ‌న ఆశీస్సులు కోరే మ‌నిషినే..ఆయ‌న చిరంజీవినే` అని అన్నారు.

మే 5 నుండి జగపతిబాబు సూర్యాభాయ్‌ చివరి షెడ్యూల్‌ షూటింగ్‌

-- Hyderabad Published:25 April 2017 06:27:26 PM

ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు హీరోగా చిన్నారి ఆర్ట్స్‌, శ్రీ తిరుమల సినిమాస్‌ పతాకాలపై అర్జున్‌ వాసుదేవ్‌ దర్శకత్వంలో రాజేష్‌ చిన్నారి, ప్రతాప్‌ దండెం సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'సూర్యాభాయ్‌'. బి.వి. రామకృష్ణ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. ఇప్పటి వరకు 3 షెడ్యూల్స్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ని మే 5 నుండి జరుపనున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు రాజేష్‌ చిన్నారి, ప్రతాప్‌ దండెం మాట్లాడుతూ..''అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్నారు. టైటిల్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో జగపతిబాబు గారి పాత్ర కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. పొలిటికల్‌ సెటైరికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుంది. సెంటిమెంట్‌, ఎమోషనల్‌, ఫ్యామిలీ డ్రామా అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రేక్షకులందరూ ఎంజాయ్‌ చేసే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు అర్జున్‌ వాసుదేవ్‌ తీర్చిదిద్దుతున్నారు. ప్రదీప్‌రావత్‌, షాయాజీషిండే, సుమన్‌, సాయికుమార్‌, డి.ఎస్‌.రావ్‌, అర్చన ముఖ్యపాత్రల్లో నటిస్తున్నఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరోయిన్‌ జగపతిబాబుగారి సరసన నటిస్తుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని లావిష్‌గా తెరకెక్కిస్తున్నాము. స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. మే 5 నుండి జరిపే చివరి షెడ్యూల్‌తో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. జూన్‌లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తిచేసి జూలైలో ఈ చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేశాం..''అన్నారు.

ఓ ప్రముఖ హీరోయిన్‌ జగపతిబాబు సరసన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో షాయాజీషిండే, ప్రదీప్‌రావత్‌, సుమన్‌, సాయికుమార్‌, డి.ఎస్‌.రావ్‌, రాజారవీంద్ర, ఉత్తేజ్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, దిల్‌ రమేష్‌, అర్చన తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బి.వి. రామకృష్ణ, సంగీతం: ఆనంద్‌, ఆర్ట్‌: జె.కె. మూర్తి, ఫైట్స్‌: నందు, పి.ఆర్‌.ఓ. జిల్లా సురేష్‌, నిర్మాతలు: రాజేష్‌ చిన్నారి, ప్రతాప్‌ దండెం, దర్శకత్వం: అర్జున్‌ వాసుదేవ్‌.

ఓయూ ఉత్స‌వాల కోసం భారీ బందోబస్తు..

-- Hyderabad Published:25 April 2017 01:01:08 PM

తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ‌లో కీల‌క‌పాత్ర పోషించింది ఉస్మానియా యూనివ‌ర్సిటి. రాష్ట్ర అవ‌త‌ర‌ణ అనంత‌రం ముఖ్య‌మంత్రి అండ్ టీం యువ‌కుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఉస్మానియా అంతా నిరుద్యోగ గ‌ళంతో అట్టుడుకుతుంది. ఇప్పుడు ఉస్మానియా శ‌తాబ్ది ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగ‌నున్నాయి. ఈ వేడుక‌ల‌కు రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ రానుండ‌టంతో ప్ర‌భుత్వం ఎటువంటి అవాంచ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటుంది. క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ యూనివ‌ర్సిటీలోని విద్యార్థి సంఘాల నాయ‌కుల‌తో స‌మావేశ‌మై, ఎలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు తలెత్త‌కుండా చూడాల‌ని, లేకుంటే క‌ఠిన చర్య‌లు త‌ప్ప‌వ‌ని తెలియ‌జేశారు.

టోల్ గేట్ వద్ద ఎంపీ కొడుకు గొడవ ...

-- Hyderabad Published:25 April 2017 11:37:58 AM

ఆనంత‌పురం జిల్లా హిందూపురం ఎంపి నిమ్మ‌ల‌కిష్ట‌ప్ప కుమారుడు అంబ‌రీష్ క‌ర్ణాట‌క‌లోని బాగేప‌ల్లి టోల్ గేట్ వ‌ద్ద దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై ఎంపి నిమ్మ‌ల‌కిష్ట‌ప్ప గ‌తంలో కూడా త‌మ వాహ‌నాల‌ను టోల్ గేట్ వ‌ద్ద ఆపి గొడ‌వ చేశారు. ఇలాంటి గొడ‌వ‌లు త‌మ‌కు కొత్తేం కాద‌ని త‌న కుమారుడు అంబ‌రీష్ త‌ప్పేదైనా ఉంటే కేసులు పెట్టాల‌ని ఈ సంద‌ర్భంగా కిష్ట‌ప్ప తెలిపారు. ఎంపి వాహ‌నం అని తెలిసినా టోల్ గేట్ వ‌ద్ద ప‌దే ప‌దే ఆప‌డం స‌రికాద‌ని అన్నారు. తాను ఈ విష‌యాన్ని కేంద్ర ర‌వాణా, ర‌హ‌దారులు శాఖా మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి పిర్యాదు చేసినట్లు కూడా చెప్పారు. ఈ విష‌యంపై ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

సుకుమా ఎన్‌కౌంట‌ర్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య‌..

-- Hyderabad Published:25 April 2017 11:26:09 AM

ఛ‌తీష్ గ‌డ్ రాష్ట్రంలో నిన్న సుకుమా జిల్లాలో సిఆర్‌పిఎఫ్ జ‌వాన్ల‌పై మావోయిస్లులు ఒక్క‌సారిగా మెరుపుదాడికి పాల్ప‌డ్డారు. మావోయిస్టులు జ‌రిపిన కాల్పుల్లో 26 మంది జ‌వాన్లు మ‌ర‌ణించ‌గా, 7 మంది అదృశ్య‌మ‌య్యారు. మ‌రికొంత మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఛ‌తీష్ గ‌డ్‌లో సుకుమా జిల్లాలో రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల కోసం వెళ్లిన సిఆర్‌ఫిఎఫ్ జ‌వాన్లపై రెక్కీ నిర్వ‌హించి ప‌క్కా స్కెచ్‌తో 300 మంది మావోయిస్టులు దాడ‌లు చేశారు. ఎం జ‌రుగుతుందో తెలుసుకునే లోపు కొంద‌రు జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. జ‌వాన్ల నుండి మావోలు ఆయుధాల‌ను ఎత్తుకెళ్ళారు. స‌మాచారం తెలుసుకున్న అధికారులు హెలికాప్ట‌ర్ల సాయంతో క్ష‌త‌గాత్రుల‌ను రాయ్‌పూర్‌, జ‌గ్ద‌ల్ పూర్ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు ఈ దాడిని ఖండించారు.

క‌ళాత‌పస్వికి దాదా సాహెబ్ పాల్కే...

-- Hyderabad Published:25 April 2017 11:17:48 AM

క‌ళాత‌పస్వి కె.విశ్వ‌నాథ్ అంటే ఏ తెలుగు ప్రేక్ష‌కుడైనా వెంట‌నే గుర్తుకు వ‌చ్చేవి తెలుగు సంస్కృతి సంప్ర‌దాయాల‌ను సినిమాల రూపంలో అందించిన మ‌హోన్న‌త ద‌ర్శ‌కుడు గుర్తుకు వ‌స్తాడు. 1957లో తోడి కోడ‌లు సినిమాతో సౌండ్ డిపార్ట్‌మెంట్‌లో కెరీర్‌ను స్టార్ట్ చేసిన కె.విశ్వ‌నాథ్ ఆత్మ‌గౌర‌వం సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. సిరి సిరి మువ్వ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా త‌న ప్రత్యేక‌త‌ను చాటుకున్న ఈయ‌న సిరివెన్నెల‌, శంకరాభ‌ర‌ణం, శృతిల‌య‌లు, స్వ‌ర్ణ క‌మ‌లం, స్వాతిముత్యం, స్వాతికిర‌ణం వంటి ఎన్నో మ‌రుపు రాని చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు. మే 3న రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా కె.విశ్వ‌నాత్ ఢిల్లీలో ఈ అవార్డును అందుకోనున్నారు.

బాహుబ‌లి సినిమా కాదు..ఓ బ్రాండ్ - ఎస్‌.ఎస్.రాజ‌మౌళి

-- Hyderabad Published:25 April 2017 11:14:49 AM

ద‌ర్శ‌క‌ధీరుడు రూపొందించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లిలో రెండో భాగం `బాహుబ‌లి-2` ఏప్రిల్ 28న విడుదలవనుంది

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయ స‌మావేశంలో ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి మాట్లాడుతూ ..``ఓ బ్రాండ్‌లా మారింది. ప్రపంచవ్యాప్తంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసేందుకు టీం అంతా ఎంతో క‌ష్ట‌ప‌డింది. `బాహుబ‌లి చిత్రాన్ని ఓ బ్రాండ్‌లా అనేక శాఖ‌లుగా విస్త‌రించాం. `దీనిపై యానిమేషన్‌లు, కామిక్‌లు, పుస్తకాలు, వీడియో గేమ్స్‌ రూపొందాయి. ఇక మీదటా పలు రూపాల్లో బాహుబలి ప్రపంచం కొనసాగుతుంది. వర్చువల్‌ రియాలిటీలో ‘బాహుబలి’ని వీక్షించడం ఓ అనిర్వచనీయమైన అనుభూతి. వీఆర్‌ కోసమే కొన్ని ప్రత్యేక సన్నివేశాల్ని రూపొదించాం. వాటిని దేశ వ్యాప్తంగా ఉన్న థియేటర్లు, గేమింగ్‌ సెంటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తాం. వీఆర్‌ ఎఫెక్ట్‌లో బాహుబ‌లిని చూడాల‌నే ఆస‌క్తితో ఉన్నాను అని తెలిపారు.

నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ...2012లో ‘బాహుబలి’ ప్రయాణం ప్రారంభమైంది. కథ విన్నప్పుడే.. సినిమాకి మించి ఏదైనా చేయాలి అనిపించింది. అప్పుడే ఈ బ్రాండింగ్‌ ఆలోచన వచ్చింది. రాజమౌళి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడంతో ఫలితం ఈ స్థాయిలో కనిపిస్తోంది. బాహుబ‌లి పేరుతో తయారు చేసిన వీడియో గేమ్‌ని రెండ్రోజుల్లో విడుదల చేస్తామ‌ని అన్నారు.

మే ప్ర‌థ‌మార్థంలో ర‌క్ష‌క‌భ‌టుడు

-- Hyderabad Published:25 April 2017 11:00:08 AM

సుఖీభ‌వ మూవీస్ బ్యాన‌ర్‌పై ఎ.గురురాజ్ నిర్మించిన చిత్రం `ర‌క్ష‌క‌భ‌టుడు`. ర‌క్ష‌, జ‌క్క‌న్న వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాలు త‌ర్వాత ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం మే నెల ప్ర‌థ‌మార్థంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఓ సాంగ్ మాత్ర‌మే ఉంది. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందించిన ఈ పాట‌ను ద‌ర్శ‌కుడు మారుతి విడుద‌ల చేశారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మారుతి సాంగ్‌ను రిలీజ్ చేశారు.

పోలీస్ గెట‌ప్‌లోని ఆంజ‌నేయ స్వామి మోష‌న్ పోస్ట‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అంద‌రిలో ఓ క్యూరియాసిటీని పెంచింది. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆస‌క్తి క‌లిగింది. కాసర్ల‌శ్యాం రాసిన పాట బావుంది. సినిమా పెద్ద హిట్ అవుతుంది. వంశీకృష్ణ‌కు ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ మూవీ అవుతుంద‌ని మారుతి చెప్పారు. సినిమాల‌పై ఆస‌క్తితోనే రియ‌ల్ ఎస్టేట్ రంగం నుండి సినిమాల వైపు అడుగులేశాను. వంశీ చెప్పిన క్లైమాక్స్ విని ఒళ్ళు జ‌ల‌ద‌రించింది. క‌థ‌ను ఎలా చెప్పారో అలాగే తెర‌కెక్కించారు. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌నేదే ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో, ఆంజ‌నేయ‌స్వామి గెట‌ప్‌లోఉన్నది ఎవ‌రు? అనే ప్ర‌శ్న అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించింది. వంశీకృష్ణ‌గారు సినిమాలోని ప్ర‌తి స‌న్నివేశాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. శేఖ‌ర్ చంద్రగారి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళుతుంది. మ‌ల్హ‌ర్‌భ‌ట్ జోషి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్ అవుతుంది అని నిర్మాత ఎ.గురురాజ్ తెలిపారు.

మాస్ ట‌చ్ ఉండే సాంగ్‌ను శేఖ‌ర్ చంద్ర‌గారు అద్భుతంగా అందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ను పెంచింది. ప్రొడ్యూస‌ర్ రియ‌ల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారో, సినిమా రంగంలో కూడా అలాంటి స‌క్సెస్‌ను సొంతం చేసుకోవాల‌ని కోరుకుంటున్నాను. మోష‌న్ పోస్టర్‌కు, టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆంజ‌నేయ‌స్వామి గెట‌ప్‌లో ఉన్న హీరో ఎవ‌ర‌నే ఆస‌క్తి అంద‌రిలో కలిగింది. మే ప్ర‌థ‌మార్థంలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామ‌ని ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ అన్నారు. సినిమాలో చాలా మంచి క్యారెక్ట‌ర్ చేశాను. నా క్యారెక్ట‌ర్ చుట్టూనే సినిమా క‌థంతా న‌డుస్తుందని రిచా ప‌న‌య్ తెలుప‌గా, జ‌క్క‌న్న‌లో రెండుసాంగ్స్ రాశాను. నాపై న‌మ్మ‌కంతో ఈ సినిమాలో ఒకే ఒక మాస్ ట‌చ్ ఉన్న సాంగ్‌ను రాసే అవ‌కాశం ఇచ్చినంద‌కు ద‌ర్శ‌క నిర్మాత‌లకు ధ‌న్య‌వాదాల‌ని కాస‌ర్ల‌శ్యాం చెప్పారు. ఇది హ‌ర్ర‌ర్‌, స‌స్పెన్సో, థ్రిల్ల‌రో అని చెప్ప‌లేని డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీ ఆడియెన్స్‌ను ప్ర‌తి సీన్ ఆక‌ట్టుకుంటుంద‌ని శేఖ‌ర్ చంద్ర తెలిపారు.

హ‌ర్ర‌ర్ స‌స్పెన్స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా టిక్ టాక్‌

-- Hyderabad Published:25 April 2017 10:42:24 AM

పి.హెచ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై చంద్రహాస్ చిత్రానికి స్వ‌ర్ణ నందిని పొంది, స‌తీష్‌, దేవాక‌ట్టా వంటి ద‌ర్శ‌కుల్ని, వెన్నెల‌కిషోర్‌, పార్వతీమెల్ట‌న్ వంటి నటీన‌టుల‌ను ప‌రిచ‌యం చేసిన స‌రోజిని దేవి ఇంట్రిగేష‌న్ అవార్డ్ గ్ర‌హీత పోలిచ‌ర్ల హ‌ర‌నాథ్ నిర్మిస్తూ న‌టిస్తూ దర్శకత్వం వహిస్తున్న హార్ర‌ర్‌, ఫ‌న్‌, ల‌వ్ కాన్సెప్ట్ మూవీ సినిమా `టిక్ టాక్‌`. ఈ సినిమా ప్రోమో రిలీజ్‌ను టి.ప్ర‌స‌న్న‌కుమార్ ప్రోమోను విడుద‌ల చేశారు.

హార్ర‌ర్‌, కామెడి జోన‌ర్‌లో అన్నీ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి చేసిన సినిమా ఇది. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసేలా సినిమా ఉంటుంది. అశ్లీల‌త ఉండ‌దు. ఎంట‌ర్‌టైనింగ్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కులను అల‌రించేలా సినిమా ఉంటుంది. తెలుగు సినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌ని విధంగా ఓ సాంగ్‌ను పిక్చ‌రైజ్ చేశాం. సినిమాలో అశ్లీల‌త ఉండ‌దు. వ‌చ్చే రెండేళ్ళ‌లో నాలుగు సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నానని ష‌హరినాథ్ పొలిచెర్ల అన్నారు. చంద్ర‌హాస్‌, హోప్‌, చాప్ట‌ర్ 6 వంఇ డిఫ‌రెంట్ సినిమాలు చేసిన హ‌రినాథ్ పొలిచెర్ల‌గారు ఇప్పుడు స‌క్సెస్ సాధిస్తున్న హ‌ర్ర‌ర్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో టిక్ టాక్ సినిమా చేశారు. ఈ సినిమా ఆయ‌న‌కు చాలా పెద్ద హిట్ కావాలని ప్ర‌స‌న్న‌కుమార్ అన్నారు.

పోలిచ‌ర్ల హ‌ర‌నాథ్‌, నిషిగంద, మౌనిక‌, రాహుల్‌, సందీప్ ఆనంద్‌, సాయికృష్ణ‌, అల్లూ ర‌మేష్‌, ర‌మ‌ణి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి

సినిమాటోగ్ర‌ఫీః పి.వంశీకృష్ణ‌,

సంగీతంః ఎస్ అండ్ బి మ్యూజిక్ మిల్‌,

ఎడిట‌ర్ః వెంక‌ట ర‌మ‌ణ‌,

ఆర్ట్ః ఇ.గోవింద్‌,

మూల‌క‌థః లిఖిత్ శ్రీనివాస్‌,

క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, నిర్మాత‌, డైరెక్ష‌న్ః పొలిచ‌ర్ల హ‌రినాథ్‌.

చర‌ణ్ మూవీ తొలి షెడ్యూల్ పూర్తి..

-- Hyderabad Published:25 April 2017 10:08:37 AM

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్‌, స్టైలిష్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై వై.ర‌వివంక‌ర్‌, న‌వీన్ ఎర్నేని, సి.వి.మోహ‌న్ నిర్మాత‌లుగా ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాలు, పాపి కొండ‌లు ప్ర‌దేశాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ చెవిటివాడిగా న‌టిస్తుంటే, స‌మంత మూగ అమ్మాయిగా న‌టిస్తుంది. ఈ సినిమాను ఆగ‌స్టులో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేసుకుంటున్నారు.

అక్ష‌య్ కుమార్ మండిపాటు...

-- Hyderabad Published:25 April 2017 10:05:40 AM

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ రుస్తుం సినిమాలో న‌ట‌న‌కుగానూ జాతీయ అవార్డును సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ అవార్డు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి అమీర్‌ఖాన్‌, మనోజ్ బాజ్‌పాయి వంటి వారి కంటే అక్ష‌య్ ఏం గొప్ప‌గా చేశాడ‌ని అవార్డు ఇచ్చారంటూ కొంద‌రు విమ‌ర్శించారు. నేష‌న‌ల్ అవార్డ్స్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా ప్రియ‌ద‌ర్శ‌న్ ఉండ‌టం వ‌ల్లే అక్ష‌య్‌కు అవార్డ్ వ‌చ్చిందంటూ కామెంట్స్ చేశారు. దీంతో అక్ష‌య్‌కు ఎక్క‌డ లేని కోపం వ‌చ్చి, మీరు కావాలంటే అవార్డు వెన‌క్కి తీసేసుకోండి అంటూ మండిప‌డ్డాడు. ఎవ‌రికైనా అవార్డు వ‌స్తే చాలు చ‌ర్చ మొద‌లుపెడ‌తారు. ర‌మేష్‌సిప్పి ఛైర్మ‌న్‌గా ఉండ‌గా అమితాబ్‌కు, ప్ర‌కాష్ ఝా ఛైర్మ‌న్‌గా ఉండ‌గా అజయ్ దేవ‌గ‌ణ్‌కు అవార్డు వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించ‌లేదు కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్ర‌శ్న‌లు ఎందుకు వ‌చ్చాయో తెలియ‌దు. నాకు ఈ అవార్డు రావ‌డానికి 26 ఏళ్ళు ప‌ట్టింది అని అక్ష‌య్ పెర్కొన్నారు.

నానితో వ‌రుణ్‌తేజ్ హీరోయిన్‌...

-- Hyderabad Published:24 April 2017 05:47:40 PM

వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకెళ్ళోన్న నేచుర‌ల్ స్టార్ నాని ఇప్ప‌డు `నిన్నుకోరి` సినిమాను విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత నాని ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీరాం ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సినిమాను నిర్మించ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాలో ముందుగా మెహ‌రీన్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఇప్పుడు మెహ‌రీన్ స్థానంలో మ‌ల‌యాళ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి న‌టించ‌నుంద‌ట‌. మ‌ల‌యాళ ప్రేమ‌మ్‌లో న‌టించిన సాయిప‌ల్ల‌వి తెలుగులో వ‌రుణ్‌తేజ్ `ఫిదా` చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. నెక్ట్స్ నాని సినిమా చేయ‌బోతుంది.

అభిమానుల తాకిడికి రామ్ చ‌ర‌ణ్ సినిమా షూటింగ్ కి అంత‌రాయం!!

-- Hyderabad Published:24 April 2017 05:45:35 PM

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తోన్న కొత్త సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. విల‌క్ష‌ణ చిత్రాల దర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం పోల‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుగుతోంది.

ఈ సంద‌ర్భంగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ, ` `ఖైదీ నంబ‌ర్ 150`వ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది అంటే కార‌ణం ప్రేక్ష‌కాభిమానులే. 100 రోజులు సినిమా ఆడ‌టం అనేది ఎప్పుడో పోయింది. కానీ `ఖైదీ నంబ‌ర్ 150`వ సినిమా 100 రో జులు ఆడింది. అది మీవ‌ల్లే. నాన్న‌గారి 151వ సినిమా ఆగ‌స్టులో ప్రారంభం అవుతుంది. ఇంత వ‌రకూ ఆయ‌న ఇలాంటి పాత్ర‌లో క‌నిపించ‌లేదు. ఓ గొప్ప పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జ‌ర‌గ‌నుంది. క‌చ్ఛితంగా పెద్ద విజ‌యం సాధిస్తుంది. అలాగే నా `ధృవ` సినిమా కూడా పెద్ద హిట్ అయింది. అప్పుడు దేశం డీమానిటైజేష‌న్ స‌మ‌స్య‌ లో ఉంది. అలాంటి స‌మ‌యంలో కూడా భారీ వ‌సూళ్లు వ‌చ్చాయి అంటే కార‌ణం అభిమానులే. అందుకు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా. బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయ‌న స‌మ్మ‌ర్ ను సైతం లెక్క చేయ‌కుండా అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నారు. అందుకు ఆయ‌న‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. బాబాయ్ ఏ కార్య‌క్ర‌మం చేసినా ఆయ‌న వెన్నంటే ఉండాలి. రాజ‌కీయ ప‌రంగానైనా..ఇంకేదైనా. భార‌త‌దేశంలో మెగా అభిమానులంతా భారీ ఎత్తున సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. చాలా గొప్ప సేవ చేస్తున్నారు. మేము ఇంత ఎత్తుకు ఎదిగామంటే కార‌ణం మీరే. నేను హైద‌రాబాద్ లో ఉండి సినిమా షూటింగ్ చేసుకోవ‌చ్చు. కానీ మిమ్మ‌ల్ని అల‌రించాలనే క్లిష్ట‌ప‌రిస్థితులు ఎదురైనా సినిమా షూటింగ్ కోసం నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతున్నాం. నా సినిమా విష‌యానికి వ‌స్తే .. సుకుమార్ చాలా మంచి క‌థ చెప్పారు. క‌థ‌, క‌థ‌నాలు చాలా డిఫ‌రెంట్ గా ఉన్నాయి. అందుకే సినిమాకు క‌మిట్ అయ్యా. మీ అంద‌ర్నీ అల‌రించే విధంగా సినిమా ఉంటుంది` అని అన్నారు.

మెగాఫ్యాన్స్ జాతీయ అధ్య‌క్షుడు ర‌మ‌ణం స్వామినాయుడు మాట్లాడుతూ, `-గ‌త 26 రోజులు నుంచి పోల‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల్లో, అన‌గా కొత్తూరు, టేకూరు మ‌రియు గిరిజన ప్రాంతాల్లో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ సినిమా షూటింగ్ జ‌ర‌గ‌ని ప్ర‌దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. హైద‌రాబాద్ కంటే భారీ ఉష్ణోగ్ర‌త‌లు న‌మొద‌య్యే ప్రాంతాల‌లో వేడిమిని త‌ట్టుకుని చిత్ర యూనిట్ షూటింగ్ చే్స్తున్నారు. అదే విధంగా అక్క‌డ ఉన్న అద్భుత‌మైన అందాల న‌డుమ షూటింగ్ చేస్తున్నారు. క‌థ‌కు సంబంధించిన పురాతన‌మైన గ్రామాలు దొర‌క‌డం వ‌ల్ల సుకుమార్ ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. అందుకు హీరో రామ్ చ‌ర‌ణ్ ఏ మాత్రం కాద‌న‌కుండా ఎంత క‌ష్ట‌మైనా చేద్దామ‌ని టీమంతా క‌లిసి ఇక్క‌డే షూటింగ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి సెల్ ఫోన్లు ప‌నిచేయ‌వు. మ‌ధ్య‌లో రెండు రోజులు కొల్లేరు ప్రాంతంలో షూటింగ్ జ‌రిపారు. ఈ ప్రాంతంలో షూటింగ్ స‌మ‌యంలో భారీగా వీరాభిమానులు త‌ర‌లి రావ‌డం వ‌ల్ల వాళ్ల ధాటికి త‌ట్టుకోలేక షూటింగ్ క్యాన్సిల్ చేశారు. త‌ర్వాత కొత్తూరు లో నిన్న‌టి రోజున (ఆదివారం 23వ తేదీన‌) మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో కూడా అభిమానుల తాకిడి ఎక్కువ కావ‌డంతో షూటింగ్ ర‌ద్దు చేశారు. రోజు రోజుకి మారుమూల గ్రామాల నుంచి అభిమానులు భారీ ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు. షూటింగ్ చూడ‌టానికి వ‌చ్చిన ఓ అభిమాని కుటుంబం త‌మ బాబుకి కిడ్నీ సంబంధింత వ్యాదితో బాధ ప‌డుతుంటే, ఎన్ని ఆసుప‌త్రులు తిరిగినా స‌రైన వైద్యం కుద‌ర‌కపోవ‌డంతో స్వ‌యంగా హీరో చ‌ర‌ణ్ వైద్య స‌దుపాయాలు క‌ల్పించారు. అలాగే షూటింగ్ చూడ‌టానికి వ‌చ్చిన అభిమానులంద‌రికీ ఆయ‌న భోజ‌న వ‌స‌తులు క‌ల్పించారు. వారం రోజుల క్రితం ఏపీ, తెలంగాణ రాష్ర్టాల‌కు కొత్త అధ్య‌క్షుల‌ను కె. నాగేంద్ర‌బాబు నియ‌మించారు. ఏపీ అధ్య‌క్షుడిగా కె. రామ‌కృష్ణ (త‌ణుకు), తెలంగాణ రాష్ర్ట అధ్య‌క్షుడిగా ఏ.నంద‌కిషోర్ (సూర్యాపేట‌) ఎంపిక‌య్యారు. వారిద్ద‌ర్నీ అశేష అభిమానుల స‌మ‌క్షంలో చ‌ర‌ణ్ ప్ర‌తిపాదించి అభినందించారు` అని తెలిపారు.

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ సమావేశం

-- Hyderabad Published:24 April 2017 05:08:58 PM

తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ 3 సంవ‌త్స‌రాల‌ వార్షికోత్స‌వం జ‌రుపుకుంటూ నూత‌నంగా క‌మిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవ‌డం జ‌రిగింది ప్రెసిడెంట్ గా ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ ని వైస్ ప్ర‌సిడెంట్ గా జె.వి.ఆర్. గారిని సెక్ర‌ట‌రీ గా ల‌య‌న్ సాయి వెంక‌ట్ గారిని ఎన్నుకోవ‌డం జ‌రిగింది. అలాగే బాడి మెంబ‌ర్స్ గా ఇంకా 23 మందిని ఎక‌గ్రీవంగా ఎన్నుకోవ‌డం జ‌రిగింది.ఇరందరి ప్రమాణస్వీకారం ఈ రోజు ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. అలాగే తె‍లంగాణ‌ మా మూవి అండ్ టీవి ఆర్టిస్ట్ అసోసీయేష‌న్ కి అధ్య‌క్షురాలిగా సీనియ‌ర్ హీరోయిన్ శ్రీమ‌తి క‌విత‌ గారిని మెంబ‌ర్స్ అంద‌రం క‌లిసి జన‌ర‌ల్ బాడి మీటింగ్ లో ఎక‌గ్రీవంగా ఎన్నుకోవ‌డం జ‌రిగింది సెక్ర‌ట‌రి గా శ్రీ జె.వి.ఆర్.గారిని ఎన్నుకోవ‌డం జ‌రిగింది పూర్తిగా క‌మిటీని త్వ‌ర‌లో నిర్ణ‌యించుకుంటాం త‌రువాత‌ దాదాపు 100 మంది సినీ మ‌రియు టీవి ఆర్టిస్ట్ మ‌రియు టెక్నీషియ‌న్స్ అంద‌రికి ఫ్రీగా 5 లక్ష‌ల‌ వార్త్ గ‌ల‌ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ కి సంబందించిన‌ హెల్త్ కార్డ్స్ ఇవ్వ‌డం జ‌రిగింది ఇంకా ఎవ‌రికైన‌ సినీ మ‌రియు టీవి ఆర్టిస్ట్ మ‌రియు టెక్నీషియ‌న్స్ హెల్త్ కార్డ్స్ అవ‌స‌ర‌మున్న‌ వారు తె‍లంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ లో అప్లై చేసుకుంటే ఫ్రీగా హెల్త్ కార్డ్స్ మేము ఇప్పిస్తాం హెల్త్ కార్డ్ తో పాటు చ‌దువుకునే పిల్ల‌ల‌కు స్కూల్ స్కాల‌ర్షిప్స్ కూడా ఇప్పిస్తాం దీనితో పాటు జ‌న‌ర‌ల్ బాడి మీటింగ్ కూడా ఇక్క‌డ‌ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది స‌భ్యులు కూడా అధిక‌ సంఖ్య‌లో హాజ‌రై వారి మ‌ద్ద‌త్తు తెలిపినందుకు వారికి ద‌న్య‌వాదాలు తెలుపుతున్నాం ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ మాట్లాడుతూ... భ‌విష్య‌త్తులో ఇందులో ఉండే సినిమా మ‌రియు టీవి ఆర్టిస్టులుల‌కు మ‌రియు టెక్నీషియ‌న్స్ కాని రెండు ప‌డ‌క‌ల‌ గదులు ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించి ముఖ్య‌మంత్రి గారికి కూడా ఈ ఉత్త‌రం ద్వారా తెలియ‌జేసి ఇండ్లు మంజూరు అయ్యే విదంగా చ‌ర్య‌లు తీసుకుంటాం...

డిజిట‌ల్ విధాన‌ దోపిడి వ‌ల్ల‌ చిన్న‌ సినిమాలు ఎక్కువ‌గా షూటింగ్ జ‌రుపుకోవ‌డం లేదు షూటింగ్ జ‌రిగిన‌ సినిమాలు రిలీజ్ కావ‌డం లేదు ఎందుకంటే ఒక‌ సినిమా డిజిట‌ల్ ట్రాన్స్ ఫ‌ర్ కి వారానికి 11వేలు సినిమా థియేట‌ర్ల‌కు 13 వేలు మ‌ల్టీ ప్లెక్స్ థియేట‌ర్ల‌కు తీసుకుంటున్నారు ప్ర‌క్క‌ రాష్ట్రాల‌ల్లో వారానికి ఒక‌ సినిమాకి డిజిట‌ల్ చార్జీలు 2500 ఉన్నాయి ఇక్క‌డ‌ 10 వేల‌ రూపాయ‌లు వారానికి ఎక్కువ‌గా తీసుకుంటున్నారు దీనివ‌ల్ల‌ నెల‌కు 15 కోట్ల‌ రూపాయ‌లు దోచుకుంటున్నారు దీనికి రెండు రాష్ట్రాల‌ల్లో గ‌వ‌ర్న‌మెంట్ ట్యాక్స్ కూడా క‌ట్ట‌ట్లేదు అలాగే వీల్లే రెండు రాష్ట్రాల‌ల్లో సినిమా థియేట‌ర్ల‌ను గుప్ప‌ట్లో పెట్టుకొని ఎక్క‌డ‌ కూడా ప‌ర్సంటేజ్ విధానంలో ఇవ్వ‌కుండా డ‌బ‌ల్ రెంట్ చార్జ్ చేస్తూ వాల్ల‌ సినిమాల‌నే రిలీజ్ చేస్తూ బ‌య‌ట‌ సినిమాలు ఎవ్వ‌రికి థియేట‌ర్లు ఇవ్వ‌కుండా మోనొపొలి వాధానం అవ‌లంబిస్తు దాదాపుగా 250 నుండి 300ల‌ సినిమాలు సెన్సార్ అయి థియేట‌ర్లు దొర‌క‌కా రిలీజ్ కాకుండా నిర్మాత‌లు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు కాబ‌ట్టి దీన్ని రెండు రాష్ట్రాల‌ ప్ర‌భుత్వాల‌ ముఖ్య‌మంత్రులు వీరి మోనోపొలి పోయె విధంగా అల‌గే ప్ర‌క్క‌ రాష్ట్రాల‌లో వారానికి 2500 ఉన్న‌ట్లు మ‌న‌ రెండు రాష్ట్రాల‌లో చేయ‌ల‌ని రెండు రాష్ట్రాల‌ ముఖ్య‌మంత్రుల‌ను కోరుతూ తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఆద్వ‌ర్యంలో చాంబ‌ర్ ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ గారు అలాగే మూవి మ‌రియు టీవి ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షురాలు శ్రీమ‌తి క‌విత‌ గారు డిమాండ్ చేసారు....ఇంకా ఈ కార్యక్రంలో సీనియర్ నటుడు నర్సింగారాజు,సీనియర్ నటి గీతాంజలి,మిస్ ఆసియ రేష్మి ఠాకూర్,కిషన్,కట్ట రాంబాబు,బులెట్ రవి తో పాటు అధిక సంఖ్యలో సినీ కార్మికులు పాలుగొని విజయవంతం చేసారు.

వేసవి కానుకగా మే 19న ఏంజెల్ విడుదల

-- Hyderabad Published:24 April 2017 04:57:58 PM

నాగ అన్వేష్, హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఏంజెల్'. 'బాహుబలి' ఫేం పళని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ సోషియో ఫాంటసీగా రానున్న 'ఏంజెల్' టీజర్ తాజాగా విడుదలై విశేష స్పందన అందుకుంటోంది.ఇక ఇటీవలే చిత్రీకరణ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అవుట్ పుట్ చూసిన చిత్రబృందం, సినిమా అద్భుతంగా వచ్చిందని, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమాను వేసవి కానుకగా మే 19న ఏంజెల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాతలు సింధూరపువ్వు కృష్ణారెడ్డి, భువన్ సాగర్ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తన కెరీర్ లోనే 'ఏంజెల్' గొప్ప సినిమా అవుతోందని హెబ్బా కాన్ఫీడెంట్ గా చెబుతోంది. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సప్తగిరి ఈ సినిమా రిలీజ్ తరువాత తను నెక్ట్స్ లెవల్ కి వెళ్తానంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ లో నాగ అన్వేష్ ప్రదర్శీస్తోన్న నటన చూసి పలువురు సీనియర్ నటులు మెచ్చుకోవడం విశేషం. ​

జై ల‌వ‌కుశ కూడా వెన‌క్కే

-- Hyderabad Published:24 April 2017 04:09:12 PM

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `జై ల‌వ‌కుశ‌`. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. . ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న నివేదాథామ‌స్‌, రాశిఖ‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఈ సినిమాను ఆగ‌స్టులో విడుద‌ల చేద్దామ‌ని యూనిట్ వ‌ర్గాలు భావించాయి. అయితే మ‌హేష్ సినిమా జూన్ నుండి ఆగ‌స్టు విడుద‌ల‌కు సిద్ధం కావ‌డంతో ఇప్పుడు ఎన్టీఆర్ త‌న సినిమాను సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో విడుద‌ల చేయ‌డానికి నిర్ణయం తీసుకున్నాడ‌ట‌.

మ‌హాభార‌తం త‌ప్ప‌కుండా చేస్తానంటున్న ద‌ర్శ‌క‌ధీరుడు...

-- Hyderabad Published:24 April 2017 03:24:39 PM

ఇండియన్ గ్రాండ్ విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి రెండో భాగం `బాహుబ‌లి 2` ఏప్రిల్ 28న విడుద‌ల‌వుతుంది. ఈ విజువ‌ల్ వండ‌ర్‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌క‌ధీరుడు తదుప‌రి ఏ సినిమా చేస్తాడోన‌ని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. రాజ‌మౌళి త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ మ‌హాభార‌తం సినిమా తీస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు ఆ విష‌యాన్ని బ‌హిర్గ‌తం కూడా చేశాడు. అయితే మ‌హాభార‌తం సినిమాను వెయ్యి కోట్ల‌తో తెర‌కెక్కించ‌డానికి మోహ‌న్‌లాల్ రెడీ అయ్యాడు. అయితే తాను కూడా మ‌హాభార‌తం తీస్తాన‌ని, అదొక మ‌హా స‌ముద్ర‌మ‌ని, ఎవ‌రికి ఎంత నీళ్ళు కావాల్సి వ‌స్తే అంత తీసుకోవ‌చ్చున‌ని, మ‌హాభార‌తం నా స్ట‌యిల్లో ఉంటుంద‌ని రాజ‌మౌళి అంటున్నారు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్‌కు రెడీ అంటున్న దేవి

-- Hyderabad Published:24 April 2017 11:33:09 AM

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ అమెరికాలో చేసిన లైవ్ స్టేజ్ పెర్‌ఫార్మెన్స్‌కు మంచి స్పంద‌న రావ‌డంతో ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో లైవ్ పెర్‌ఫార్మెన్స్ ఇవ్వ‌డానికి రెడీ అయ్యారు. అందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుద‌ల చేశారు. కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

        లైవ్ పెర్‌ఫార్మెన్స్‌ల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్ళే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. ఇటీవ‌ల యు.ఎస్‌లో నేను చేసిన డిఎస్‌పి లైవ్ టూర్ స‌క్సెస్ అయ్యింది. ఆ టూర్ త‌ర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్ ప్లాన్ చేశాం. అమెరికాలో ఈసారి హాలీవుడ్‌ న‌టీన‌టుల‌తో పాటు టాలీవుడ్ టాప్ సింగ‌ర్స్ అంద‌రూ క‌లిసి చేసిన పెర్‌ఫార్మెన్స్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియా, కెన‌డా టూర్‌లో కూడా ఆస్ట్రేలియాకు చెందిన టాప్ మోస్ట్ డ్యాన్స‌ర్స్‌, ఇండియ‌న్ సినిమా నుండి టాప్ మ్యూజిషియ‌న్స్ఈ పెర్‌ఫార్మెన్స్‌లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నానని దేవిశ్రీ ప్ర‌సాద్ తెలిపారు. దేవిశ్రీ ప్ర‌సాద్ అంటే ఉండే క్రేజ్‌, ఎన‌ర్జీ కానీ వేరుగా ఉంటుంది. డిఎస్‌పిలో డి అంటే డేడికేష‌న్‌, ఎస్ అంటే స్ట్రాట‌జిక్‌, పి అంటే పాపులేష‌న్‌. ప్రేక్ష‌కుల‌ను ఎలా ఎంట‌ర్‌టైన్ చేయాల‌నే దాంట్లో దేవిశ్రీ ప్ర‌సాద్ నిష్ణాతుడు. దేవి మ్యూజిషియ‌న్ కాదు, మేజిషియ‌న్‌. మైకేల్ జాక్స‌న్ కానీ ఇత‌ర పాప్‌స్టార్స్ చేసే షోస్ మ‌నం చూస్తుంటాం. చూస్తే మ‌నం ఎందుకు ఇలాంటివి చేయ‌లేమ‌నిపించేది. ఎందుకు చేయ‌కూడ‌ద‌ని దేవిశ్రీ ప్ర‌సాద్ ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్నాడు. ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా విదేశాల‌కు వెళ్ళి, అక్క‌డున్న టాప్ టెక్నిషియ‌న్స్‌ స‌పోర్ట్ తీసుకుని త‌ను చేసే పెర్‌పార్మెన్స్‌తో తెలుగు వాళ్ళం కూడా హ‌లీవుడ్ స్టార్స్ రేంజ్‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తామ‌ని నిరూపిస్తున్నాడు. ఇందులో వ‌చ్చే ఆదాయాన్ని ఫిజిక‌ల్లీ ఛాలెంజ్‌డ్ పిల్ల‌ల కోసం, త‌న తండ్రి స‌త్యమూర్తిగారి పేరుపై స్థాపించిన ఫౌండేష‌న్‌కు ఇస్తూ స‌మాజానికి త‌న వంతుగా స‌పోర్ట్ చేస్తున్న దేవి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్ పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాన‌ని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

ర‌వితేజ మ‌రో హీరోయిన్‌...

-- Hyderabad Published:24 April 2017 11:24:37 AM

ఏడాది గ్యాప్ త‌ర్వాత మాస్ మ‌హారాజా రవితేజ విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌క‌త్వంలో `ట‌చ్ చేసి చూడు`, `రాజా ది గ్రేట్‌` సినిమాల‌ను చేస్తున్నాడు. న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌, వ‌ల్ల‌భ‌నేని వంశీ నిర్మిస్తున్న `ట‌చ్ చేసి చూడు` త‌దుప‌రి షెడ్యూల్‌కు రెడీ అవుతుంది. ఈ సినిమాలో అల్రెడి రాశిఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ‌రో హీరోయిన్‌గా లావ‌ణ్య త్రిపాఠిని అనుకున్నారు. కానీ లావ‌ణ్య డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోవ‌డంతో లావ‌ణ్య స్థానంలోమ‌రో హీరోయిన్ కోసం చాలా రోజులు వెతికారు. చివ‌ర‌కు ప్ర‌గ్యా జైశ్వాల్‌ను మ‌రో హీరోయిన్‌గా సెల‌క్ట్ చేసుకున్నార‌ని స‌మాచారం. ప్ర‌గ్యా కూడా కథ‌లోని త‌న క్యారెక్టర్ న‌చ్చ‌డంతో సినిమాచేయ‌డానికి రెడీ అయ్యింద‌ట‌. త్వ‌రలోనే సినిమాకు సంబంధించిన షెడ్యూల్ వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తారు.

లాలూకు 1000 కోట్ల బినామీ ఆస్థులు

-- Hyderabad Published:24 April 2017 11:21:48 AM

ఆర్జెడి నేత లాలూ ప్ర‌సాద్ యాదవ్ కుటుంబం పేరుపై 1000 కోట్ల బినామీ ఆస్థులున్న‌ట్లు విమర్శ‌లు వ‌స్తున్నాయి. బినామీ కంపెనీలు ఏర్పాటు చేయ‌డం, ఇత‌రుల కంపెనీలును సొంతం చేసుకోవ‌డంతో ఈ ఆస్థుల‌ను సంపాదించార‌ని బిజెపి నేత సుశీల్ మోదీ ఆరోపించారు. డిలైట్‌ మార్కెటింగ్‌ ప్రయివేటు లిమిటెడ్‌, ఏకే ఇన్ఫోసిస్టమ్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌, ఆర్జేడీ ఎంపీ ప్రేంచంద్‌ గుప్తా, ఓం ప్రకాశ్‌ కత్యాల్‌లకు చెందిన కంపెనీలను లాలూ త‌మ కుటుంబం పేరు మీద‌కు మార్పించుకోవ‌డం వంటి అభియోగాలున్నాయి.

ఢిల్లీలోని ఎబి ఎక్స్‌పోర్ట్ కంపెనీకి చెందిన 115 కోట్ల విలువైన ఆస్థిని లాలూ కుటుంబం చేజిక్కించుకుంద‌ని సుశీల్ మోదీ ఆరోపించారు. గ‌తంలో ఈ సంస్థ‌కు లాలూ రైల్వీ మినిష్ట‌ర్‌గా ఉన్న‌ప్పుడు 5 కోట్ల వ‌డ్డీ లేని రుణాలు ఇచ్చారు. ఆ డ‌బ్బుతో ఢిల్లీలో స్థ‌లం కొన్నారు. ఇప్పుడు ఆ స్థ‌లం ఖ‌రీదు 55 కోట్లు, అలాగే 60 కోట్ల‌తో నాలుగంతస్థుల భ‌వ‌నం క‌డుతున్నారు. అసలు వ‌డ్డీ లేని రుణాలు ఎందుకు ఇచ్చారో ద‌ర్యాప్తు చేయించాల‌ని సుశీల్ మోదీ ఆరోపించారు. అయితే సుశీల్ మోదీ ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆర్‌జెడి అధికార ప్ర‌తినిధి మృత్యంజ‌య తివారీ ఆ వార్త‌ల‌ను కొట్టి పారేశారు.

సీఎంగా ప‌న్నీరు సెల్వం..?

-- Hyderabad Published:24 April 2017 11:17:48 AM

అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో పెనుమార్పులే చోటు చేసుకున్నాయి. శ‌శిక‌ళ వ‌ర్గం, ప‌న్నీరు సెల్వం వ‌ర్గంలో ముఖ్యమంత్రి పీఠంపై క‌న్నేశారు. శ‌శిక‌ళ జైలుకు వెళ్ళిపోవ‌డంతో ప‌ళ‌నిస్వామి సీఎం కావ‌డంతో త‌మిళ రాజ‌కీయాలు మ‌రో మ‌లుపు తీసుకున్నాయి. ఆర్.కె.న‌గ‌ర్ ఎన్నిక‌ల కార‌ణంగా దిన‌క‌ర‌న్‌, ఎన్నిక‌ల క‌మీష‌న్‌కు రెండాకులు చిహ్నం కోసం లంచం ఇచ్చి అడ్డంగా దొరికి పోవ‌డంతో పెను దుమార‌మే చెల‌రేగింది. అన్నా డి.ఎం.కె ఎమ్మెల్యేలు స‌మావేశ‌మై శశిక‌ళ ఫ్యామిలీని పార్టీకి దూరంగా పెట్టాల‌నే నిర్ణ‌యం తీసుకున్నారు. అన్నా డిఎంకె రెండు వ‌ర్గాలుగా చీల‌పోయాయి. ఇప్పుడు ఈ రెండు వ‌ర్గాల విలీనానికి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రిగాయి. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే ప‌న్నీరు సెల్వం ముఖ్య‌మంత్రిగా ప‌దవి బాధ్య‌త‌లు చేప‌డ‌తాడు. అయితే ప్రార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎవ‌ర‌నే దానిపై సందిగ్ధం నెల‌కొంది. అ్ర‌లెడి శ‌శిక‌ళ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న‌ట్లు ఇచ్చిన లేఖ‌ను వెన‌క్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రెండు, మూడు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఈలోపు ప‌ళ‌నిస్వామికి ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇచ్చి, రెండు వ‌ర్గాలు క‌లిసిపోయి ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అధికార‌క ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు.

అమెరికా రాయ‌బారి సౌదీ రాకుమారుడు..

-- Hyderabad Published:24 April 2017 11:00:26 AM

సౌదీ రాజు స‌ల్మాన్ త‌న కుమారుడు ఖ‌లీద్ బిన్ స‌ల్మాన్ బిన్ అబ్డుల‌జీజ్‌ను అమెరికాలో సౌదీ ఆరేబియా రాయ‌భారిగా నియ‌మించారు. ఈ విష‌యాన్ని సౌదీ అధికార‌క ప్రెస్ ఎజెన్సీ తెలియ‌జేసింది. స‌ల్మాన్ కేబినెట్‌లో మార్పులు చేసిన నేప‌థ్యంలో ఈ మార్పులు జ‌రిగాయ‌ని సౌదీ మీడియా వెల్ల‌డించింది. ప్రిన్స్ ఖ‌లీద్ ఇస్లామిక్ స్టేట్స్ వ్య‌తిరేకంగా ప‌నిచేసిన సంకీర్ణ ద‌ళాల ఎయిర్‌ఫోర్స్ ఫైల‌ట్‌గా ప‌నిచేశారు. ఒబామా స‌మ‌యంలో అమెరికా, సౌదీకి మ‌ధ్య స్నేహ‌బాంధ‌వ్యాలు అంతంత మాత్రంగానే ఉండేవి. డొనాల్డ్ ట్రంప్ అధ్య‌క్షుడు అయిన త‌ర్వాత ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ప్రిన్స్ ఖ‌లీద్ నియామ‌కం కూడా అందులో బాగ‌మేనంటున్నారు.

అంద‌రి ముఖ్య‌మంత్రుల‌ కృషితోనే న‌వ‌భార‌త్ సాధ్యం - ప్ర‌ధాని మోదీ

-- Hyderabad Published:24 April 2017 10:56:39 AM

ఈరోజు న్యూఢిల్లీ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వేదిక‌గా ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న నీతి ఆయోగ్ పాల‌క మండ‌లి మూడో సమావేశం ఆదివారం ప్రారంభ‌మైంది. ఈ స‌మావేశంలో రాజ్‌నాథ్ సింగ్‌, నితిన్ గ‌డ్క‌రీ, జావ‌దేక‌ర్ స‌హా అన్నీ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, గ‌వ‌ర్న‌ర్స్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో అన్నీ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ప‌నిచేస్తే న‌వ‌భార‌త్ సాధ్య‌మ‌వుతుందని, జిఎస్‌టిపై అంద‌రూ ఓకాభిప్రాయానికి రావ‌డం చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని అన్న ప్ర‌ధాని, ఒకే దేశం, ఒకే ఆశ‌యం, ఒకే నిర్ణయం జిఎస్‌టి ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని, ఒకేసారి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌లు కొన‌సాగాల‌ని కోరారు. ఈ కార్యక్ర‌మానికి ఢిల్లీ ముఖ్య‌మంత్రి క్రేజీవాల్‌, కోల్‌క‌త్తా ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీలు గైర్హాజ‌ర‌య్యారు.

హౌరా బ్రిడ్జ్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

-- Hyderabad Published:24 April 2017 10:47:34 AM

ఇఎంవిఇ స్టూడియోస్ ప్రై.లి Ltd బ్యాన‌ర్‌పై రాహుల్ ర‌వీంద్ర‌న్, చాందిని చౌద‌రి, మ‌నాలి రాథోడ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం `హౌరా బ్రిడ్జ్‌`. రేవ‌న్ యాదు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రాహుల్ ర‌వీంద్ర‌న్‌, రేవ‌న్ యాదు, చాందిని చౌద‌రి, మ‌నాలి రాథోడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. `బూచ‌మ్మ బూచోడు` సినిమా త‌ర్వాత నా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న మ‌రో సినిమా `హౌరా బ్రిడ్జ్‌`. క‌ల‌క‌త్తా కుర్రాడు త‌న ప్రేమ‌ను ఎలా గెలిపించుకున్నాడ‌నేదే ఈ క‌థ‌. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు రేవ‌న్ యాదు తెలిపారు. ఒక సాంగ్‌, రెండు, మూడు రోజుల షూటింగ్ మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీ. అన్నీ ఎమోష‌న్స్ ఉంటాయి. బాలీవుడ్‌కి చెందిన విజ‌య్ మిశ్రాగారు మా సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ అందించ‌డం ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. శేఖ‌ర్ చంద్ర బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. చాందిని చౌద‌రి, మ‌నాలి రాథోడ్ చ‌క్క‌గా న‌టించారని హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ తెలిపారు.

ప‌వ‌న్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం గురించి ఆలోచిస్తాను - గ‌ద్ద‌ర్‌

-- Hyderabad Published:24 April 2017 10:37:41 AM

రాజ‌కీయ వ‌ర్గాల్లో గ‌ద్ద‌ర్ పేరు తెలియ‌ని వారుండ‌రు. ఇటీవ‌ల గ‌ద్ద‌ర్‌, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీతో క‌లిసి ప‌నిచేస్తార‌ని వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల గురించి గ‌ద్ద‌ర్‌ను ప్ర‌శ్నిస్తే..జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న‌కు చిర‌కాల మిత్రుడు..త‌న‌తో రాజ‌కీయాల్లో క‌ల‌సి ప‌నిచేయ‌డం గురించి ఆలోచిస్తాన‌ని తెలిపారు. ప్ర‌స్తుతం రాజ‌కీయ వ‌ర్గాల్లో ప‌వ‌న్ పార్టీ గురించి విస్తృత చర్చ జ‌రుగుతుంద‌ని, త్వ‌ర‌లోనే అన్నీ శ‌క్తుల‌ను ఏకం చేసే ఆలోచ‌న ఉంద‌ని కూడా తెలిపారు.

రెబెల్ స్టార్ ప్రభాస్, సుజిత్, యువి క్రియేషన్స్ మూవీ టైటిల్ సాహో..బాహుబలి2 తో ఫస్ట్ లుక్ టీజర్ ప్రదర్శన

-- Hyderabad Published:24 April 2017 10:32:37 AM

సుమారు 5 సంవ‌త్స‌రాలు.. ఒకే పాత్ర‌లో ఓకే చిత్రంలో న‌టించి కేవ‌లం భార‌త‌దేశ‌లోనే కాదు ప్ర‌పంచంలో న‌లుమూల‌లా వున్న భార‌తీయులంద‌రికి ఇది మా చిత్రం అని మీసం మెలిపెట్టెలా.. ఇతనే మా భార‌తదేశ బాహుబ‌లి అని వెలిగెత్తి చాటేలా కీర్తిప్ర‌తిష్ట‌లు సాధించిన రెబెల్‌స్టార్‌ ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి ఇప్ప‌టికి ఎప్ప‌టికి భారతీయ సినీ చరిత్రలో గొప్ప చిత్రంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అంతేకాదు బాహుబలి రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రత్యేక అభిమానులని ప‌రిచ‌యం చేసింది. బాహుబలి చిత్రం కోసం ఆయన చూపిన అంకితభావం, బాహుబలిగా ఆయన ప్రదర్శించిన నటన, ప్ర‌పంచ‌వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకోవటంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది.

ఇదిలా ఉంటే అటు అభిమానులు, సినీ వర్గాలు.... ఇటు సాధారణ ప్రేక్షకులు, మీడియా వర్గాల్లో ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రం టైటిల్ పై ఆసక్తి ఏర్పడింది. భారీ అంచనాల బాహుబ‌లి త‌ర్వాత వ‌చ్చే చిత్రం కావ‌డంతో అస‌లు ఏ టైటిల్ పెట్టార‌నే క్యూరియాసిటీతో ప్ర‌పంచ‌వ్యాప్త ప్ర‌భాస్ అభిమానులు, భార‌తీయ సినీ ప్రేక్ష‌కులు గూగుల్ లో సెర్చ్ చేయ‌టం విశేషం.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... భారతీయ సినీ జగత్తు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ప్రభాస్-సుజిత్-యువి క్రియేషన్స్ భారీ చిత్రానికి 'సాహో' అనే టైటిల్ ను ఖరారు చేశాం. ఈ హై టెక్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని ఏక కాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందించబోతున్నాం. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇందులో భాగం కానున్నారు. మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ లో విదేశాల్లో చిత్రీకరిస్తున్నాం. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్ ను... అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్ లాంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోనున్న సాహో చిత్ర ఫస్ట్ లుక్ అఫీషియల్ టీజర్ ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న బాహుబలి 2 చిత్రంతో పాటు ప్రదర్శించనున్నాం. సో... ఏప్రిల్ 28వ తేది ప్రభాస్ అభిమానులకు డబుల్ బొనాంజా అనే చెప్పాలి. సాహో స్టైలిష్ యాక్షన్ టీజర్ ను పెద్ద తెర పై చూసి ఆస్వాదించండి. అన్ని హంగులతో భారీ స్థాయిలో నిర్మితమవుతున్న ‘సాహో’ దేశవ్యాప్తంగా అభిమానులను అలరిస్తుంది అని ఆశిస్తున్నాం. అని అన్నారు.

వంశి-ప్ర‌మెద్,విక్రమ్ సంయుక్తంగా యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ స్థాపించి యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ తో మిర్చి అనే చిత్రాన్ని నిర్మించారు. అప్ప‌టికి రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ కెరీర్ బెస్ట్ గ్రాస్ ని అందించారు. కొనసాగింపుగా యువి క్రియేషన్స్ నిర్మించిన ప్ర‌తి చిత్రం ఆయా హీరోల‌కి బెస్ట్ గ్రాస‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ని అందించింది. సినిమా ప‌ట్ల ప్యాషన్ తో స్టోరి జ‌డ్జిమెంట్ తో 100 శాతం స‌క్స‌ెస్ రేట్ సాధించి టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా ముందుకు దూసుకుపోతున్నారు. క‌థ ని బేస్ చేసుకుని బ‌డ్జెట్ ని రిచ్ గా ప్రొడ‌క్ష‌న్ డిజైన్ చేస్తూ... చూసిన ఆడియ‌న్ కి ఇది యు.వి వారి చిత్రం అనే బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న నిర్మాణ సంస్థ యు.వి.క్రియోష‌న్స్‌.

చిత్రం పేరు - సాహో

బ్యానర్ - యువి క్రియేషన్స్

కథా నాయకుడు - ప్రభాస్

దర్శకుడు- సుజీత్

నిర్మాతలు - వంశీ-ప్రమోద్

సంగీతం - శంకర్-ఎహసాన్-లాయ్

సినిమాటోగ్రాఫర్ - మధి

ఆర్ట్ డైరెక్టర్ - సాబు సిరీల్

బాహుబ‌లికి ఆరు ఆట‌ల అనుమ‌తి...

-- Hyderabad Published:24 April 2017 10:12:20 AM

టాలీవుడ్ ప్రెస్టిజియ‌స్ మూవీ `బాహుబ‌లి 2` ఏప్రిల్ 28న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి కావ‌డంతో సినిమా విడుద‌లకు ఆటంకాలు అన్నీ క్లియ‌ర్ అయిన‌ట్టే క‌న‌ప‌డుతున్నాయి. చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్‌లో బిజి బిజీగా ఉంది. టెన్ష‌న్‌గా ఉన్న రాజ‌మౌళి అండ్ టీంకు ఓ శుభ‌వార్త..అదెంటంటే..ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం బాహుబ‌లి 2 మూవీ కోసం ఆరు ఆట‌ల‌ను ప్ర‌ద‌ర్శించుకోవ‌చ్చున‌ని ప‌రిమితులు క‌ల్పించింది. ఎందుకంటే బ్లాక్ టికెట్స్ నియంత్ర‌ణ‌, జ‌నం రద్ధీ, శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలియ‌జేసింది.

రైతుల‌ను ఆందోళ‌న విర‌మించాల‌ని కోరిన ముఖ్య‌మంత్రి..

-- Hyderabad Published:24 April 2017 10:08:30 AM

కొన్ని రోజులుగా ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ త‌మిళ రైతులు ఆందోళ‌న కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే త‌మిళనాడులో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితులు గురించి ఢిల్లీలోని పెద్ద‌ల‌తో మాట్లాడ‌టానికి వెళ్ళిన ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి రైతుల‌ను క‌లిశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రైతుల‌కు రుణ‌మాఫీని క‌లిగించిన రీతిలో త‌మ‌కు కూడా కేంద్ర ప్ర‌భుత్వం స‌పోర్ట్ చేయాల‌ని కోరారు. త‌ప్ప‌కుండా కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని, ఆందోళ‌న‌ను విర‌మించాల్సిందిగా ప‌ళ‌నిస్వామి రైతుల‌ను కోరారు.

బ‌యోమెట్రిక్ ప‌ద్ధతిపై యోగి క‌న్ను...ఆదేశం..

-- Hyderabad Published:24 April 2017 09:50:18 AM

ఉత్త‌ర‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ త‌న‌దైన దూకుడును ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నారు. గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగుల పిల్ల‌లు గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్‌లోనే ప‌నిచేయాల‌నే కండిష‌న్ పెట్టారు. కేంద్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోక ముందే త‌న కారుపై ఉన్న ఎర్ర‌బుగ్గ‌ను తొల‌గించారు. భ‌ద్ర‌తా స‌మావేశంలో 150 మంది విఐపిల్లో 105 మందికి పూర్తిస్థాయి భ‌ద్ర‌త‌ను తొల‌గించారు. ఇందులో మాజీ సీఎంలు అఖిలేష్ యాద‌వ్‌, మాయ‌వ‌తి కూడా ఉండ‌టం విశేషం. తాజాగా ప్ర‌భుత్వ ఉద్యోగుల్లో నిబ‌ద్ధ‌త పెంచ‌డానికి, అనుకున్న స‌మ‌యానికి ఆఫీసుకు చేర‌డానికి బ‌యోమెట్రిక్ అంటెండ‌న్స్ విధానాన్ని త‌ప్ప‌నిస‌రి చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నార‌ట‌.

ఫ్యాష‌న్ డిజైన‌ర్‌కి క్రేజ్‌!

-- Hyderabad Published:22 April 2017 03:30:03 PM

ఫ్యాష‌న్ డిజైన‌ర్‌కి క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఒక‌ప్ప‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం లేడీస్ టైల‌ర్‌కి సీక్వెల్‌గా తెర‌కెక్కుతోంది ఫ్యాష‌న్ డిజైన‌ర్‌. ఈ చిత్రం యుఎస్ హ‌క్కుల‌ను శింగ‌న‌మ‌ల క‌ల్యాణ్ తీసుకున్నారు. పాపికొండ‌లు ప‌రిస‌రాల్లో వంశీ ఈ సినిమాను తెర‌కెక్కించారు. మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి నిర్మించారు. ఇటీవ‌ల తొలి, రెండో సింగిల్స్ ను విడుద‌ల చేశారు. ఇప్ప‌టిదాకా ప‌లు సినిమాల‌కు ఇళ‌య‌రాజాతో క‌లిసి ప‌ని చేసిన వంశీ తొలిసారి మ‌ణిశ‌ర్మ సంగీతంలో సినిమా చేశారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ ఎలా ఉండ‌నుంద‌నే ఆస‌క్తి సంగీత ప్రియుల్లో ఉంది. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది.

మ‌హేష్ రావాల‌నుకున్న రోజునే దువ్వాడ కూడా వ‌చ్చేస్తున్నాడు

-- Hyderabad Published:22 April 2017 09:52:58 AM

`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `డి.జె..దువ్వాడ జగన్నాథమ్`. ఈ చిత్రాన్ని ఈద్ సంద‌ర్భంగా జూన్ 23న విడుద‌ల చేస్తున్నారు. ఆర్య‌, ప‌రుగు వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మా వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో చేస్తోన్న హ్యాట్రిక్ మూవీ `డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`. దిల్ రాజు బ్యాన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌లో నిర్మిత‌మ‌వుతున్న 25వ సినిమా కూడా ఇదే కావ‌డం విశేషం. అల్రెడి విడుద‌లైన టీజ‌ర్‌కు హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం సినిమా అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈద్ సంద‌ర్భంగా సినిమాను జూన్ 23న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నామ‌ని నిర్మాత దిల్‌రాజు తెలిపారు.

2.0 వాయిదా ప‌డింది..

-- Hyderabad Published:22 April 2017 09:49:44 AM

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్, బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సైంటిఫిక‌ల్ థ్రిల్ల‌ర్ `2.0`. 450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నాల‌జీతో రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్పుడు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ముందుగా ఈ ఏడాది దీపావ‌ళికి విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నారు. అయితే ఇప్పుడు సినిమాను వ‌చ్చే ఏడాది అంటే 2018, గ‌ణ‌తంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేయాల‌నుకుంటున్న‌ట్లు లైకా ప్రొడ‌క్ష‌న్స్ సి.ఇ.వో రాజ మ‌హాలింగం త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. ప్ర‌త్యేకంగా కార‌ణాలైతే చెప్ప‌లేదు. ర‌జ‌నీకాంత్‌ను ఈ ఏడాది తెర‌పై చూడాల‌నుకున్న అభిమానులు ఇది నిరాశ క‌లిగించే అంశ‌మే.

హరే రామ హరే కృష్ణ మూవీ ప్రారంభం

-- Hyderabad Published:21 April 2017 05:36:11 PM

సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌ నెం.1 `హ‌రే రామ హ‌రే కృష్ణ‌` ప్రారంభం

సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిలీప్‌ ప్రకాష్‌, రెజీనా హీరో హీరోయిన్లుగా అర్జున్‌సాయి దర్శకత్వంలో నవీన్‌ రెడ్డి ఎన్‌ నిర్మాతగా కొత్త చిత్రం `హ‌రే రామ హ‌రే కృష్ణ‌` శుక్రవారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి చందు మొండేటి క్లాప్‌ కొట్టగా, ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. తొలి సన్నివేశానికి వీరశంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా.... దర్శకుడు అర్జున్‌సాయి మాట్లాడుతూ - ''శ్రీమన్నారాయణ, ఢమరుకం, నక్షత్రం సినిమాలకు రచయితగా పనిచేశాను. దర్శకుడుగా నా తొలి చిత్రమిది. కామెడికి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తూ స్క్రిప్ట్‌ను తయారుచేసుకున్నాను. మే నెల ప్రథమార్థంలో కులుమనాలిలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది'' అన్నారు.

రెజీనా మాట్లాడుతూ - ''డిఫరెంట్‌ కథ, కథనాలతో సాగే చిత్రమిది. హెచ్‌.ఆర్‌.డిపార్ట్‌మెంట్‌లో కనపడే అమ్మాయి. సంప్రదాయ కళలకు ఆదరణ తగ్గిపోతున్నాయి. అలా ఆదరణ తగ్గిపోతున్న సంప్రదాయ కళలను కాపాడటానికి ప్రయత్నించే యువతి పాత్రలో నేను నటిస్తున్నాను. నా పాత్రను దర్శకుడు అర్జున్‌గారు బాగా డిజైన్‌ చేశారు. ఈ సినిమాలో నా మదర్‌ పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ ఆమనిగారు నటిస్తున్నారు'' అన్నారు.

నిర్మాత నవీన్‌రెడ్డి ఎన్‌ మాట్లాడుతూ - ''ఏడాదిన్నర క్రితం ఈ కథను దర్శకుడు అర్జున్‌ చెప్పారు. వినగానే బాగా నచ్చింది. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు భిన్నంగా మా సినిమాను రూపొందిస్తాం. మంచి టీం కుదిరింది. ప్రకాష్‌రాజ్‌, రసూల్‌ ఎల్లోర్‌గారు ఒప్పుకోకుంటే సినిమా చేసేవాడిని. రెజీనా చాలా బిజీగా ఉన్నా, కథ నచ్చగానే సినిమా చేయడానికి ఒప్పుకోవడం ఆనందంగా ఉంది.తెలుగు, తమిళంలో ఏకకాలంలో సినిమాను తెరకెక్కిస్తాం'' అన్నారు.

రసూల్‌ ఎల్లోర్‌ మాట్లాడుతూ - ''హిందీలో చేయాల్సిన సినిమా ఇది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు ప్రేక్షకులకు చేంజ్‌ కలిగించే కాన్సెప్ట్‌ చిత్రమిది. కొత్త నటీనటులను ఆదరిస్తే మరిన్ని కొత్త సినిమాలు వస్తాయి'' అన్నారు.

దిలీప్‌ప్రకాష్‌ మాట్లాడుతూ - ''హీరోగా నా తొలి చిత్రమిది. తొలి సినిమానే మంచి సీనియర్స్‌ ఉన్న టీంతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. నన్ను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది'' అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరో బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు. ప్రకాష్‌రాజ్‌, ఆమని, నాజర్‌, కృష్ణభగవాన్‌, కాశీవిశ్వనాథ్‌, అలీ, పృథ్వీ, నాగినీడు, రచ్చరవి, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రమణ గోపిశెట్టి, కళ: బ్రహ్మకడలి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, నిర్మాత: నవీన్‌ రెడ్డి ఎన్‌, రచన-దర్శకత్వం: అర్జున్‌ సాయి

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప‌ర‌శురాం జిఏ2 చిత్రం ప్రారంభం

-- Hyderabad Published:21 April 2017 02:40:18 PM

వ‌రుస సూప‌ర్‌హిట్‌ చిత్రాల త‌రువాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో, బ‌న్నివాసు నిర్మాత‌గా జిఏ2 బ్యాన‌ర్ లో ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో, `పెళ్ళిచూపులు` ఫేం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరొగా చిత్రం ఈ రోజు మాస్ట‌ర్‌ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వ‌గా పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. మే రెండ‌వ వారం నుండి సెట్స్ మీద‌కి వెళ్ళ‌నున్న ఈ చిత్రానికి కెమెరా మ‌ణికంఠ‌న్‌, సంగీతం గోపిసుంద‌ర్ లు అందిస్తున్నారు.

చిత్ర నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ..``శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2 ప్రోడ‌క్ష‌న్ నెం-4 గా , శ్రీర‌స్తుశుభ‌మ‌స్తు చిత్రాన్ని ద‌ర్శ‌క‌త్వం చేసిన‌ ప‌రుశురాం , పెళ్ళిచూపులు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో , మాస్ట‌ర్ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వ‌గా పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్నాం. మే రెండ‌వ వారం నుండి సెట్స్ మీద‌కి వెళ్ళ‌నున్న ఈచిత్రం రోమాంటిక్‌ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రానికి కెమెరా మ‌ణికంఠ‌న్‌, సంగీతం గోపిసుంద‌ర్ లు అందిస్తున్నారు. మిగ‌తా వివ‌రాలు అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం`` అన్నారు.

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ.. ``శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో, బ‌న్ని వాసు నిర్మాత‌గా ,జిఏ2 బ్యాన‌ర్‌లో , ప‌రుశురాం గారి ద‌ర్శ‌కత్వంలో చేస్తున్న చిత్రానికి పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్నాం. ఈచిత్రం రోమాంటిక్‌ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం చేయ‌టం చాలా ఆనందంగా వుంది`` అన్నారు.

ద‌ర్శ‌కుడు ప‌రుశురా మాట్లాడుతూ.. ``అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో , బ‌న్ని వాసు నిర్మాత‌గా, జిఏ2 బ్యాన‌ర్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా చేస్తున్న చిత్రానికి మాస్ట‌ర్‌ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వ‌గా పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్నాం. మే రెండ‌వ వారం నుండి సెట్స్ మీద‌కి వెళ్ళ‌నున్న ఈచిత్రం రోమాంటిక్‌ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రానికి కెమెరా మ‌ణికంఠ‌న్‌, సంగీతం గోపిసుంద‌ర్ లు అందిస్తున్నారు. మిగ‌తా వివ‌రాలు నిర్మాత అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం`` అన్నారు.

కెమెరా- మ‌ణికంఠ‌న్‌, సంగీతం-గోపిసుంద‌ర్‌, స‌మ‌ర్ప‌కులు- అల్లు అర‌వింద్‌, నిర్మాత‌- బ‌న్ని వాసు, క‌థ‌,మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం- ప‌రుశురాం.

మే 19న జ‌ట్టు ఇంజ‌నీర్ ఫ‌స్ట్ లుక్‌

-- Hyderabad Published:21 April 2017 02:31:41 PM

హింద్ కా నాప‌క్ కో జ‌వాబ్ వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత సెయింట్ డా.గుర్‌మీత్ రామ్ ర‌హీం సింగ్ ఇన్‌సాన్‌(డా.ఎం.ఎస్‌.జి) `జ‌ట్టు ఇంజ‌నీర్‌` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకురానున్నారు. సోష‌ల్ మెసేజ్‌తో కూడిన కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌గా `జట్టు ఇంజ‌నీరింగ్‌`. డా.ఎం.ఎస్‌.జి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా `జ‌ట్టు ఇంజ‌నీర్‌` ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఎం.ఎస్‌.జి సిరీస్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద్వ‌యం డా.ఎం.ఎస్‌.జి, ఆయ‌న కుమార్తె హ‌నీ ప్రీత్ ఇన్‌సాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌చేశారు. పేద‌రికం, నిరుద్యోగం, డ్ర‌గ్స్ త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌తో కొట్టు మిట్టాడే గ్రామాన్ని ఓ ఉపాధ్యాయుడు ఎలా మార్చి ప్ర‌జ‌ల్లో ఎలాంటి మార్పు తెచ్చాడ‌నేదే క‌థ‌. ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర‌మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్ స్వ‌చ్చ్ భార‌త్ మిష‌న్‌కు సంబంధించిన అంశాల‌ను కూడా ఈ సినిమాలో చూపిస్తున్నారు. ఈ చిత్రంలో హ్యుమ‌ర్‌తోపాటు ఎమోష‌న్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ఉంటుందని చిత్ర ద‌ర్శ‌కురాలు హ‌నీ ప్రీత్ ఇన్‌సాన్ తెలిపారు. ఈ చిత్రాన్ని 15రోజుల్లోనే చిత్రీక‌రించ‌డం విశేషం. డా.ఎం.ఎస్‌.జి న‌టిస్తున్న మ‌రో చిత్రం ఎం.ఎస్‌.జి ఆన్‌లైన్ గురుకుల్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ ఏడాది చివ‌ర్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సినిమాలో రెండు పాట‌లుంటాయి. అందులో ఒక‌టి స్పోర్ట్స్‌కు సంబంధించి ఉంటుంది. ఈ రెండు సాంగ్స్‌ను డా.సెయింట్ డా.ఎం.ఎస్‌.జి కంపోజ్ చేసి పాడ‌టం విశేషం.

జూన్‌ 23న వరల్డ్‌వైడ్‌గా నాని నిన్ను కోరి

-- Hyderabad Published:21 April 2017 02:18:15 PM

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం 'నిన్ను కోరి'. ఈ చిత్రాన్ని జూన్‌ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ప్రోగ్రెస్‌ గురించి నిర్మాత దానయ్య డి.వి.వి. తెలియజేస్తూ - ''అమెరికాలో భారీ షెడ్యూల్‌ చేశాం. ఏప్రిల్‌ 17 నుంచి వైజాగ్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ నెల 29 వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో ప్యాచ్‌వర్క్‌ మినహా టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. జూన్‌ 23న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేశాం'' అన్నారు. నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, ప థ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., రచన, దర్శకత్వం: శివ నిర్వాణ.

ఏంజెల్ టీజర్ లాంఛ్ చేసిన వి.వి.వినాయక్

-- Hyderabad Published:21 April 2017 11:07:47 AM

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సింధూరపువ్వ కృష్ణారెడ్డి నిర్మాణ సారధ్యంలో యంగ్ హీరో నాగ అన్వేశ్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన సినిమా ఏంజెల్. దర్శకధీరుడు రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని ఈ సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఓ అద్భుతమైన సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ లాంఛ్ తాజాగా ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిధిగా హాజరై సినిమా టీజర్ ను లాంఛ్ చేశారు. అనంతరం వినాయక్ మాట్లాడుతూ, సింధూరపువ్వ కృష్ణారెడ్డి గారితో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తం ఏంజెల్ కోసం చాలా కష్టపడ్డారని, ఈ సినిమాకి మొదటి నుంచి తన సహాయ సహాకారులు అందిస్తున్నట్లుగా తెలిపారు. కథ విన్న వెంటనే తనకి చాలా ఆశక్తిగా అనిపించి కృష్ణారెడ్డిగారిని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీయాల్సిందిగా కోరినట్లుగా తెలిపారు. అలానే హీరో నాగా అన్వేష్ చిన్నప్పటి నుంచి నటన పైనే ధ్యాస పెడుతూ చిత్ర సీమలో ఒక్కో మొట్టు పైకి ఎక్కుతున్నాడని, ఈ సినిమా కచ్ఛితంగా అన్వేష్ కెరీర్ ని ఓ కీలక మలుపు తిప్పుతొందని అన్నారు. ఇక వినాయక్ తో పాటు ఈ కార్యక్రమంలో ఏంజెల్ నిర్మాత భువన్ సాగర్, హీరో నాగ అన్వేష్, హీరోయిన్ హెబ్బా పటేల్, సింధూరపువ్వు కృష్ణరెడ్డి, సప్తగిరి, తదితరులు పాల్గొన్నారు.

మే మూడో వారంలో రారండోయ్‌ వేడుక చూద్దాం - కింగ్‌ నాగార్జున

-- Hyderabad Published:21 April 2017 10:25:28 AM

యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'రారండోయ్‌ వేడుక చూద్దాం'. ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు, సంపత్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే మూడవ వారంలో ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం ప్రోగ్రెస్‌ను తెలియ చేయడానికి ఏప్రిల్‌ 20న హైదరాబాద్‌ అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్‌లో ప్రెస్‌ మీట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత అక్కినేని నాగార్జున, జగపతిబాబు, యువసామ్రాట్‌ నాగచైతన్య, హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌, దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ కురసాల పాల్గొన్నారు.

నిర్మాత అక్కినేని నాగార్జున మాట్లాడుతూ - ''ఒక అమ్మాయి తనకొచ్చే భర్త రాకుమారుడిలా ఉండాలి అని కలలు కంటుంది. ఆ రాకుమారుడు ఎవరు? ఎలా ఉంటాడు ఆ అమ్మాయి కన్న కల నెరవేరిందా లేదా అనేది చిత్ర కథ. నాకు బాగా నచ్చిన రొమాంటిక్‌ ఫిలింస్‌ నిన్నే పెళ్లాడతా, మన్మధుడు. ఫ్యామిలీ లవ్‌, ఎమోషన్స్‌ సీన్స్‌ 'నిన్నే పెళ్లాడతా'లో చూపించాం. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సెన్సిటివ్‌ లవ్‌ని 'మన్మధుడు'లో చూపించాం. ఆ రెండు మిక్స్‌చేసి సినిమా చేస్తే బాగుంటుందని కళ్యాణ్‌తో చెప్పాను. ఫెంటాస్టిక్‌ సబ్జెక్ట్‌ చెప్పాడు. నేను ఏదైతే అనుకున్నానో కరెక్ట్‌గా ఆ రేంజ్‌లో కథ రెడీ చేశాడు. కథ వినగానే బాగా నచ్చింది. వెరీ హ్యాపీ. జగపతిబాబు చైతన్య ఫాదర్‌గా నటించారు. వారిద్దరి మధ్య వచ్చే ఫాదర్‌ అండ్‌ సన్‌ రిలేషన్‌షిప్‌ ఎలా ఉంటుందో అద్భుతంగా తెరకెక్కించారు. రియల్‌ లైఫ్‌లో నేను, చైతు ఎలా ఉంటామో ఈ చిత్రంలో జగపతిబాబు- చైతు క్యారెక్టర్స్‌ సేమ్‌ అలాగే ఉంటాయి. అలాగే సంపత్‌ కూతురిగా రకుల్‌ నటించింది. ఒకరంటే ఒకరికి ప్రాణం. అంత బాగా వారిద్దరి క్యారెక్టర్స్‌ ఉంటాయి. ఈ నాలుగు క్యారెక్టర్స్‌ సినిమాకి మెయిన్‌ పిల్లర్స్‌గా హైలైట్‌ అవుతాయి. దేవి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఎప్పటిలాగే ఈ చిత్రానికి సూపర్‌హిట్‌ ఆల్బమ్‌ ఇచ్చాడు. విశ్వేశ్వరరావు కెమెరా విజువల్స్‌ సూపర్‌గా వచ్చాయి. కొత్త కెమెరామెన్‌ అయినా ప్యాషన్‌తో వర్క్‌ చేశాడు. కళ్యాణ్‌ ఆర్టిస్టులందర్నీ బాగా అందంగా చూపించాడు. చెప్పింది చెప్పినట్లుగానే తీశాడు. ఎమోషన్స్‌ బాగా కనబడాలి అప్పుడే సినిమా పండుతుంది. డైరెక్టర్‌గా కంటే కళ్యాణ్‌ మంచి రైటర్‌. అతని రైటింగ్‌ స్కిల్స్‌ చూసి 'సోగ్గాడే చిన్నినాయనా'కి తీసుకున్నాం. నాకు పెద్ద హిట్‌ ఇచ్చాడు. బంగార్రాజు క్యారెక్టర్‌ని బాగా డిజైన్‌ చేశాడు. చాలా మంచి పేరు వచ్చింది. తెలుగుదనం, నేటివిటీ గురించి కళ్యాణ్‌కి బాగా తెలుసు. సినిమా బాగా వచ్చింది. మేమంతా శాటిస్‌ఫాక్షన్‌ అయ్యాకే ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్తున్నా. మాకు నచ్చకుండా సినిమా రిలీజ్‌ చేయం. ఒక పాట తప్ప సినిమా అంతా కంప్లీట్‌ అయింది. మే మూడవ వారంలో చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం. లెజెండ్‌లో యాంగ్రీ సాల్ట్‌ పెప్పర్‌ క్యారెక్టర్‌లో కనిపించిన జగపతిబాబు ఈ చిత్రంలో మోడరన్‌ స్టైలిష్‌ ఫాదర్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. రకుల్‌ బ్రమరాంబ క్యారెక్టర్‌లో నటించింది. డిఫరెంట్‌గా చాలా బాగా చేసింది. తెలుగు నేర్చుకుని క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్‌ అయి బ్యూటిఫుల్‌గా చేసింది. సినిమా చూసి సర్‌ప్రైజ్‌ అయ్యాను. ఈ సినిమాతో రకుల్‌కి చాలా మంచి పేరు వస్తుంది. చైతు తన క్యారెక్టర్‌కి జస్టిస్‌ చేశాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. సమ్మర్‌లో వస్తోన్న గుడ్‌ ఫ్యామిలీ లవ్‌, ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ ఫిలిం ఇది'' అన్నారు.

ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు మాట్లాడుతూ - ''ఈ సినిమా షూటింగ్‌ అయిపోయాక అప్పుడే షూటింగ్‌ ఫినిష్‌ అయిందా అనే ఫీలింగ్‌ కలిగింది. ఎంజాయ్‌ చేస్తూ కూల్‌గా వర్క్‌చేశాం. వెరీ వెరీ నైస్‌ ఫిలిం. స్టార్టింగ్‌ నుండి నాగార్జున సినిమా బాగా వస్తుందా లేదా అని ఫాలోఅప్‌ చేస్తున్నారు. చైతన్య నా కళ్ల ముందు పెరిగాడు. ఫస్ట్‌టైం అన్నపూర్ణ స్టూడియోస్‌లో వర్క్‌ చేస్తున్నాను. చై, నేను కలిసి నటించడం చాలా హ్యాపీగా వుంది. మా ఇద్దరి మధ్య చిత్రీకరించిన సీన్స్‌ ఫెంటాస్టిక్‌గా వచ్చాయి. మా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయింది. చై వెరీ స్వీట్‌ బోయ్‌. అద్భుతంగా నటించాడు. రకుల్‌ ఎనర్జీ లెవల్స్‌ ఎక్స్‌లెంట్‌. బాగా కాన్‌సన్‌ట్రేట్‌ చేసి ఈ సినిమాలో నటించింది. మామూలుగా నాకు ఇరిటేషన్‌ ఎక్కువ. అలాంటిది నాకు ఇరిటేషన్‌ రాకుండా స్మూత్‌గా, కూల్‌గా వర్క్‌ చేశాడు కళ్యాణ్‌. సినిమాని బాగా తెరకెక్కించాడు. చాలా డిఫరెంట్‌ ఫిలిం. తప్పకుండా మంచి సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను'' అన్నారు.

దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ - ''అన్నపూర్ణ స్టూడియోస్‌లో మళ్లీ సెకండ్‌ ఫిలిం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన నాగార్జున గారికి థాంక్స్‌. అన్నివేళలా నాకు సపోర్ట్‌ చేస్తూ ఎంకరేజ్‌ చేసిన సుప్రియ గారికి నా ధన్యవాదాలు. ఫ్యామిలీ ఎమోషన్స్‌, రిలేషన్స్‌ వున్న కథ ఇది. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న ప్రేమ. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న రిలేషన్‌. ఫాదర్‌ అండ్‌ డాటర్‌ మధ్య ప్రేమ. ఫ్రెండ్‌షిప్‌ రిలేషన్స్‌ ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎమోషన్‌ సీన్స్‌ ఎంత బాగుంటాయో, అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ కూడా అంతే బాగుంటాయి. ఈ చిత్రంలో నాగచైతన్య పెర్ఫామెన్స్‌ కొత్త యాంగిల్‌లో చూస్తారు. నేను ఎక్స్‌పెక్ట్‌ చేసిన దానికన్నా అత్యద్భుతంగా చేశారు. రకుల్‌ క్యారెక్టర్‌ చాలా కొత్తగా ఉంటుంది. బ్యూటిఫుల్‌ పర్ఫామెన్స్‌ చేసింది. జగపతిబాబుగారి లాంటి సీనియర్‌ యాక్టర్‌తో వర్క్‌ చేయడం నా అదృష్టం. సెట్‌లో చాలా సరదాగా ఫన్నీగా వుంటారు ఆయన. అందరికీ నచ్చే క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ఇది'' అన్నారు.

యువసామ్రాట్‌ నాగచైతన్య మాట్లాడుతూ - ''ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. బాలెన్స్‌ ఉన్న పాటని నెలాఖరుకు ఫినిష్‌ చేసి మే థర్డ్‌ వీక్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా చేశాక యాక్టర్‌గా నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లాలంటే కళ్యాణ్‌కృష్ణతో ఒక సినిమా చేయాలి అనుకున్నాను. కళ్యాణ్‌ మంచి స్క్రిప్ట్‌ రెడీ చేశారు. నాన్న సినిమా చూసి చాలా కాన్ఫిడెంట్‌గా వున్నారు. సీనియర్‌ ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాకి వర్క్‌ చేశారు. నా కెరీర్‌కి ఈ సినిమా చాలా బాగా హెల్ప్‌ అవుతుంది. ఫీల్‌గుడ్‌ లవ్‌, ఎమోషన్స్‌, రిలేషన్‌షిప్‌ ఉన్న చిత్రాలను తెలుగు ఆడియన్స్‌ బాగా ఆదరిస్తారు. ఇట్స్‌ ఎ ట్రమండస్‌ ఫిలిం. ఈ చిత్రంలో ఎమోషన్స్‌, రిలేషన్స్‌ సీన్స్‌ హైలైట్‌గా నిలుస్తాయి. వెరీ వెరీ పాజిటివ్‌ ఫీల్‌గుడ్‌ ఫిలిం. 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాన్ని ఎలాగైతే సపోర్ట్‌ చేసి ఆదరించారో ఈ చిత్రాన్ని కూడా అలాగే సపోర్ట్‌చేసి ఆదరించాలి'' అన్నారు.

హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ - ''ఎప్పటి నుంచో ప్యూర్‌ లవ్‌స్టోరీ ఫిలిం చేయాలని వెయిట్‌ చేస్తున్నాను. కళ్యాణ్‌ ఈ స్టోరీ నెరేట్‌ చేయగానే బాగా ఎగ్జైట్‌ అయ్యాను. ఈ క్యారెక్టర్‌ నేనే చేస్తాను అని ఎంతో ఇష్టపడి చేశాను. సచ్‌ ఎ లవబుల్‌ ఇన్నోసెంట్‌ లవ్‌ స్టోరీ. మన కల్చర్‌ తెలుగు నేటివిటీకి దగ్గరగా ఈ చిత్రం ఉంటుంది. ఫ్యామిలీ రిలేషన్స్‌, ఎమోషన్స్‌ ఏవిధంగా ఉంటాయో ఈ చిత్రంలో క్లియర్‌గా చూపించారు. భ్రమరాంబ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్‌ అయి నటించాను. సినిమా ఫినిష్‌ అయ్యాక ఇంకా భ్రమరాంబలాగే బిహేవ్‌ చేస్తున్నాను. అంతలా ఆ క్యారెక్టర్‌ నన్ను వెంటాడుతంది. ఈ సినిమా ఒక బ్యూటిఫుల్‌ జర్నీ. చై శివ క్యారెక్టర్‌లో నటించారు. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్‌ యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతాయి. ప్రతి ఒక్కరికీ నచ్చే వెరీ వెరీ క్యూట్‌ ఫిలిం. నా మనసుకి దగ్గరగా వున్న చిత్రం ఇది'' అన్నారు.

అక్కినేని నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్‌, జగపతిబాబు, సంపత్‌, వెన్నెల కిషోర్‌, కౌసల్య, ఇర్షాద్‌, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేష్‌, సప్తగిరి, రఘుబాబు, పృధ్వీరాజ్‌, చలపతిరావు, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: విశ్వేశ్వరరావు, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: కళ్యాణ్‌ కృష్ణ కురసాల.

ఇద్దరి మధ్య 18 రేపే (ఏప్రియల్‌ 21) విడుదల

-- Hyderabad Published:21 April 2017 10:16:08 AM

ఎస్‌.ఆర్‌.పి విజువల్‌ పతాకంపై సాయితేజ పాటిల్‌ సమర్పణలో రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి జంటగా బిత్తిరి సత్తి ప్రధానపాత్రలో నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్‌ పాటిల్‌ నిర్మించిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం 'ఇద్దరి మధ్య 18'. ఈ చిత్రం ఏప్రియల్‌ 21న (రేపు) విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాల్లో ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివరాజ్‌ పాటిల్‌ మాట్లాడుతూ..''ఇద్దరి మధ్య 18'' చిత్రం మంచి మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీ. చిత్రం అంతా అద్భుతంగా వచ్చింది. తెలంగాణ మంత్రి వర్యులు హరీష్‌రావుగారు సినిమా చూసి..మంచి మెసేజ్‌ ఇస్తున్నారని మమ్మల్ని అభినందించడం ఎంతగానో ఆనందాన్నిచ్చింది. అన్ని హంగులతో రేపు ఏప్రియల్‌ 21న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. ప్రేక్షకులు ఆదరించి, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము..'' అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న మల్కాపురం శివకుమార్, దర్శకుడు నాని ఆచార్య, హీరో రామ్ కార్తీక్, హీరోయిన్ భానుత్రిపాత్రి తదితరులు సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.

రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి, బిత్తిరిసత్తి, రవిప్రకాష్‌, శివన్నారాయణ, బాబీలహరి, రఘు, రాము, అప్పారావు, చిట్టిబాబు, చమ్మక్‌చంద్ర మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, ఎడిటింగ్‌: మార్తాండ్‌.కె.వెంకటేష్‌, కెమెరా: జి.ఎల్‌.బాబు, కొరియోగ్రఫీ: నిక్సన్‌ డిక్రూజ్‌, భాను, గణేష్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, పాటలు: కందికొండ, వరికుప్పల యాదిగిరి, రామ్‌ పైడిశెట్టి, చిలుకరెక్క గణేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శివకుమార్‌, కో-డైరెక్టర్‌: జి.భూపతి, సమర్పణ: సాయితేజ పాటిల్‌, నిర్మాత: శివరాజ్‌ పాటిల్‌, స్టోరీ-డైరెక్షన్‌: నాని ఆచార్య.

ఏప్రిల్ 23న వెంకటాపురం ఆడియో విడుద‌ల‌

-- Hyderabad Published:21 April 2017 10:01:30 AM

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం. హ్యాపీడేస్ ఫేం యంగ్ హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అచ్చు అందించిన ఆడియోని ఈనెల 23న విడుద‌ల చేస్తున్నారు. చిత్రాన్ని అతిత్వ‌ర‌లో మంచి ధియోట‌ర్స్ లో ప్రేక్ష‌కుల‌ని ఈ స‌మ్మ‌ర్ కి థ్రిల్ చేసేవిధంగా విడుద‌ల‌కి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్‌కు, వి.వినాయ‌క్ చేతుల మీదుగా విడుద‌ల చేసిన సాంగ్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఓ యువతి హత్య నేపథ్యంలో ఊహకందని మలుపులతో స‌రికొత్త క‌థ‌నంతో ఆధ్యంతం ఆసక్తి కరంగా తెర‌కెక్కించిన చిత్రం మా వెంక‌టాపురం. వైజాగ్ నెప‌ధ్యంలో సాగే యూత్‌ఫుల్ థ్రిల్ల‌ర్ గా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. హీరో రాహుల్ న్యూ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. చాలా అందంగా పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా ఓదిగిపోయాడు రాహుల్, చిత్రం చూసిన త‌రువాత రాహుల్ కంటే ఆనంద్ గా అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంటాడు. దర్శకుడు వేణు అద్భుతమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించాడు. మా చిత్రానికి సాయిప్ర‌కాష్ కెమెరా వ‌ర్క్ హైలెట్ గా నిలుస్తుంది. ప్ర‌స్తుతం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. అచ్చు అందించిన ఆడియో ఈనెల 23న విడుద‌ల చేస్తున్నారు. అతిత్వ‌ర‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నాము. అని అన్నారు

నటీనటులు - రాహుల్, మహిమా మక్వాన్, అజయ్, జోగిబ్రదర్స్, శశాంక్ తదితరులు

సాంకేతిక నిపుణులు - ప్రొడక్షన్ కంట్రోలర్: వాసిరెడ్డిసాయిబాబు,

డ్యాన్స్ మాస్టర్: అనీష్ విజ్ఞేష్, అనిత నాథ్,

కెమెరా: సాయిప్రకాష్ ఆర్ట్: జె.మోహన్,

మ్యూజిక్: అచ్చు,

కొ-ప్రోడ్యూస‌ర్: ఉమాదేవి కున‌ప‌రాజు

ప్రొడ్యూసర్స్: శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్,

స్టోరీ, డైరెక్టర్: వేణు మాధికంటి.

ర‌జ‌నీకాంత్ అలాంటి క్యారెక్టర్ చేయ‌డం లేద‌ట‌...

-- Hyderabad Published:21 April 2017 09:50:32 AM

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా అన‌గానే, అస‌లు ర‌జ‌నీకాంత్ ఎలాంటి క‌థ‌ను సెల‌క్ట్ చేసుకుంటాడు. ద‌ర్శ‌కుడుడెవ‌రు? ర‌జ‌నీని ఎలా ప్రెజంట్ చేస్తాడు? అనే క్యూరియాసిటీ అభిమానుల‌తో పాటు అంద‌రికీ క‌లుగుతుంది. ఇలాంటి ఆస‌క్తి ఇప్పుడు ర‌జ‌నీకాంత్ రాబోయే సినిమాకు క్రియేట్ అవుతుంది. ర‌జ‌నీకాంత్, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న `2.0` మూవీ సినిమా పోస్ట్ ఫ్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమా దీపావ‌ళికి విడుద‌ల కావాల్సి ఉంది. ర‌జ‌నీకాంత్ ఇప్పుడు త‌న నెక్ట్స్ మూవీపై ఫోక‌స్ పెట్టాడు. క‌బాలి ద‌ర్శ‌కుడు పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సినిమాలో న‌టించ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ర‌జ‌నీకాంత్‌తో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాల‌న్ న‌టిస్తుంద‌ని టాక్‌. హీరో, ర‌జ‌నీకాంత్ అల్లుడు ధ‌నుష్ ఈ సినిమాను నిర్మించ‌బోతున్నాడు. ఈ సినిమాను ముంబైలో ఒక‌ప్ప‌టి ముస్లిండాన్ హ‌జీ మస్తాన్ జీవిత‌క‌థ‌కు దగ్గ‌ర‌గా ఉంటుందని సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే ర‌జ‌నీకాంత్ సినిమాపై వ‌స్తున్న వార్త‌లు అబద్ధం అంటూ కొట్టిపారేశాడు. క‌బాలిలో వ‌య‌సు మ‌ళ్ళిన డాన్ పాత్ర‌లో ర‌జ‌నీకాంత్‌ను చూపించిన పా రంజిత్ ఈసారి సూప‌ర్‌స్టార్‌ను ఎలా చూపించ‌బోతున్నాడో..

శ్రీదేవి మామ్‌ రిలీజ్ డేట్ మారింది...

-- Hyderabad Published:21 April 2017 09:47:55 AM

ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ తర్వాత శ్రీదేవి నటిస్తున్న మరో మంచి చిత్రం 'మామ్‌'. ఆస్కార్‌ అవార్డ్స్‌ విజేత ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్నఈ చిత్రానికి సంబంధించిన తెలుగు మోషన్‌ పోస్టర్‌ను విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ వాయిస్‌ ఓవర్‌తో విడుద‌లై మెప్పించింది. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాల‌నుకున్నారు. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం సినిమాను జూలై 7న విడుద‌ల చేస్తున్నారు

రాజ‌మౌళి విన్న‌పాన్ని క‌న్న‌డిగులు వింటారా...?

-- Hyderabad Published:21 April 2017 09:46:12 AM

క‌ట‌ప్ప కార‌ణంగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి పెద్ద స‌మ‌స్య‌నే వ‌చ్చి ప‌డింది. బాహుబ‌లి 2 చిత్రంలో క‌ట్ట‌ప్ప పాత్ర‌లో న‌టించిన స‌త్య‌రాజ్ తొమ్మిదేళ్ళ క్రితం చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌మౌళి మెడ‌ను చుట్టుకున్నాయి. కావేరి జ‌లాల విష‌యంలో స‌త్య‌రాజ్ అప్పుడెప్పుడో చేసిన వ్యాఖ్య‌లు క‌న్న‌డిగుల‌ను అవ‌మాన‌ప‌రిచేలా ఉన్నాయ‌ని, స‌త్యరాజ్ క్ష‌మాప‌ణ చెబితే, ప్ర‌స్తుతం స‌త్య‌రాజ్ న‌టించిన బాహుబ‌లి 2 సినిమాను క‌ర్ణాట‌క‌లో ఆడనిస్తాం లేకుంటే లేద‌ని ఏప్రిల్ 28న క‌ర్ణాట‌క రాష్ట్రంలో బంద్ కూడా ప్ర‌క‌టించారు. అయితే స‌త్య‌రాజ్ అప్పుడెప్పుడే చేసిన వ్యాఖ్య‌లను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బాహుబ‌లి 2కు ఆటంకం క‌లిగిస్తే స‌త్య‌రాజ్‌కు పోయేదేం లేదు. నిర్మాత‌ల‌కు పెద్ద న‌ష్టం జ‌రుగుతుంది. స‌త్య‌రాజ్ వ్యాఖ్య‌లు త‌ర్వాత ఆయ‌న న‌టించిన చిత్రాలు విడుద‌ల‌య్యాయి. అప్పుడు రాని స‌మస్య ఇప్పుడు ఎందుకని, బాహుబ‌లి పార్ట్ 1ను ఆదరించిన‌ట్లే బాహుబ‌లి 2ను కూడా ఆద‌రించాలని క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌కు వీడియో ద్వారా సోష‌ల్ మీడియా స‌హ‌యంతో విన్న‌పం చేశారు. మ‌రి క‌న్న‌డిగులు రాజ‌మౌళిని దృష్టిలో పెట్టుని క్ష‌మిస్తారో లేదో మ‌రి...

జున్ను గా అఖిల్‌..

-- Hyderabad Published:21 April 2017 09:42:27 AM

జున్నుగా అఖిల్ ఎంట‌ని అనుకుంటున్నారా..అఖిల్ అక్కినేని హీరోగా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వ‌లో రూపొందుతోన్న సినిమా పేరు `జున్ను`. అఖిల్ త‌న పేరుతోనే ప‌వ‌ర్ ఆఫ్ జువా అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తే, సినిమాను బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల బ‌డింది. అయితే త‌న రెండో సినిమా చేయ‌డానికి కాస్తా ఎక్కువ‌గానే స‌మ‌యం తీసుకున్న అఖిల్‌, త‌నను తొలిసారిగా `మ‌నం` సినిమాతో చక్క‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనే సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. 13 బి, ఇష్క్‌, మ‌నం, 24 వంటి డిఫ‌రెంట్ సినిమాల‌తో ఆక‌ట్టుకున్న విక్ర‌మ్ కుమార్ ఇప్పుడు అఖిల్ భారాన్ని త‌న భుజాల‌కెత్తుకున్నాడు. ఈ సినిమాను హీరో నాగార్జున త‌న బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నాడు. స్క్రిప్ట్‌పై నాగ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. క‌చ్చితంగా ట్రెండ్ క్రియేట్ చేస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు. ఈ సినిమాకు `జున్ను` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌యం ఏమంటే, ఈ సినిమాను హైద‌రాబాద్ మెట్రో స్టేష‌న్‌లో చిత్రీక‌రిస్తున్నారట‌. ఇంకా అధికార‌కంగా ప్రారంభం కానీ మెట్రో స్టేష‌న్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న తొలి తెలుగు చిత్ర‌మిదే కావ‌డం గ‌మ‌నార్హం.

ఎర్ర‌బుగ్గ కార్లు ఉండ‌విక‌...

-- Hyderabad Published:19 April 2017 06:11:36 PM

ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర‌మోడీ స‌హా విఐపిలంద‌రి కార్ల‌కు ఇక‌పై ఎర్ర‌బుగ్గ కార్లు ఉండ‌వు. ఇక‌పై అంద‌రూ సాధార‌ణంగా వారి వాహ‌నాల్లో ప్ర‌యాణించాల్సిందే. ఈరోజు జ‌రిగిన కేంద్ర మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. మే 1 దీనికి సంబంధించిన అధికార‌క నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది. ఎర్ర‌బుగ్గ‌ల‌ను విఐపి కార్ల‌పై తొలగించాల‌నే చారిత్రాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్నామ‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ తెలిపారు. కేబినెట్ నిర్ణ‌యం బ‌య‌ట‌కు రాగానే నితిన్ గ‌డ్క‌రీ త‌న కారుకున్న ఎర్ర బుగ్గ‌ను తొలగించారు. ఈ నిర్ణ‌యం వెలువ‌డ‌క ముందే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం ఆదిత్య‌నాథ్‌, పంజాబ్ సీఎం అమ‌రింద‌ర్‌సింగ్‌లు వారి కార్ల‌కున్న ఎర్ర‌బుగ్గ‌ల‌ను తొల‌గించ‌డం విశేషం.

ప‌ది ల‌క్ష‌లు తెమ్మంటున్న సోనూ...

-- Hyderabad Published:19 April 2017 06:10:17 PM

ప్ర‌ముఖ గాయ‌కుడు సోనూ నిగ‌మ్ ఇన్న ఆజాన్ విన‌గానే ఉద‌యం మెలుకున్నాడు. త‌ర్వాత ఆజాన్‌పై సోనూ చేసిన ట్వీట్స్ దుమారం రేపాయి. ఆల‌యాల్లో, గురుద్వారాల్లో ఇలాంటి ధ్వ‌నులు వినిపించ‌కూడ‌ద‌ని కామెంట్ చేయ‌డంతో కొంద‌రూ ఈ వ్యాఖ్య‌లు ముస్లింల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా ఉన్నాయ‌ని అన్నారు. కొంద‌రు ప్ర‌ముఖులు సోనూకు మ‌ద్ధ‌తుగా నిల‌బ‌డితే మ‌రికొంద‌రు త‌ప్పుప‌ట్టారు. అయితే సోనూ వ్యాఖ్య‌ల‌కు ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మౌల్వి(మ‌త‌పెద్ద‌) సోనూకు గుండు కొట్టి ఊరేగిస్తే ప‌ది ల‌క్ష‌లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు. అయితే సోనూ తానేం త‌ప్పు చేయ‌లేదు అనేలా గుండు కొట్టించుకుని మీడియా ముందుకు వ‌చ్చాడు. తాను అన్న‌ట్టే గుండు కొట్టించుకున్నాన‌ని, ప‌ది ల‌క్ష‌లు తీసుకురావాల‌ని మ‌త పెద్ద‌ను కోరారు. మ‌రి మ‌త పెద్ద కానీ, ఇత‌రులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

తానేం త‌క్కువ తిన‌లేంద‌టున్న శృతి...

-- Hyderabad Published:19 April 2017 06:05:05 PM

చెన్నై సొగ‌స‌రి, క‌మ‌ల్ పెద్ద త‌న‌య శృతిహాస‌న్ త‌న త‌దుప‌రి సినిమా కోసం తీవ్రంగా క‌ష్ట‌పడుతుంది. ఖుష్బూ భ‌ర్త‌, సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వంలో 150 కోట్ల‌కు పైగా భారీ బ‌డ్జెట్‌తోరూపొందుతోన్న పీరియాడికల్ మూవీ `సంఘ‌మిత్ర‌`. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాల‌ను జ‌రుపుకుంటున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌లోకి వెళ్ళ‌నుంది. ఈ సినిమాలో జ‌యం ర‌వి, ఆర్య‌ను క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. సినిమాలోని క్యారెక్ట‌ర్స్ కోసం ముగ్గురు బాగానే శ్ర‌మిస్తున్నారు. ముఖ్యంగా శృతిహాస‌న్ రాజ‌కుమారి పాత్ర‌లో క‌న‌ప‌డుతుంది. అందుకోసం లండ‌న్‌లో క‌త్తియుద్ధం ట్ర‌యినింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.

21న ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న పిశాచి-2

-- Hyderabad Published:19 April 2017 04:40:26 PM

స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "పిశాచి-2ష‌. `డేంజర్ జోన్` అన్నది ట్యాగ్ లైన్. నల్లగట్ల శ్రీనివాస్ రెడ్డి-తిరుక్కోవళ్ళూరి మురళీకృష్ణ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి.. లయన్ ఏ.వేణుమాధవ్, కొలను సురేంద్రరెడ్డి, అట్లూరి రామకృష్ణ సహ నిర్మాతలు. ఏప్రిల్ 21న సినిమా విడుద‌ల‌వుతుంది.

ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో సాయి వెంక‌ట్ మాట్లాడుతూ, ` క‌న్న‌డ భాష‌లో పెద్ద విజ‌యం సాధించిన చిత్ర‌మిది. ఏ సినిమాలో నైనా విష‌యం ఉంటే హిట్ అవుతుంది. ఈసినిమా కూడా ఆ కోవ‌కు చెందించే. పిశాచి వ‌ల్ల ఓ గ్రామ ప్ర‌జ‌లు ఎదుర్కున్న ఇబ్బందులేంటి? వాటి నుంచి ఆ దుర్గామాత ఎలా బ‌య‌ట పడేసింది అన్న‌దే క‌థ‌. ప్ర‌తీ స‌న్నివేశం ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. 100 థియేట‌ర్ల‌లలో సినిమా విడుద‌ల చేస్తాం. తెలుగు ప్రేక్ష‌కులంతా సినిమా ను ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.

నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, ` బాహుబ‌లి-2 సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందే పిశాచి ప్రేక్ష‌కుల ముందుకు ఓ పెద్ద సినిమాలా వ‌స్తుంది. ప్రేక్ష‌కులంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.

చిత్ర హీరోయిన్ శిప్రా గౌర్ మాట్లాడుతూ... తెలుగులో టెన్తులో మూవీ చేశాను. తర్వాత హిందీలో ఒకటి, తమిళంలో రెండు, కన్నడలో రెండు సినిమాలు చేశాను. తెలుగులో పిశాచి 2 గా రిలీస్ అవుతున్న చిత్రం కన్నడలో 150 రోజులు ఆడి నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.తెలుగులో కూడా విజయవంతమౌతుందని టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నా అన్నారు.

ఈ స‌మావేశంలో సుప్రీక‌ర్, నాగేశ్వ‌ర‌రావు, ముర‌ళీకృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు

జెడి చక్రవర్తి, అమ్మరాజశేఖర్‌ల ఉగ్రం పోస్టర్‌ విడుదల

-- Hyderabad Published:19 April 2017 04:34:36 PM

నక్షత్ర మీడియా పతాకంపై జెడి చక్రవర్తి, అక్షిత జంటగా అమ్మ రాజశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి 'ఉగ్రం' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇటీవలే 'ఉలవచారు' రెస్టారెంట్‌లో ఈ మూవీ టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జెడి చక్రవర్తి, అమ్మ రాజశేఖర్‌, హీరోయిన్‌ అక్షిత, బెనర్జీ, గౌతం రాజు, చమ్మక్‌చంద్ర, ఆజాద్‌, జబర్ధస్త్‌ ఆర్కే తదితరులు పాల్గొన్నారు. పోస్టర్‌ని ఎమ్మెల్యే వేణుగోపాలచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు అమ్మ రాజశేఖర్‌ మాట్లాడుతూ..'మా గురువు గారు జెడి చక్రవర్తి హీరోగా నేను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'ఉగ్రం' అనే టైటిల్‌ని ఖరారు చేశాము. ఇదొక వెరైటీ సబ్జెక్ట్‌. ఎస్‌.ఎస్‌. థమన్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉంది. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంకా 10 రోజులు షూటింగ్‌ జరుపుకుని, వచ్చే నెల మొదటివారంలో ఫ్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని జరుపనున్నాం...అని అన్నారు. 'ఉగ్రం' చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌, కెమెరా: అంజి, ఎడిటింగ్‌: గౌతంరాజు, ప్రొడ్యూసర్‌: నక్షత్ర రాజశేఖర్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అమ్మ రాజశేఖర్‌.

అమెరికాలో నాన్‌స్టాప్‌గా యూత్‌స్టార్‌ నితిన్‌, హను రాఘవపూడి, 14 రీల్స్‌ భారీ చిత్రం లై షూటింగ్‌

-- Hyderabad Published:19 April 2017 04:28:07 PM

యూత్‌స్టార్‌ నితిన్‌ కథానాయకుడిగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). ఈ చిత్రం షూటింగ్‌ అమెరికాలోని వివిధ లొకేషన్స్‌లో నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. చిత్ర దర్శకుడు హను రాఘవపూడి ఈరోజు(ఏప్రిల్‌ 19) తన పుట్టినరోజును యూనిట్‌ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ - ''ఈరోజు మా డైరెక్టర్‌ హను రాఘవపూడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రస్తుతం మా చిత్రం షూటింగ్‌ అమెరికాలోని డిఫరెంట్‌ లొకేషన్స్‌లో జరుగుతోంది. జూన్‌ రెండో వారం వరకు సాగే ఈ షెడ్యూల్‌లో వెగాస్‌, లాస్‌ ఏంజిలిస్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో వంటి అందమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ జరుగుతుంది. దీంతో 90 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. ఆగస్ట్‌ 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. కృష్ణగాడి వీరప్రేమగాథ తర్వాత హను రాఘవపూడి కాంబినేషన్‌లో నితిన్‌ హీరోగా చేస్తున్న ఈ సినిమా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది'' అన్నారు. యూత్‌స్టార్‌ నితిన్‌, మేఘా ఆకాష్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శ్రీరామ్‌, రవికిషన్‌, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, డాన్స్‌: రాజు సుందరం, ఫైట్స్‌: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.

లంక చిత్రం గురించి రాశి ఇంటర్వ్యూ

-- Hyderabad Published:19 April 2017 04:08:38 PM

నా కెరీర్ మొత్తంలో నేను నటించిన డిఫరెంట్ సినిమా "లంక"

సీనియర్ కథానాయిక రాశి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `లంక`. రోలింగ్‌రాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నామన దినేష్, నామన విష్ణు కుమార్ నిర్మిస్తున్నారు. శ్రీముని దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఏప్రిల్ 21న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా అందాల రాశి కాసేపు పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు..

హీరోయిన్ గా 75 సినిమాల్లో న‌టించాను. అవ‌న్నీ ఒకే జోన‌ర్ కు చెందిన పాత్రలు. కానీ `లంక` ఓ డిఫ‌రెంట్ మూవీ. ఇందులో కాంట్రాక్ట్ లుక్ లో క‌నిపిస్తా. ఆహార్యం..న‌ట‌న అన్నీ కొత్త‌గా ఉంటాయి. టెలీప‌తి (లేని పిల్ల‌లు ఉన్న‌ట్లు ఊహించుకోవ‌డం) 40 ఏళ్ల వ‌య‌సుగ‌ల ఓ పెద్దావిడ సోలోగా లైఫ్ లీడ్ చేస్తుంటుంది. ఆ క్ర‌మంలో ఆమెకు హీరోయిన్ ప‌రిచ‌యం అవుతుంది. ఆ ఇంట‌ర్ డ‌క్ష‌న్ ఎలా జ‌రుగుతుంది? దానికి వెనుక కార‌ణం ఏంటి? ఆ అమ్మాయిని నేను ఆవ‌హించానా? లేక త‌ను న‌న్ను ఆవ‌హించిందా? అన్న‌ది స‌స్సెన్స్. మొత్తం ఆరు పాత్ర‌ల చుట్టూ క‌థ తిరుగుతుంది. ఆడ‌వాళ్ల‌కు భ‌ద్ర‌త లేద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన వాస్త‌వం. స‌మాజంలో ఆడ‌వాళ్లు ఉన్నా అదోక `లంక‌`గా భావించి బ్ర‌తుకుతున్నాం. ఆ కాన్సెప్ట్ ను బేస్ చేసుకునే క‌థ సిద్ద‌మైంది. నా పాత్ర‌లో ఎలాంటి మేక‌ప్ లేకుండా నేచుర‌ల్ ఫేస్ తోనే న‌టించా. నా క‌ర్లీ హెయిర్ కూడా కొత్త లుక్ ను తీసుకొచ్చింది.

ఈ సినిమాలో ముందు న‌టించ‌నన్నాను. ఇలాంటి పాత్ర‌లో నేనేంటి అని క్శ‌శ్చ‌న్ మార్క్ ఫేస్ పెట్టా. కానీ శ్రీను గారు తెలుగు వాళ్ల‌కు బాగా తెలిసి న ముఖం అయితే నే బాగుంటుంద‌ని ప‌ట్టుపబ‌ట్ట‌డంతో త‌ప్ప‌లేదు. ముందు కొంత మంది నార్త్ హీరోయిన్ల‌ను ప‌రిశీలించ‌డం జ‌రిగింది.

నందిని రెడ్డి గారు `కల్యాణ వైభోగం` సినిమాలో హీరోయిన్ మ‌ద‌ర్ గా న‌టించా. వాస్త‌వానికి ఆ పాత్ర ముందు చేయ‌ను. ఇప్ప‌టివ‌ర‌కూ హీరోయిన్ గా కొన‌సాగా స‌డెన్ గా త‌ల్లి పాత్ర లో అలా క‌నిపించి ఇలా వెళ్లిపోయే క్యారెక్ట‌ర్ అని రిజెక్ట్ చేశా. పైగా అప్ప‌టికి మూడు నెల‌ల పాప కూడా ఉండ‌టంతో ఆస‌క్తి చూప‌లేదు. కానీ అప్ప‌టికీ సినిమా డీలే అవ్వ‌డం.. త‌ర్వాత నా పాత్ర విని న‌చ్చ‌డంతో ఒకే చేశా. ఇది నాకు క‌మ్ బ్యాక్ మూవీ.

హీరోయిన్ గా ఉన్న‌ప్పుడు పాత్ర‌లో విష‌యంలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. కానీ ఈ వ‌య‌సులో నేను ప్ర‌త్యేకంగా చేయాల్సింది ఏమి లేదు. కాక‌పోతే ఎంచుకునే పాత్ర‌లో ఇంపార్టెన్స్ ఉండాలి. త‌ల్లి..అక్క పాత్ర‌లు చేయ‌డానికి సిద్దంగా ఉన్నా. సెకెండ్ ఇన్నింగ్స్ లో కేరింగ్ లేవీ ఉండ‌వు . చేసుకుంటూ వెళ్లిపోవ‌డ‌మే.

టెక్నాలజీతో పాటు హీరోయిన్ల‌కు క‌ల్పించే ఫెసిలిటీస్ బాగున్నాయి. అప్ప‌ట్లో కార్వాన్స్ లేవు. చెట్టు క్రింద ఫ్యాన్లు..కూల‌ర్లు పెట్టుకుని విశ్రాంతి తీసుకునే వాళ్లం. ఒక సినిమా పారితోషికం ఇప్పుడు ఒక రోజులో హీరోయిన్ కు వ‌చ్చేస్తుంది. ఇప్పుడున్న ఫేంలో ఉన్న హీరోయిన్లంద‌రిదీ హ్యాపీ లైఫ్.

రియాల్టీ షోలు చేయడానికి సిద్దంగానే ఉన్నా. కాక‌పోతే వాటిపై పెద్ద‌గా నాలెడ్జ్ లేదు. అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తా.

మా పాప బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ గారిని తెలిసిన వ్య‌క్తే అని క‌ల‌వ‌డానికి వెళ్లా. కానీ అపాయింట్ మెంట్ అడిగారు. నేను వ‌చ్చిన విష‌యం ఆయ‌న‌కు తెలియ‌దు.. నేనేమో బ‌య‌ట వెయింటింగ్. త‌ర్వాత ప‌వ‌న్ కు విష‌యం తెలిసిన వెంట‌నే అవునా ? అని పిలిపించి చాలాసేపు మాట్లాడారు. `గోకులంలో సీత` సినిమా టైమ్ లో క‌న్నా మా పాప‌ను అడ్డుపెట్టుకుని ఎక్కువ సేపు మాట్లాడా. లోప‌ల‌కు వెళ్లిన‌ప్పుడు క‌న్నా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు హ్యాపీగా ఫీల‌య్యా. ప్ర‌స్తుతం ఏ సినిమాలు చేయ‌లేదు. లంక రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాన‌ని ముగించారు.

న‌వ్వుకున్న ఎన్టీఆర్‌...

-- Hyderabad Published:19 April 2017 12:33:02 PM

`జై ల‌వ‌కుశ` సినిమాతో బిజీగా ఉన్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌వ‌భార‌త్ నేష‌న‌ల్ పార్టీ పెట్టి రాజ‌కీయాల్లోకి వ‌స్తాడ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే రీసెంట్‌గా జై ల‌వ‌కుశ చిత్రీక‌ర‌ణ‌లో ఆయ‌న అభిమానులు ఆయ‌న్ను ఈ విష‌యం గురించి అడిగితే న‌వ్వుకున్నార‌ట‌. ప్ర‌స్తుతం తాను సినిమాల్లో బిజీగా ఉన్నాన‌ని, చాలా మంచి స్క్రిప్ట్స్ వింటున్నాన‌ని, త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కులు కోరుకునేలా మంచి సినిమాలు చేస్తాన‌ని, కాబ‌ట్టి ఇప్పుడు రాజకీయ రంగ ప్ర‌వేశం గురించి ఆలోచ‌న‌లు లేవ‌ని చెప్పేశాడు. ఒక‌వేళ అలాంటి ఆలోచ‌న ఉన్నా, తానే ప్రెస్‌మీట్ పెట్టి చెబుతాన‌ని కూడా తెలిపార‌ట ఎన్టీఆర్. ఎన్టీఆర్‌, బాబీ కాంబినేష‌న్‌లో జై ల‌వ‌కుశ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

అక్టోబ‌ర్‌లో చైత‌న్య‌, స‌మంత పెళ్ళి..

-- Hyderabad Published:19 April 2017 12:29:53 PM

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత పెళ్ళి అక్టోబ‌ర్‌లో జ‌ర‌గ‌నుంది. వీరి పెళ్ళి ముందుగా బ్యాంకాక్‌లోనో, మ‌రేక్క‌డో జ‌ర‌గుతుంద‌నే వార్త‌లు వచ్చాయి కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం వీరిద్ద‌రూ హైద‌రాబాద్‌లోనే పెళ్ళి చేసుకోబోతున్నార‌ట‌. ఈలోపు వీరిద్ద‌రూ త‌మ క‌మిట్‌మెంట్స్‌ను పూర్తి చేయాల‌నుకుంటున్నార‌ట‌. త‌మ చేతిలో ఉన్న సినిమాల‌ను పూర్తి చేశాకే పెళ్ళి జ‌ర‌నుంద‌ట‌. ప్ర‌స్తుతం చైత‌న్య `రారండోయ్ వేడుక చూద్దాం` స‌హా డెబ్యూ డైరెక్ట‌ర్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే స‌మంత కూడా `రాజుగారి గ‌ది 2` సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉంది.

కొత్త రూట్‌లోకి ఆది..

-- Hyderabad Published:19 April 2017 12:26:51 PM

సాయికుమార్ త‌న‌యుడు ఆది ల‌వ‌ర్‌బోయ్‌గా, యాక్ష‌న్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్ర‌య‌త్నాలు చేశాడు. ఇక కొత్త టర్న్ తీసుకుని హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ మూవీలో న‌టించ‌డానికి సిద్ధ‌మైయ్యాడు. గీతాఆర్ట్స్‌2, యువి క్రియేష‌న్స్‌, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా వి4 మూవీస్ బ్యాన‌ర్‌ఫై ఆధి హీరోగా ఈటీవీ ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌లో సాగుతుంద‌ట‌. ఈ చిత్రంతో మ‌రాఠీ, త‌మిళ సినిమాల్లో న‌టించిన వైభ‌వి శాండిల్యను హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. వైభ‌వి శాండిల్య కూచిపూడి, భ‌ర‌త‌నాట్యం డ్యాన‌ర్ కూడా కావ‌డం విశేషం. మ‌రి హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ ఆదికి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో మ‌రి...

రైట‌ర్ ప్ర‌స‌న్న ద‌ర్శ‌కుడిగా....

-- Hyderabad Published:19 April 2017 12:24:23 PM

`సినిమా చూపిస్త మావ‌` చిత్రంతో ర‌చ‌యిత‌గా మంచి పేరు తెచ్చుకున్న రైట‌ర్ ప్ర‌స‌న్న ఇప్పుడు ద‌ర్శ‌కుడుగా మారే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాడు. `సినిమా చూపిస్త మావ‌` చిత్రం త‌ర్వాత దిల్‌రాజు నిర్మాత‌గా రూపొందిన `నేను లోక‌ల్` కూడా ప్ర‌సన్న‌కు చాలా మంచి పేరునే తీసుకొచ్చింది. అప్ప‌టి నుండి ప్ర‌స‌న్న త‌న ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి క‌థ‌ను సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ మూవీలో రాజ్‌త‌రుణ్ హీరోగా న‌టించే అవ‌కాశాలున్నాయి. మ‌రో విష‌య‌మేమంటే ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేసే నిర్మాతల్లో దిల్‌రాజు ఒక‌డు. ఎంతో మంది కొత్త ద‌ర్శ‌కుల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు. దిల్‌రాజు, ప్ర‌స‌న్న కాంబినేష‌న్‌లో సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌లోకి వెళ్లే అవ‌కాశం ఉందని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.

టంప్ స్ట‌యిల్లోకి ఆస్ట్రేలియా...

-- Hyderabad Published:19 April 2017 12:20:38 PM

గ్లోబ‌లైజేష‌న్‌తో ప్ర‌పంచం గుప్పిట్లో అనేది కాస్తా క‌ల‌గానే మిగిలిపోనుంది. ఇప్పుడు మా దేశం..మా ఉద్యోగాలు అంటూ ట్రంప్ ప్ర‌చారం అన్నీ దేశాల‌కు పాకుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ బాట‌ను ఆచ‌రిస్తున్న దేశం ఆస్ట్రేలియా. తాత్కాలిక విదేశీ ఉద్యోగులు ఆస్ట్రేలియాలో ప‌ని చేసేందుకు ఇచ్చే 457 వీసాను త‌మ దేశంలో నిరుద్యోగం పెరిగింద‌నే కార‌ణంతో ర‌ద్దు చేసింది. స్థానికులు అందుబాటులో ఉన్నా, త‌క్కువ వేతనంతో ప‌ని చేయించుకోవ‌చ్చున‌ని విదేశీయుల‌ను ఆస్ట్రేలియాకు తీసుకు వ‌స్తుండ‌టంతో 457 వీసా విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పోయింది. ఆస్ట్రేలియ‌న్స్‌కు రావాల్సిన ఉద్యోగాల‌ను రాకుండా చేయ‌డానికి ఈ వీసాను వాడుకోవ‌డం తాము స‌హించ‌మ‌ని ఆస్ట్రేలియా ప్ర‌ధాని మాల్కం ట‌ర్న‌బుల్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. 457 వీసాలో తాత్కాలిక ఉద్యోగుల‌ను తెచ్చుకునేందుకు ఏర్పాటు చేసింది. దీనికి నాలుగేళ్ళ కాల ప‌రిమితి ఉంటుంది. నిపుణులు దొర‌క‌న‌ప్పుడు ఈ వీసా ప‌రిమిత‌లను వ‌ర్తింప చేసి 200 పైచిలుకు జాబితాలోని ఉద్యోగుల‌ను ఆస్ట్రేలియాకు పంప‌వ‌చ్చు. కానీ ఇప్పుడు 180 ర‌కాల ఉద్యోగాల‌ను తొలగించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆస్ట్రేలియాలో 90 వేల పై చిలుకు ఉద్యోగుల‌కు ఏ స‌మ‌స్యా లేదు. ఇక వెళ్ళాల‌నుకునేవారికి క‌ష్ట‌కాలమే.

చిన్న‌మ్మ‌కు షాక్‌....

-- Hyderabad Published:19 April 2017 12:16:56 PM

జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత సీఎం పీఠం ఎక్కి చ‌క్రం తిప్పుదామ‌నుకున్న చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌క పెద్ద షాకే త‌గిలింది. సీఎం కావాల‌నుకున్న ఆమె క‌ల‌ల‌కు ఆక్ర‌మార్జ‌న కేసు కార‌ణంగా బ్రేక్ ప‌డి జైలుకెళ్ళింది. తాజాగా త‌న ఫ్యామిలీ చేతిలోకి రాష్ట్ర రాజ‌కీయాల‌ను తీసుకురావాల‌ని అనుకుంటే మొద‌టికే ఎస‌రు వ‌చ్చింది. సోమ‌వారం అర్ధ‌రాత్రి నుండి మంగ‌ళ‌వారం రాత్రి వ‌ర‌కు పార్టీలో రెండు వ‌ర్గాల్లో ప‌లు ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. చివ‌ర‌కు ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా శ‌శిక‌ళ నియామ‌కం చెల్ల‌ద‌ని, పార్టీలోని అట్డ‌డుగు కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాల‌కు అనుగుణంగా, పార్టీని శాశ్వ‌తంగా కాపాడుకునే చ‌ర్య‌ల్లో భాగంగా దిన‌క‌రన్ కుటుంబాన్ని పార్టీకి దూరం చేసి పాల‌న కొన‌సాగిస్తామ‌ని తెలిపారు. పార్టీని, ప్ర‌భుత్వాని న‌డిపేందుకు ఓ క‌మిటీని ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి జ‌యకుమార్ తెలియ‌జేశారు. ప‌న్నీరు సెల్వంతో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామ‌ని కూడా తెలిపారు. రెండాల‌కులు చిహ్నం కోసం దిన‌క‌ర‌న్ ఎన్నిక‌ల క‌మీష‌న్‌కే లంచం ఇవ్వ‌చూప‌డంతో పార్టీ మ‌నుగ‌డ‌కే ముప్పు వాటిల్ల‌డంతో సీనియ‌ర్ మంత్రులు స‌మావేశ‌మై శ‌శిక‌ళ కుటుంబాన్ని దూరం పెట్టాల‌ని నిర్ణయం తీసుకున్నారు.

మాల్యా అరెస్ట్‌..భార‌త్‌కు మాల్యాను రప్పిస్తారా?

-- Hyderabad Published:19 April 2017 12:15:00 PM

లిక్క‌ర్ కింగ్, కింగ్‌ఫిష‌ర్ అధినేత‌, భార‌తీయ బ్యాంకుల‌కు వేల కోట్ల‌ను ఎగ‌వేసి లండ‌న్ పారిపోయిన విజ‌య్ మాల్యాను బ్రిట‌న్ పోలీసులు ఆరెస్ట్ చేశారు. ఏడాదికి పైగా లండ‌న్ పారిపోయిన విజ‌య్ మాల్యాను ఇండియాకు ర‌ప్పించేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు అన్నీ విఫ‌ల‌మ‌య్యాయి. మ‌రిప్పుడు బ్రిట‌న్ ప్ర‌భుత్వం విజ‌య్ మాల్యాను భార‌త్‌కు అప్ప‌గిస్తుందా అని తెలియ‌డం లేదు. ప‌రారీ అనంతరం ముంబై కోర్టు మాల్యాను దోషిగా ప‌రిగ‌ణించింది. బార‌త బ్రిట‌న్ ప‌ర‌స్ప‌న న్యాయ స‌హాయ ఒప్పందం ప్ర‌కారం త‌మ‌కు అప్ప‌గించాల్సిందిగా భార‌త్ కోరగా, మాల్యాను ప‌ట్టుకుని బ్రిట‌న్ అప్ప‌గించ‌లేమ‌ని, ఆయ‌న‌పై తీవ్ర‌మైన అభియోగాలు ఉన్నందున్న న్యాయ ప్ర‌క్రియ ద్వారా భారత్‌కు పంపేందుకు స‌హ‌క‌రిస్తామ‌ని బ్రిట‌న్ విదేశాంగ‌శాఖ హామీ ఇచ్చింది.

21 నుండి జ‌న సైనికులు ఎంపిక - ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

-- Hyderabad Published:19 April 2017 10:16:27 AM

రాజ‌కీయాల్లో జ‌న‌సేన పార్టీతో ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఈ సారి ఎన్నిక‌లకు పూర్తిస్థాయిలో స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీని స‌మాయ‌త్తం చేయ‌డానికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నడుం బిగించారు. అందులో భాగంగా కార్య‌కర్త‌ల‌ను ఎంపిక చేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 21 నుండి జ‌న‌సేన సైనికుల ఎంపిక జ‌రుగుతుందని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అనంత‌ర‌పుం జిల్లా నుండి 3600 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని అంద‌రికీ మూడు రోజుల పాటు అర్హ‌త ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తామ‌ని ప‌వ‌న్ తెలిపారు. అంతే కాకుండా ఎంపిక‌లు పార‌దర్శ‌కంగా, ప్ర‌తిభ‌కు ప‌ట్టం క‌ట్టేలా ఉంటాయ‌ని కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు.

ఆగ‌స్ట్‌లో అజిత్‌..

-- Hyderabad Published:19 April 2017 09:47:25 AM

త‌మిళ‌స్టార్ అజిత్, డైరెక్ట‌ర్ శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `వివేగం`. ఈ సినిమాలో అజిత్ యాంటీ టెర్ర‌రిస్ట్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు. ఈ పాత్ర కోసం అజిత్ వెయిట్ త‌గ్గ‌డమే కాకుండా, స్టంట్స్ కూడా నేర్చుకోవ‌డం విశేషం. బల్గేరియా, ఆస్ట్రియా, సెర్బియా, క్రోషియా దేశాల్లో చిత్రీకరించారు. సినిమా చిత్రీక‌ర‌ణ‌ను మే 10కంతా పూర్తి చేసి జూలై మొదటివారంలో ఆడియో రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. అలాగే సినిమాను ఆగ‌స్ట్ 10న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నార‌ట‌. తెలుగు మార్కెట్‌పై క‌న్నేసిన అజిత్‌కు మ‌రి వివేగం సినిమాను తెలుగులోకి అనువాదం చేస్తాడేమో చూడాలి.

ప‌వ‌న్ టైటిల్ మారుతుందా..?

-- Hyderabad Published:19 April 2017 09:42:31 AM

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో సినిమా అంటే భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉంటాయి. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు సూప‌ర్‌హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఇద్ద‌రి కాంబోలో హ్యాట్రిక్ మూవీ స్టార్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. కీర్తిసురేష్‌, అనుఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవుడే దిగివ‌చ్చినా, ఇంజనీరింగ్ బాబు అనే టైటిల్స్ పెడ‌తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌రిప్పుడు `ప‌ర‌దేశ ప్ర‌యాణంలో` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని టాక్ వ‌స్తుంది. ఈ చిత్రంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా క‌న‌ప‌డుతున్నాడు. ఈ సినిమాను ఆగ‌స్ట్‌లో విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

మోహ‌న్‌లాల్‌కు ఆ ద‌ర్శ‌కుడితో ప‌నిచేయాల‌నుంద‌ట‌..

-- Hyderabad Published:18 April 2017 06:28:16 PM

కంప్లీట్ యాక్ట‌ర్‌గా పేరున్న మోహ‌న్‌లాల్ త్వ‌ర‌లోనే వెయ్యికోట్ల రూపాయ‌ల‌తో రూపొందనున్న `మ‌హాభార‌తం` సినిమాలో న‌టించ‌బోతున్నాడు. పులిమురుగున్, ఒప్పం వంటి వ‌రుస విజ‌యాల‌ను సాధించిన ఈ మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ తెలుగులో కూడా జ‌న‌తాగ్యారేజ్, మ‌న‌మంతా చిత్రాల్లో న‌టించాడు. ఇప్పుడు ఈ మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్‌కు రామ్‌గోపాల్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ప‌నిచేయాల‌నుంద‌ట‌. ఎప్పుడో ప‌దిహేనేళ్ళ క్రితం వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `కంపెనీ` పెద్ద హిట్ అయ్యింది. త‌ర్వాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా రాలేదు. ఇప్పుడు మోహ‌న్‌లాల్‌కు వర్మ‌తో ప‌నిచేయాల‌ని మ‌న‌సైంది. మ‌రి వ‌ర్మ‌, మోహ‌న్‌లాల్ మాట వినైనా సినిమా చేస్తాడా...రామ్‌గోపాల్ వ‌ర్మ ఇప్పుడు అమితాబ్ బ‌చ్చ‌న్ `స‌ర్కార్ 3` సినిమాను సిద్ధం చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు.

రెజీనాకు బాలీవుడ్ షాక్‌...

-- Hyderabad Published:18 April 2017 06:04:32 PM

చెన్నై సొగ‌స‌రి రెజీనా కసండ్రకు బాలీవుడ్ నుండి షాక్ త‌గిలింది. ఇంత‌కు రెజీనాకు, బాలీవుడ్‌కు ఉన్న సంబంధం తెలిసిందే. కొన్ని నెల‌లు ముందు రెజీనా హీరోయిన్‌గా అమితాబ్ స‌హా ప‌లువురు బాలీవుడ్ హీరోలతో బాలీవుడ్ చిత్రం `అంఖే 2` సినిమా ప్రారంభ‌మైంది. అయితే కార‌ణాలు తెలియ‌లేదు కానీ ఈ సినిమా ఇప్పుడు అట‌కెక్కిన‌ట్లేన‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో ఇలియానా కూడా న‌టిస్తుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి. తెలుగు, త‌మిళంలో బిజీగా ఉన్న రెజీనాకు అనీజ్ బ‌జ్‌మీ ద‌ర్శ‌కత్వంలో గౌరంగ్ దోషి నిర్మాత‌గా `అంఖే 2` స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ `అంఖే 2` చిత్రం బాలీవుడ్‌లో మంచి ఎంట్రీ అయ్యి ఉండేది కానీ ఏం చేద్దాం అన్నీ మ‌నం అనుకున్న‌ట్లు జ‌ర‌గ‌వు క‌దా..

మే 5న బాబు బాగా బిజి

-- Hyderabad Published:18 April 2017 05:55:47 PM

మంచి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌ట‌మే ధ్యేయంగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా... దర్శక నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా వినూత్న కథతో నిర్మించిన చిత్రం `బాబు బాగా బిజి`. బాలీవుడ్ హిట్ చిత్రం `హంటర్‌`కి తెలుగు రీమేక్ ఇది. నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని A స‌ర్టిఫికేట్ పొందింది. మే 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు. అవ‌స‌రాల శ్రీనివాస్ చేసిన అన్ని చిత్రాల‌కంటే బాబు బాగా బిజి చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెర‌కెక్కించాం. ఈ చిత్రం ద్వారా నవీన్ మేడారం ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. చాలా బాగా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వించే చిత్రమిది. అన్ని వర్గాల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేసే చిత్రమిది. మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి ఇందులో విభిన్నమైన పాత్రల్లో ప్రేక్ష‌కుల్ని ముఖ్యంగా యూత్ ని ఎంట‌ర్‌టైన్ చేస్తారు. సునీల్ కశ్యప్ స్వరపరిచిన పాటలు ఇప్ప‌టికే మార్కెట్ లో విడుద‌లై, చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తున్నాయి. ఇవ‌న్నీ చిత్రంలో సందర్భానుసారంగా వచ్చే పాటలు. సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని స‌భ్యుల‌చే ప్ర‌శంసలు అందుకుంది. A స‌ర్టిఫికేట్ తో చిత్రం మే 5న పెర్‌ఫెక్ట్ స‌మ్మర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మే 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుందని నిర్మాత తెలిపారు.

రాజ‌మౌళి ..లాస్ట్ వ‌ర్కింగ్ డే

-- Hyderabad Published:18 April 2017 05:12:02 PM

విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో భారీ బడ్జెట్‌, విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి` చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరించాడు ద‌ర్శ‌కుడు. బాహుబ‌లి ది బిగినింగ్‌తో తెలుగు సినిమా జాతీయ‌స్థాయిలో నిలిపిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నాడు. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సెన్సార్ పూర్తి కావ‌డంతో, లాస్ట్ వ‌ర్కింగ్ డే అని రాజ‌మౌళి ట్వీట్ చేశాడు. బాహుబ‌లి మ‌ర‌చిపోలేని ప్ర‌యాణం సంతోషంతో కూడిన న‌వ్వు, నొప్పితో కూడి బాధ‌ప‌డుతున్నా అని కూడా రాజ‌మౌళి తెలియ‌జేశాడు. 2015లో బాహుబ‌లి ది బిగినింగ్ విడుద‌లైంది. అందులో క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌నే ప్ర‌శ్న వ‌చ్చింది. అప్ప‌టి నుండి ఎంతో మంది దీనిపై ఎన్నో ర‌కాలుగా మాట్లాడుకున్నారు కూడా, ఈ వార్త‌ల‌న్నింటికీ ఏప్రిల్ 28న తెర‌ప‌డ‌నుంది. మ‌రి ఈ బాహుబ‌లి ఫ్రాంచైజీ కంటిన్యూ అవుతుందో లేదో మ‌రి చూడాలి.

స్ట్రేంజర్ సెకండ్ షెడ్యూల్ పూర్తి

-- Hyderabad Published:18 April 2017 04:55:46 PM

స్వీయ దర్శకత్వంలో యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి నిర్మిస్తున్న చిత్రం "స్ట్రేంజర్". మర్డర్ మిస్టరీ నేపథ్యంలో.. గోవా బ్యాక్ డ్రాప్ లో ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగే కథనంతో ఫణి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది. ఈ షెడ్యూల్ లో ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఒక పాటతోపాటు.. సెకండ్ షెడ్యూల్ లో కృష్ణ చైతన్య, జావేద్ లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించామని దర్శకనిర్మాత ఫణికుమార్ అద్దేపల్లి తెలిపారు. శివ హరీష్, సమీర్ హీరోలుగా.. ఆలియా తేజారెడ్డి హీరోయిన్లుగా..కృష్ణ చైతన్య, జావేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి.. డైరెక్షన్ డిపార్ట్ మెంట్: ప్రణీత్, కిరీటి, విజయ్, చందు, ధనుంజయ్, కెమెరా: అశ్విన్-ప్రేమ్ చంద్, స్టైలింగ్: సరస్వతి అద్దేపల్లి, సంగీతం: జితేందర్, రచన-నిర్మాణం-దర్శకత్వం: ఫణికుమార్ అద్దేపల్లి.

నిఖిల్‌కు స్నేహితుడి అండ‌

-- Hyderabad Published:18 April 2017 04:34:54 PM

స్వామిరారా నుండి విల‌క్ష‌ణ‌మైన స‌బ్జెక్ట్స్‌తో ప్రేక్ష‌కుల ఆదారాభిమానాల‌ను సంపాదించుకున్న యంగ్ హీరో నిఖిల్ ఓ రీమేక్ మూవీలో న‌టించ‌నున్నాడు. క‌న్న‌డంలో విజ‌య‌వంత‌మైన యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ `కిరిక్ పార్టీ` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్నార‌నే సంగ‌తి విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా రూఢీ అయ్యింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ చిత్రాన్ని కొరియోగ్రాఫ‌ర్ రాజు సుంద‌రం తెర‌కెక్కించ‌నున్నాడు. మ‌రో విశేష‌మేమంటే, ఈ సినిమాకు నిఖిల్ స్నేహితుడు, ద‌ర్శ‌కుడు అయిన చందు మొండేటి సంభాష‌ణ‌లు, క‌థ‌నంకు సంబంధించిన బాధ్య‌త‌లను త‌ల‌కెత్తుకుంటాడ‌ట‌.

బాహుబ‌లి 2 సెన్సార్ పూర్తి...

-- Hyderabad Published:18 April 2017 11:27:14 AM

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, అనుష్క‌, త‌మ‌న్నా, రానా ప్ర‌ధాన తారాగ‌ణంగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్కా మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌సాద్ దేవినేని, శోభు యార్ల‌గ‌డ్డ నిర్మాత‌లుగా రూపొందిన చిత్రం `బాహుబ‌లి 2`. ఈ విజువ‌ల్ వండ‌ర్ ఏప్రిల్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీలో విడుద‌ల కానుంది. తెలుగులో నిన్న `బాహుబ‌లి 2` సెన్సార్ కార్యక్ర‌మాలు పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్ పొందింది. త‌మిళం, హిందీ, మ‌ల‌యాళంలో సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తైన త‌ర్వాత‌నే అధికార‌కంగా స‌మాచారం రానుంది. బాహుబ‌లి పార్ట్ 2 విడుద‌ల కోసం అభిమానులు, ప్రేక్ష‌కులు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

బ‌న్ని విల‌న్‌తో ప‌వ‌న్‌..

-- Hyderabad Published:18 April 2017 10:12:09 AM

ఆది పినిశెట్టికి తెలుగులో హీరోగా కంటే విల‌న్‌గానే ఎక్కువ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. గుండెల్లో గోదారి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది, త‌ర్వాత మ‌లుపుతో తెలుగులో మంచి స‌క్సెస్ సొంతం చేసుకున్నాడు. అల్లుఅర్జున్ స‌రైనోడుతో విల‌న్‌గా మారి రూట్ మార్చాడు. ఇప్పుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రంలో ఆది పినిశెట్టి ఓ పాత్ర చేస్తున్నాడుని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. మ‌రి ఆది చేస్తున్న పాత్ర పాజిటివ్‌గా ఉంటుందా లేక గ్రే షేడ్స్ ఉంటాయా అనేది తెలియ‌లేదు. ఈ చిత్రంలో ప‌వ‌న్ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నాడు.

వైజాగ్‌లో `నిన్ను కోరి`

-- Hyderabad Published:17 April 2017 06:23:05 PM

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.3గా నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి`. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా ఈరోజు నుండి వైజాగ్ షెడ్యూల్ స్టార్ అయ్యింది. ఈ నెలాఖ‌రున వర‌కు ఈ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తార‌ట‌. నాని, నివేదా థామ‌స్ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీల‌క‌పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే తెలుగు థియేట్రిక‌ల్‌రైట్స్‌తో పాటు ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌ను అమ్ముడైపోవ‌డం విశేషం. వ‌రుస స‌క్సెస్‌ల మీదున్న నానికి, నిన్నుకోరి మ‌రో స‌క్సెస్ తెచ్చిపెడుతుందని యూనిట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

మ‌రోసారి మ‌హేష్‌తో....

-- Hyderabad Published:17 April 2017 06:07:07 PM

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఇప్పుడు స్పై థ్రిల్ల‌ర్ `స్పైడ‌ర్‌`తో బిజీగా ఉన్నాడు. సినిమాను జూన్ 23న‌తెలుగు, త‌మిళంలో విడుద‌ల చేయాల్సి ఉండ‌టం అందుకు కార‌ణం. ఈ సినిమా త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ సినిమా సెట్స్‌లోకి వెళ్ళ‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌రినీ తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. కొర‌టాల శివ అయితే ర‌కుల్ ప్రీత్ సింగ్ అయితే బావుంటుంద‌ని యోచించి ఆమెతో డిస్క‌ష‌న్స్ చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

వెయ్యి కోట్ల మ‌హాభార‌తం

-- Hyderabad Published:17 April 2017 06:03:47 PM

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి క‌ల‌కు బ్రేక్ ప‌డ‌నుంది. బాహుబ‌లి వంటి భారీ బ‌డ్జెట్ విజువ‌ల్ వండ‌ర్‌ను తెర‌కెక్కించిన ఈ ద‌ర్శ‌కుడుకి మ‌హాభార‌తాన్ని సినిమాగా తీయాన‌లే క‌ల ఉంది. ఈ విష‌యాన్ని ఆయ‌న ఎన్నో సంద‌ర్బాల్లో చెప్పారు. అయితే మోహ‌న్‌లాల్‌తో `మ‌హాభార‌తం` టైటిల్‌తో సినిమాను రూపొందించ‌నున్నారు. ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో క‌నువిని ఎరుగ‌ని రీతిలో వెయ్యికోట్ల బ‌డ్జెట్‌తో సినిమా రూపొంద‌నుంద‌టం విశేషం. యు.ఎ.ఇ.లోని భార‌త సంత‌తి వ్య‌క్తి బి.ఆర్‌.శెట్టి ఈ చిత్రాన్ని వెయ్యి కోట్ల రూపాయ‌ల‌తో నిర్మిస్తాడ‌ట‌. వి.ఎ.శ్రీకుమార్ అనే యాడ్ ఫిలిం డైరెక్ట‌ర్ ఈ సినిమాను డైరెక్ట‌ర్ చేయ‌నున్నారు. మోహ‌న్‌లాల్‌తో పాటు ఇండియ‌న్ సినిమాలోని టాప్ యాక్ట‌ర్స్‌, టెక్నిషియ‌న్స్ ఈ సినిమాలో వ‌ర్క్‌చేస్తార‌ట‌. 2018 సెప్టెంబ‌ర్‌లో సినిమా ప్రారంభ‌మై రెండు భాగాలుగా 2020నాటికి విడుద‌ల‌వుతుంద‌ట‌. మ‌రి అంత పెద్ద భార‌తాన్ని ఇంత త్వ‌ర‌గా అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేయ‌గ‌ల‌గుతారా..ఏమో చూడాల్సిందే..

ప్రభాస్ ఇంటర్వ్యూ

-- Hyderabad Published:17 April 2017 05:17:28 PM

బాహుబ‌లి సినిమా మ‌ర‌చిపోలేని ఓ ఎక్స్‌పీరియెన్స్ - ప్ర‌భాస్‌ ఆర్కా మీడియా వ‌ర్క్ బ్యాన‌ర్‌పై ప్ర‌భాస్‌, అనుష్క‌, రానా, త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `బాహుబ‌లి 2`. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో పాత్రికేయుల‌తో మాట్లాడారు..

ఐదేళ్ళుగా ఒకే ప్రాజెక్ట్ మీద ఉండ‌టం ఎలా అనిపించింది?

- ఐదేళ్ళ పాటు ఓ ప్రాజెక్ట్ చేయ‌డం చాలా క‌ష్టం. బాహుబ‌లి నుండి బ‌య‌ట‌ప‌డ‌టం అంత ఈజీ అయితే కాదండీ. ఫ‌స్ట్ పార్ట్ రిలీజ్ అయి మేమంతా కాస్త రిలీఫ్‌గా కూర్చుని ఉండ‌గా ఒక‌రోజు వినాయ‌క్‌గారు అడిగారు.. శివ‌గామి ఎందుకు చ‌నిపోయింది? క‌ట్ట‌ప్ప ఎందుకు పొడిచాడు? అస‌లేమైంది? ఇలాంటివి ప‌ది ప్ర‌శ్న‌లు ఉండి కూడా సినిమా హిట్ అయిందంటే మామూలు విష‌యం కాదని అన్నారు. సినిమాలో అన్నీ ప్ర‌శ్న‌లున్నాయని నాకు అప్పటి వ‌ర‌కు అనిపించ‌లేదు. ఎందుకంటే, క‌థ నాకు తెలుసు కాబ‌ట్టేనేమో. రాజ‌మౌళిగారు ప్ర‌తి పాత్ర‌ను ఎంతో ప్రాముఖ్య‌త‌తో మ‌లిచారు. అన్నీ పాత్ర‌ల్ని ఒక్క క‌థ‌లో చెప్ప‌డం క‌ష్ట‌మ‌నే రెండు భాగాల్లో తీద్దామ‌ని డిసైడ్ అయ్యారు. ఈ పార్ట్ ఒన్‌, పార్ట్ టూ ఎక్క‌డ క‌ట్ చేయాల‌నే పాయింట్‌ను ఆలోచించ‌డానికే ఆయ‌న 15-20 రోజులు టైమ్ తీసుకున్న‌ట్టున్నారు.

శివుడు, బాహుబ‌లి రెండు పాత్ర‌ల్లో ఏదీ క‌ష్ట‌మైనా పాత్ర‌?

- శివుడు పాత్ర చేయ‌డం చాలా సుల‌భ‌మే ఎందుకంటే ఆ పాత్ర ప‌రంగా అర‌వ‌చ్చు, కోప్ప‌డొచ్చు.. కానీ బాహుబ‌లి అనేది డిజైన్డ్ పాత్ర‌. కింగ్ అవుతాడా? కాదా? అయితే ఎలా ఉంటుంది? వ‌ంటివ‌న్నీ అత‌ని పాత్ర‌లో మెయిన్‌. అందుకే ఆ డిజైన్డ్ పాత్ర క‌ష్ట‌మ‌నిపించింది. శివుడు కొండ‌ల్లో పెరిగిన‌వాడికిమైండ్ సెట్ డిఫ‌రెంట్‌.. వాడికి వాడి గురించి అస‌లు తెలియ‌దు. తెలియ‌కుండానే డీఎన్ఏని బ‌ట్టి ఎదిగాడు. బాహుబ‌లికి ప్ర‌తిదీ మైండ్‌లో ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఉంది. ఓ మ‌ద‌ర్ ఉంది. కాబ‌ట్టి బాహుబ‌లి పాత్ర‌నే క‌ష్టం.

రిలీజ్‌కు ముందే ఈ రెస్పాన్స్‌ను ఊహించారా?

- రాజ‌మౌళిగారు ఐదేళ్ల ముందు ఓ లైన్ చెప్పారు. దానికి ముందు ఐదేళ్ల ముందు నుంచీ ఐదారుక‌థ‌లు చెప్పారు. అన్నిట్లోకీ నాకు న‌చ్చింది ఇదే. రాజ‌మౌళ‌ఙ‌గారు చెప్పిన క‌థ‌ల్లో కృష్ణ‌దేవ‌రాయ‌ల క‌థ కూడా చెప్పారు. బిఫోర్ బిక‌మింగ్ ద కింగ్ అనేది కూడా ఉంటుంది. అయినా వాట‌న్నిటిక‌న్నా నాకు న‌చ్చింది ఇదే. రెబ‌ల్ డ‌బ్బింగ్‌లో ఉన్న‌ప్పుడు నాకు ఈ లైన్ చెప్పారు. లైన్ ఇంపాక్ట్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి నాకు ఐదారు రోజులు ప‌ట్టింది. ఆ ఇంపాక్ట్స్ అన్నీ సెకండాఫ్‌లో ఉంటాయి. క‌థ చాలా తొంద‌ర‌గా చేసుకున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ మాత్రం టైమ్ తీసుకున్నారు. ఫ‌స్ట్ పార్ట్ లో ప్ర‌తి షాటూ నాకు ఎక్స్ పీరియ‌న్సే. ప్ర‌తిదీ ఊహించే చేయాలి. హాఫ్ బ్లైండ్‌లోనే ఫ‌స్ట్ పార్ట్ రిలీజైంది. ఇంత డ‌బ్బు ఖ‌ర్చుపెట్టి, అన్ ఫినిష్డ్ సినిమా చేసి ఎప్పుడూ మ‌నం రిలీజ్ చేయ‌లేదు. ఇన్ని ప్ర‌శ్న‌ల‌తో మ‌న సినిమా ఎప్పుడూ విడుద‌ల కాలేదు.. అలాంటి అన్ని యాంగిల్స్ లోనూ బాహుబ‌లి తొలి సినిమా అయింది. రిలీజ్ అయిన త‌ర్వాత చాలా పెద్ద హిట్ అయింది. నిర్మాత‌లు కూడా రిస్క్ తీసుకుందామ‌ని రెడీ అయ్యారు. శోభుగారు ఒక‌టి న‌మ్మారు. వాట‌ర్ ఫాల్స్ సీక్వెన్స్, వార్‌, విజువ‌ల్స్ మ‌నం ఎప్పుడూ విన‌లేదు. వాట‌ర్ పాల్స్ ఆకాశం నుంచి వ‌చ్చిన‌ట్టు రాజ‌మౌళిగారు ఆలోచించారు. దేవ‌ర సాంగ్‌ను చూసి అవ‌తార్‌లా ఉందే అని క‌ర‌ణ్‌జోహార్ అన్నారు. వాట‌ర్ ఫాల్ ను నేను హాలీవుడ్‌లో కూడా చూడ‌లేదు నేను. అంత గొప్ప‌గా ఉంది. అది చూశాక నా లైఫ్‌లో ఇది చాల‌నిపించింది.

మ‌ధ్య‌లో వేరే సినిమాల‌ను ఎందుకు చేయలేదు..?

- న‌వ్వుతూ..నేను, రాజ‌మౌళిగారు వేరే సినిమాలు చేసి ఉంటే ఎనిమిదేళ్లు ప‌ట్టేది. అలా కాకుండా చేశాం కాబ‌ట్టే ఇప్ప‌టికి పూర్త‌యింది. నేను కూడా వేరే సినిమాలు చేసి ఉండ‌వ‌చ్చు. కానీ నాకు అది న‌చ్చ‌లేదు. పూర్తిగా ఈ సినిమా మీదే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాం. వార్‌ని మేం 80 రోజులు ప్లాన్ చేశాం. ఎందుకంటే ప్లాన్ చేయ‌డానికి రిఫ‌రెన్స్ కూడా ఏమీ లేదు. దాన్లో దిగ‌డం ప్లాన్ చేయ‌డం, చేసుకుంటూ వెళ్లాం. 80 అనుకున్న‌ది 120కి చేరుకుంది. మ‌ధ్య‌లో స‌ర్జ‌రీ అయి, మ‌ధ్య‌లో నాలుగు నెల‌లు ఆపి ఇలా చేసుకుంటూ వెళ్లాం. సో సినిమా ఇదొక ఎక్స్ పెరిమెంట్‌. మ‌ర‌చిపోలేని ఎక్స్ పీరియ‌న్స్ అంతే. మ‌ధ్య‌లో వెళ్లొచ్చి సినిమా చేయ‌డ‌మ‌నేది ఊహ‌కు కూడా క‌ష్టం

. బాహుబ‌లి సెట్స్ నుంచి వ‌స్తున్న‌ప్పుడు ఏమ‌నిపించింది?

- ఫ‌స్ట పార్ట్ అయిన‌ప్పుడు మాత్రం కాస్త ఎమోష‌న్‌గా అనిపించింది. ఇలాంటి గొప్ప సినిమా ఆడుతుందా? ఆడితే ఇంకో పార్ట్ ఉంటుంది.. లేక‌పోతే? అని అక్క‌డున్న వారిని హ‌గ్ చేసుకుని వ‌చ్చాను. కానీ ఇప్పుడు నేను ఇంకా ఆ సినిమా నుంచి బ‌య‌టికి రాలేదు. ఇంకా రాజ‌మౌళి పిలిచి ఓ క్లోజ‌ప్ తీసుకోవాల‌ని అంటారేమోన‌నే అనుకుంటున్నా. నా దృష్టిలో ఇంకా సినిమా పూర్త‌యిన‌ట్టు లేదు.

ఇందులో ట‌ఫ‌స్ట్ పార్ట్ ఏంటండీ?

- అలా చెప్ప‌లేమండీ. ఇందులో ప్ర‌తి పార్ట్ ఎంత ఎగ్జ‌యిట్‌మెంట్ ఉంటుందో అంత క‌ష్టం కూడా ఉంటుంది. ఒక‌రోజు 24 గంట‌లు కూడా చేశాం. బాహుబ‌లి సినిమా కోసం 300 డేస్‌కు పైగా వ‌ర్క్‌చేశాను. అందులోయాక్ష‌న్ 200 డేస్‌కు పైగా వ‌ర్క్‌చేశాను.

బాహుబ‌లి ప్ర‌భావం మీ నెక్ట్స్ మూవీపై ఉంటుందా?

- ఉండ‌ద‌నే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆడియెన్స్‌ను బాగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఛ‌త్ర‌ప‌తి సినిమా త‌ర్వాత డార్లింగ్ సినిమా చేశాను. ప్రేక్ష‌కులు ఆద‌రించారు. అలాగే మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ చేశాను. ఆ సినిమాను కూడా ఆద‌రించారు. సినిమా రిలీజ్‌కు ముందుగానే సినిమాపై జ‌నాలు ఓ ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకుని ఉంటారు. ఇత‌నేదో కొత్త‌గా ట్రై చేశాడ‌నే అనుకుంటారు.

ఉన్న‌ప‌ళంగా బాహుబ‌లి రేంజ్ సినిమాలో చేయాల్సి వ‌స్తే, మీరుచేయ‌డానికి సిద్ధ‌మా..?

- బాహుబ‌లి సినిమాలో నేనేం చేశాను. ఇప్పుడు నెక్ట్స్ సినిమా కూడా అదే రేంజ్‌లో చేయాలంటే..నేనెందుకు చేయాలి. అది ల‌క్ష కోట్ల సినిమా అయినా స‌రే.. పేరు వ‌చ్చినా, రాకున్నా స‌రే, నాకు కొంత టైం కావాలి. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే నాలుగేళ్ళ త‌ర్వా ఆలోచిస్తాను.

మీకు రాజ‌కీయాలంటే ఇష్ట‌మా?

- నేను రాజ‌కీయాల్లోకి రావ‌డ‌మేంటండి..మీరు చూస్తున్నారు క‌దా, నాదొక డిఫ‌రెంట్ మైండ్‌సెట్‌

. బాహుబ‌లి సినిమాను మూడు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు క‌దా, ఇత‌ర భాష‌ల‌కు చెందిన మీడియాలో ఎలాంటి స్పంద‌న వ‌స్తుంది?

- బాహుబ‌లి పార్ట్ 1 విడుద‌లకు ముందు మేం ప్ర‌మోష‌న్స్‌కు వెళితే, వీళ్లేదో కొత్త‌గా సినిమా చేశార‌ట అనే భావన అంద‌రిలో ఉంది. కానీ బాహుబ‌లి పార్ట్ 1 తర్వాత మంచి స‌క్సెస్ వ‌చ్చింది. మంచి స్పంద‌న వ‌చ్చింది. బాహుబ‌లి 2 ప్ర‌మోష‌న్స్‌కు వెళ్ళిన‌ప్పుడు ముంబైలో మీడియా వ్య‌క్తులు లేచి నిల‌బ‌డ్డారు. బాహుబ‌లితో మాపై గౌర‌వం పెరిగిపోయింది. ఎవ‌రైతే ఏమీ..మ‌న ఇండియ‌న్ సినిమాను గొప్ప‌గా తీస్తున్నార‌ని అంద‌రూ అనుకుంటున్నారు. ఇండియ‌న్ సినిమాల్లో కొత్తగా చేశారు వీళ్ళు ఎవ‌రు అని అంద‌రూ మాకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

రానా పాత్ర `బాహుబ‌లి 2` ఎలా ఉంటుంది?

- బాహుబ‌లి పార్ట్ 1లోరానా పాత్ర ఇంట్ర‌డ‌క్ష‌న్ మాత్ర‌మే చూశారు. సెకండ్ పార్ట్‌లో త‌న పాత్ర ఇంకా భ‌య‌కరంగా, శ‌క్తివంతంగా ఉంటుంది. రాజ‌మౌళిగారు ప్ర‌తి పాత్ర‌ను పీక్స్‌లో చూపించారు. రానా ఒక ప‌క్క హీరోగా చేస్తున్నా, విల‌న్‌గా చేయ‌డమంటే చిన్న విష‌యం కాదు, రానా ధైర్యానికి మెచ్చుకోవాలి.

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపార‌నే విష‌యాన్ని ఎవ‌రికైనా చెప్పారా?

- నేను బాహుబ‌లి సినిమా షూటింగ్ టైంలో పెద్ద‌గా ఎవ‌రినీ క‌ల‌వ‌లేదండి..అయితే నేను క‌లిసిన కొంత మంది ఆ విష‌యాన్ని అడిగారు. అస‌లు విష‌య‌మేమంటే, క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌నేది ఓ ముప్పై సీన్స్‌తో లింక్ అయ్యి ఉండే ఎలిమెంట్‌, దాన్ని ఓ సీన్ ఆధారంగా చేసుకుని చెప్ప‌మంటే కుద‌ర‌దు. అది సినిమాలో చూడాల్సిందే. ఒక‌వేళ చెప్పినా ఎంజాయ్ చేయ‌లేరు. ఎంత విన్నా కూడా సినిమాలో ఆ సీన్‌ను చూడాల‌నే ఆస‌క్తి చాలా మందికి ఉంటుంది.

హాలీవుడ్ సినిమాల్లో చేయ‌బోతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి క‌దా?

- ఈ సినిమా స‌క్సెస్‌తో పాటు మంచి విష‌యాలు, రూమ‌ర్స్ అన్నీ ఎడా పెడా వాయించేస్తున్నాయి. హాలీవుడ్‌లో నేను చేస్తాన‌న‌డం రూమ‌ర్‌.

బాలీవుడ్‌లో క‌ర‌ణ్‌జోహార్ సినిమా చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి

- అలాంటిదేమీ లేదు. అన్నీ రూమ‌ర్స్‌

మీ నెక్ట్స మూవీ షూటింగ్ కంటే ముందు టీజ‌ర్ రానుంద‌ట అవునా?

- నా నెక్ట్స్ సినిమాకు సంబంధించి చాలా ప్లాన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి క్లారిటీ రావాలి. రెండు మూడు రోజుల్లో క్లారిటీ వ‌స్తుంది.

రాజ‌మౌళి మ‌హాభార‌తంలో చేస్తే మీరే క్యారెక్ట‌ర్ చేస్తారు?

- రాజ‌మౌళిగారికి మ‌హాభార‌తం చేయాల‌నుంది కానీ, బాహుబ‌లి త‌ర్వాత మ‌హాభార‌తం చేయ‌మంటే, రాజ‌మౌళిగారు కొట్టినా కొట్టే అవ‌కాశం ఉంది. రాజమౌళిగారు మ‌హాభారతం ఏ క్యారెక్ట‌ర్ ఇచ్చినా చేయ‌డానికి నేను సిద్ధం.

రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఎప్పుడు ఉంటుంది?

- సుజిత్ సినిమాతో పాటు చేయాల‌నే ఆలోచ‌న ఉంది. బాహుబ‌లి 2 త‌ర్వాత దానికి సంబంధించి కూడా ఆలోచిస్తాను.

చిన్న సినిమా ర‌క్ష‌ణ మా ధ్యేయం.. నిరాహార దీక్ష‌కు సిద్ధంగా ఉన్నాం - ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్

-- Hyderabad Published:17 April 2017 04:04:05 PM

`తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ర్టీలో రెండు ర‌కాల వ్య‌వ‌స్థ‌ల ద్వారా ఇండ‌స్ర్టీ అంత ఛిన్నాభిన్నం అవుతుంది. ఒక‌టి థియేట‌ర్ లెస్ విధానం వ‌ల్ల ఒక న‌లుగురు ఐదుగురు చేతుల్లోనే రెండు రాష్ర్టాల సినిమా థియేట‌ర్ల‌ను వాళ్ల గుప్పిట్లో పెట్టుకుని చిన్న సినిమాలు మ‌రియుకొన్ని పెద్ద సినిమాలు విడుద‌ల కాకుండా చేస్తున్నారు. దాదాపు 250 సినిమాలు సెన్సార్ అయి రిలీజ్ కాకుండా ఉన్నాయి. అందులో ఒక‌టి అమ్మ‌కు ప్రేమ‌తో ఒక రూపాయి కూడా ఫైనాన్స్ లేదు. సినిమా సెన్సార్ అయింది. కాని థియేట‌ర్లు దొర‌క‌క సినిమా విడుద‌ల కాలేదని` అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్‌ కామ‌ర్స్ అధ్య‌క్షుడు ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ, - రెండ‌వ‌ది డిజిటల్ వ్య‌వ‌స్థ‌ను ముగ్గురు పెద్ద నిర్మాత‌లు వాళ్ల చేతుల్లో పెట్టుకుని ప‌క్క రాష్ర్టాల్లో వారానికి రూ.2,500 చొప్పున ఒక సి నిమా డిజిట‌ల్ ట్రాన్స్ఫ‌ర్ ఉంటే ఇక్క‌డ రూ.11,000 క్యూబ్ సినిమా థియేట‌ర్స్‌, మ‌ల్టీప్లెక్స్‌లో రూ.13,000 వారానికి తీసుకుంటూ చిన్న, పెద్ద నిర్మాత‌ల‌ను ముంచుతున్నారు. ఈ డిజిట‌ల్ ఇబ్బందుల వ‌ల్ల అస‌లు చిన్న సినిమాలు రిలీజ్ కావ‌డంలేదు. దాదాపు 40వేల మంది ఇండ‌స్ర్టీలో కార్మికులు నాలుగువేల మంది ఇండ‌స్ర్టీలో సిన‌మా ప్రొడ్యూస‌ర్స్, దాదాపు వెయ్యి మంది డైర‌క్ట‌ర్లు, వీరి వ‌ల్ల చాలా ఇబ్బంది ప‌డుతున్నారు. షూటింగ్ లు జ‌రుపుకుని సినిమాలు రిలీజ్‌కాకా నిర్మాత‌ల డ‌బ్బంతా బూడిద‌లో పోసిన ప‌న్నీర‌వుతుంది. దాదాపు సంవత్స‌రానికి 200 తెలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో 150-160 సినిమాలు చిన్న సినిమాలు రిలీజ‌వుతాయి. డిజిట‌ల్ వ్య‌వ‌స్థ‌పైన ఎక్కువ రేట్లు తీసుకుంటూ దాదాపు నెల‌కు రూ.15కోట్లు ఈ ముగ్గురు సంపాదిస్తున్నారు. దానికి గ‌వ‌ర్న‌మెంట్ టాక్స్ కూడా క‌ట్ట‌రు. థియేట‌ర్ లీజ్ విధానం పైన కూడా నెల‌కు రూ.15కోట్లు సంపాదిస్తున్నారు. దానిపైన కూడా గ‌వ‌ర్న‌మెంట్ టాక్స్ క‌ట్ట‌రు. దోపిడీ విధానం పైన రెండు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు స్పందించి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికుల‌ను, నిర్మాత‌ల‌ను దృష్టిలో ఉంచుకుని లీజ్ విధానాన్ని మ‌రియు డిజిట‌ల్ విధానాన్ని రూపు మాపి స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని ఇరు రాష్ర్టాల సీఎం ల‌ను కోరుతున్నాము. 15రోజుల్లో ఈ డిజిట‌ల్ అమౌంట్ వారానికి ఉన్న రూ.11వేలు, రూ.13వేలను త‌గ్గించి ప‌క్క‌రాష్ర్టాల్లో ఉన్న‌ట్లుగా రూ.2,500లు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడ‌ల ఫిలింఛాంబ‌ర్ వ‌ద్ద నిర్మాత‌లు మ‌రియులు కార్మికులు అంతా ఏక‌మై నిరాహార దీక్ష చేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నాం.తెలంగాణ ఫిలించాంబ‌ర్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 9 సినిమాలు సెన్సారయిన‌వి. కాని థియేట‌ర్ల ఇబ్బందుల వ‌ల్ల కేవ‌లం ఒకే ఒక్క సినిమా రిలీజైంది` అని అన్నారు. నిర్మాత‌ సాయి వెంక‌ట్, జె.వీ.ఆర్ లు కూడా చిన్న సినిమా బ్ర‌తికే వ‌ర‌కూ త‌మ పోరాటం ఆప‌మ‌ని హెచ్చ‌రించారు.

సుప్రీమ్ హీరోతో అందాల‌రాక్ష‌సి

-- Hyderabad Published:17 April 2017 11:24:52 AM

అందాల రాక్ష‌సి చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన లావ‌ణ్య త్రిపాఠి ఇప్పుడు వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయ్యింది. తాజాగా స‌మాచారం ప్ర‌కారం సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌తో లావ‌ణ్య త్రిపాఠి జ‌త క‌ట్ట‌నుంది. వివరాల్లోకెళ్తే..సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ద‌ర్శ‌కుడు వినాయ‌క్ లావ‌ణ్య‌ను క‌లిసి క‌థ వినిపించాడ‌ట‌. త‌న పాత్ర న‌చ్చ‌డంతో లావ‌ణ్య సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. రీసెంట్‌గా వ‌రుణ్‌తేజ్‌తో మిస్ట‌ర్‌లో న‌టించిన ఈ సుంద‌రాంగి త‌దుప‌రి కూడా మెగా క్యాంప్ హీరోతో న‌టించ‌నుండ‌టం గ‌మ‌నార్హం.

ర‌వితేజ విల‌న్‌ని బ‌న్ని ఏం చేస్తాడో..

-- Hyderabad Published:17 April 2017 11:23:30 AM

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు బొమ‌న్ ఇరాని మూడో తెలుగు సినిమాలో న‌టించ‌బోతున్నాడు. అత్తారింటికి దారేది చిత్రంలో ప‌వ‌న్ తాత‌య్య‌గా, బెంగాల్ టైగ‌ర్ చిత్రంలో మెయిన్ విల‌న్‌గా న‌టించిన బొమ‌న్ ఇరాని ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, వ‌క్కంతం వంశీ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న `నా పేరు శివ నా ఇల్లు ఇండియా` చిత్రంలో కీలక పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే అధికార‌క స‌మాచారం రానుంది. సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ తుది ద‌శ‌కు చేరుకుంది. త్వ‌ర‌లోనే సెట్స్‌లోకి వెళ్ళ‌నున్న ఈ సినిమాలో కీల‌క పాత్ర‌కు బొమ‌న్ ఇరాని అయితేనే న్యాయం చేస్తాడ‌ని ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీ భావించి ఆయ‌న‌కు కథ వినిపిస్తే, బొమ్మ‌న్ న‌టించ‌డానికి ఒప్పుకున్నాడ‌ట‌. మ‌రి అంత ప్రాముఖ్య‌త ఉన్న పాత్రంటో మరి..

టీవీ రంగంలోకి క‌మ‌ల్ హాస‌న్‌...

-- Hyderabad Published:17 April 2017 11:21:08 AM

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ ఇప్పుడు త‌మిళ సినీ రంగంలో యాక్టివ్ మెంబ‌ర్ అయ్యారు. విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో, సినిమాల‌తో మెప్పించిన క‌మ‌ల్ హాస‌న్ త్వ‌ర‌లోనే టీవీల్లో కూడా క‌న‌ప‌డ‌బోతున్నాడు. రీసెంట్‌గా ఓ వాణ‌జ్య ప్ర‌క‌ట‌న‌లో న‌టించిన క‌మ‌ల్ ఇప్పుడు శ‌భాష్ నాయుడు సినిమాను ట్రాక్ ఎక్కించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ నేప‌థ్యంలో త‌మిళంలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ కార్య‌క్ర‌మానికి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించాలంటూ ప్ర‌ముఖ టీవీ ఛానెల్ క‌మ‌ల్‌ను సంప్ర‌దించింద‌ట‌. మ‌రి కమ‌ల్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..

విక్ర‌మ్ హీరోగా స్కెచ్‌

-- Hyderabad Published:17 April 2017 11:17:12 AM

`శివ‌పుత్రుడు`, `అప‌రిచితుడు` చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువైన న‌టుడు చియాన్ విక్ర‌మ్‌. `ఇంకొక్క‌డు` చిత్రంతో వంద‌కోట్ల క్ల‌బ్‌లో చేరిన ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `స్కెచ్‌`. ఇంతకు మునుపు ఎప్పుడూ లేన‌ట్టుగా `స్కెచ్‌`లో గ‌డ్డంతో, కొత్త లుక్‌తో క‌నిపిస్తున్నారు చియాన్‌ విక్ర‌మ్‌. ఆయ‌న ప‌క్క‌న తొలిసారిగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఆడిపాడ‌నుంది. తెలుగు, త‌మిళంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను వి క్రియేష‌న్స్ ప‌తాకంపై క‌లైపులి య‌స్‌.థాను స‌మ‌ర్పిస్తున్నారు. మూవింగ్ ఫ్రేమ్స్ సంస్థ నిర్మిస్తోంది. విజ‌య్ చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సోమ‌వారం విక్ర‌మ్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని క‌లైపులి య‌స్‌. థాను మాట్లాడుతూ ``విజ‌య్ చంద‌ర్ చెప్పిన క‌థ థ్రిల్లింగా అనిపించింది. విక్ర‌మ్ గ‌త చిత్రాల‌కు భిన్నంగా, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే రీతిలో ఉంది. ఈ క‌థ‌లోని ఇంటెన్సిటీ న‌చ్చి గ‌డ్డంతో విక్ర‌మ్ కొత్త లుక్‌ను షేప‌ప్ చేసుకున్నారు. విక్ర‌మ్ ప‌క్క‌న త‌మ‌న్నా తొలి సారి న‌టిస్తోంది. ర‌ష‌స్ చూశాక తెర‌మీద వీరిద్ద‌రి జంట త‌ప్ప‌కుండా హిట్ పెయిర్ అవుతుంద‌నే న‌మ్మ‌కం వ‌చ్చింది. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. తెలుగు, త‌మిళంలో ఒకే సారి తెర‌కెక్కిస్తున్నాం. ఒకే షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. మా సంస్థ నిర్మించిన గ‌త చిత్రాల‌కు ఏమాత్రం తీసిపోకుండా భారీ బ‌డ్జెట్‌తో, ఎక్క‌డా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. క‌థ‌, స్క్రీన్‌ప్లే, లొకేష‌న్లు, పాట‌లు అన్నీ హైలైట్ అవుతాయి. క్లాస్‌, మాస్ అనే తేడా లేకుండా అంద‌రికీ న‌చ్చుతుంది. ప్రేక్ష‌కుడికి విందుభోజ‌నంలాంటి సినిమా అవుతుంది`` అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: య‌స్‌.య‌స్‌.థ‌మ‌న్‌, కెమెరా: సుకుమార్‌, ఆర్ట్: మాయ పాండి

అమీ తుమీ టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్న నాని..

-- Hyderabad Published:17 April 2017 11:12:51 AM

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ "అమీ తుమీ". వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్నారు. ఈషా, అదితి మ్యాకల్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం టీజ‌ర్‌ను రేపు సాయంత్రం హీరో నాని విడుద‌ల చేస్తున్నారు. డైరెక్ట‌ర్ ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న "అమీ తుమీ"ఈ చిత్రం కోసం సింక్ సౌండ్ విధానాన్ని ఉపయోగిస్తున్నాం. సింక్ సౌండ్ కారణంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలుగుతుంది. అవసరాల-అడివి శేష్ ల మధ్య సన్నివేశాలు టైటిల్ కు తగ్గట్లుగా ఉంటాయి. ఈషా, అదితి మ్యాకల్ పాత్రలు చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. త్వరలోనే ఆడియో మరియు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం. అందరూ తెలుగు ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్లతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత కె.న‌ర‌సింహారావు తెలిపారు.

అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్: డి.యోగానంద్, కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి!

పిలిచినా పలుకుతావని మూవీ ఆల్బం లాంచ్

-- Hyderabad Published:17 April 2017 11:05:58 AM

ఎంపీ మురళి మోహన్ చేతుల మీదుగా `పిలిచినా పలుకుతావని` భక్తి గీతాలు విడుదల

సాయి శ్రేయ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీనివాస్ బోని, పార్వతినాయుడు నిర్మాత‌లుగా సాయిబాబాపై స్వ‌ర సుంద‌ర్ ర‌చ‌న‌లో జి.ఆర్‌.న‌రేన్ సంగీత సారథ్యంలో రూపొందిన `పిలిచినా ప‌లుకుతావ‌నీ..` పాట‌ల సీడీ విడుద‌ల కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ముర‌ళీమోహ‌న్ బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు.

అనంతరం.. మురళి మోహన్ మాట్లాడుతూ - ``సాయినాథునిపై పాట‌లు ఎప్పుడు విన్న బాగానే ఉంటాయి. శ్రీనివాస్ బోని, పార్వతినాయుడు చేసిన ఈ ప్ర‌య‌త్నం చాలా బావుంది. న‌రేన్ చ‌క్క‌ని సంగీతాన్ని అందించారు. మంచి సాహిత్యంతో స్వ‌ర‌సుంద‌ర్ పాట‌ల‌ను చ‌క్క‌గా రాశారు. నేను 350 సినిమాల‌కు పైగా న‌టించిన న‌టుడినే ఓ వ్య‌క్తి న‌న్ను ఓ సంద‌ర్బంలో క‌లిసి సాయిబాబాపై వేటూరిగారు రాసిన పాట‌ను బాలుగారు ఆర‌గంట పాటు పాడార‌ని, ఆ పాట‌లో న‌న్ను సాయిబాబా భ‌క్తుడిగా న‌టించ‌మ‌ని అన్నారు. నేను కూడా నిజ‌మైన భ‌క్తుడిలా కనిపించాల‌ని, ఒక నెల రోజులు గ‌డువు టైం కావాల‌ని చెప్పి, ఏ మేక‌ప్ లేకుండా గ‌డ్డం పెంచి త‌ర్వాత న‌టించాను. ఆ పాట ఇప్ప‌టికీ టీవీ చానెల్స్‌లో వ‌స్తుంటుంది. అంత పెద్ద పాట‌ను రెండు రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశామంటే కారణం సాయిబాబానే అని నేను భావిస్తుంటాను. ఆ పాట విన్న‌వారంద‌రూ ఆ పాట‌లో నేను బాగా చేశాన‌ని మెచ్చుకోవ‌డం విన్న‌ప్పుడంతా, నాకు సంతోషంగా ఉంటుంది. `పిలిచినా ప‌లుకుతావ‌నీ..`ఆల్బ‌మ్ చేసిన అంద‌రికీ న‌చ్చే పాట‌ల‌తో చ‌క్క‌గా ఉంది. ఈ నిర్మాత‌లు భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని మంచి ప్ర‌య‌త్నాలు చేస్తార‌ని భావిస్తున్నాను`` అన్నారు.

శివాజీ రాజా మాట్లాడుతూ - ``పిలిచినా ప‌లుకుతావ‌నీ` పాట‌లు చాలా బావున్నాయి. నిర్మాత‌లు శ్రీనివాస్‌, పార్వ‌తినాయుడు, సంగీత ద‌ర్శ‌కుడు న‌రేన్‌ల‌కు నా అభినంద‌న‌లు`` అన్నారు.

అనిల్ చంద్ర మాట్లాడుతూ - ``దేవుడి భ‌క్తిని ఇలా తెలిపిన నిర్మాత‌ల‌కు మంచి భ‌విష్య‌త్ ఉంటుంది. న‌రేన్ చాలా మంచి సంగీతం అందించాడు`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో రేలంగి న‌ర‌సింహారావు, డా.జ‌యంతిరెడ్డి, జిహెచ్ఎంసి డిప్యూటీ క‌మీష‌న‌ఱ్ సుదాన్ష్ త‌దిత‌రులు పాల్గొన్నా జి ఆర్.నరే న్ మాట్లాడుతూ, సాయిబాబు పాటలను కంపోస్ చేసే గొప్ప అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.

సుకుమార్‌ రైటింగ్స్‌ దర్శకుడు మూవీ ఫస్ట్‌ లుక్‌ విడుదల

-- Hyderabad Published:17 April 2017 10:56:32 AM

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ నిర్మాతగా సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న 'దర్శకుడు' చిత్రం ఫస్ట్‌లుక్‌ని ఆదివారం సుకుమార్‌ విడుదల చేశారు. సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై వచ్చిన 'కుమారి 21 ఎఫ్‌' చిత్రం ఎంతటి సెన్సేషన్‌ని క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తర్వాత వస్తున్న 'దర్శకుడు' చిత్రాన్ని సుకుమార్‌ తో కలిసి బిఎన్‌సిఎస్‌పి విజయ్‌కుమార్‌, థామస్‌ రెడ్డి ఆదూరి మరియు రవిచంద్ర సత్తి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అశోక్‌, ఈషా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు హరిప్రసాద్‌ జక్కా. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలీ, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌ అనుమోలు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రమేష్‌ కోలా.

హంస‌దీవిలో బోయ‌పాటి, బెల్లంకొండ శ్రీనివాస్‌

-- Hyderabad Published:17 April 2017 10:51:58 AM

బెల్లంకొండ శ్రీనివాస్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం నెక్ట్స్ షెడ్యూల్‌లో హంస‌ల‌దీవిలో జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్ ఏప్రిల్ 21 నుండి ప్రారంభం కానుంది. హై బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం రీసెంట్‌గా హైద‌రాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. స‌రైనోడు త‌ర్వాత బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం హంస‌ల‌దీవిలో స‌ముద్ర‌తీరంలో ఓ భారీ సెట్‌ను వేశారు. అందులో భారీ ఫైట్‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. క్యాథ‌రిన్ ఈ సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేస్తుంది. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

శతమానం భవతి అప్ప్రీసియేషన్ మీట్ బై అల్లు అకాడమీ అఫ్ ఆర్ట్స్

-- Hyderabad Published:17 April 2017 10:48:51 AM

`శ‌త‌మానం భ‌వ‌తి` చిత్రానికి వ‌చ్చిన‌ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నేషనల్ అవార్డు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన అవార్డుగా భావిస్తున్నాను - మెగాస్టార్ చిరంజీవి

27ఏళ్ళ త‌ర్వాత హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాత‌గా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించిన `శ‌త‌మానం భ‌వ‌తి` సినిమాకు జాతీయ అవార్డు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. గీతాంజ‌లి, శంక‌రా భ‌ర‌ణం చిత్రాల త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన తెలుగు చిత్రం `శ‌త‌మానం భ‌వ‌తి`. చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రంతో తెలుగువారి సంప్ర‌దాయాల‌ను, సంస్కృతి, బంధాల‌ను తెలియ‌జెప్పిన శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాన్నినిర్మించిన దిల్‌రాజును అల్లు అకాడ‌మీ ఆఫ్ ఆర్ట్స్ సంస్థ త‌ర‌పున ప్ర‌ముఖ నిర్మాత అల్లుఅర‌వింద్ స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా... అల్లు అర‌వింద్ మాట్లాడుతూ - ``దిల్‌రాజుతో నాకు చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. మంచి టెస్ట్ ఉన్న నిర్మాత‌. తెలుగు ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమాల‌ను అందించాల‌నే ఆయ‌న త‌ప‌నే ఈరోజు ఇలా `శ‌త‌మానంభ‌వ‌తి` సినిమా రూపంలో జాతీయ‌స్థాయిలో అవార్డు రావ‌డానికి కార‌ణ‌మైంది. 27 ఏళ్ళ త‌ర్వాత తెలుగు సినిమాకు నేష‌న‌ల్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చిన సినిమా `శ‌త‌మానంభ‌వ‌తి` నిల‌వ‌డ‌మ‌నేది తెలుగు సినిమాలో భాగ‌మైన అంద‌రూ గ‌ర్వించే విషయం. ఇలాంటి ఓ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన దిల్‌రాజుకి, టీంకు అభినంద‌న‌లు`` అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - ``మ‌న తెలుగు సినిమాకు జాతీయస్థాయిలో రెండున్నర ద‌శాబ్దాలు త‌ర్వాత జాతీయ‌స్థాయిలో గుర్తింపు రావ‌డ‌మ‌నేది గ‌ర్వంగా ఉంది. దిల్‌రాజు, స‌తీష్ వేగేశ్న కృషితోనే ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించ‌డ‌మే కాదు, గొప్ప గౌర‌వాన్ని అంద‌రికీ తీసుకొచ్చింది. ఒక‌ప్పుడు నేను చేసిన `రుద్ర‌వీణ‌` సినిమాకు నేష‌న‌ల్ ఇంటగ్రిటీ అవార్డు వ‌చ్చింది. ఎందుకంటే న‌ర్గీస్‌ద‌త్ అవార్డు తెలుగు సినిమాల‌కు రావ‌డం అరుదు. అలాంటి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అవార్డు రావ‌డం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన అవార్డుగా భావిస్తున్నాను. తోటి నిర్మాత‌ను గౌర‌వించిన అల్లు అర‌వింద్‌గారిని అభినందిస్తున్నాను. ఇలాంటి అరుదైన గౌర‌వాన్ని తెచ్చిపెట్టిన దిల్‌రాజుగారికి, ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న‌, ఎంటైర్ టీంకు హృద‌య‌పూర్వ‌క కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను`` అన్నారు.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ మాట్లాడుతూ - ``అల్లు అర‌వింద్‌గారు ఒక నిర్మాత అయ్యి ఉండి మ‌రో నిర్మాత‌ను స‌న్మానించ‌డం చాలా గొప్ప విష‌యం. `శ‌త‌మానంభ‌వ‌తి` సినిమా చూసి మా ఆవిడ అప్పుడ‌ప్పుడు ఇలాంటి సినిమాలు చెయ్య‌వ‌చ్చు క‌దా అని న‌న్ను అడిగింది. దిల్‌రాజుగారు చాలా గొప్ప సినిమా తీశారు. నేను కూడా `శ‌త‌మానంభ‌వ‌తి` వంటి మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చేయాల‌నే కోరిక క‌లిగింది`` అన్నారు.

అల్లుఅర్జున్ మాట్లాడుతూ - ``నాకు దిల్‌రాజుగారితో మంచి అనుబంధం ఉంది. ఇద్ద‌రం ఒకేసారి ఇండ‌స్ట్రీలో ప్ర‌యాణం మొద‌లు పెట్టాం. ఇప్పుడు ఆయ‌న చేస్తున్న 25వ సినిమాను నేనే చేస్తున్నాను. దిల్‌రాజుగారు త‌క్కువ స‌మ‌యంలోనే ప్రామిసింగ్‌, బెస్ట్ ప్రొడ్యూస‌ర్ అయ్యారు. గీతాంజ‌లి, శంక‌రాభ‌ర‌ణం త‌ర్వాత ఇప్పుడు శ‌త‌మానంభ‌వ‌తి చిత్రానికి జాతీయ అవార్డు రావ‌డం అరుదైన విష‌యం. జాతీయ అవార్డు రావ‌డ‌మ‌నేది నిర్మాత‌కు, నిర్మాణ సంస్థ‌కే కాదు, తెలుగు సినిమా పరిశ్ర‌మ‌కే గ‌ర్వ‌కార‌ణ‌మైన విష‌యం. బాహుబ‌లి సినిమాను తెలుగు సినిమాను నేష‌న‌ల్ స్కేల్‌లో నిలిపింది. అలాగే శ‌త‌మానంభ‌వ‌తి సినిమా కూడా తెలుగు సినిమాను నేష‌న‌ల్ స్కేల్ గుర్తింపు వ‌చ్చేలా చేసింది. ఇలాంటి సినిమాను నిర్మించిన దిల్‌రాజుగారికి,టీంకు అభినంద‌న‌లు`` అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ - ``లైఫ్‌లో గ్రేట్ అచీవ్‌మెంట్ చేసిన సంద‌ర్భంలోనే జీవితంలో చాలా పెద్దగా కోల్పోయాను. ఆ బాధ ఎలాంటిదో నాకు చాలా క్లోజ్‌గా ఉండే అర‌వింద్‌గారి వంటివారికి తెలుసు. ఈ అవార్డు కంటే ప‌దిహేనేళ్ళుగా అర‌వింద్‌గారి వంటి మంచి వ్య‌క్తి చేసిన స్నేహం గొప్ప‌దిగా భావిస్తున్నాను. లైఫ్‌లో మ‌నం అనుకున్న‌వాటిలో కొన్నింటిని సాధించిన‌ప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది. అటువంటి దానిలో ఈ `శ‌త‌మానంభ‌వ‌తి` సినిమా చేయ‌డం. స‌తీష్ ద‌గ్గ‌ర ఈ లైన్ విన‌మ‌ని హ‌రీష్ శంక‌ర్ చెప్పిన‌ప్పుడు లైన్ విన్నాను. అప్ప‌టి నుండి, సినిమా బాగా రావాల‌ని అంద‌రితో క‌థ‌ను షేర్ చేసుకుంటూ వ‌చ్చాను. అంద‌రి ద‌గ్గ‌ర స‌ల‌హాలు తీసుకున్నాను. అలాంటి వారిలో నాని కూడా ఒక‌డు. నాని కూడా కొన్ని స‌ల‌హాల‌నిచ్చాడు. అంద‌రినీ సినిమాలోఇన్‌వాల్వ్ చేస్తూ పూర్తి చేసి ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌ర‌కు రీచ్ అయ్యేలా చేశాం. మా ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయ్యి జాతీయ‌స్థాయిలో అవార్డు రావ‌డం హ్యాపీగా ఉంది`` అన్నారు.

హీరో నాని మాట్లాడుతూ - ```శ‌త‌మానంభ‌వ‌తి` సినిమాను ముస‌లివాళ్ళ నుండి చిన్న పిల్ల‌ల వ‌ర‌కు త‌మ సినిమా భావించారు. చాలా రోజుల త‌ర్వాత ఓ మంచి సినిమాకు ముఖ్యంగా క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా స‌క్సెస్ అయిన సినిమాకు ఇవ్వ‌డం ఇంకా గొప్ప విష‌యం. దిల్‌రాజుగారికి, టీంకు కంగ్రాచ్యులేష‌న్స్‌`` అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న మాట్లాడుతూ - ``చిరంజీవిగారు సినిమా స‌క్సెస్ మీట్‌కు వ‌చ్చి యూనిట్‌ను అభినందించారు. అవార్డు వ‌చ్చిన త‌ర్వాత ఇండ‌స్ట్రీ నుండి అల్లు అర‌వింద్‌గారు వ‌చ్చి అభినందించ‌డం చాలా సంతోషంగాఉంది`` అన్నారు.

హీరో శ‌ర్వానంద్ మాట్లాడుతూ - ``ఒక సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గానో, అవార్డు ప‌రంగానో గుర్తింపు తెచ్చుకుంటుంది. కానీ శ‌త‌మానం భ‌వ‌తి, క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద హిట్ కావ‌డ‌మే కాకుండా జాతీయస్థాయిలో అవార్డు సాధించ‌డ‌మ‌నేది నా కెరీర్‌లో తొలిసారి. నా జీవితంలో సంతోష‌క‌ర‌మైన క్ష‌ణ‌మిది. ఈ సినిమాకు సంబంధించి అన్నీ చ‌క చ‌కా జ‌రిగిపోయాయి. 45 రోజుల్లో షూటింగ్ పూర్తి కావ‌డం, 20-30 రోజుల్లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి కావ‌డం, సినిమా విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కావ‌డం, ఇప్పుడు నేష‌న‌ల్ అవార్డు రావ‌డం అన్నీ త్వ‌ర త్వ‌ర‌గా పూర్త‌య్యాయి. వీట‌న్నింటికి కార‌ణం మా రాజు అన్న‌య్యే. ఆయ‌న‌న‌కు, శిరీష్‌గారికి, టీం అంత‌టికీ థాంక్స్‌`` అన్నారు.

డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల్లో సునీల్ న‌టించిన‌ ఉంగరాల రాంబాబు

-- Hyderabad Published:17 April 2017 10:25:16 AM

క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ లు త‌న సొంతం చేసుకొన్న‌ సునీల్ హీరోగా, మంచి చిత్రాల ద‌ర్శ‌కుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపోందుతున్న‌ చిత్రం ఉంగరాల రాంబాబు. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలువ‌ల‌తో కూడిన వాణిజ్య‌ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి మే నెల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. అతిత్వ‌ర‌లోనే జిబ్రాన్ అందించిన ఆడియో విడుద‌ల చేస్తారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ '' మా దర్శకుడు క్రాంతి మాధవ్ తెర‌కెక్కిస్తున్న ఉంగ‌రాల రాంబాబు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సునిల్ న‌టించిన అందాల‌రాముడు త‌ర‌హ న‌వ్వించే చిత్రంగా తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పోందుతుంది. ఈ సంవ‌త్స‌రం స‌మ్మ‌ర్ లో ఫ్యామిలి ఆడియ‌న్స్ ని క‌డుపుబ్బ న‌వ్వించే మెట్ట‌మెద‌టి చిత్రంగా మా ఉంగ‌రాల రాంబాబు వుంటాడనేది మా న‌మ్మ‌కం. త్వ‌ర‌లో మేము విడుద‌ల చేస్తున్న విజువ‌ల్స్ చూస్తే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ని ఏ రేంజిలో తెర‌కెక్కించామ‌నేది తెలుస్తుంది. మా చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. న‌వ్వించ‌మే ద్యేయంగా అది కూడా అవుటాఫ్ కామెడి కాకుండా క‌థ‌లోని కామెడి ని పోందు ప‌ర‌చి న‌వ్విస్తాము. ప్ర‌కాష్‌రాజ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిషోర్ ల కాంబినేష‌న్ లో సునిల్ చేసిన కామెడి అంతాఇంతాకాదు. ఈ స‌మ్మ‌ర్ కి పెర్‌ఫెక్ట్ కామెడి మూవీగా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పోందుతుంద‌నే న‌మ్మ‌కం మా యూనిట్ అంద‌రికి వుంది. అతిత్వ‌ర‌లో జిబ్రాన్ అందించిన ఆడియోని విడుద‌ల చేస్తాము. ఫుల్ లెంగ్తె కామెడి మాత్ర‌మే చేశాము. ఈ స‌మ్మ‌ర్ లో ఫుల్ కామెడి చిత్రం గా మే నెల‌లో ఉంగరాల రాంబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం. '' అని అన్నారు. నటీ నటులు - సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున

సాంకేతిక వర్గంః

మ్యూజిక్ - జిబ్రాన్,

లిరిక్స్ - రామ జోగయ్య శాస్త్రి, రెహమాన్,

సినిమాటోగ్రఫి - సర్వేష్ మురారి,

ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావ్,

ఫైట్ మాస్టర్ - వెంకట్,

డైలాగ్స్ - చంద్ర మోహన్ చింతాడ,

ఆర్ట్ - ఎ.ఎస్.ప్రకాష్,

కొరియో గ్రఫి - భాను మాస్టర్,

ప్రొడ్యూసర్ - పరుచూరి కిరీటి,

డైరెక్టర్ - కె. క్రాంతి మాధవ్.

ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాటి ల చిత్రం

-- Hyderabad Published:17 April 2017 10:13:38 AM

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో తెరకెక్కిన 'మాయావన్‌' చిత్రాన్ని ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో నిర్మాత ఎస్‌.కె. బషీద్‌ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సందర్భంగా ఎస్‌.కె.బషీద్‌ మాట్లాడుతూ..'ఆద్యంతం ఆసక్తి కలిగించే ఉత్కంఠతతో తెరకెక్కిన తమిళ 'మాయావన్‌' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సందీప్‌కిషన్‌, లావణ్య త్రిపాటి, జాకీష్రాప్‌లు ఇందులో కీలకమైన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఓ సాంగ్‌కి సంబంధించి చిన్న ఫ్యాచ్‌ వర్క్‌ జరుగుతోంది. ఇది ఏప్రిల్‌ 27 వరకు కోడైకెనాల్‌, చెన్నయ్‌లలో జరుగుతుంది. ఆ వెనువెంటనే ఆడియోని రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ఈ సినిమాకి సంబంధించి తెలుగు టైటిల్‌ను, ఇతరత్రా విషయాలను అతి త్వరలో తెలియజేస్తాము..' అని అన్నారు

ఆగ‌స్టులో రానా సినిమా...

-- Hyderabad Published:17 April 2017 10:02:47 AM

భ‌ళ్ళాల‌దేవుడుగా ఏప్రిల్ 28న `బాహుబ‌లి 2`లో రానా సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విడుద‌లైన మూడు నెల‌ల‌కే అంటే ఆగ‌స్టులో మ‌రో సినిమాతో రానా రానున్నాడు. ఇంత‌కు ఆ సినిమా మ‌రేదో కాదు తేజ ద‌ర్శ‌క‌త్వంలో రానా, కాజ‌ల్ అగర్వాల్ న‌టిస్తున్న `నేనే రాజు - నేనే మంత్రి`. పొలిటిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రానా రాయ‌ల‌సీమకు చెందిన ఫైనాన్సియ‌ర్‌గా క‌న‌పడ‌నున్నాడు. ఈ సినిమాను ఆగ‌స్టులో స్వాతంత్ర‌దినోత్స‌వం సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని యూనిట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. త‌నను హీరోయిన్‌గా ఇంట్ర‌డ్యూస్ చేసిన తేజ ద‌ర్శ‌క‌త్వంలో ద‌శాబ్ద కాలం త‌ర్వాత కాజ‌ల్ న‌టిస్తున్న చిత్రం కూడా ఇదే కావ‌డం విశేషం. ప్ర‌తి సినిమాను డిఫ‌రెంట్‌గా ఎంచుకున్న రానా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది.

మ‌హేష్ రికార్డులు స్టార్ట్ చేసేశాడు...

-- Hyderabad Published:17 April 2017 09:58:06 AM

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌కు అభిమానుల్లో ఉన్న ఆద‌ర‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమాల ప‌రంగా, క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ ప‌రంగా దూసుకెళ్తోన్న మ‌హేష్, ఇప్పుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పైడ‌ర్ అనే స్పై థ్రిల్ల‌ర్‌లో న‌టిస్తున్నాడు. రెండు పాటలు, క్లైమాక్స్ మిన‌హా సినిమా పూర్త‌య్యింది. రీసెంట్ విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్, మోష‌న్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తుంది. ఇప్ప‌టికే స్పైడ‌ర్ మోష‌న్ పోస్ట‌ర్‌ను రెండు మిలియ‌న్ మంది ప్రేక్ష‌కులు వీక్షించారు. సినిమా విడుద‌ల‌కు ముందు రికార్డుల ప‌ర్వానికి తెర తీసిన మ‌హేష్‌, విడుద‌ల త‌ర్వాత ఎన్ని రికార్డుల‌కు నాంది ప‌లుకుతాడోన‌ని  చూడాలి.

హిట్ డైరెక్ట‌ర్‌తో మిస్ట‌ర్‌..

-- Hyderabad Published:17 April 2017 09:53:29 AM

రీసెంట్‌గా విడుద‌లైన `మిస్ట‌ర్‌`అనుకున్న రేంజ్ ప‌లితాన్ని రాబ‌ట్టుకోలేక‌పోవ‌డంతో మెగా బ్ర‌ద‌ర్ త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్ ఇప్పుడు త‌న నెక్ట్స్ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో `ఫిదా` సినిమా చేస్తున్న వ‌రుణ్ తేజ్ త‌దుప‌రిగా బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా, డెబ్యూ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తాడు. ఈ సినిమాతో పాటు మ‌రో సినిమాలో న‌టించ‌డానికి వ‌రుణ్‌తేజ్ ఆస‌క్తిని చూపిస్తున్నాడు. ఈ ఏడాది ఘాజీతో స‌క్సెస్ కొట్టిన డైరెక్ట‌ర్ సంక‌ల్ప్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ సినిమా చేయ‌నున్నాడ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. సంక‌ల్ప్ త‌న తొలి చిత్రం ఘాజీని తెర‌కెక్కించిన‌ట్లే , రెండో సినిమాను కూడా డిఫ‌రెంట్‌గానే తెర‌కెక్కించాల‌నుకుంటున్నాడ‌ట‌.

ద‌ర్శ‌కుడు ఫ‌స్ట్‌లుక్ ఎప్పుడంటే...

-- Hyderabad Published:15 April 2017 05:56:10 PM

ద‌ర్శ‌కుడు సుకుమార్ నిర్మాత‌గా మారి సుకుమార్ రైటింగ్స్ అనే సంస్థ‌ను స్టార్ట్ చేసి తొలి చిత్రం `కుమారి 21 ఎఫ్‌`తో స‌క్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు త‌న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ హ‌రిప్రసాద్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న అన్న కొడుకు అశోక్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ `ద‌ర్శ‌కుడు` అనే సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమా తుది ద‌శ షూటింగ్‌కు చేరుకుంది. సినిమాను సమ్మ‌ర్‌లో విడుద‌ల చేయడానికి సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను రెండు రోజుల్లో విడుద‌ల చేయ‌బోతున్నాడ‌ట‌. మ‌రి `ద‌ర్శ‌కుడు`లో ఏ కోణాన్ని సుకుమార్ చూపిస్తాడో మ‌రి...

నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వెబ్ సిరీస్‌...

-- Hyderabad Published:15 April 2017 05:52:06 PM

అలా మొద‌లైందితో స‌క్సెస్ కొట్టిన నంద‌నీ రెడ్డి క‌ళ్యాణ వైభోగ‌మే చిత్రం త‌ర్వాత మ‌రే చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌లేదు. అయితే ద‌ర్శ‌కురాలిగా సినిమాను కూడా వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించ‌డానికి నందినీ రెడ్డి సిద్ధ‌మైంద‌ట‌. ఈ వెబ్ సిరీస్‌లో హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ఆదిత్‌, శ‌శాంక్‌ల‌తో పాటు తేజ‌స్వి న‌టిస్తుంది. విజ‌య‌వాడ నుండి హైద‌రాబాద్ చేరుకున్న అమ్మాయి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుందనే కాన్సెప్ట్‌పై ఈ వెబ్ సిరీస్ ఉంటుంద‌ట‌. ఈ వెబ్‌సిరీస్ 25 భాగాలుగా ఉంటాయని స‌మాచారం. ఈ మ‌ధ్య కాలంలో సినీ న‌టులంద‌రూ వెబ్ సిరీస్‌ల వైపు ఆస‌క్తి చూపుతున్నారు.

పాండిచ్చేరిలో ర‌వితేజ చిత్రం...

-- Hyderabad Published:15 April 2017 05:38:38 PM

మాస్‌మ‌హారాజా అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ర‌వితేజ‌, ఇప్పుడు రెండు సినిమాల్లో ఒకేసారి న‌ట‌స్తున్నాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌కత్వంలో రాజా ది గ్రేట్ ఒక‌టి కాగా, విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌క‌త్వంలో టచ్ చేసి చూడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. పాండిచ్చేరిలో ఓ షెడ్యూల్ పూర్త‌య్యింది. నెక్ట్స్ షెడ్యూల్‌ను విదేశాల్లో చిత్రీక‌రించాల‌నుకుంటున్నార‌ట‌. ఫారిన్ షెడ్యూల్ త‌ర్వాత మ‌ళ్ళీ నెల రోజుల పాటు పాండిచ్చేరిలో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. మొత్తం మీద ట‌చ్ చేసి చూడు చిత్రం పాండిచ్చేరి బ్యాక్‌డ్రాప్‌లో తెరెక్కుతుందో..మ‌రి పాండిచ్చేరి బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌డానికి కార‌ణాలేంటో మ‌రి తెలియాలంటే మ‌రికొన్నిరోజులు ఆగాల్సిందే.

హిట్ ద‌ర్శ‌కుడితో తేజు...

-- Hyderabad Published:15 April 2017 05:22:40 PM

శ‌త‌మానం భ‌వ‌తితో సూప‌ర్‌హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న ఇప్పుడు త‌న రెండో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మైపోయాడు. నిజానికి శ‌త‌మానం భ‌వ‌తి సినిమాను సాయిధ‌ర‌మ్ తేజ్ చేయాల్సింది కానీ చేయ‌లేదు. త‌ర్వాత రాజ్‌త‌రుణ్‌తో చేద్దామ‌నుకున్నారు కానీ రాజ్‌త‌రుణ్‌తో కూడా కుద‌ర‌లేదు. దాంతో దిల్‌రాజు శ‌ర్వానంద్‌తో చేశాడు. సినిమా హిట్ కొట్ట‌డంతో ఇప్పుడు స‌తీష్‌తో నెక్ట్స్‌మూవీని చేయ‌డానికి సాయిధ‌ర‌మ్ తేజ్ ఆసక్తి చూపిస్తున్నాడు. స్క్రిప్ట్ త‌యారవుతుంది. అన్నీ ఫైన‌లైజ్ అయ్యాక పూర్తి వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంది.

రీమేక్ చేస్తున్న మంచు హీరో...

-- Hyderabad Published:15 April 2017 04:57:50 PM

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఇప్పుడు ఓ రీమేక్ చిత్రంలో న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. 600కుపైగా చిత్రాల్లో విభిన్న‌మైన పాత్ర‌ల‌ను పోషించిన మోహ‌న్‌బాబుకు ఈ మ‌ధ్య అనుకున్న స్థాయి హిట్ లేదు. రీసెంట్‌గా ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన `పా పాండి` చిత్రాన్ని తెలుగులో మోహ‌న్‌బాబు రీమేక్ చేయ‌బోతున్నార‌ట‌. ఈ చిత్రంలో టైటిల్‌పాత్ర‌లో న‌టించిన రాజ్‌కిర‌ణ్ పాత్ర‌లోమోహ‌న్‌బాబు న‌టించ‌న‌బోతున్నారు. ధ‌నుష్ ద‌ర్శ‌కత్వంతో పాటు సినిమాలో న‌టించాడు కూడా మ‌రి ధ‌నుష్ పాత్ర‌లో మంచు హీరోలు న‌టిస్తారా లేక మ‌రేవ‌రైనా న‌టిస్తారా అనేది తెలియ‌డం లేదు కానీ ప్ర‌స్తుతం `పా పాండి` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి సంబంధించిన చ‌ర్చ‌లు జర‌గుతున్నాయ‌ట‌.

గ్రీన్ కార్డ్ టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

-- Hyderabad Published:15 April 2017 03:40:13 PM

సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ‌తృఘ్న రాయ‌పాటి(యు.ఎస్‌.ఎ),స్టెఫానీ(యు.ఎస్‌.ఎ), జోసెలిన్‌(యు.ఎస్‌.ఎ) తారాగ‌ణంగా ర‌మ్స్ (యు.ఎస్‌.ఎ) ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస్ గుప్తా(యు.ఎస్‌.ఎ), మోహ‌న్‌.ఆర్‌(యు.ఎస్‌.ఎ), న‌ర‌సింహ‌, నాగ‌శ్రీనివాస‌రెడ్డి నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం `గ్రీన్‌కార్డ్‌`. ఈ సినిమా టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా... సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావు మాట్లాడుతూ ``ఎన‌భై శాతం షూటింగ్ అంతా అమెరికాలోనే జ‌రిగింది. ఉయ్ ల‌వ్ అమెరికా..ఉయ్ మేట్ గ‌న్స్ అనే కాన్సెప్ట్ ఆధారంగా సినిమా తెర‌కెక్కింది. అమెరికాలో ఎవ‌రి స్వేచ్ఛ వారికి ఉంటుంది. ఎవ‌ర్ని ఎవ‌రు కాల్చినా అడిగే వాడుండ‌డు. ఇండియా నుంచి వెళ్లి అమెరికాలో స్థిర‌ప‌డిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. డ‌బ్బు సంపాద‌న కోసం వెళ్లిన అక్క‌డ వాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అమెరికాను ఇష్ట‌ప‌డ‌దాం..కానీ గన్స్ క‌ల్చ‌ర్ కూ దూరంగా ఉండాల‌ని చెప్పే సినిమా అది. ఆద్యంతో వినోదంతో తెర‌కెక్కింది. ఈ సినిమా ద్వారా అలాంటి వాళ్ల‌లో కొంత‌మందైనా మారితే ద‌ర్శ‌కుడు చేసిన ఈ ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయిన‌ట్లే` అని అన్నారు. చిత్ర ద‌ర్శ‌కుడు ర‌మ్స్ మాట్లాడుతూ ``వీసా తీసుకుని అమెరికా చేరుకున్న ఓ కుర్రాడి క‌థే గ్రీన్‌కార్డ్‌. గ‌త 15 సంవ‌త్స‌రాలుగా నేను అమెరికాలో గ‌మ‌నించిన ప‌రిస్థితుల‌ను ఆధారంగా చేసుకుని ఈ క‌థ‌ను వారి వారి పిల్ల‌ల‌ను అమెరికాకు పంపాల‌నుకునే త‌ల్లిదండ్రుల‌కు ఈ సినిమాను అంకితం చేస్తున్నాను. 2004లో 10 డాల‌ర్ల బీర్ కోసం నామీదు ఓ అమెరిక‌న్ గ‌న్ ఎక్కిపెట్టాడు. డ్రగ్ర్స్ మ‌త్తులో ఉన్న అత‌ను బీర్ కోసమే అలా చేశాడు త‌ప్ప వ్య‌క్తిగ‌తంగా నాపై ఎలాంటి క‌క్ష లేదు. ఇలాంటి అనుభ‌వాలు చాలా మందికి ఎదుర‌య్యే ఉంటాయి. వాటిని హైలైట్ చేస్తూ ఈ క‌థ‌కు అక్క‌డ న‌టీన‌టుల అయితే బాగుంటుంద‌ని అక్క‌డ వాళ్ల‌తోనే సినిమా చేశా. ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి క‌థ‌తో ఎక్క‌డా సినిమా రాలేదు. ఇదే తొలిసారి. సినిమా ఆడియో కూడా అక్క‌డే రిలీజ్ చేస్తాం. అనంత‌రం మ‌న వాళ్ల కూడా ఇక్క‌డ కూడా ఫంక్ష‌న్ చేస్తాం. అన్ని ప‌నులు పూర్తిచేసి సినిమా వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాం`` అన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ` మంచి క‌థ‌, క‌థ‌నాల‌తో ర‌మ్స్ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఆడియో, సినిమా చ‌క్క‌ని విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది` అని అన్నారు. సింహ మాట్లాడుతూ ` వినోదం ఉంటూనే క‌థ ఆద్యంతం..ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ఎన్ ఆర్ ఐల జీవితాలు ఎలా ఉంటాయ‌నేది ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు క‌ళ్ల‌కుక‌ట్టిన‌ట్లు చూపించారు` అని అన్నారు. శ‌తృఘ్న రాయ‌పాటి(యు.ఎస్‌.ఎ),స్టెఫానీ(యు.ఎస్‌.ఎ), జోసెలిన్‌(యు.ఎస్‌.ఎ), రెబెకా(యు.ఎస్‌.ఎ), మిల్లి(యు.ఎస్‌.ఎ), స్వీటెన్ (యు.ఎస్‌.ఎ) త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః కు(యు.ఎస్‌.ఎ), హెన్నీ ప్రిన్స్‌, ప్ర‌ణ‌య్‌కుమార్‌, కెమెరాః న‌వీన్‌(యు.ఎస్‌.ఎ), నాగ‌శ్రీనివాస్‌రెడ్డి, ఎడిటింగ్ః మోహ‌న్‌, రామారావు, నిర్మాత‌లుః శ్రీనివాస్ గుప్తా(యు.ఎస్‌.ఎ), మోహ‌న్‌.ఆర్‌(యు.ఎస్‌.ఎ), న‌ర‌సింహ‌, నాగ‌శ్రీనివాస‌రెడ్డి, ద‌ర్శ‌క‌త్వంః ర‌మ్స్ (యు.ఎస్‌.ఎ).

తెలుగులో డ‌బ్బింగ్ చెప్పాల‌ని ఉంది - లావ‌ణ్య‌త్రిపాఠి

-- Hyderabad Published:15 April 2017 03:32:09 PM

వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య‌త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ హీరో హీరోయిన్లుగా ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఠాగూర్ మ‌ధు, న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి) నిర్మించిన చిత్రం `మిస్ట‌ర్‌`. ఏప్రిల్ 14న సినిమా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ లావణ్యత్రిపాఠి పాత్రికేయుల‌తో సినిమా గురించిన విశేషాల‌ను తెలియ‌జేశారు. లావ‌ణ్య త్రిపాఠి మాట్లాడుతూ - ``మిస్ట‌ర్ జ‌ర్నీ చాలా సాఫ్ట్‌గా జ‌రిగింది. శ్రీనువైట్ల వంటి డైరెక్ట‌ర్‌తో వ‌ర్క్ చేయ‌డం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన క్యారెక్ట‌ర్స్‌కు భిన్నంగా ఉండే చంద్ర‌ముఖి అనే క్యారెక్ట‌ర్ చేయ‌డం చాలా హ్యాపీగా అనిపించింది. చంద్ర‌ముఖి అనే అమ్మాయికి సెల్‌ఫోన్‌, కంప్యూట‌ర్ గురించి ఏమీ తెలియ‌ద‌ని డైరెక్ట‌ర్ చెబుతున్న‌ప్పుడు ఓ అమ్మాయి ఏమీ తెలియ‌కుండా ఎలా ఉంటుందోన‌ని ఆలోచించాను. ఆ ఆలోచ‌నే చంద్ర‌ముఖి క్యారెక్ట‌ర్ చేయ‌డానికి కార‌ణ‌మైంది. సినిమాలో హాఫ్ శారీ క‌ట్టుకున్నాను. క్యారెక్ట‌ర్ లుక్ ప‌రంగా కొత్త‌గా చేయాల‌నుకుంటాను. నేను ఇండియ‌న్‌, వెస్ట్ర‌న్ స్ట‌యిల్లో దుస్తులు ధరిస్తుంటాను. క్యారెక్ట‌ర్ ప‌రంగా నేను, రూప వైట్ల డిస్క‌స్ చేసుకుని, క‌ళ్ళు పెద్ద‌గా ఉండ‌టానికి లెన్స్ వేసుకున్నాను, రాజుల కాలంనాటి స్ట‌యిల్లో ఉండే అభ‌ర‌ణాల‌ను ధ‌రించాను. వ‌రుణ్‌తేజ్ మంచి యాక్ట‌ర్‌, హీరోగా భ‌విష్య‌త్ ఉంటుంది. ఏమీ తెలియ‌ని చంద్ర‌ముఖి క్యారెక్ట‌ర్ చేయ‌డాన్ని ఛాలెంజింగ్‌గా భావించాను. హీరోయిన్‌గా ఎక్స్‌పోజ్ చేయ‌డాన్ని గ్లామ‌ర్ అని అనుకోను. శ్రీనువైట్ల‌గారు సినిమాను చాలా చ‌క్క‌గా తీశారు. ముఖ్యంగా నా క్యారెక్ట‌ర్‌ను చ‌క్కగా డిజైన్ చేశారు. ప్ర‌తి సీన్‌ను ఎలా చేయాలో చెప్పి చేయించుకున్నారు. నేను ప్ర‌స్తుతం టాలీవుడ్‌పైనే కాన్‌స‌న్ ట్రేష‌న్ పెట్టాను. త‌మిళంలో మాయావ‌న్ అనే సినిమా చేశాను. అందులో సైక్రియాటిస్ట్‌గా చేశాను. తెలుగులో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ `రాధ‌` చేశాను. అలాగే నాగ‌చైత‌న్య హీరోగా రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తున్నాను.తెలుగు బాగానే అర్థ‌మ‌వుతుంది. బాగా మాట్లాడుతున్నాను కూడా. తెలుగులో డ‌బ్బింగ్ చెప్పాల‌నుకుంటున్నాను`` అన్నారు.

ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బ‌మ్ సాంగ్ ఎప్ప‌టికీ ప్రేమ‌ విడుద‌ల‌

-- Hyderabad Published:15 April 2017 03:24:53 PM

ధృవ‌, అదితి ఆర్య‌( ఇజం ఫేమ్‌) కాంబినేష‌న్‌లో రూపొందిన ఇండిపెండెంట్ ఆల్బ‌మ్ సాంగ్ `ఎప్ప‌టికీ ప్రేమ‌` విడుద‌లైంది. 300కు కైగా థియేట‌ర్స్ షోస్ చేసి అంత‌ర్జాతీయంగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ధృవ ఈ ఇండిపెండెంట్ ఆల్బ‌మ్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రొమాంటిక్ సాంగ్‌ను ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ స్వ‌రూప్ రాజ్ మేడ‌ర డైరెక్ట్ చేశారు. శైలేష్ సువ‌ర్ణ ఈ సాంగ్‌కు మ్యూజిక్‌ను అందించారు. సాంగ్ విజువ‌ల్స్, క్వాలిటీ అంతా చాలా గ్రాండ్‌గా ఉంది. మంచి లుక్‌, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న ధృవ‌కు ఈ సాంగ్, టాలీవుడ్‌లో మంచి ఎంట్రీ అవుతుంది. ఆ సాంగ్‌ను ల‌హ‌రి మ్యూజిక్‌వారు విడుద‌ల చేశారు.​

మిస్టర్ మూవీ రివ్యూ

-- Hyderabad Published:15 April 2017 12:15:08 PM

బ్యాన‌ర్‌: ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌

న‌టీన‌టులు: వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్, నాజ‌ర్‌, నికిత‌న్ ధీర్‌, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, పృథ్వీ, ఈశ్వ‌రీరావు, చంద్ర‌మోహ‌న్ త‌దిత‌రులు

మాట‌లు: శ‌్రీధ‌ర్ సీపాన‌

 క‌థ‌: గోపీమోహ‌న్‌,

మ్యూజిక్‌: మిక్కి జె.మేయ‌ర్‌

కెమెరా: కె.వి.గుహ‌న్‌

ఎడిట‌ర్‌: ఎం.ఆర్‌.వ‌ర్మ‌

ఆర్ట్: ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌

ప్రొడ్యూస‌ర్లు: న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌,ఠాగూర్ మ‌ధు

డైర‌క్ష‌న్ : శ‌్రీనువైట్ల‌

ప్రేక్ష‌కుల మీద ప్రేమ‌తో చేసిన సినిమా `మిస్ట‌ర్‌` అని ఈ మ‌ధ్య అన్నారు శ్రీనువైట్ల‌. గ‌తంలో వరుస హిట్లు ఇచ్చిన శ్రీనువైట్ల ఇటీవ‌ల `ఆగ‌డు`, `బ్రూస్‌లీ` చిత్రాల ప‌రాజ‌యాల‌తో ఉన్నారు. `ముకుంద‌`తో టౌన్ కుర్రాడిగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన వ‌రుణ్‌తేజ్ `మిస్ట‌ర్‌`లో క‌థానాయ‌కుడిగా న‌టించారు. తొలి సినిమా `ముకుంద‌`, మూడో సినిమా `లోఫ‌ర్‌` కూడా వ‌రుణ్ కి ఆశించినంత భారీ హిట్ ఇవ్వ‌లేదు. కానీ ఆ లోటును `మిస్ట‌ర్‌` భ‌ర్తీ చేస్తుంద‌ని న‌మ్మారు. ఈ మ‌ధ్య `విన్న‌ర్‌`తో కాసింత చేదును చ‌విచూసిన భ‌వ్య క్రియేష‌న్స్ నుంచి వ‌స్తున్న తాజా సినిమా ఇది. అటు హీరో, ఇటు ద‌ర్శ‌కుడు, డ‌బ్బులు పెట్టిన నిర్మాత‌... ఈ ముగ్గురికీ తీపి క‌బురు అందిస్తుందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే ఓ లుక్కేసేయండి మ‌రి...

క‌థ‌:

చై (వ‌రుణ్ తేజ్‌) వ్యాపార‌వేత్త రావు దంప‌తుల‌ (ఆనంద్‌, ఈశ్వ‌రీరావు) కుమారుడు. స్పెయిన్‌లో ఉంటాడు. ఇండియా నుంచి త‌మ ఇంటికి వ‌స్తున్న ప్రియ‌కు బదులు పొరపాటుగా ఎయిర్‌పోర్టులో మీర (హెబ్బాప‌టేల్‌)ను పిక‌ప్ చేసుకుంటాడు. ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ ఆమె సిద్ధార్థ్ (ప్రిన్స్)ను ప్రేమించింద‌ని తెలిసి త‌న మ‌న‌సుకు స‌ర్ది చెప్పుకుంటాడు. అయినా ఆమె ప్రేమకు స‌మ‌స్య వ‌చ్చింద‌ని ఫోన్లో చెప్పిన‌ప్పుడు ఇండియాలో వాలుతాడు. అక్క‌డ అత‌నికి చంద్ర‌ముఖి (లావ‌ణ్య త్రిపాఠి) ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఆమె రాయ‌ల ఫ్యామిలీకి చెందిన వ‌నిత‌. ఆమెక్కూడా ఓ స‌మ‌స్య ఉంటుంది. మీరా, చంద్ర‌ముఖి స‌మ‌స్య‌ను అర్థం చేసుకుని, వారిని బ‌య‌ట‌ప‌డేసిన చై త‌న స‌మ‌స్య‌ను ఎలా తీర్చుకున్నాడు? త‌న తాత‌పై అత‌నికున్న కోపం ఎందుకు? ఎలా పోయింది. ఒడ‌యార్ (నికిత‌న్ ధీర్‌)తో ఎందుకు త‌ల‌ప‌డ్డాడు? వ‌ంటివ‌న్నీ సెకండాఫ్‌లో వ‌చ్చే అంశాలు.

ప్ల‌స్ పాయింట్లు:

వ‌రుణ్‌తేజ్ స్పెయిన్ కుర్రాడిగా చ‌క్క‌గా న‌టించాడు. ఫైట్లు బావున్నాయి. డ్యాన్సులు కూడా ఫ‌ర్వాలేద‌నిపించాడు. లొకేష‌న్లు సినిమాలో బావున్నాయి. ఛేజింగ్ సీన్లు ఆక‌ట్టుకుంటాయి. కుమారి 21ఎఫ్‌తో యూత్‌కి బాగా క‌నెక్ట్ అయిన హెబ్బా ఇందులోనూ స్టైలిష్‌గా న‌టించింది. సెల్‌ఫోన్ అంటే ఏంటో తెలియ‌నంత అమాయ‌కురాలిగా లావ‌ణ్య న‌టించింది. నాజ‌ర్‌, ఆనంద్‌, ఈశ్వ‌రీరావు, హ‌రీశ్ ఉత్త‌మ‌న్ త‌దిత‌రులు త‌మ‌కిచ్చిన పాత్ర‌ల్లో బాగానే చేశారు. ఏదో ఏదో బావుందే పాట బావుంది. అక్క‌డ‌క్క‌డా మిక్కీ రీరికార్డింగ్ కూడా బావుంది. కెమెరా ప‌నిత‌నం సినిమాకు హైలైట్‌. నిర్మాత‌లు పెట్టిన ఖ‌ర్చు తెర‌పై క‌నిపించింది.

మైన‌స్ పాయింట్లు:

సినిమాకు ఫ‌స్ట్ మైన‌స్ ఫాయింట్ క‌థ‌. స‌న్నివేశాల‌ను అనుకుని, వాటిని క‌థ‌గా కూర్చుకున్న‌ట్టు అనిపిస్తుంది. `మిస్ట‌ర్‌`ను చూస్తున్నంత సేపూ ప్ర‌తి ఫ్రేమూ ఏదో ఒక సినిమాను గుర్తుచేస్తుంది. అంతే కానీ ఎక్క‌డా తాజాగా అనిపించ‌దు. సినిమా మొత్తం కొత్త పాత్ర‌లు ఎంట్రీ అవుతూనే ఉంటాయి. క‌థ సాఫీగా ఎక్క‌డా సాగ‌దు. రెండో స‌గం చూశాక తొలి స‌గం ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా లేదు. అంత మంది ఆర్టిస్టులు ఎందుకు వ‌స్తారో అర్థం కాదు. ఎక్క‌డా బ‌ల‌మైన ఎమోష‌న్స్ క్యారీ కాదు. హీరోకి రాయ‌ల వంశ‌స్తులు ఉరిశిక్ష వేసిన‌ప్పుడు కూడా అంతా ఫ‌న్నీగా ఉంటుంది. ఎక్క‌డా ఎమోష‌న్ క్యారీ అయిన‌ట్టు క‌నిపించ‌దు.

స‌మీక్ష‌:

ప్రేమించిన ప్రేమ‌ను వెతుక్కుంటూ వెళ్తే ప్రేమ మ‌న‌ల్ని వెతుక్కుంటూ వ‌స్తుంద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. కానీ క‌థా ర‌చ‌యిత ఆ విష‌యాన్ని ఆక‌ట్టుకునే స‌న్నివేశాల‌తో చెప్ప‌లేక‌పోయాడు. ఒక వైపు హ‌రీశ్ ఉత్త‌మ‌న్ గ్యాంగ్‌, మ‌రో వైపు నికిత‌న్ ధీర్ గ్యాంగ్‌, ఇంకో వైపు రాయ‌ల వంశం గ్యాంగ్ చేసే చేజింగుల‌తో ఎవ‌రు ఎవ‌రి మ‌నుషులోన‌ని తేల్చుకోలేక అయోమ‌యంగా అనిపిస్తుంది. సంగీతం పెద్ద ఎఫెక్టివ్‌గా లేదు. కామెడీని క‌ష్ట‌ప‌డి పండించే ప్ర‌య‌త్నం చేసినా పండ‌లేదు. ర‌ఘుబాబు చేసిన ఊపిరి స్ఫూఫ్‌, పృథ్వి, శేషు, ష‌క‌ల‌క శంక‌ర్ చేసిన కామెడీ సినిమాలో ఎక్క‌డా అత‌క‌వు. అతిగా అనిపిస్తుంటాయి. సినిమా లొకేష‌న్ల‌ను వెత‌క‌డంలో పెట్టిన శ్ర‌మ కొద్దిగా సినిమా క‌థ‌పై పెట్టి ఉంటే బావుండేదేమో.. శ్రీధ‌ర్ సీపాన డైలాగులు అక్క‌డ‌క్క‌డా బావున్నా.. చాలా చోట్ల కాపీ డైలాగుల్లాగా అనిపిస్తాయి. చివ‌రాఖ‌రిగా.. `మిస్ట‌ర్‌` విసుగును పంచాడు

రేటింగ్‌: 1.75/5

శివలింగ రివ్యూ

-- Hyderabad Published:15 April 2017 12:11:25 PM

నిర్మాణ సంస్థః అభిషేక్ ఫిలిమ్స్‌

తారాగ‌ణంః రాఘవ లారెన్స్‌, రితిక సింగ్‌, ఊర్వ‌శి, వ‌డివేలు, రాధా ర‌వి, భాను ప్రియ‌, జ‌య‌ప్ర‌కాష్‌, ప్ర‌దీప్ రావ‌త్ త‌దిత‌రులు

సంగీతంః ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌

కూర్పుః సురేష్ అర‌స్‌

ఛాయాగ్ర‌హ‌ణంః స‌ర్వేష్ మురారి

నిర్మాతః ర‌మేష్ పిళ్ళై

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః పి.వాసు

పి.వాసు సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు త‌మిళంలో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించారు. ఈయ‌న సినిమాలు తెలుగులోకి రీమేక్ అయ్యి మంచి స‌క్సెస్‌ల‌నే సాధించాయి. చంద్ర‌ముఖి వంటి సినిమాను తెలుగు, త‌మిళంలో డైరెక్ట్ చేసి స‌క్సెస్ సాధించారు. ఇప్పుడు మ‌ళ్ళీ అలాంటి ప్ర‌య‌త్న‌మే చేశారు డైరెక్ట‌ర్ పి.వాసు. క‌న్న‌డంలో త‌న ద‌ర్శ‌క‌త్వంలోనే హిట్ అయిన శివ‌లింగ సినిమాను తెలుగు, త‌మిళంలో అదే పేరుతో రీమేక్ చేశారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ముని, కాంచన‌, గంగ వంటి హార్ర‌ర్‌ చిత్రాల‌తో ద‌ర్శ‌కుడుగా, హీరోగా మెప్పించిన లారెన్స్ ఇందులో హీరోగా న‌టించ‌డం. మ‌రి లారెన్స్‌కు శివ‌లింగ ఎలాంటి స‌క్సెస్ అయ్యింది. కన్న‌డంలో సూప‌ర్‌హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో ఎలా ఉందో తెలుసుకోవాలంటే క‌థ ఏంటో తెలుసుకుందాం....

క‌థః

కొత్త‌గా పెళ్ళైన సిబి సిఐడి ఆఫీస‌ర్ శివ‌లింగ‌(రాఘ‌వ లారెన్స్‌)కు ట్ర‌యిన్ నుండి బ‌య‌ట‌కు ప‌డి చ‌నిపోయిన ర‌హీమ్‌(శ‌క్తివాసు) కేసును అప్ప‌గిస్తారు. ట్రయిన్‌లో ప్ర‌యాణిస్తున్న ర‌హీమ్‌ను ఒక గుడ్డివాడు బ‌య‌ట‌కు తోసేసి చంపేస్తాడు. కేసును డీల్ చేయ‌డానికి భార్య స‌త్య‌భామ‌(రితిక సింగ్‌)తో స‌హా ర‌హీమ్ ఉండే ఊరికి వ‌చ్చిన శివ‌లింగ కొన్ని విచిత్ర‌మైన పరిస్థితుల‌ను ఫేస్ చేస్తాడు. స‌త్య త‌ను ఇంట్లో లేని స‌మ‌యంలో ఎవ‌రికీ చెప్ప‌కుండా బ‌య‌ట‌కు వెళుతుంద‌ని తెలుసుకుంటాడు. కానీ చ‌నిపోయిన ర‌హీమ్ త‌న భార్య స‌త్యను ఆవ‌హిస్తున్నాడ‌నే భ‌యంక‌ర‌మైన నిజం తెలుసుకున్న శివ‌లింగ ఏం చేస్తాడు? అస‌లు ర‌హీమ్‌ను ఎవ‌రు చంపారు? ఎందుకు చంపారు? అస‌లు స‌త్య‌కు, ర‌హీమ్‌కు ఉన్న సంబంధం ఏంటి? శివ‌లింగ చివ‌ర‌కు కేసును ఎలా చేదిస్తాడు? సారా ఎవ‌రు? సారాకు, ర‌హీంకు ఉన్న సంబంధం ఏంటి? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

ప్ల‌స్ పాయింట్స్ః

- లారెన్స్‌, రితిక సింగ్ న‌ట‌న‌

- కామెడి

- సినిమాటోగ్ర‌ఫీ

- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌

మైన‌స్ పాయింట్స్‌

- లాజిక్స్ మిస్ కావ‌డం

- పాట‌లు

స‌మీక్షః

హార్ర‌ర్ చిత్రాల్లో కామెడితో కూడిన న‌ట‌న క‌ల‌గ‌లిపి న‌టించే లారెన్స్ ఈ సినిమాలో కూడా దెయ్యాలంటే భ‌య‌ప‌డే పిరికివాడుగా చ‌క్క‌గా న‌టించాడు. ముఖ్యంగా ఇంట్లో దెయ్యం ఉంద‌ని, ఇంటి వెనుక శ్మ‌శానం ఉంద‌ని తెలిసి భ‌య‌ప‌డే స‌న్నివేశాల్లో చ‌క్క‌గా న‌టించాడు. అలాగే త‌న భార్య‌కు దెయ్యం ప‌ట్టింద‌ని తెలిసినా, త‌న భార్య‌ను ఎలా కాపాడుకోవాల‌నుకునే భ‌ర్త‌గా, నిజాయితీగ‌ల సిబిసిఐడి ఆఫీస‌ర్‌గా మంచి పెర్‌ఫార్మెన్స్ చేశాడు. డ్యాన్సుల గురించి ప్ర‌త్యేకంగాచెప్ప‌న‌క్క‌ర్లేదు లారెన్స్ సునాయ‌సంగా చేసేశాడు. రితిక కూడా డ్యాన్సుల‌ను బాగానే చేసింది. ఇక రితిక న‌ట‌న విష‌యానికి వ‌స్తే, దెయ్యం ఆవహించిన‌ప్పుడు ఆమె న‌టించిన తీరు సింప్లీ సూప‌ర్బ్‌. ఇంట‌ర్వెల్ సీన్ స‌హా దెయ్యం త‌న‌ను ఆవ‌హించిన సంద‌ర్భాల్లో రితిక న‌ట‌న మెచ్చుకోలుగా ఉంది. ఇక వ‌డివేలు పిట్ట‌ల‌దొర అనే దొంగ‌గా కామెడితో న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. వ‌డివేలు, ఊర్వ‌శి మ‌ధ్య సెకండాఫ్‌లో వ‌చ్చే కామెడి సీన్స్ బావుంది. ఇక హాస్పిట‌ల్‌లో కూడా వ‌డివేలు, ఊర్వ‌శి మ‌ధ్య కామ‌డి సీన్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. .జ‌యప్ర‌కాష్‌, భాను ప్రియ‌, ఊర్వ‌శి స‌హా అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. ద‌ర్శ‌కుడు వాసు క‌న్న‌డంలో తెర‌కెక్కించిన సినిమాను తెలుగు, త‌మిళ నెటివిటీకి త‌గిన విధంగా తెర‌కెక్కించారు. ముఖ్యంగా మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని చివ‌రి వ‌ర‌కు మెయిన్‌టెయిన్ చేసిన తీరు బావుంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని మెయిన్‌టెయిన్ చేస్తూ, ఒక్కొక్క సీన్‌ను కలుపుకుంటూ సినిమానుఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాడు. స‌ర్వేష్ మురారి సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ముఖ్యంగా లారెన్స్‌ను చాలా బాగా చూపించాడు. థ‌మ‌న్ ట్యూన్స్ విన‌డానికి బాగా లేవు. సాంగ్స్ పిక్చ‌రైజేష‌న్ బాగానే ఉన్నా, సీరియ‌స్‌గా సాగే క‌థ‌లో డిస్ట్ర‌బ్ చేసేలా పాట‌ల‌ను ఇరికించిన‌ట్టు అనిపించింది. థ‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. కొన్నిచోట్ల లాజిక్స్ మిస్ అయినా హార్రర్ సినిమాల‌ను ఎంజాయ్ చేసే ప్రేక్ష‌కులు స‌హా అందరూ సినిమాను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. చివ‌రాఖ‌రుగా...శివ‌లింగ‌....లాజిక్స్ మిస్ అయినా..స‌స్పెన్స్‌, మిస్ట‌రీని క్యారీ చేసిన తీరు, కామెడి ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాయి

రేటింగ్ః 2.75/5

నానికి చిరు గిఫ్ట్‌...

-- Hyderabad Published:15 April 2017 10:29:49 AM

చిరంజీవి హీరోగా న‌టించిన మాస్ట‌ర్ సినిమా కోసం చిన్న‌ప్పుడు స‌త్యం థియేట‌ర్‌లో వ‌రుస‌లో నిల‌బ‌డ్డ హీరో నాని..టికెట్ కోసం క్యూలో నిల‌బ‌డ్డాడు. వ‌చ్చి చూస్తే..సైకిల్ క‌న‌ప‌డ‌లేదు. ఎవ‌రో ఎత్తుకు పోయారు. ఈ విష‌యాన్ని భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమా సంద‌ర్భంలో అల్లు అర‌వింద్‌కు చెప్పాడు. నేను సైకిల్ కొనిస్తాలే అని అర‌వింద్ చెప్పినా, తర్వాత మ‌ర‌చిపోయాడట‌. ఈ విష‌యాన్ని మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు కార్య‌క్ర‌మంలో అతిథిగా పాల్గొన్న నాని చెప్పాడు. త‌న సైకిల్ పోయిన విష‌యాన్ని చిరంజీవికి చెప్పాడు. దానికి చిరంజీవి నేను కొనిపెడ‌తా..నాకు ఆనందాన్నిచ్చే విష‌య‌మ‌ది అని చిరంజీవి మాట ఇచ్చాడు. అన్న మాట ప్ర‌కార‌మే చిరంజీవి ఓ సైకిల్‌ను కొని నాని ఇంటికి పంపారు. నాని ఆ సైకిల్‌ను చూసి ఎంతో మురిసిపోయారు. సైకిల్ ప‌క్క‌న నిల‌బ‌డి, కుర్రాడు తిరిగి సైకిల్ ద‌క్కించుకున్నాడు. ఇచ్చిన మాట ప్ర‌కారం చిరంజీవిగారు పంపిన కూల్ సైకిల్ ఇది అంటూ త‌న సంతోషాన్ని త‌న ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశాడు.

బాహుబ‌లి వ‌ర్సెస్ భ‌ళ్ళాలదేవ‌

-- Hyderabad Published:15 April 2017 10:24:12 AM

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, ద‌గ్గ‌బాటి రానా ఢీ అంటే ఢీ అంటూ క‌ల‌బ‌డుతున్నారు. బాహుబలిలోనే కాదు, రియ‌ల్‌గా కూడా అనుకునేలా మీడియాకు ఫోజులిచ్చారు ఇద్ద‌రూ. చంఢీగ‌ర్ విశ్వ‌విద్యాల‌యంలో సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ప్ర‌భాస్‌, రానా ఇద్ద‌రూ పాల్గొన్నారు. `బాహుబ‌లి 2` ఏప్రిల్ 28న తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం విడుదల కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

బాబు బాగా బిజీ సెన్సారు పూర్తి

-- Hyderabad Published:14 April 2017 04:17:32 PM

మంచి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌ట‌మే ధ్యేయంగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా దర్శక నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా వినూత్న కథతో నిర్మించిన చిత్రం బాబు బాగా బిజీ. బాలీవుడ్ హిట్ చిత్రం హంటర్ కి తెలుగు రీమేక్ ఇది. నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని A స‌ర్టిఫికేట్ ని తీసుకుంది. మే నెల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌టానికి నిర్మాత స‌న్నాహ‌లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ... అవ‌స‌రాల శ్రీనివాస్ చేసిన అన్ని చిత్రాల‌కంటే బాబు బాగా బిజి చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెర‌కెక్కించాము. ఈ చిత్రం ద్వారా నవీన్ మేడారం ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. చాలా బాగా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వించే చిత్రమిది. అన్ని వర్గాల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేసే చిత్రమిది. మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి ఇందులో విభిన్నమైన పాత్రల్లో ప్రేక్ష‌కుల్ని ముఖ్యంగా యూత్ ని ఎంట‌ర్‌టైన్ చేస్తారు. సునీల్ కశ్యప్ స్వరపరిచిన పాటలు ఇప్ప‌టికే మార్కెట్ లో విడుద‌లయ్యి, చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తున్నాయి. ఇవ‌న్ని చిత్రంలో సందర్భానుసారంగా వచ్చే పాటలు. సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని స‌బ్యుల‌చే ప్ర‌శంశ‌లు అందుకుంది. A స‌ర్టిఫికేట్ తో చిత్రం మే లనెల‌లో పెర్‌ఫెక్ట్ స‌మ్మర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. అని అన్నారు.

అవసరాల శ్రీనివాస్, మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి, రవి ప్రకాష్, తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు

ఎడిటర్ - ఎస్.బి. ఉద్దవ్,

మాటలు - మిర్చి కిరణ్,

శ్రీకాంత్ రెడ్డి,ప్రదీప్ బోద

ఛాయాగ్రహణం - సురేష్ భార్గవ

సంగీతం - సునీల్ కశ్యప్,

నిర్మాత - అభిషేక్ నామా

స్క్రీన్ ప్లే,దర్శకత్వం - నవీన్ మేడారం

లోకేశ్ విషయంలో బాబుకు కేసీఆర్ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా..!?

-- Hyderabad Published:14 April 2017 03:47:04 PM

కేసీఆర్ తన వద్ద పని చేశాడని చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పుకున్నారు.. ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే అసలు తెలంగాణ ఉద్యమం వచ్చి ఉండేదా అని పలువురు తెలుగుదేశం నేతలు ఇప్పటికీ కామెంట్ చేస్తుంటారు. కానీ గతం గతహ.. ఎవరు ఎవరి వద్ద పని చేసినా సరే.. ప్రస్తుతం ఇద్దరూ సమ ఉజ్జీలుగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎంత తిట్టుకున్నా.. ఓటుకు నోటు సమయంలో ఎంతగా సవాళ్లు విసురుకున్నా.. చంద్రబాబూ నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ రంకెలు వేసిననా.. ఆ తర్వాత ఇద్దరూ రాజీకి వచ్చేశారు. ఇప్పుడు ఒకరికి ఒకరు సలహాలు ఇచ్చేకునే రేంజ్ లో ఫ్రెండ్ షిప్ మెయింటైన్ చేసున్నారు. ఇటీవల చంద్రబాబుకు కేసీఆర్ ఇచ్చిన సలహాను ఆయన తుచ తప్పకుండా పాటించాడట. ఇంతకీ కేసీఆర్ చంద్రబాబుకు ఏ విషయంలో సలహా ఇచ్చి ఉంటారు.. కేసీఆర్ కు వాస్తు విషయం, పూజల విషయంలో పట్టింపు ఉంది. కానీ కేసీఆర్ ఇచ్చిన సలహా వాటి గురించి కాదు.. లోకేశ్ గురించి.. చంద్రబాబు మొదట లోకేశ్ ను రాజ్యసభకు పంపుదామని అనుకున్నారట. జాతీయ స్థాయిలో తెలుగు దేశం వ్యవహారాలు అప్పగించాలని అనుకున్నారట. అదే విషయంలో కేసీఆర్ తో ప్రస్తావించినప్పుడు.. కేసీఆర్ దాన్ని సున్నితంగా తిరస్కరించారట. ఒకేసారి జాతీయ స్థాయిలో రాజకీయాల్లోకి దింపితే ఎక్స్ పోజర్ ఎక్కువవుతుంది. చిన్న తప్పులు కూడా హైలెట్ అవుతాయి. ముందు రాష్ట్ర రాజకీయాల్లోనే దింపు.. ఇక్కడ ఏమైనా తేడా వచ్చినా మీరు సరిదిద్దొచ్చు.. అని కేసీఆర్ సలహా ఇచ్చారట. దాంతో లోకేశ్ ను ఎమ్మెల్సీగా రంగంలోకి దింపారట చంద్రబాబు.. బావుంది కదూ చంద్రుళ్ల కుమార రాజకీయం..!

జ‌గ‌ప‌తిబాబుతో ఆ హీరోయిన్‌....

-- Hyderabad Published:14 April 2017 12:29:47 PM

విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారిన హీరో జ‌గ‌ప‌తిబాబు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. మ‌ళ్ళీ జ‌గ‌ప‌తిబాబు హీరోగా క‌న‌ప‌డుతున్నాడు. ఈ సీనియ‌ర్ హీరో టైటిల్ పాత్ర‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం `ప‌టేల్ S.I.R`. వాసు ప‌రిమి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ కంటే ముదుగా విడుద‌లైన టీజ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. జ‌గ‌ప‌తిబాబు లుక్ చాలా కొత్త‌గా ఉండ‌టంతో సినిమాపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉండ‌బోతున్నారు. అందులో మెయిన్ హీరోయిన్ పాత్ర చాలా కీల‌క‌మైన‌ది కావ‌డంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు అలాంటి పాత్ర‌ను క్యారీ చేయ‌డానికి భావ‌న అయితే స‌రిపోతుంద‌ని భావించి ఆమెతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌. రీసెంట్‌గా కిడ్నాప్‌, వేధింపుల‌కు గురైన ఈ న‌టి, వార్త‌ల్లో నిలిచింది. తెలుగులో అల్రెడి గోపీచంద్‌తో ఒంట‌రి, శ్రీకాంత్‌తో మ‌హాత్మ సినిమాల్లో న‌టించింది.

శివ‌లింగ‌ మార్నింగ్ షోస్ క్యాన్సిల్‌..

-- Hyderabad Published:14 April 2017 11:50:50 AM

రాఘ‌వ‌లారెన్స్ టైటిల్ పాత్ర‌లో పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హార్ర‌ర్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `శివ‌లింగ‌` ఏప్రిల్ 14న అంటే ఈరోజు విడుద‌లైంది. క‌న్న‌డంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళంలో రీమేక్ చేశారు. తెలుగులో ఈ సినిమాను సుర‌క్ష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై మ‌ల్కాపురం శివ‌కుమార్ విడుద‌ల చేస్తున్నాడ‌నుకున్నారు. కానీ విడుద‌ల‌కు ముందు డిస్ట్రిబ్యూట‌ర్‌కు, ప్రొడ్యూస‌ర్‌కు ఏదో ఫైనాన్స్ గొడ‌వ‌లు రావ‌డంతో సినిమా మార్నింగ్ షోస్ విడుద‌ల కాలేదు. మ‌ధ్యాహ్నం ఆట‌లు మాత్ర‌మే ప్ర‌ద‌ర్శింప‌బ‌డ‌తాయ‌ని స‌మాచారం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే రాఘ‌వ లారెన్స్ గ‌త చిత్రం గంగ కూడా తెలుగు విడుద‌లకు ఇలాంటి స‌మ‌స్య‌నే ఎదుర్కొని అప్పుడు కూడా గంగ మార్నింగ్ షోస్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి.

ఫైనాన్సియ‌ర్ పాత్ర‌లో రానా...

-- Hyderabad Published:14 April 2017 11:18:20 AM

విల‌క్ష‌ణ పాత్ర‌లైనా, విల‌న్‌గా అయినా చేయ‌డానికి తాను రెడీ అంటున్నాడు యంగ్ హీరో రానా. అందుకు నిద‌ర్శ‌నాలు స‌బ్ మెరైన్ సినిమా ఘాజీ అయినా కావ‌చ్చు లేదా, విల‌న్‌గా నటించిన బాహుబ‌లి అయినా కావ‌చ్చు. ఇప్పుడు అలా రానా చేస్తున్న మ‌రో డిఫ‌రెంట్ మూవీ `నేనే రాజు నేనే మంత్రి`. తేజ ద‌ర్శ‌క‌త్వంలో రానా, కాజ‌ల్ న‌టిస్తున్న ఈ చిత్రంలో రానా రాయ‌ల‌సీమ‌కు చెందిన ఫైనాన్సియ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ పాత్ర చాలా థ్రిల్లింగ్ సాగేలా ద‌ర్శ‌కుడు తేజ డిజైన్ చేశాడ‌ని యూనిట్ వ‌ర్గాలు అంటున్నాయి. క్యాథ‌రిన్ ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్ పాత్ర‌లో న‌టిస్తుంది.

చ‌ర‌ణ్ విల‌న్‌గా జ‌గ‌ప‌తిబాబు...

-- Hyderabad Published:14 April 2017 11:14:31 AM

హీరో కంటే విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా జ‌గ‌ప‌తిబాబు ఫేమ్ రోజు రోజూకి పెరుగుతూనే ఉంది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌త‌క్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా చిత్రీక‌ర‌ణను జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తుది. రాజ‌మండ్రిలో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు మెయిన్ విల‌న్ రోల్ చేయ‌బోతున్నాడ‌ట‌. రీసెంట్‌గా సుకుమార్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి జ‌గ‌ప‌తిబాబు రెడీ అయ్యాడ‌ట‌. నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో కూడా సుకుమార్ జ‌గ‌ప‌తిబాబును స్ట‌యిలిష్ విల‌న్‌గా ప్రెజంట్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఇప్పుడు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబును సుకుమార్ ఎలా చూపించనున్నాడో మ‌రి...

`స‌చిన్` సంచ‌ల‌నం...

-- Hyderabad Published:14 April 2017 11:03:27 AM

క్రికెట్ లెజెండ్ స‌చిన్ టెండ్కూల‌ర్ బ‌యోపిక్ `స‌చిన్‌` ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సంచ‌న‌ల రేపుతుంది. నిన్న సాయంత్రం ఏడు గంట‌ల‌కు విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్ యూ ట్యూబ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ప‌న్నెండు గంట‌ల్లోనే ఈ ట్రైల‌ర్ 48 ల‌క్ష‌ల మంది ప్రేక్ష‌కులు వీక్షించ‌డం విశేషం. క్రికెట్ ఆట‌కు భ‌గ‌వంతుడుగా ప‌రిగ‌ణించ‌బ‌డే స‌చిన్ ఆట‌కు చేసిన సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివ‌ని ఎవ‌రైనా చెబుతారు. అలాంటి వ్య‌క్తిపై సినిమా అంటే ఎంత‌టి ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉంటాయో అర్థం చేసుకోవ‌చ్చు. స‌చిన్ చిన్న‌త‌నం నుండి రిటైర్ మెంట్ వ‌ర‌కు ఈ సినిమా ఉంటుంది. జేమ్స్ ఎర్కిన్ సినిమాను ఎమోష‌న‌ల్‌గా తెర‌కెక్కించి ఉంటాడ‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఎ.ఆర్‌.రెహ్మాన్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్ల‌స్ కానుంది. గ్రౌండ్‌లో రికార్డుల‌ను క్రియ‌టే్ చేసిన స‌చిన్ ఇక‌పై వెండితెర‌పై కూడా రికార్డుల‌కు శ్రీకారం చుట్ట‌బోతున్నాడ‌న్న‌మాట‌.

నాక‌న్నా బాహుబ‌లినే గొప్ప - ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి

-- Hyderabad Published:14 April 2017 10:53:32 AM

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఇప్పుడు బ‌హుబ‌లి 2 సినిమాను ప్రేక్ష‌కుల ముంద‌కు తీసుకు రానున్నాడు. ఇప్పుడు యూనిట్ ప్ర‌మోష‌న్స్‌లో బిజీ బిజీగా ఉంది. రీసెంట్‌గా ఐమాక్స్ పోస్ట‌ర్ణు ముంబైలో విడుద‌ల చేసిన అనంతరం ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి బాహుబ‌లి కొన్ని విశేషాల‌ను తెలిపారు. నా క‌న్నా బాహుబ‌లి సినిమానే గొప్ప. ప్ర‌భాస్ లేకుంటే బాహుబ‌లి లేదు. ఎందుకంటే ప్ర‌భాస్ మూడున్న‌రేళ్ళు బాహుబ‌లి కోసం కేటాయించారు. దీంతో ఇండ‌స్ట్రీలో ప్ర‌భాస్ టాప్ హీరో అవుతాడు. నేను, ప్ర‌భాస్ బాహుబ‌లి అనే నావ‌లో ప్ర‌యాణిస్తున్నాం. సినిమాపై న‌మ్మ‌కం పెట్టుకున్న‌వారంద‌రూ సినిమా చూసిన త‌ర్వాత హ్యాపీగా ఫీల‌వుతారు అని అన్నారు ద‌ర్శ‌క ధీరుడు. నేష‌న‌ల్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానున్న బాహుబ‌లి 2 తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళంలో విడుద‌ల‌కానుంది.

ధ‌నుష్ రెడీ చేసేస్తున్నాడు...

-- Hyderabad Published:14 April 2017 10:17:38 AM

ధ‌నుష్ హీరోగానే కాదు, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా కూడా త‌నెంటో ప్రూవ్ చేసుకున్నాడు. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సాహించే దిశ‌గా వండ‌ర్ బార్స్ అనే నిర్మాణ సంస్థ‌ను స్థాపించి కొత్త న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్‌కు అవ‌కాశం ఇస్తున్నాడు. కాగా మామ‌గారైన సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో క‌బాలి ఫేమ్ పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తాన‌ని తెలియ‌జేసిన ధ‌నుష్‌, అందుకోసం త్వ‌ర త్వ‌ర‌గా శ్రీకారం చుడుతున్నాడు. ర‌జ‌నీకాంత్, డైరెక్ట‌ర్ శివ క‌థ‌ను వింటున్నాడు, అత‌నితోనే నెక్ట్స్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో కోలీవుడ్ సినీ వ‌ర్గాలు మాత్రం ధ‌నుష్‌, పా రంజిత్‌, ర‌జ‌నీకాంత్ కాంబినేష‌న్‌లో మూవీ మే ద్వితియార్థంలో మొద‌లవుతుంద‌ని అంటున్నారు.

తాత అయిన బ్ర‌హ్మానందం

-- Hyderabad Published:13 April 2017 06:18:15 PM

టాలీవుడ్‌లో స్టార్ క‌మెడియన్ అయిన బ్ర‌హ్మానందం తాత‌గా ప్ర‌మోష‌న్ పొందారు. బ్ర‌హ్మానందం త‌న‌యుడు, హీరో గౌత‌మ్‌, జ్యోత్స్న దంప‌తులకు హ‌నుమాన్ జ‌యంతి రోజున మ‌గ‌బిడ్డ జ‌న్మించాడు. మ‌న‌వ‌డి రాక‌తో ఇల్లంత పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని బ్ర‌హ్మానందం త‌న సంతోషాన్ని తెలియ‌జేశారు. ప‌ల్ల‌కిలో పెళ్ళికూతురు సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన గౌత‌మ్, బ‌సంతి సినిమా చేశాడు. ఇప్పుడు మ‌ను అనే సినిమాలో న‌టిస్తున్నాడు.

మ‌ణిక‌ర్ణిక లుక్ ఇదేనా...

-- Hyderabad Published:13 April 2017 06:14:19 PM

బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో రూపొందనున్న చిత్రం `మ‌ణిక‌ర్ణిక‌`. ఝాన్సీ రాణి జీవితం ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను అందిస్తున్నార‌ట‌. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో క్వీన్ ఆఫ్ ఝాన్సీగా కంగ‌నా లుక్ ఎలా ఉండ‌బోతుంద‌నే దానికి సోష‌ల్ మీడియాలో ఓ లుక్ సంద‌డి చేస్తుంది. ఈ మణిక‌ర్ణిక సినిమాను జూన్ నుండి సెట్స్‌లోకి తీసుకెళుతున్నార‌ట‌. హిందీతో పాటు తెలుగు, త‌మిళంలో సినిమా రూప‌కల్ప‌న జ‌రగ‌నుంద‌ట‌. హిందీలో కంగనా కూడా ఈ సినిమాతో నిర్మాత‌గా మారుతుంది.

కలశ ఫైన్ జువెలర్స్ స్టొర్ లాంచ్

-- Hyderabad Published:13 April 2017 05:56:02 PM

బంజార హిల్స్ లో కలశ ఫైన్ జువెలర్స్ స్టోర్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం లో నటీమణులు తన్య హోప్,పాయల్ ఘొష్ లతో పాటు ముఖ్యాతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన్య హోప్,పాయల్ ఘొష్ లతో పాటు పలువురు మోడల్స్ నూతన ఆభరణాలను ప్రదర్శించారు. నగరవాసులకు మరిన్ని డిజైనర్ ఆభరణాలను అందించేందుకు బంజారా హిల్స్ లో తమ బ్రాంచ్ ను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

నగరం లో ప్రారంభమైన మ్యాంగో ఫుడ్ ఫెస్టివల్

-- Hyderabad Published:13 April 2017 05:52:24 PM

నగరం లో భోజన ప్రియుల కోసం మ్యాంగో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. కూకట్ పల్లి లోని సుజనా మాల్ తోపాటు,బంజారా హిల్స్ లోని ఖాన్ ధాన్ రాజ్ ధాని మ్యాంగో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభ మైంది. జూన్ నెల వరకూ ఈ ఫుడ్ ఫెస్టివల్ కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు.ఈ మ్యాంగో ఫుడ్ ఫెస్టివల్ లో మ్యాంగో కోస్తా పులావ్, మ్యాంగో జిలేబి,మామిడి రసం, చట్ పటా కచాకైరి ముతియా,మ్యాంగో రైటా,మల్బరి మ్యాంగోకది వంటి డిషెస్ అందుబాటులో ఉన్నాయి.

మాడ్యులర్ కిచెన్ ఉత్పత్తులను ఆవిష్కరించిన నటీమణులు

-- Hyderabad Published:13 April 2017 05:51:20 PM

బర్లిన్ ఇంప్లెక్స్ సంస్థ మార్కెట్ లోకి నూతన మాడ్యులర్ కిచెన్ ప్రొడక్ట్స్ ను ప్రవేశ పెట్టింది.ఆవిష్కరణ కార్యక్రమం బేగం పేటలోని తాజ్ వివంతా హొటల్ లో జరిగింది. ఇందులో నటీమణులు దీపాలీ,అక్షత,భాను,ప్రియ లు నూతన ఉత్పత్తులను లాంచనంగా ఆవిష్కరించారు.అంతేకాకుండా ఈ కార్యక్రమం లో నటుడు వేను తో పాటు బర్లిన్ ఇంప్లెక్స్ సంస్థ డైరెక్టర్ కమలేష్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీదేవి న్యూ మూవీ మామ్ మోషన్ పిక్చర్ లాంచ్

-- Hyderabad Published:13 April 2017 05:50:24 PM

ప్రకాష్‌రాజ్‌ వాయిస్‌ ఓవర్‌తో రిలీజ్‌ అయిన శ్రీదేవి కొత్త చిత్రం 'మామ్‌' మోషన్‌ పోస్టర్‌ ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం 'మామ్‌'. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు మోషన్‌ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ వాయిస్‌ ఓవర్‌తో డిఫరెంట్‌గా, అందర్నీ ఆకట్టుకునే విధంగా ఈ మోషన్‌ పోస్టర్‌ రూపొందింది. ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ తర్వాత శ్రీదేవి నటిస్తున్న మరో మంచి చిత్రం 'మామ్‌'. ఆస్కార్‌ అవార్డ్స్‌ విజేత ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆల్‌ ఇండియా స్టార్‌ శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్‌ ఖన్నా, అభిమన్యు సింగ్‌, సజల్‌ ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: అనయ్‌ గోస్వామి, ఎడిటింగ్‌: మోనిసా బల్‌ద్వా, కథ: రవి ఉద్యవార్‌, గిరీష్‌ కోహ్లి, కోన వెంకట్‌, స్క్రీన్‌ప్లే: గిరీష్‌ కోహ్లి, నిర్మాతలు: బోనీ కపూర్‌, సునీల్‌ మన్‌చందా, నరేష్‌ అగర్వాల్‌, ముఖేష్‌ తల్‌రేజా, గౌతమ్‌ జైన్‌, దర్శకత్వం: రవి ఉద్యవార్‌.

నిర్మాణ రంగంలోకి శ్రీనువైట్ల‌..

-- Hyderabad Published:13 April 2017 05:46:16 PM

ఢీ, రెఢీ, దూకుడు, బాద్‌షా వంటి సూప‌ర్‌డూప‌ర్ సినిమాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల ఇప్పుడు వ‌రుణ్ తేజ్ హీరోగా మిస్ట‌ర్ అనే ట్రావెల్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించాడు. ఈ సినిమా త‌ర్వాత మ‌రో ద‌ర్శ‌కుడిగా రెండు క‌థ‌ను సిద్ధం చేసుకున్న శ్రీనువైట్ల త్వ‌ర‌లోనే ప్రొడ‌క్ష‌న్ స్టార్ట్ చేయ‌బోతున్నార‌ట‌. అయితే సినిమా ప్రొడ్యూస‌ర్‌గా కాకుండా బుల్లితెరలో నిర్మాత‌గా వైట్ల దంప‌తులు రంగ ప్ర‌వేశానికి రంగం సిద్ధ‌మైంది. ఓ కామెడి షోను వైవా హ‌ర్ష ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిస్తార‌ట‌. అందుకు సంబంధించిన చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయి.

వైద్యుల సమ్మె

-- Hyderabad Published:13 April 2017 05:45:57 PM

సోమవారం నుంచి తెలంగాణ ప్రభుత్వ వైద్యులు సమ్మెకు దిగనున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని వైద్యుల డిమాండ్‌

ఏపీసీఎం గృహప్రవేశం

-- Hyderabad Published:13 April 2017 05:44:12 PM

నేడు హైదరాబాద్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గృహప్రవేశం. అతి ఖరీదైన ప్రాంతంలో అర ఎకరా స్థలంలో నివాసం సిద్ధం. 20 వేల చదరపు అడుగుల్లో సీఎం విలాసవంత నిర్మాణం

అధిక ఉష్ణోగ్రతలు

-- Hyderabad Published:13 April 2017 05:41:59 PM

ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండనున్నాయి. 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదుకానున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ

-- Hyderabad Published:13 April 2017 05:33:55 PM

ప్రేమ‌ను పంచే `మిస్ట‌ర్` - వ‌రుణ్‌తేజ్‌ మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడిగా మెగా బ్యాక్‌గ్రౌండ్‌తో తెలుగు ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టాడు వ‌రుణ్‌తేజ్‌. అత‌ను న‌టించిన తొలి చిత్రం ముకుంద టౌన్‌లో సాగే ల‌వ్ స్టోరీ. రెండో చిత్రం కంచె రెండో ప్ర‌పంచం నేప‌థ్యంలో సాగిన ల‌వ్‌స్టోరీ. ఆ మ‌ధ్య విడుద‌లైన లోఫ‌ర్ మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో సాగిన చిత్రం. తాజాగా వ‌రుణ్ న‌టంచిన `మిస్ట‌ర్‌` జ‌ర్నీ బేస్డ్ ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ. క‌థ‌కూ, క‌థ‌కూ మ‌ధ్య పోలిక‌లు లేకుండా స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు వ‌రుణ్‌. ఆయ‌న న‌టించిన `మిస్ట‌ర్‌` ఈ నెల 14న విడుద‌ల కానుంది. శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. బేబి భ‌వ్య స‌మ‌ర్పిస్తుండ‌గా న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి వ‌రుణ్‌తేజ్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* `మిస్ట‌ర్‌` గురించి చెప్పండి? -

ఇదొక ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ అండీ. జ‌ర్నీని ఇష్ట‌ప‌డే వ్య‌క్తిగా చేశాను. ఎవ‌రికి ఎలాంటి సాయం కావాల‌న్నా ముందుండే పాత్ర నాది. మ‌రి అలాంటిది నాకు ఏదైనా ప్రాబ్ల‌మ్ వ‌స్తే ఎవ‌రు ముందుంటార‌న్న‌ది ఆస‌క్తిక‌రం. ఇందులో.. నాకూ, హీరోయిన్స్ కి త‌లా ఒక క‌థ ఉంటుంది. మా ముగ్గురికీ క‌లిపి మ‌రో క‌థ ఉంటుంది. అదేంట‌న్న‌ది ఆస‌క్తిక‌రం.

* శ్రీనువైట్ల‌తో కాంబినేష‌న్ గురించి చెప్పండి? -

ఆయ‌న్ని క‌లిసి ఏడాద‌వుతోంది. ఆయ‌న‌తో జ‌ర్నీని ఎంజాయ్ చేస్తున్నాను. ఆయ‌న‌తో స్టోరీ డిస్క‌ష‌న్ జ‌రిగిన‌ప్పుడు, షూటింగ్ జ‌రిగిన‌ప్పుడు చాలా మెమ‌ర‌బుల్ మొమెంట్స్ ఉన్నాయి.

* మీతో శ్రీనువైట్ల కొత్త‌గా ట్రై చేసిన‌ట్టున్నారు? -

నిజ‌మే.. నాతో కొత్తే కానీ, ఆయ‌న‌కు ఇలాంటి సినిమాలు చేయ‌డం అల‌వాటే. ఆయ‌న కెరీర్ ప్రారంభంలో ఇలాంటి సినిమాలే చేశారు. కానీ మ‌ధ్య‌లో కొన్ని క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు చేసి హిట్ కొట్టారు. దాంతో అలాంటి చిత్రాల‌నే ఆయ‌న నుంచి చాలా మంది ఆశించారు. ఈ మ‌ధ్య ఆ ఫార్ములా కాసింత బ్రేక్ కావ‌డంతో మ‌ర‌లా త‌న ఒరిజిన‌ల్ ఫార్ములాతోనే సినిమా చేశారు.

* ఇందులో మీరు చాలా కొత్త‌గా క‌నిపిస్తార‌ట క‌దా?

- అవునండీ. నా గ‌త చిత్రాల‌కు భిన్నంగా ఉంటాను. గ‌త సినిమాల్లో ఇంటెన్సిటీ ఉంటుంది. ఇందులో జోవియ‌ల్‌గా ఉంటాను. రొమాంటిక్‌గా క‌నిపిస్తాను.

* శ్రీనువైట్ల కామెడీ, డైలాగ్ టైమింగ్ పెక్యూలియ‌ర్‌గా ఉంటాయి క‌దా.. ఎలా మేనేజ్ చేశారు?

- నిజ‌మే. అలాంటి విష‌యాలు నాకు కొత్త‌. అయినా ప‌ట్టుకోగ‌లిగాను. మానిట‌ర్‌లో చూసుకున్న‌ప్పుడు బాగానే చేశాన‌ని అనిపించింది.

* వ‌రుస‌గా పెద్ద డైర‌క్ట‌ర్ల‌తోనే సినిమాలు చేస్తున్నారు?

- కొత్తా పాతా అని తేడా ఏం లేదు. మంచి స్టోరీ ఎవ‌రు చెప్పినా చేస్తున్నాను. త్వ‌ర‌లో వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్నా.

* సీనియర్ ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డం వ‌ల్ల ప్ర‌త్యేకంగా ఏమైనా ఫ‌లితాలుంటాయా?

 - ఉంటాయండీ. ఒక్కో ద‌ర్శ‌కుడికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. అవ‌న్నీ మ‌న‌కు అల‌వాట‌వుతాయి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది.

* మీ తొలి చిత్రం, మూడో చిత్రం అనుకున్నంత స్థాయి విజ‌యం సాధించ‌లేద‌ని ఏమైనా బాధ‌గా అనిపించింది?

- అవి ప‌ట్టించుకోనేండీ. నా ప్ర‌య‌త్నం సిన్సియ‌ర్‌గా చేస్తాను. రిజ‌ల్ట్ నా చేతిలో ఉండ‌దు. నా ప్ర‌య‌త్నం సిన్సియ‌ర్ న‌మ్మిన ద‌ర్శ‌కులు నాతో సినిమాలు చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నారు. శ్రీనువైట్ల‌గారు ఈ క‌థ‌ను ఎవ‌రితోనైనా తీసి ఉండ‌వ‌చ్చు. కానీ నేను స‌రిపోతాన‌ని ఫీల‌య్యి నాతో చేయ‌డం నాకు హ్యాపీగా అనిపించింది.

మీ బ్యాన‌ర్‌లో సినిమా ఎప్పుడు చేస్తున్నారు?

- క‌థ‌లు వింటున్నాం. అన్నీ స‌వ్యంగా కుదిరితే చేయాలి. అలాగే గీతా ఆర్ట్స్ లోనూ ఓ సినిమా చేయాలి. మంచి క‌థ కోసం ఎదురుచూస్తున్నాం. ఇటీవ‌ల బ‌న్ని బ‌ర్త్ డే కు నాన్న‌గారు వెళ్లిన‌ప్పుడు అర‌వింద్‌గారు కూడా ఆ సినిమా గురించి మాట్లాడార‌ట‌.

* ఫిదా ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింది?

- ఇంకో షెడ్యూల్ ఉందండీ. 20-25 రోజులు ప‌నిచేస్తే పూర్త‌వుతుంది. ప్ర‌స్తుతం మిస్ట‌ర్ మీద ఫోక‌స్ చేస్తున్నా. ఇది పూర్తికాగానే ఫిదా మీద దృష్టి పెడ‌తా.

* ఫిదా ఏ త‌ర‌హా చిత్రం?

- అది కూడా ల‌వ్‌స్టోరీనే అండీ. కాక‌పోతే అది కాస్త క్లాస్ ల‌వ్ స్టోరీ. కామెడీ పెద్ద‌గా ఉండ‌దు. ఆనంద్‌, గోదావ‌రి త‌ర్వాత ఆయ‌న ఆ త‌ర‌హా సినిమాను నాతో చేస్తున్నారు.

* మ‌ల్టీస్టార‌ర్స్ కు సిద్ధమ‌ని ఇదివ‌రకే చెప్పారు.. ఏమైనా క‌థ కుదిరిందా?

- లేదండీ. కానీ చ‌ర‌ణ్‌, తేజ్‌, బ‌న్నీ.. ఎవ‌రితోనైనా చేయ‌డానికి సిద్ధ‌మే. కాక‌పోతే మంచి క‌థ దొరికితే. ఏదో చేశామంటే చేశామ‌న్న‌ట్టు ఉండ‌కూడ‌దు.

మ్యాక్స్ స్టోర్ లో టీవీ సెలెబ్రిటీ శ్రీముఖి

-- Hyderabad Published:13 April 2017 05:25:56 PM

నగరం లోని మ్యాక్స్ స్టోర్ లో టీవీ సెలెబ్రిటీ శ్రీముఖి సందడి చేసింది. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మ్యాక్స్ వినూత్న పోటీని నిర్వహించింది. తాజా మ్యాక్స్ సమ్మర్ కలెక్షన్ తో వినియోగదారులు పోటొ దిగి మ్యాక్స్ ఫ్యాషన్ తో టాగ్ అయిన ఫేస్ బుక్ పేజీలో అప్ లోడ్ చేసిన వారిలో విన్నర్స్ ను ఎంపిక చేశారు. వాళ్ళను టీవీ సెలెబ్రిటీ శ్రీముఖి కలుసుకున్నారు.

చంద్రబాబుని భలేగా ఫిక్స్ చేసారు: ఆధునిక చాణక్యుడు నరెంద్ర మోడీ

-- Hyderabad Published:13 April 2017 05:25:41 PM

వ్యూహాలు సుస్పష్టం. (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ - ఎన్.డి.ఏ) జాతీయ ప్రజాస్వామిక సంఘటన. దీంట్లో అనేక భాగస్వామ్య పక్షాలు. చాలావరకు ప్రాంతీయ పార్టీలే. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టి ఒక్క దానికే దేశాన్ని పాలించగల మెజారిటీ పార్లమెంట్ లో ఉంది. కాని ఈ అలయన్స్ ను "మోడీ-షా" ద్వయం విస్త్రుత సుదూర దృష్టితో విజయవంతంగా నడిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనేక పనులకు పథకాలకు ఆమోద ముద్ర వేయించి మోడీ పాలన బహుభద్రం, అనిర్వచనీయం, అమిత గౌరవ ప్రదం, విదేశాల్లో భారత దేశ గౌరవం బహువ్యాపితం అని ప్రచారం చేయటం మిత్రపక్షాల భాధ్యతగా మారిపోయింది.

గత కాలం నాటి ఎన్.డి.ఏ ప్రభుత్వ పాలనా కాలంలో కేంద్రంలో చక్రం తిప్పిన నారా చంద్రబాబునాయుడు నేడు మోడీకున్న బలానికి మోడీ కున్న మెజారిటీకి ఝడుసుకొని పక్క తడుపుకునే పరిస్థితుల్లో చక్రంలా ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఒక ప్రముఖ తెలుగు పత్రికలో ప్రచురితమైన వార్తను యధాతతంగా చదవండి. బాబుతో మోదీ ఏకాంత చర్చలు: ఒకే టేబుల్‌పై రాత్రి భోజనం.. పక్కకు తీసుకెళ్లిమంతనాలు ఏకంగా 33 పార్టీల అగ్రనేతలు పాల్గొన్న సమావేశం! ఇందులో ఏపీ సీఎం చంద్రబాబుకుకీలక ప్రాధాన్యం లభించింది. సమావేశంలో ప్రధాని మోదీకి ఒకవైపు అమితషాకూర్చోగా... మరోవైపు చంద్రబాబు ఆసీను లయ్యారు. ఈ భేటీలో ఎన్డీయే సాధించినవిజయాలు, మూడేళ్ల వార్షికోత్సవాల నిర్వహణపై చర్చించారు. భేటీ సందర్భంగాపలుమార్లు చంద్రబాబుతో మోదీ మంతనాలు జరిపారు. ఇక... సమావేశం ముగిసినతర్వాత భేటీ వివరాలను తెలిపేందుకు నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ, చంద్రబాబు మాత్రమే పాల్గొనడం మరో విశేషం. మూడేళ్లలోసాధించిన విజయాలపై మోదీ ప్రజంటేషన్‌ తర్వాత ఇచ్చిన విందులో మోదీ, అమితషా, రాజ్‌నాథ్‌, చంద్రబాబు ఒకే టేబుల్‌ వద్ద కూర్చున్నారు. ఈ సమయంలో చంద్రబాబునుమోదీ పక్కకు తీసుకెళ్లి కొద్దిసేపు ఏకాంతంగా చర్చించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిఅభ్యర్థుల పై చంద్రబాబు అభిప్రాయాన్ని ఆయన తెలుసుకున్నట్లు తెలిసింది. చివరలోమోదీ...

చంద్రబాబు తో పాటు కొద్దిదూరం నడిచి వచ్చి ఆయనకు వీడ్కోలు పలకడంవిశేషం. మోదీ మాటే మా మాట ‘‘మోదీ మాటే మా మాట. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఎవరిని నిర్ణయిస్తారోతెలియదుగానీ.. ఆయన ఎవరి పేరు చెప్తే వారికే మా మద్దతు ఉంటుంది. ‘మాలోభిన్నాభిప్రాయాలు లేవు’ అని చెప్పడానికే ఈ భేటీ. మాదంతా ఒకే మాట’’ ..సోమవారంరాత్రి ఎన్డీయే మిత్రపక్షాల భేటీలో పాల్గొన్న ఓ సీనియర్‌ నేత తేల్చిచెప్పిన విషయమిది. ప్రవాసీ భారతీయ భవన్‌లో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో.. 32పార్టీలకు చెందిన ప్రతినిధులు, కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపాల్గొన్నారు.

ఎన్డీయే సర్కారు గత మూడేళ్లలో వివిధ రంగాల్లో సాధించిన విజయాలపైప్రధాని మోదీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సమావేశానికి ముందు అమితషా.. ఏపీ సీఎం చంద్రబాబు సహా కొన్ని ముఖ్యమైన పార్టీల నేతలను కలుసుకున్నారు. ఆసమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికపై వారి మనసులో మాటనుతెలుసుకునే ప్రయత్నాన్ని అమితషా చేసినట్లు సమాచారం. ఎన్డీయేలో ప్రధాన పక్షమైనబీజేపీ ముందుగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తే ఆ తరువాత తమ అభిప్రాయాలనుతెలియజేస్తామని.. సమీకరణాలన్నింటినీ ఆలోచించే మోదీ నిర్ణయం తీసుకుంటారుకాబట్టి తమకు పెద్దగా అభ్యంతరాలు ఉండవని ఆ నేతలు అమితషాకు చెప్పినట్లుతెలిసింది.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక విషయంలో తమలో ఎటువంటిచీలికలూ వచ్చే అవకాశం లేదన్న సంకేతాలను ప్రతిపక్షాలకు పంపేందుకే ప్రధాని ఈ భేటీనిర్వహించినట్లు బీజేపీ సీనియర్‌ నేతలు తెలిపారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైనశివసేన గతంలో.. కాంగ్రెస్‌ ఎంపిక చేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకురెండుసార్లు ఓటేసిన విషయం తెలిసిందే. ఈసారి అటువంటి అవకాశాలకుతావివ్వకుండా అందర్నీ ఏకతాటిపైకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతి ఒక్క ఓటూ కీలకంగానే మారనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో 776 మంది ఎంపీలు, 4120 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సిఉంది.

అందుకే ఎంపీలుగా ఉన్న మనోహర్‌ పర్రీకర్‌(గోవా), యోగి ఆదిత్యనాథ్‌ (యూపీ) సీఎంలుగా.. కేశవ్‌ప్రసాద్‌ మౌర్య (యూపీ) డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినావారిని రాజీనామా చేయవద్దనే ప్రధాని మోదీ సూచించారు. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడంతో శాంతించిన శివసేనఅధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ఈ భేటీకి హాజరయ్యారు. ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవతనురాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్‌ చేసిన ఉద్ధవ్‌ చివరికి ప్రధాని మోదీకేఓటేసినట్లు సమాచారం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులపై మోదీ నిర్ణయంతీసుకునేంతవరకూ మిత్రపక్షాల నేతలు ఈ అంశంపై మాట్లాడకుండా ఉండాలనిఅమితషా విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. మోదీ ప్రపంచంలోనే.. శక్తివంతమైన నేత ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడని ఏపీ సీఎం చంద్రబాబుప్రశంసించారు. సోమవారం ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీ అనంతరం ఆయన కేంద్రమంత్రి జైట్లీతో కలిసి విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలదేభవిష్యత్తు అని అంతా అనుకున్నారని, అయితే 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీసారథ్యంలో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించిందని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకున్న నేపథ్యంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిందన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు హర్షించారని, మోదీపై తమవిశ్వాసాన్ని కొనసాగిస్తూ యూపీతోపాటు మరో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పట్టంకట్టారన్నారు. ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ఠను మోదీ లా ఇనుమడింపజేసిన ప్రధానిమరెవ్వరూ లేరన్నారు. ప్రపంచంలోనే ఆయన అత్యంత శక్తివంతమైన నాయకుడన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పదేళ్లపాటు దేశాన్ని భ్రష్టు పట్టించిందని, ఆ కుళ్లును కడిగేసి, తిరిగిదేశాన్ని ప్రగతి పథంలో పెట్టేందుకు మోదీ ఎంతగానో కృషి చేశారన్నారు. దేశభవిష్యత్తుకు మైలురాళ్లు నిర్మిస్తూ భవిష్యత్తు తరాలకు గొప్ప దేశాన్ని నిర్మిస్తున్నారనిచంద్రబాబు ప్రశంసించారు. గత మూడేళ్లలో ప్రభుత్వంలో ఒక్క అవినీతి ఘటనచోటుచేసుకోలేదని, అవినీతి ఆరోపణలు చేసే ధైర్యం కూడా ఎవరికీ లేదన్నారు. గతప్రభుత్వ అవినీతి కుంభకోణాలతో పోలిస్తే ఇదే గొప్ప విజయ మన్నారు. కేవలం మోదీనాయకత్వం కారణం గానే భారతదేశం రెండంకెల వృద్ధిని సాధించగలుగుతుందని, ప్రపంచంలో భారతకు తప్ప మరే దేశానికీ ఈ అవకాశం లేదన్నారు. 2019 ఎన్నికలకుకూడా మోదీ నాయకత్వంలోనే వెళతామని చంద్ర బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని, ఎన్డీఏను మరింత సుస్థిరపర్చటం, దేశాన్ని మరింత అభివృద్ధి చేయటమే తమ లక్ష్య మన్నారు. నాయకులంతా ఎన్నికల కోసమే పనిచేస్తున్నారు తప్ప అభివృద్ధి కోసం కాదనిచంద్రబాబు వ్యాఖ్యానించారు. పై వార్తా కథనాలను పరిశీలిస్తే చంద్రబాబును నరెంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడుగా ప్రచారం చేయాలన్న ఆ పత్రిక తీరని తహతహ కనిపిస్తుంది. ఇది లోక విదితం, దీనిపై చర్చ అనవసరం. కానీ ముఖ్యాంశాలకు ఆ పత్రిక దృక్కోణములో కాకుండా మరో కోణంలో పరిశీలిస్తే: * చిన్నాచితక అన్నీ కలిపి 33 ప్రాంతీయ పార్టీల అతుకుల బొంత ఎన్.డి.ఏ - ఇందులో ఒక్కోపార్టీ ఒక్కోరకం సమస్యతో బాధపడుతుంది. ఎవరికీ సంతృప్తికరమైన విజయాలు లేవు. వారివారి రాజ్యాల్లో మోడీ నామస్మరణతో అధికారములోకి రావటమో అధికారాన్ని పంచు కోవటమో జరిగింది. ఆ పార్టీలన్ని నామావశిష్ఠం మాత్రమే. అంతా మిధ్యే. యాదార్ధం మాత్రం మోడీనే – “ఐ మీన్ భారతీయ జనతా పార్టీ” మాత్రమే. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేరు పాత ఎన్.డి.ఏ లో చక్రం తిప్పిన వారుగా అందరికి తెలవటం మూలంగా ఆయన్ను మోడీ విలేఖరుల సమావేశానికి వాడేసి ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంత ప్రభావంతమైన రాష్ట్రం కాదు. ఒకప్పటిలా పెద్ద రాష్ట్రమూ కాదు. విభజనానంతరం అవశేషంగా మిగిలిన చిన్న రాష్ట్రమే. దానికి బాబు ముఖ్యమంత్రి. * దేశ వ్యాప్తంగా ఎంతోకొంత పరువు ప్రతిష్ట ఉన్న ఏపి ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీలో నుండి తన పార్టీలోకి గోడ దూకిన శాసనసభ సభ్యులనే మంత్రులు గా చేసిన దరిమిలా ఆ పాపం తో ఆయకున్న పరువు ప్రతిష్ట, ఓటుకు నోటు కేసుతో ఆయన లోని నైతికత లేమి బయటపడటం (సిద్ధార్ద లూద్ర వాదన ననుసరించి ఓటర్లను మభ్య పెట్టటానికి రాజకీయ నాయకులిచ్చే సొమ్ములు లంచం కిందకు రావనే వాదన ఎంత న్యాయమో పసిపిల్లాడు కూడా అంగీకరిం చడు. దాన్ని బాబు న్యాయమంటున్నాడు. ఇదేలా సాధ్యం. ఇంకా న్యాయమెందుకు, న్యాయ స్థానాలెందుకు, న్యాయ మూర్తులెందుకు అనే అభిప్రాయం దేశమంతటా అలుముకొని ఉంది) అదే అనైతికతను న్యాయస్థానం ముందు చట్టబద్దం చేయబోవటం ఆయన్ని మరింతగా దిగజార్చింది. * అసలు పెద్ద నోట్ల రద్దు విషయం లో పదేపదే మాటమార్చి అది విజయవంతమైతే 'నేను సిఫారసు చేశానంటూ - వైఫల్యమైనట్లు కనిపించగానే నాలిక మడతేసి మోడీ అనాలోచిత నిర్ణయమని స్పురించేలా మాట్లాడిన "బాబు స్వరం - అంతరం" అందరికి తేటతెల్లమైంది’ అందుకే రేపెప్పుడైనా చంద్రబాబు నాలుక మడతెట్టకుండా ఆయన చేతే నరెంద్ర మోడీ జాతీయమీడియా ముందు ఒక ప్రకటన ఇప్పించి ఉండవచ్చు. దీంతో ఆయన కూడా మెచ్చుకున్నారుగదా! అని అనవచ్చు. అంతే కాని బాబుపై ప్రేమకాదు. అసలు మోడీ ఏనాడూ బాబును నమ్మిందిలేదు. ఒకనాడు సబర్మతి ఎక్స్-ప్రెస్ దహనం కేసులో నరెంద్ర మోడీని ఆంధ్ర ప్రదేశ్ వస్తే అరస్టు చేయిస్తానన్నారు బాబు. మోడీ కది మరపురాని కథ. *రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలో మిత్రపక్షాల నుండి వ్యతిరేఖత రాకుండా బ్రేకులు వేశారు మోడీ. అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిని చేసింది తానేనని చంద్రబాబు దేశాన్ని ప్రత్యేకించి తెలుగువారిని వాయించేసే చంద్రబాబుకు ‘‘మోదీ మాటే మా మాట. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఎవరిని నిర్ణయిస్తారో తెలియదుగానీ.. ఆయన ఎవరి పేరు చెప్తే వారికే మా మద్దతు ఉంటుంది. ‘మాలో భిన్నాభిప్రాయాలు లేవు’ అని చెప్పించి చంద్రబాబుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఎంపికలో బాబు పాత్ర లేదని సాక్ష్యాదారాలతో బాబుచేతే చెప్పించారు.

క్రీడలు విద్యార్ధుల జీవితాల్లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి

-- Hyderabad Published:13 April 2017 05:22:20 PM

హైద్రాబాద్,న్యూస్ రీల్ : క్రీడ‌ల వల్ల విద్యార్థుల‌లో చక్కటి క్రమశిక్షణ, పట్టుదల, కార్యదీక్ష , సమయస్ఫూర్తి, ఐకమత్యం వంటి గుణాలు పెంపొందతాయని‌ మాజీ జాతీయ వాలీబాల్ క్రీడాకారులు, సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్, ప్రిన్సిపాల్ జి.కిరణ్ రెడ్డి అన్నారు. శరీరానికి వ్యాయామాన్ని, మెదడుకి ఆలోచనా శక్తిని పెంచేవి క్రీడలే కానీ కంప్యూటర్‌, ఫెస్‌బుక్‌, వాట్స‌ఫ్ ద‌గ్గ‌ర‌ కూర్చుని ఆడే ఆటలు కావ‌ని హిత‌వు ప‌లికారు. బండ్ల‌గూడ‌లోని అరోరా సైంటిఫిక్ టెక్నాలాజిక‌ల్ అండ్ రిసెర్చ్ అకాడ‌మీ వార్షికోత్సవ సభలో గౌర‌వ‌ అతిథిగా ఆయన మాట్లడుతూ ప్రస్తుతకాలంలో విద్యార్థులు సెల్ ఫోన్‌తో ఎక్కువ సమయం గడపటం వలన ఎలాంటి వ్యాయామాలు చేయటం లేదని, దానితో వారు కొంత మందకొడిగా త‌యార‌య్యే ప్రమాదంతో పాటు భవిష్యత్తులో అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు లేక‌పోలేద‌న్నారు. ఆటలు ఆరోగ్యానికేకాక విద్యార్ధుల‌కు వినోదం అందించడంలోను, బుద్ధి వికాసం కలిగించడంలోను, చురుకుదనం పెంచడంలో కూడా తోడ్పడతాయంటూ క్రీడ‌లు విద్యార్థుల దైనందిక జీవితంలో ఒక భాగం కావాలని చెప్పారు. అంతర్లీనంగా ఉన్న శక్తిని ఆటల ద్వారా చైతన్యవంతం చేస్తే, విద్యార్థులు క్రమశిక్షణగల ఉత్తమ పౌరులుగా ఎదుగుతా రనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పారు. క్రీడ‌ల్లో పాల్గొనే విద్యార్ధ‌లకు టీం వ‌ర్క్ సామార్ధ్యాలు పెరుగుతాయ‌ని, గెలుపోట‌ములు జీవితంలో ఒక భాగ‌మ‌న్న నిజాన్ని గ్ర‌హించ‌గ‌ల్గుతార‌ని, ఈ మేర‌కు ఆట‌ల వల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల్ని గుర్తించి ఆ దిశ‌గా విద్యార్ధుల‌ను ప్రోత్స‌హించాల్సి ఉంద‌ని సూచించారు. క్రీడ‌లు విద్యార్ధుల జీవితాల్లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయంటూ గెలుపు కోసం ప‌డే శ్ర‌మ ఎప్పుడూ వృధా కాదు అన్నారు. విద్యార్ధులు హార్ఢ్‌వ‌ర్క్‌తో పాటు క‌మిట్‌మెంట్‌తో ప‌ని చేయ‌డం అవ‌లంభించుకోవాల‌ని, అప్పుడే వారు జీవితంలో రాణిస్తార‌ని చెప్పారు. చ‌దువుతో పాటు క్రీడ‌లు, క‌ళ‌ల్లో ప్రావీణ్యం ఏర్ప‌ర‌చుకున్న విద్యార్ధులు ఉత్త‌ములుగా ఎదుగుతార‌ని చెబుతూ క్రీడ‌ల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారిని అభినందించారు. ఈ సంద‌ర్భ0గా విజేత‌లుగా నిలిచిన వారికి జి.కిరణ్ రెడ్డి ప్ర‌త్యేకంగా బ‌హుమ‌తులు అంద‌జేశారు. కార్యక్ర‌మంలో క‌ళాశాల నిర్వ‌హ‌కులు శ్రీల‌త‌, అనుదీప్‌, డీన్‌ వీర‌న్న, ప్ర‌ముఖులు జె.చంద్ర‌శేఖ‌ర్‌, ఎం.డి తాజుద్ధీన్ ఆహ్మ‌ద్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

ట్రెండ్ క్రియేట్ చేస్తున్న జైల‌వకుశ‌

-- Hyderabad Published:13 April 2017 04:17:27 PM

టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తాగ్యారేజ్ హ్యాట్రిక్ హిట్స్‌తో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ వ‌ద్ద త‌న సత్తాను చాటాడు. దీంతో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయ‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు సాక్ష్య‌మే `జైల‌వ‌కుశ‌`. ఈ సినిమా నిర్మాణ ద‌శ‌లో ఉండ‌గానే సినిమా టైటిల్ లోగో మోష‌న్ పోస్ట‌ర్‌ను రీసెంట్‌గా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మోష‌న్ పోస్ట‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి అపూర్వ స్పంద‌న వ‌చ్చింది. కేవ‌లం టైటిల్ లోగో మోష‌న్ పోస్ట‌ర్‌ను ఏకంగా ప‌దిల‌క్ష‌ల మంది వీక్షించారు. ఇలాంటి రికార్డు సొంతం కావ‌డం ప‌ట్ల ఎన్టీఆర్ అభిమానులు సంతోష‌ప‌డుతున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న ఈ సినిమాలో రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్స్‌గా న‌టిస్తుంటే నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై క‌ళ్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. బాబీ ద‌ర్శ‌కుడు.

పెళ్లి కథ మేటర్ అండ్ స్టిల్స్

-- Hyderabad Published:13 April 2017 03:59:00 PM

తొలి దశ షూటింగ్ పూర్తి చేసుకున్న పెళ్లి కథ శ్రీ రామాంజనేయులు ఇంటర్నేషనల్ మూవీ కార్పొరేషన్ పతాకం పై వడ్డి రామాంజనేయులు నిర్మాతగా రూపొందుతొన్న సినిమా 'పెళ్లి కథ'. నూతన తారలు మనోహార్, ఇషిక, అయేషా జంటగా నటిస్తున్న ఈ సినిమాను ఓ యూత్ ఫుల్ అండం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జి.యన్.మూర్తి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా మొదటి షెడ్యల్ పూర్తి చేసకున్న ఈ చిత్ర బృందం ఏప్రిల్ 14 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. వైజాగా తో పాటు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండో దశ షూటింగ్ నిర్విహించేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తొలి షెడ్యూల్ లో 50 శాతానికి పైగా షూటింగ్ జరిగిందని, సెకండ్ షెడ్యూల్ లో బ్యాలెన్స్ షూట్ చేసి సాధ్యమైనంత త్వరాగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నటు నిర్మాత రామాంజనేయులు తెలిపారు.

క్వీన్ ఎందుకు ఆగిపోయిందో...

-- Hyderabad Published:13 April 2017 02:55:08 PM

కంగనా ర‌నౌత్‌ను బిగ్గెస్ట్ స్టార్ చేసిన చిత్రం క్వీన్‌. మ‌హిళా ప్ర‌ధానంగా తెర‌కెక్కిన ఈ సినిమాను ద‌క్షిణాదిన తెలుగు, త‌మిళంలో, క‌న్న‌డంలో రీమేక్ చేయాల‌ని అనుకున్నారు. తెలుగు, త‌మిళంలో త‌మ‌న్నా ప్ర‌ధాన‌పాత్ర‌లో సినిమాను రూపొందించాల‌నుకున్నారు. త‌మిళంలో రేవ‌తి ద‌ర్శ‌కురాలుగా నిర్మాత‌లు భావించి ప్ర‌క‌టించారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం కార‌ణాలు తెలియ‌లేదు కానీ క్వీన్ ఆగిపోయింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త‌మిళ సీనియ‌ర్ న‌టుడు త్యాగ‌రాజ‌న్ రీమేక్ హ‌క్కుల‌ను కొనుగోలు చేసి మ‌రో కొర్పొరేట్ సంస్థ‌తో క‌లిసి సినిమాను నిర్మించాల‌నుకున్నాడు. చాలా రోజులుగా ప్రాజెక్ట్ ముందుకు క‌ద‌ల‌డం లేదు మ‌రి. ఇప్పుడైతే ఓ వెర్ష‌న్‌లో మూవీ ఆగిపోయింది. మ‌రి క్వీన్ ఎప్పుడు ముందుకెళుతుందో చూడాలి...

గోపీచంద్ ఎంత ప‌నిచేశాడో తెలుసా...

-- Hyderabad Published:13 April 2017 02:39:51 PM

హీరోగా ఎంట్రీ ఇచ్చి త‌ర్వాత విల‌న్‌గా మారి, మ‌ళ్ళీ హీరోగా మారిన గోపీచంద్ ఇప్పుడు గౌత‌మ్ నంద సినిమాలో న‌టిస్తున్నాడు. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. దుబాయ్‌లో రాజు సుంద‌రం నేతృత్వంలో పాట‌లను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో సాంగ్‌లోని ఓ సీన్ కోసం గోపీచంద్ స్కై డైవింగ్ చేశాడ‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్షిణాదిన స్కై డైవింగ్ చేసిన హీరోలెవ్వ‌రూ లేరు. ఈ ఫీట్ చేసిన హీరో గోపీచంద్ మాత్ర‌మే. ఈ ఫీట్ చాలా అద్భుతంగా వ‌చ్చింది. గోపీచంద్ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో తెలియ‌జేశారు. ఓ సీన్ కోసం స్కై డైవింగ్ చేయ‌డమంటే గోపీచంద్ సాహ‌సం చేసిన‌ట్లే మ‌రి...

మ‌హేష్ కొత్త యాపారం..

-- Hyderabad Published:13 April 2017 02:30:35 PM

మ‌హేష్ కొత్త యాపారం షురూ చేసిండని న్యూస్ ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది మ‌రి. ఇంత‌కు మ‌హేష్ స్టార్ట్ చేసిన బిజినెస్ ఎంట‌ని అనుకుంటున్నారా..థియేట‌ర్స్ బిజిన‌స్ అని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సూప‌ర్‌స్టార్ స్టేట‌స్‌తో అభిమానుల గుండెల్లో కొలువైన మ‌హేష్‌, శ్రీమంతుడు సినిమా ఎంబి ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ను ప్రారంభించి చిత్న నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. దీనితో పాటు ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేట‌ర్స్‌ను కూడా నిర్మించాల‌ని ఏషియ‌న్ థియేట‌ర్స్ అధినేత సునీల్ నారంగ్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ట‌. ముందుగా 20 నుండి 25 థియేట‌ర్స్‌ను క‌ట్టాల‌నుకుంటున్నార‌ట‌. అన్నీ అనుకున్న ప్లానింగ్‌లో జ‌రిగితే మహేష్ మ‌రిన్ని మల్టీప్లెక్స్‌లను నిర్మిస్తాడ‌ట‌.

లంక సెన్సార్ పూర్తి..ఏప్రిల్ 21న విడుద‌ల‌

-- Hyderabad Published:13 April 2017 02:19:39 PM

సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ "లంక". శ్రీముని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమాను ఏప్రిల్ 21న విడుద‌ల చేస్తున్నారు. విధ్యమైన కథాంశంతో సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా ఇది. టెలీపతి నేపధ్యంలో రూపొందిన చిత్ర‌మిది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పంద‌న రావ‌డంతో సినిమా స‌క్సెస్‌పై నిర్మాత‌లు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. రాశి, సాయి రోనక్, ఐనా సాహ, సిజ్జు, సుప్రీత్, లీనా సిద్ధు, రాజేష్, సత్య, సుదర్శన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్: లెనిన్, డ్యాన్స్: స్వర్ణ, కళ: హరివర్మ, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: వి.రవికుమార్, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.రవిబాబు, పి.ఆర్.ఓ: వంశీశేఖర్, నిర్మాతలు: నామన దినేష్-నామన విష్ణు కుమార్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీముని!

య‌దార్థ ఘ‌ట‌న ఆధారంగా డేగ‌ల శ్రీను ప్రారంభం

-- Hyderabad Published:13 April 2017 02:15:18 PM

ఆర్‌.ఎఫ్‌.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై అమ‌ర్‌నాథ్ మండూరి ద‌ర్శ‌క నిర్మాణంలో కొత్త చిత్రం బుద‌వారం హైద‌రాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి సాగ‌ర్ క్లాప్ కొట్ట‌గా, బాబూ మోహ‌న్ కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.స‌ముద్ర తొలి స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో ద‌ర్శ‌క నిర్మాత అమ‌ర్‌నాథ్ మండూరి సినిమా గురించిన విశేషాల‌ను తెలియ‌జేశారు. అమ‌ర్‌నాథ్ మండూరి మాట్లాడుతూ ..నేను గుంటూరు లోక‌ల్ ఛానెల్‌లో నేను ఇర‌వై సంవ్స‌త‌రాల‌కు పైగా వ‌ర్క్ చేస్తున్నాను. అలాగే క‌ర్త‌వ్య భార‌తి అనే పేప‌ర్‌కు ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గుంటూరులో జ‌రిగిన ఓ యదార్థ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని, దానికి కొన్ని క‌ల్పితాలు జోడించి డేగ‌ల శ్రీను సినిమా చేస్తున్నాను. ఈ సినిమాలో అంద‌రూ హీరోలే, అంద‌రూ విల‌న్లే. యూత్ ఈగో స‌మ‌స్య‌ల‌తో 50 హత్య‌ల‌కు ఎలా దారి తీసింద‌నేదే ఈ సినిమా క‌థ‌. సినిమాలో పెద్ద నట‌నటులంద‌రూ ప‌నిచేస్తారు. కాశ్మీర్‌కు చెందిన జ‌హీదా శ్యామ్ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతుంది. ఇర‌వై రోజుల త‌ర్వాత గుంటూరు, విజ‌య‌వాడ ప‌రిస‌ర ప్రాంతాల్లో రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. రెండు షెడ్యూల్స్‌లో 80 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ చేయ‌బోతున్నాం. స‌మాజంలో పోలీసు వ్య‌వ‌స్థ అవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేసే విధంగా కూడా సినిమా ఉంటుంద‌ని తెలిపారు. సినిమాలో చాలా మంచి క్యారెక్ట‌ర్ చేస్తున్నాను. నాకు అవ‌కాశం ఇచ్చిన అమ‌ర్‌నాథ్ మండూరిగారికి థాంక్స్ అని జ‌హీదా శ్యామ్ చెప్పారు. సుమ‌న్‌, భానుచంద‌ర్‌, బాబూ మోహ‌న్‌, సీనియ‌ర్ బాల‌య్య, జ‌యప్ర‌కాష్ రెడ్డి, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, వినోద్‌ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః అడుసుమల్లి విజ‌య్‌కుమార్‌, ఎడిటింగ్ః నంద‌మూరి హ‌రి, ఆర్ట్ః భాషా, క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, నిర్మాత‌, ద‌ర్శ‌కత్వంః అమ‌ర్‌నాథ్ మండూరి.

నితిన్‌తో పంజాబీ హీరోయిన్‌...

-- Hyderabad Published:13 April 2017 02:12:15 PM

అఆతో 50 కోట్ల క్ల‌బ్‌లో చేరిన యంగ్ హీరో నితిన్ ఇప్పుడు హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో లై అనే సినిమా చేస్తున్నాడు. 14 రీల్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్జున్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమా పూర్తి కాగానే కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. తాజా స‌మాచారం ప్రకారం ఈ సినిమాలో పంజాబీ హీరోయిన్ మెహ‌రీన్ నితిన్‌తో జ‌త క‌ట్ట‌నుంది. గ‌తంలో నానితో కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ చిత్రంలో జోడి క‌ట్టిన ఈ భామ ఇప్పుడు ర‌వితేజ‌తో రాజా ది గ్రేట్‌, సాయిధ‌రమ్ తేజ్‌తో జ‌వాన్ సినిమాలో న‌టిస్తుంది.

కాంచన, గంగ తరహాలో ప్రేక్షకులను హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎంటర్‌టైన్‌ చేసే హార్రర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ శివలింగ - రాఘవ లారెన్స్‌

-- Hyderabad Published:13 April 2017 02:03:31 PM

చేయడం అనేది ఆ రాఘవేంద్రస్వామి, మా అమ్మ ఆశీర్వాదంగా భావిస్తాను. ఆలయాల నిర్మాణం ఎంత వరకు వచ్చింది? - రాఘవేంద్రస్వామి గుడిని, అలాగే గాయత్రి అమ్మవారి గుళ్ళను నిర్మించాను. గాయత్రి అమ్మవారి గుడిలో మా అమ్మగారి 5 అడుగుల విగ్రహాన్ని పెట్టాను. దీన్ని మే 1న ఓపెన్‌ చేస్తాం. ఈ అలయాలను నేను ఒక్కడినే నిర్మించాలని అనుకున్నాను. అయితే వాసుగారు ఒక వ్యక్తి అలయాన్ని నిర్మించడం మంచిది కాదని చెప్పడంతో ఆయన దగ్గరే ఒక లక్ష రూపాయల చందా తీసుకున్నాను, ఆర్‌.బి.చౌదరిగారు 50 వేల రూపాయలు చందా ఇచ్చారు. చిరంజీవి అన్నయ్య మూడు లక్షల రూపాయలు చందా ఇచ్చారు. అమ్మ కోసం గుడి కట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? - నేను ఈరోజు ఇలా మీ ముందు కూర్చొని ఉన్నానంటే అందుకు కారణం మా అమ్మగారే. పన్నెండేళ్ళ వయసులో నాకు బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చినప్పుడు అమ్మ ఎంతో కష్టపడింది. నన్ను ఎత్తుకుని తిరిగింది. మా అమ్మ నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. నా సినిమా స్క్రిప్టులన్నీ మా అమ్మకు చెబుతుంటాను. ఆమె సలహాలు తీసుకుంటాను. యోగ చేయడం, బ్రహ్మ ముహుర్తంలో నిద్ర లేవడం అన్నీ అమ్మ నుండే నేర్చుకున్నాను. దేవుడు ఎక్కడో ఉండడు. అమ్మ రూపంలో మన ముందే ఉంటుంది. నేను ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్‌ పిల్లలకు డ్యాన్స్‌ నేర్పించాలన్నా అమ్మనే అడిగాను. ఆమె ఒప్పుకోకపొతే నేను ఎలా ఇన్ని పనులు చేయగలుగుతాను. పది మంది పిల్లలకు డ్యాన్స్‌ నేర్పించడం స్టార్ట్‌ చేశాను. ఇప్పుడు వంద మంది పిల్లలు అయ్యారు. స్టార్టింగ్‌లో అమ్మ అందరికీ వంట వండి పెట్టేది. పిల్లలు ఎక్కువ కావడంతో నా స్వంత ఇంటిని ట్రస్ట్‌గా మార్చేసి, అద్దె ఇంటికి వెళ్ళిపోయాం. ఇన్ని పనులు అమ్మ ఒప్పుకోకపోతే నేను ఎలా చేయగలను. ఈ ట్రస్ట్‌ ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు? - 136 మంది పిల్లలకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు చేయించాం. 60 మంది పిల్లలకు ఆశ్రయం ఇస్తున్నాను. అలాగే 200 స్లమ్‌లోని పిల్లలను కాన్వెంట్‌లో చదివిస్తున్నాను. వారి చదువు వ్యవహారమంతా మా ట్రస్ట్‌ చూసుకుంటుంది. ఇంకో బ్యాచ్‌ రెడీ అవుతుంది. హిజ్రాలకు, ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్‌ వ్యక్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాను. హిజ్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండటమే కాకుండా, కాంచన సినిమా తర్వాత హిజ్రాలకు నా వంతుగా సహాయం చేస్తున్నాను. వారు పుట్టడమే శాపంగా భావిస్తున్నారు, కానీ వారికి నమ్మకం కలిగించడం కోసం నా ఇంట్లో ఏదైనా మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు వారితో పూజలు చేయిస్తున్నాను. వారికి డబ్బు సాయం చేస్తున్నాను. నా సినిమా స్టార్ట్‌ అయితే కొంత డబ్బు ఇస్తున్నాను. నన్ను చూసి నా ఫ్రెండ్స్‌ అంతా కూడా హిజ్రాలకు అర్ధికంగా సహాయం చేస్తున్నారు. అలాగే వారికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా నన్ను నియమించుకోమని అన్నాను. నా ట్రస్ట్‌లో ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు వారు ముందుంటున్నారు. నా ట్రస్టులో ముగ్గురు హిజ్రాలు పనిచేస్తున్నారు. బయట కూడా వారికి పని ఇప్పిస్తున్నాం. వచ్చే నెల హిజ్రాలతో ఢిల్లీలో షో చేస్తున్నాం. తదుపరి చిత్రాలు..? - తెలుగు, తమిళంలో ఒకేసారి నా దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాను. అలాగేఅమ్మ సెంటిమెంట్‌పై ఓ సినిమా ఉంటుంది.

అక్రమ మార్గం లో సంపాదించేదెలా? : లాలూ ప్రసాద్ & సన్స్

-- Hyderabad Published:13 April 2017 01:54:23 PM

ప్రజలను దోచుకోవటమే కాదు పశువులను దోచుకోవటమూ బీహార్ ముఖ్యమంత్రికే కాదు వారి పత్నిపుత్రులకూ బాగా తెలుసు. బుకాయింపులూ ఇంపుగా చెయ్యగలరు లాలు ప్రసాద్ యాదవ్. మాటల్లో చాతుర్యం ఎంతగానో ఉన్న లాలూ యాదవ్‌ ముందు మన కలవకుంట్ల చంద్రశేఖర రావు "జస్ట్ ఆఫ్ట్రాల్". "తన కొడుకులిద్దరికీ వ్యాపారం చేసే హక్కు ఉందని, వాళ్లు పేదరికంలో చనిపోవాలని తాను కోరుకోవడం లేదని" ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు. బిహార్‌ మంత్రివర్గంలో​ సభ్యులుగా ఉన్న తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌ ఇద్దరికీ పట్నా శివార్లలో రెండేసి ఎకరాల భూమి ఉంది. వాళ్లతో పాటు వారి తల్లి రబ్రీదేవికి కూడా అందులో భాగస్వామ్యం ఉంది. ఆ భూమి విలువ దాదాపు 60 కోట్ల రూపాయలు. నితీష్ కుమార్‌ ప్రభుత్వంలో మంత్రి అయిన ఓ నాయకుడు ఈ భూమిని తీసుకుని బిహార్‌ రాష్ట్రములోనే అతిపెద్దదైన వ్యాపారాల ఎన్నిటికో కేంద్రమయ్యేలా ఓ మాల్‌ కడుతున్నారు. ఆ ప్రాజెక్టు మొత్తం విలువ దాదాపు 500 కోట్ల రూపాయలు. అందులో సగం వరకు బిల్డర్ వాటాగా ఉంటుందని, మిగిలినది కంపెనీ పేరు మీద ఉంటుందని లాలు ప్రసాద్ మీడియాకు చెప్పారు. అయితే, "ఆ భూమిని లాలు ప్రసాద్ కొడుకులు కొనలేదని, వాళ్లకు లంచంగా ఇచ్చారని" బీజేపీ నాయకుడు సుశీల్‌కుమార్‌ మోదీ ఆరోపించారు. 2008 లో లాలు ప్రసాద్ యాదవ్ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు 'హర్ష్‌-కొచ్చర్‌' అనే ఓ వ్యాపారికి పూరీ, రాంచీలో రైల్వేల తరఫున రెండు హోటళ్లు నడిపే కాంట్రాక్టు ఇచ్చారని, దానికి ముందు ఆయన పాట్నాలోని రెండెకరాల భూమిని ఆర్జెడి పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ ప్రేమ్‌ గుప్తా భార్యకు అమ్మారని మోదీ చెప్పారు. తర్వాత కొంత కాలానికి కంపెనీ పేరు మార్చి, అందులో ముగ్గురు డైరెక్టర్ల పేర్లను చేర్చారని, వాళ్లు ముగ్గురూ లాలు యాదవ్ - తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌ కొడుకులు, భార్య రవ్రీ దేవి అని తెలిపారు. ప్రస్తుతం ఆ కంపెనీ పేరు లారా.. అంటే లాలు ప్రసాద్ - ఆయన ధర్మ పత్ని రబ్రీ దేవి అని చెపుతున్నారు. లాలు ప్రసాద్ కొడుకులకు ఇలా అక్రమ మార్గంలో ఆ ఆస్తి వచ్చిందని, ఇప్పుడు వాళ్లు "వందల కోట్ల స్కాం" చేస్తున్నారని సుశీల్‌ మోదీ ఆరో పించారు. అయితే, కొచ్చర్‌ చాలా సక్రమమార్గంలోనే ఆ భూమిని అమ్మారని, అది ఇప్పుడు ఈ కంపెనీకి వచ్చిందని లాలు వాదిస్తున్నారు. కానీ అలాగైతే మంత్రులందరూ తమఆస్తులు వెల్లడించాల్సి ఉండగా, లాలు కొడుకులు ఈ భూమి విషయాన్ని ఎందుకు బయటకు చెప్పలేదని సుశీల్‌ మోదీ ప్రశ్నిస్తున్నారు. అధికారములో ఉన్నవారు అత్యున్నత పదవులను అలంకరించిన వారు వివాదాస్పదాశాలకు తావివ్వరాదన రాజకీయ సంస్కృతి చెపుతుంది. నేరం చేయక పోవటమేకాదు, నేరం చేయరు అనిపించేలా నాయకులు ఉండాలని తప్పులు చేయక పోవటమే కాదు అలా అనుమానం కూడా ప్రజలకు రానంత నిబద్దత తో రాజ్యపాలన చేయాలని 2500 సంవత్సరాల క్రితమే చాణక్యుడు తన అర్ధశాస్త్రములో విశదీకరించారు. మోసం, దగా మార్గము లో డబ్బు సంపాదించటానికి విద్యాబుద్దులు, సంస్కారం, సాంప్రదాయం, సంసృతి అవసరంలేదని - మరో సారి లాలు ప్రసాద్ యాదవ్ తన మాటలతో బహు చమత్కారం గా అభివర్ణించారు. నీతి లేని ఇలాంటి నాయకులను బహిరంగ విచారణ చేసి శిక్ష విధించాలని బీహార్ ప్రజలు అంటున్నారు.

గోవాలో ఇక మిడ్-నైట్ పార్టీలు, రేవ్-పార్టీలు పూర్తిగా నిషేధం

-- Hyderabad Published:13 April 2017 01:53:11 PM

పోర్చుగీస్ సాంప్రదాయాన్ని పుణికి పుచ్చుకుంది మన గోవా. బీచ్ బీచ్ రిసార్ట్ లకు మారుపేరైన గోవా యూరప్ లా సముద్రతీర అందాలతో నిరంతరం పులకరించి పోతుంది. అందుకే దేశ విదేశాల నుండి వచ్చే యాత్రికులు, ప్రకృతి ఒడిలో సేద తీర్చు కుంటూ ఉంటారు. అయితే గోవా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. బీచ్‌లకు, బీచ్‌ పార్టీలకు మారుపేరుగా నిలిచిన గోవాలో అన్ని రకాల మిడ్‌-నైట్‌ పార్టీలను, రేవ్‌-పార్టీలను పూర్తిగా నిషేధించేం దుకు రంగం సిద్ధం చేసుకుంటుంది గోవా ప్రభుత్వం. ఇప్పటికే ఈ విధమైన పార్టీలకు 80 శాతం ముగింపు పలికిన ప్రభుత్వం వీటిని పూర్తిగా నిషేధించే వైపు పావులు కదుపుతోంది. వచ్చే రెండుమూడు వారాల్లో లేట్‌-నైట్‌ పార్టీలు, రేవ్‌-పార్టీలపై పూర్తి నిషేధం విధించనున్నట్టు గోవా జలవనరుల మంత్రి వినోద్‌ పాలేకర్‌ ప్రకటించారు. "లేట్-నైట్ పార్టీలు మన సంస్కృతిలో భాగం కాదు, వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. అందుకే వెంటనే వాటిని మూసివేయాలని" మంత్రి నిష్కర్షగా చెప్పారు. గోవా తీరం లో డ్రగ్స్‌ విక్రయాలు, అక్రమ రవాణా నియంత్రించలేని స్థితికి చేరిందనీ, అందుకే తక్షణం ఈ పార్టీలను నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. ముందు అర్థరాత్రి, రేవ్‌-పార్టీలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి విలేకరులతో చెప్పారు. ఈ మేరకు పోలీసుల అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అనేక హెచ్చరికలు, రిమైండర్లు పంపినప్పటికీ, తెల్లవారు జామున 3-4 గంటల వరకు ఈ పార్టీలు కొనసాగు తున్నాయని, దీని మూలంగా పెద్దవాళ్లే కాకుండా, వివిధ బోర్డు పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్ధినీ విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటిపై పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. కాగా వివిధ బీచ్‌లు, అందాలతో లక్షలాది టూరిస్టులను ఆకర్షించే ఉత్తర గోవాలోని సియోలిమ్‌ నియోజకవర్గానికి వినోద్ పాలేకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశం లోనే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత బీచ్‌లతో గోవా తీరం కళకళ లాడుతుంది. పర్యాటక సౌంధర్యాలతో తీర ప్రాంత అందాలతో అలరించే గోవా వెనుక మాదక ద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలు విక్రయం కూడా జోరుగా సాగటం గమనిస్తూనే ఉన్నాం.

చంద్రబాబు డూపులా రాజకీయాలు చేస్తున్న పవన్...!!

-- Hyderabad Published:13 April 2017 01:52:04 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాలు ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. పవన్ ప్రసంగాలలో, రాజకీయాల్లో పక్షపాత వైఖరి విస్పష్టంగా కనిపిస్తుంది. పవన్ విమర్శల్లో ప్రాంతీయ పక్షపాత వైఖరి కూడా గమనించవచ్చు. పవన్ ఆయనకీ ఎవరు నచ్చితే వారు తప్పులు చేసినా సరే మద్ధతు తెలుపుతారు కానీ ఎవరైనా నచ్చకపోతే మాత్రం వారు చిన్న పొరపాటు చేసినా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తారు. పవన్ జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ కూడా బాబును విమర్శించడం మనం చూడనే లేదు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని కేంద్రం తో హామీ ని ఇప్పించడంలో బాబు పూర్తిగా విఫలం అయ్యారు. అప్పుడు కూడా పవన్ బాబును పల్లెత్తి ఒక్కమాట కూడా అనలేదు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు పై మాత్రం, అక్కడ జరిగిన వలసలపై మాత్రం పవన్ మాట్లాడుతారు. కానీ బాబు పార్టీలో వలసలను మాత్రం ప్రస్తావించరు. అతడెవరో బీజేపీ ఎంపీ దక్షిణ భారతీయులపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే ఆ అంశంపై కొన్ని నిమిషాల వ్యవధిలోనే పవన్ రియాక్ట్ అయిపోయాడు. ఆ వ్యవహారంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ ఒక్క వ్యక్తినే నిందించాల్సిన పవన్ కల్యాణ్ ఏకంగా ఉత్తర భారతదేశాన్నే నిందించేశాడు. మరి ఉత్తరభారతం, దక్షిణ భారతం విషయంలో నిమిషాల మీద రియాక్ట్ అయిన పవన్ ఫిరాయింపుదారుల విషయంలో మాత్రం ఇప్పటివరకూ మాట్లాడలేదు. తెలంగాణలో తను ఖండించిన అంశం.. ఏపీ రాజకీయంలో భాగం అయిపోయినా పవన్ స్పందించలేదు. ఇదీ పవన్ కల్యాణ్ వ్యూహాత్మక రాజకీయం. దీని బట్టి చూస్తే పవన్ బాబుకు డూపులా రాజకీయాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది.

బీజేపీతో దోస్తీకి జగన్ ట్రై చేస్తున్నాడా..?

-- Hyderabad Published:13 April 2017 01:51:09 PM

వైసీపీ అధినేత జగన్ బీజేపీ తో దిస్తీ కి ట్రై చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియా లో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇదే కారణంతో జగన్ ఇటీవల ఢిల్లీ కి వెళ్లినట్టు అక్కడ బీజేపీ పెద్దల మద్ధతుతో కమలంతో చెలిమికి ప్రయత్నాలు చేస్తునట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి కారణాలు సైతం లేకపోలేదు. ప్రస్తుతం జగన్ ను అనుక్షణం వెంటాడుతున్న భయం సీబీఐ కేసు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి జగన్ అడ్డం తిరగడంతో జగన్ దూకుడుకు బ్రేక్ వేయడానికి సోనియా గాంధీ జగన్ ను సీబీఐ కేసులో ఇరికించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసునుండి బయటపడాలంటే ఇప్పుడు జగన్ కు ఉన్న ఏకైక మార్గం బీజేపీ తో చేలిపి చేయడమే. అందుకే జగన్ ఈ అంశంపై అమిత ఆసక్తి కనబరుస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నకేంద్ర, రాష్ట్రాల రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జగన్ కమలం తో చేలిపి చేయడం అనేది అసలు జరగని పనే అనే చెప్పవచ్చు. కారణం ఇధవరకే టీడీపీ భాజపా తో పొత్తు పెట్టుకోవడమే. పైగా బాబు, మోడీ మధ్య మంచి సన్నిహిత సంబంధాలు సైతం ఉన్నాయి. జగన్ కమల దళంతో దోస్తీకి ట్రై చేసినా బాబు తక్షణమే ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జగన్ కంటే బాబుకే ఎక్కువ పరజలలో ఆదరణ లభిస్తున్న సమయంలో కమలం పార్టీ జగన్ తో ఏ విధంగా జత కడుతుంది..? ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఇలాంటి వార్తల్లో నిజం లేదని స్పష్టంగా చెప్పవచ్చు.

కేసీఆర్, చంద్రబాబులకు ఉమ్మడి హైకోర్టు షాక్..!

-- Hyderabad Published:13 April 2017 01:50:19 PM

కేసీఆర్, చంద్రబాబు.. ఈ ఇద్దరు సీఎంలో 2014 ఎన్నికల ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిన వారే. విచ్చలవిడిగా హామీలు గుప్పించారు. వాటిలో ప్రధానంగా రైతుల రుణమాఫీ ఒకటి. ఎన్నికల్లో హామీ అయితే ఇచ్చారు కానీ దాన్ని సంపూర్ణంగా అమలు చేయాలంటే.. వేల కోట్లు కావాలి. అన్ని నిధులు ఎక్కడివీ.. అందుకే అది సంపూర్ణంగా అమలుకావడంలేదు. దీనికితోడు కరవు పరిస్థితులు నెలకొనడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. వీటిపై కడుపు మండిన ఓ రైతు హైకోర్టులో పిటీషన్ వేశాడు. రైతులు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ వాటిని పరిష్కరించి ఆత్మహత్యలను నివారించడంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం శాఖమూరుకు చెందిన రైతు కొల్లి శివరామిరెడ్డి ఈ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వ్యాజ్యం దాఖలు చేసిన కొల్లి శివరామిరెడ్డి స్వయంగా ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం లేదని ఆయన వాదించారు. బడా వ్యాపారులు రుణం ఎగవేస్తే స్పందించని బ్యాంకులు.. చిన్న చిన్న రుణాల చెల్లింపుల కోసం రైతులను వేధిస్తున్నారని శివరామిరెడ్డి తెలిపారు. ఆయన వాదనలు విన్న న్యాయమూర్తి ఆత్మహత్యలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపారు. పనిలో పనిగా రిజర్వ్ బ్యాంకుకు, నాబార్డులకూ హైకోర్టు నోటీసులిచ్చింది.

బెల్లంకొండ త‌న‌యుడు కొత్త చిత్రం..

-- Hyderabad Published:13 April 2017 01:18:54 PM

అల్లుడు శీనుతో తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ తొలి చిత్రంతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. త‌ర్వాత స్పీడున్నోడు బాక్సాఫీస్ వ‌ద్ద అనుకున్న విజ‌యాన్ని సాధించ‌లేదు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత బెల్లంకొండ సురేష్ త‌న త‌న‌యుడు త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. `మేం వ‌య‌సుకు వ‌చ్చాం` సినిమాతో స‌క్సెస్ సాధించిన ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన‌ మ‌ధ్య‌లో అనుకున్న స్థాయి స‌క్సెస్‌ల‌ను సాధించిలేక‌పోయినా రాజ్ త‌రుణ్‌తో `సినిమా చూపిస్త మావ` స‌క్సెస్‌తో ట్రాక్‌లోకి వ‌చ్చాడు. రీసెంట్‌గా విడుద‌లైన నాని `నేను లోక‌ల్‌` చిత్రంతో మ‌రో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను తెరకెక్కించ‌డానికి ప్లాన్స్ జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకు మంత్రిగారి అల్లుడు అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ట‌.

భూమా టీవీ ఛానెల్.. భూమా మౌనిక హెడ్...!!

-- Hyderabad Published:13 April 2017 01:02:48 PM

అక్క అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, సీఎం చంద్రబాబు నాయుడుకు తాము కృతఙ్ఞతలు చెప్పుకున్నామని భూమా నాగిరెడ్డి చిన్న కూతురు మౌనిక అన్నారు. ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. నంద్యాల సీటును ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఫ్యామిలీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మౌనికా రెడ్డి అన్నారు. ఈ నియోజకవర్గాన్ని తన తండ్రి ఎంతో అభివృద్ధి చేశారని, భూమా నాగిరెడ్డి అంటే ఒక నమ్మకమని వ్యాఖ్యానించారు. భూమా టీవీ ఛానెల్.. భూమా మౌనిక హెడ్...!! ఆ నమ్మకాన్ని ప్రజల్లో ఓ స్థాయికి నాన్న తీసుకు వెళ్లారన్నారు. నంద్యాల నియోజకవర్గం ఉప ఎన్నికలో మా కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారు. మా పెదనాన్న కొడుకు బ్రహ్మానందరెడ్డి పోటీ చేసినా ఓకే. నా సొంత సోదరుడు పోటీ చేస్తే ఎంత సంతోషంగా ఫీలవుతానో, బ్రహ్మానందరెడ్డి పోటీ చేసినా అంతే ఫీలవుతాను’ అని మౌనిక చెప్పారు. , ‘నాన్న ఉండి ఉంటే చాలా బాగుండేది. భూమా టీవీ ఛానెల్.. భూమా మౌనిక హెడ్...!! ఎందుకంటే, భూమా నాగిరెడ్డి మంత్రి పదవి తీసుకోవడమనేది..నంద్యాల, ఆళ్ళగడ్డ ప్రజల చిరకాల కోరిక. అక్క కూడా అంతే కష్టపడి మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాము. మాకు అక్కపై ఆ నమ్మకం ఉంది’ అని చెప్పారు. తనది జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ అని, ఛానెల్ పెట్టాలనే ఆలోచన ఉందని .. ఆ ప్రాజెక్టు ప్రస్తుతానికి ప్రణాళిక దశలో ఉందని మౌనిక చెప్పుకొచ్చారు.

ఢిల్లీలో జగన్ కు చేదు అనుభవం..ఏమైంది..?

-- Hyderabad Published:13 April 2017 12:59:34 PM

అధికార పార్టీ ఆగడాలను, వలసలను, అవినీతిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తో పాటు, పలువురు కేంద్ర మంత్రులకు కూడా తెలపాలనే ఉద్దేశంతో ఉన్న పళంగా హస్తినకు బయలుదేరిన జగన్ కు ఢిల్లీ లో చేదు అనుభవమే ఎదురైంది. రాష్ట్రపతి ని అనుకున్న ప్రణాళిక ప్రకారం కలుసుకున్నా, కేంద్ర మంత్రులను మాత్రం కలుసుకోలేక పోయారు. కారణం వారు జగన్ తో భేటీ అవడానికి సుముఖంగా లేకపోవడమే. దీనికి కారణాలు సైతం లేకపోవడమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రానికి ఫుల్ సపోర్ట్ ఉన్న సమయంలో బాబు పై ఫిర్యాదు చేయడానికే జగన్ తమను కలుస్తున్నాడని ముందే తెలుసుకొని బిజీ గా ఉన్నామని జగన్ కు పలువురు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో, రాష్ట్రపతితో పాటు అరుణ్ జైట్లీ, ములాయం సింగ్ యాదవ్, వామపక్ష నేతలను మాత్రమే కలుసుకుని జగన్ వెనుదిరిగారట. జాతీయ స్థాయి నేతల స్పందనతో వైసీపీ నేతలు షాక్ కు గురయ్యారని చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని ఢిల్లీలోని పలువురు రాజకీయ నేతల దృష్టికి తీసుకెళ్లాలని జగన్ భావించారు. అయితే, దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఆ పార్టీ సీనియర్ నేతలు జగన్ కు సూచించారట. అయినా కూడా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న స్పైడర్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల

-- Hyderabad Published:13 April 2017 12:58:32 PM

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'స్పెడర్‌' టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ ఈరోజు విడుదల చేశారు. క్లైమాక్స్‌, రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ 23న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఠాగూర్‌ మధు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.

బ్లాక్ మనీ ట్రైలర్ లాంచ్ మూవీ న్యూస్

-- Hyderabad Published:13 April 2017 12:46:27 PM

సౌత్ సూప‌ర్‌స్టార్‌ మోహ‌న్‌లాల్ న‌టించిన మ‌ల‌యాళ సూప‌ర్‌హిట్ `రన్ బేబి ర‌న్‌` తెలుగులోకి  `బ్లాక్‌మ‌నీ`. (.. అన్నీ కొత్త నోట్లే) పేరుతో ఈనెల 21న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. నిజామ్ స‌మ‌ర్ప‌ణ‌లో మాజిన్ మూవీమేక‌ర్స్ ప‌తాకంపై స‌య్య‌ద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ ఇటీవ‌లే `క్లీన్ యు` స‌ర్టిఫికెట్ ఇచ్చి చ‌క్క‌ని కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న సినిమా ఇద‌ని అభినందించింది. ఈనెల 21న తెలుగు రాష్ట్రాలు స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా రిలీజ‌వుతోంది. తాజాగా స్టార్ క‌మెడియ‌న్ అలీ ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని హైద‌రాబాద్‌లో లాంచ్ చేశారు. 

ఈ సంద‌ర్భంగా అలీ మాట్లాడుతూ -``మోహ‌న్‌లాల్ అంత పెద్ద స్టార్ న‌టించిన ఈ చిత్రం తెలుగులో పెద్ద విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నా. ఇటీవ‌లి వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న లాల్‌కి మ‌రో గ్రాండ్ స‌క్సెస్ గ్యారెంటీ. అంత పెద్ద స్టార్ న‌టించిన సినిమా ట్రైల‌ర్ లాంచ్ చేయ‌డం క్రేజీగా ఫీల‌వుతున్నా. ఈ సినిమాతో విజ‌యం సాధించి చిత్ర‌నిర్మాత‌లు మ‌రిన్ని సినిమాలు తీయాలని ఆకాంక్షిస్తున్నా`` అన్నారు. 

నిర్మాత నిజాముద్దీన్ మాట్లాడుతూ -``స్టార్ క‌మెడియ‌న్ అలీ చేతుల‌మీదుగా బ్లాక్‌మ‌నీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ లాంచ్ చేయ‌డం సంతోషంగా ఉంది. మంచి మ‌నసుతో మ‌మ్మ‌ల్ని ఎంక‌రేజ్ చేస్తున్న అలీకి ధ‌న్య‌వాదాలు. మీడియా నేప‌థ్యంలో తెర‌కెక్కిన `బ్లాక్‌మ‌నీ` పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఈ చిత్రంలో లాల్ ఓ టీవీచానెల్ కెమెరామేన్‌గా న‌టించారు. క‌థానాయిక అమ‌లాపాల్ సీనియ‌ర్ ఎడిట‌ర్ రేణుక పాత్ర‌లో న‌టించారు. సంబంధ బాంధ‌వ్యాలు, వృత్తిప‌ర‌మైన సంఘ‌ర్ష‌ణ చుట్టూ ఈ సినిమా క‌థాంశం తిరుగుతుంది. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక గ్రాస్ వ‌సూళ్లు సాధించిన ఈ సినిమా తెలుగులోనూ అంతే పెద్ద విజ‌యం అందుకుంటుంద‌ని ఆశిస్తున్నాం. అన్నిప‌నులు పూర్త‌య్యాయి. ఈనెల 21న రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.

అటు ఇటు కానీ హృదయం

-- Hyderabad Published:13 April 2017 11:33:48 AM

విడుద‌ల‌కు ముస్తాబ‌వుతున్న `అటు ఇటుకాని హృద‌యం తోటి`! లిపి భార్గ‌వ ప్రొడ‌క్ష‌న్స్, విమ‌న్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బేన‌ర్స్ పై డి.వి.కృష్ణ మోహ‌న్, జి.ఆంజ‌నేయులు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `అటు ఇటుకాని హృద‌యం తోటి`. జ‌గ‌దీష్, శుభాంగి జంట‌గా న‌టిస్తోన్నఈ చిత్రం ద్వారా జె.కె.జి ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలూ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం సెన్సార్ కి సిధ్ద‌మైంది. ఇటీవ‌ల మ‌ధుర ఆడియో ద్వారా విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత డి.వి.కృష్ణ‌మోహ‌న్ మాట్లాడుతూ...``నిల‌క‌డ‌లేని మ‌న‌స్త‌త్వం క‌లిగిన అబ్బాయి...సున్నిత మ‌న‌స్తత్వం క‌లిగిన అమ్మాయి ప్రేమ‌లో ప‌డితే ఆ త‌ర్వాత వారి జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింద‌నేది చిత్ర క‌థాంశం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా తీర్చిదిద్దాము. హైదారాబాద్ ,రాజ‌మండ్రి, విజ‌య‌వాడ‌, వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌రించాము. సినిమా అనుకున్న దానికన్నా చాలా బాగా వ‌చ్చింది. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. త్వ‌ర‌లో సెన్సార్ కార్య‌క్ర‌మాలూ పూర్తి చేసి సినిమాను గ్రాండ్ గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు. జ‌గ‌దీష్‌, శుభాంగి, క్రిష్ణ మోహ‌స‌న్ డి.వి; కె.య‌స్.య‌స్‌. ప్ర‌సాద్; సుధావాణి, రాఘ‌వ‌రావు, క‌ల్ప‌న త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః సునీల్; ఎడిటింగ్ః జి.య‌స్‌.చౌద‌రి; స‌ంగీతంః జి.పి.ర‌వీన్‌; పాట‌లుః జె.కె; సింగ‌ర్స్ః సునీత‌, గీతా మాధురి, సాకేత్‌, విశ్వ‌, ప్ర‌వీణ్‌, పీఆర్వోః వంగాల కుమార స్వామి; నిర్మాత‌లుః డి.వి.కృష్ణ మోహ‌న్, జి.ఆంజ‌నేయులు; క‌థ‌-స్ర్కీన్ ప్లే-ద‌ర్శ‌కత్వంః జె.కె.జి.

హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌తో మ‌రోసారి..

-- Hyderabad Published:13 April 2017 11:02:36 AM

అక్కినేని నాగ‌చైత‌న్య ఇప్పుడు క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో `రారండోయ్ వేడుక చూద్దాం` సినిమాతో పాటు కృష్ణ అనే కొత్త ద‌ర్శ‌కుడితో మ‌రో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు దాదాపు పూర్తి కానుండ‌టంతో చైతు త‌న త‌దుప‌రి చిత్రాల‌పై కాన్‌స‌న్‌ట్రేష‌న్ పెట్టాడు. అందులో భాగంగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఇంత‌కు ముందు చైతు హీరోగా ప్రేమమ్ సినిమాను డైరెక్ట్ చేసి హిట్ కొట్టిన చందు మొండేటి, చైతు కోస‌మే ఓ క‌థ‌ను సిద్ధం చేశాడ‌ట‌. లైన్ విన్న చైతుకు బాగా న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మైపోయాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాలు తెలుస్తాయి.

నాగ శౌర్య న్యూ మూవీ మేటర్ & స్టిల్స్

-- Hyderabad Published:13 April 2017 11:01:56 AM

నాగ‌శౌర్య హీరోగా త‌న సొంత బ్యాన‌ర్ ఐరా క్రియోష‌న్స్ లో ర‌ష్మిక మండ‌న్న‌ హీరోయిన్ గా చిత్రం ప్రారంభం "ఊహ‌లు గుస‌గుస‌లాడే", "దిక్కులు చూడ‌కు రామ‌య్య‌", "ల‌క్ష్మిరావే మా ఇంటికి", "క‌ళ్యాణ‌ వైభోగమే"," జ్యో అచ్యుతానంద‌" లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించిన నాగ‌శౌర్య హీరోగా, క‌న్న‌డ‌ లో "కిరాక్ పార్టీ" అనే చిత్రంలో త‌న క్యూట్ ఫెర్‌ఫార్మెన్స్ తో అంద‌రి మ‌న‌సులు దోచుకున్న ర‌ష్మిక మండ‌న్న‌ని హీరోయిన్ గా టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేస్తూ...., మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ లో ప‌నిచేసిన వెంకి కుడుముల ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ, ఐరా(IRA CREATIONS)క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మాత‌లు ఉషా మూల్పూరి, శంక‌ర ప్ర‌సాద్ మూల్పూరి లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ప్రముఖ కథానాయకుడు నారా రోహిత్ హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టగా...., ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజేష్ కిలారు కెమెరా స్విఛాన్ చేశారు. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ గా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెలాఖరులో ప్రారంభమౌతుంది. ఈ సంద‌ర్బంగా నిర్మాత‌ల్లో ఒక‌రైన శంక‌ర ప్ర‌సాద్‌ మూల్పూరి మాట్లాడుతూ.." మా అబ్బాయి నాగ‌శౌర్య ని తో చిత్రాన్ని నిర్మించాల‌ని ఎప్ప‌టినుంచో అనుకుంటున్నాము. త్రివిక్ర‌మ్ గారి అసోసియేట్ వెంకి కుడుముల చెప్పిన క‌థ మాకు న‌చ్చి మా బ్యాన‌ర్ లోనే చేయ్యాల‌ని నిర్ణ‌యించుకున్నాము. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది. నారా రోహిత్ క్లాప్ నివ్వగా, రాజేష్ కిలారు గారు కెమెరా స్విఛాన్ చేశారు. ఈనెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తున్నాం. మ‌రిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. మా ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం. 1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వెంకీ దర్శకుడు. రష్మిక హీరోయిన్. నారా రోహిత్ క్లాప్ కొట్టారు. ఇకపై మా బ్యానర్ లో మంచి చిత్రాలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాను. ఈనెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తున్నాం. అని అన్నారు. హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ - నా డెబ్యూ తెలుగు చిత్రం ఇది. ఓ మంచి కథతో, క్యారెక్టర్ తో తెలుగులో లాంచ్ అవుతున్నందకు చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్ టూ ఎంటైర్ టీం. అని అన్నారు. ద‌ర్శ‌కుడు వెంకి కుడుముల మాట్లాడుతూ.." నాకు ఇంత మంచి అవ‌కాశాన్ని ఇచ్చిన హీరో నాగ‌శౌర్య గారికి , నిర్మాత‌లు ఉషా ముల్పూరి, శంక‌ర‌ప్ర‌సాద్ ముల్పూరి గారికి ధ‌న్య‌వాదాలు. నాగ‌శౌర్య కి జంట‌గా ర‌ష్మిక మండ‌న్న‌ న‌టిస్తుంది. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అని అన్నారు. నటీనటులు - నాగశౌర్య, రష్మిక మండన్న, సీనియర్ నరేష్, ప్రగతి, రఘుబాబు, పోసాని, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సత్య, సుదర్శన్, స్వప్నిక, మైమ్ గోపి, అచ్యుత కుమార్ తదితరులు సాంకేతిక నిపుణులు సంగీతం- సాగ‌ర్ మ‌హ‌తి, సినిమాటోగ్ర‌ఫి- సాయి శ్రీరామ్‌. ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి) ఆర్ట్ - రామ్ కుమార్ లిరిక్స్ - భాస్కరభట్ల కొరియోగ్రఫి - రఘు లైన్ ప్రొడ్యూసర్ - ఎస్. నాగేశ్వరరావు (బుజ్జి) నిర్మాత‌లు- ఉషా ముల్పూరి, శంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - వెంకి కుడుముల‌

జ‌గ‌ప‌తిబాబుతో మ‌రో హీరోయిన్‌...

-- Hyderabad Published:13 April 2017 10:38:59 AM

హీరో టు విల‌న్‌..క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ మ‌ళ్ళీ హీరో..సింపుల్‌గా చెప్పాలంట ఇది జ‌గ‌ప‌తిబాబు కెరీర్‌. లెజెండ్‌తో విల‌న్‌గా మారిన జ‌గ‌ప‌తిబాబు మ‌ళ్ళీ `ప‌టేల్ S.I.R` చిత్రంలో హీరోగా మారుతున్నాడు. టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. రీసెంట్‌గా పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకున్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు స‌ర‌స‌న ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టించ‌బోతున్నారు. కేర‌ళ‌కు చెందిన భావ‌న మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంటే, మ‌రో హీరోయిన్ పాత్ర‌లో తాన్య హోప్ న‌టించ‌బోతుంది. అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు చిత్రంలో శ్రీ విష్ణుతో జ‌త‌కట్టిన ఈ బెంగ‌ళూరు ముద్దుగుమ్మ‌, `ప‌టేల్ S.I.R` క‌థ, అందులో త‌న క్యారెక్ట‌ర్ విన‌గానే ఏ మాత్రం ఆలోచించ‌కుండా ఒప్పేసుకుంద‌ట‌. రోజులో మూడు గంట‌ల పాటు సినిమా వ‌ర్క్ షాప్‌లో పాల్గొంటుంద‌ట మ‌రి.

గ‌జిని, తుపాకీ స్ట‌యిల్లో ఉండే మూవీ స్పైడ‌ర్‌- మ‌హేష్‌

-- Hyderabad Published:13 April 2017 10:35:01 AM

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా, స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పై థ్రిల్ల‌ర్ `స్పైడ‌ర్‌`. ఈ సినిమా క్లైమాక్స్‌, రెండు సాంగ్స్ మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. తెలుగు, త‌మిళంలో ఈ సినిమాను జూన్ 23న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త‌మిళ హీరో విజ‌య్ నాకు మంచి మిత్రుడు. హీరో సూర్య‌, కార్తీ, మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్ రాజా నా స్కూల్ మేట్స్‌. సెంట్ బీడ్స్ స్కూల్‌లో నేను స్కూలింగ్ చేశాను. ల‌యోలా కాలేజ్‌లో కాలేజ్ చ‌దువుకున్నాను. కాబ‌ట్టి నాకు చెన్నై న‌గ‌రం అంటే చాలా ఇష్టం. మ‌ణిరత్నంగారు న‌న్ను, విజ‌య్ హీరోలుగా పెట్టి పొన్నియ‌ల్ సెల్వ‌న్ అనే సినిమా తీద్దామనుకున్నారు కానీ కొన్ని కార‌ణాల‌తో కుద‌ర‌లేదు. గ‌జినీ, తుపాకీ స్ట‌యిల్లో ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌గారు స్పైడ‌ర్ చిత్రాన్ని చ‌క్క‌గా తెర‌కెక్కించారు. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీలో వ‌ర్క్ చేయ‌డం నా క‌ల నిజ‌మైన‌ట్లుగా అనిపించింది. పొలిటిక్స్ నాకు అర్థం కావు, సినిమాల పైనే నా ఫోక‌స్ అంటూ త‌మిళ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు.

క్వీన్ ఆగిపోలేదు - నిర్మాత త్యాగ‌రాజ‌న్‌

-- Hyderabad Published:13 April 2017 10:31:24 AM

బాలీవుడ్ చిత్రం `క్వీన్‌`ను సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత త్యాగ‌రాజ‌న్ ద‌క్షిణాదిన తెలుగు, త‌మిళం, కన్న‌డంలో రీమేక్ చేయాల‌నుకుని రీమేక్ హ‌క్కుల‌ను పొందిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌మిళ వెర్ష‌న్‌లో త‌మ‌న్నాను హీరోయిన్‌గా అనుకున్నారు. రేవ‌తి ద‌ర్శ‌కురాలుగా అనుకున్నారు. అయితే సోష‌ల్ మీడియాలో క్వీన్ ఆగిపోయింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ క్వీన్ ఆగిపోలేద‌ని, త‌మ‌న్నా న‌టిండ‌చం లేదంతేన‌ని నిర్మాత త్యాగ‌రాజ‌న్ తెలియ‌జేశారు. నిజానికి త‌మ‌న్నాను ఈ సినిమాలో న‌టింప చేయ‌డానికి ఆమె తండ్రిని, మేనేజ‌ర్‌ను సంప్ర‌దించ‌డం జ‌రిగింది. ఆమె రెమ్యున‌రేష‌న్ తెలుసుకున్నాం. మా బ‌డ్జెట్‌కు అది ఎక్కువ‌గా ఉండ‌టంతో మేం ఆలోచ‌న‌ప‌డ్డామంతే కానీ, సినిమా ఆగిపోయేంత ప‌రిస్థితి లేదు. సినిమాను మే నెల‌లో సెట్స్‌లోకి తీసుకెళ్ళ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని కూడా త్యాగ‌రాజ‌న్ చెప్పుకొచ్చారు.

ఆంధ్రులు ఆరంభ శూరులు - చంద్రబాబు ఆంధ్రుల పాలిటి ఔరంగజేబు

-- Hyderabad Published:13 April 2017 10:22:34 AM

ఆంధ్రులు ఆరంభ శూరులు - చంద్రబాబు ఆంధ్రుల పాలిటి ఔరంగజేబు పిల్లనిచ్చిన పాపానికి వెన్నుపోటు పొడిచి పిల్లనిచ్చిన మామ మరణానికి కారణమైన నారా చంద్రబాబు నాయుడు విభజనానంతర ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యెక హోదా 15 సంవత్సరాలు కావాలని కోరి పోరాడిన వారు నేడు మొదటికే మోసం తెచ్చారు. ఆయన తన స్వప్రయోజనాల కోసమే నేడు ప్రత్యెక ప్యాకేజ్ కోసం కక్కుర్తి పడ్డారని సఖలాంద్రుల అభిప్రాయంగా కనిపిస్తుంది.

ఆంధ్రులు ఆరంభ శూరులు - చంద్రబాబు ఆంధ్రుల పాలిటి ఔరంగజేబు ప్రజలు 2019 ఎన్నికల్లో గెలిపించే అవకాశలేదని గ్రహించిన బాబు, తన చినబాబు లోకెష్ ను, ఎం.ఎల్.సి గా దొడ్డి దారిన మంత్రిమండలిలోకి తెచ్చారని అది దిక్కులేని పరిస్థితుల్లోనే జరిగిందంటారు. రెండుసార్లు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టిన పాపానికి, ఆంధ్రాను అవస్థల పాలు చేస్తూ, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేశారు. విభజన వేదనతో, కాంగ్రెస్ మీద కసితో చంద్రబాబుకు అధికారాన్ని ఇవ్వటం ఆంధ్రోళ్లు చేసిన అతి పెద్ద తప్పన్న విషయం తాజాగా రుజువైంది.

ఆంధ్రులు ఆరంభ శూరులు - చంద్రబాబు ఆంధ్రుల పాలిటి ఔరంగజేబు అలాగే నమ్మి ఓటేసిన నేరానికి - 2014లో ఐదేళ్ల అధికారాన్ని చంద్రబాబుకు ఇచ్చిన పాపానికి ఆంధ్రోళ్లకు జరగాల్సిన ద్రోహం బాగానే జరిగిపోయింది. తను సీఎంగా మొదటి తొమ్మిదిన్నరేళ్ల పాలనలో అభివృద్ధి అంతా హైదరాబాద్ లో పోగేసిన చంద్ర బాబు, అంధ్రప్రదేశ్ లో మరే ప్రాంతాన్ని భాగ్యనగరాన్ని పట్టించుకున్నట్లుగా పట్టించు కున్నది లేదు. ఆంధ్రులు ఆరంభ శూరులు - చంద్రబాబు ఆంధ్రుల పాలిటి ఔరంగజేబు చంద్రబాబు అధికారం లోకి రాకముందే, అభివృద్దికి నోచుకున్న అయిన విశాఖను గాలికి వదిలేసి, తన ఫోకస్ అంతా హైదరాబాద్ మీద, ముఖ్యంగా తన బందువర్గం మరియు తన కులవర్గంపై పెట్టిన కారణంగా, భాగ్యనగరానికి కి భాగ్యంగా మారిందని ఆంధ్రులంటుంటే - ఆంధ్రొళ్ళు మాత్రమే హైదరాబాద్ లో బాగుపడ్డరని తెలంగాణా వాళ్ళ వేదన. "భూమి మాది సుఖం మీది" అన్న చందాన వాళ్ళవాళ్ళకి తప్ప అటు సాధారణ ఆంధ్రులకుగాని ఇటు తెలంగాణా వాసులకి కాని హైదరాబాద్ ను చెంద కుండా చేశారు చంద్రబాబు. ఆంధ్రులు ఆరంభ శూరులు - చంద్రబాబు ఆంధ్రుల పాలిటి ఔరంగజేబు విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అగమ్య గోచరమే కాక, విభజన జరిగిన దరిమిలా ప్రత్యేక హోదా ఇస్తామన్న నాటి ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో హామీ ఇవ్వటం, దానికి వెంకయ్య నాయుడు కౌంటర్ గా తాము పవర్ లోకి రాగానే పదేళ్లు ఇచ్చేస్తామన్న ఊకదంపుడు మాటలు గా తరవాత తేలటం మనకు తెలిసిందే.

మోడీ అధికారములోకి లోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి అన్యాయం జరిగిందో తెలిసిందే. విభజన కారణంగా చాలా అన్యాయం జరిగిందని, తనను చాలా వేదన కు గురి చేసిందని, చెట్ల కింద పాలన చేసుకునే పరిస్థితికి వచ్చామంటూ పలు సందర్భంగా ఆవేదనా భరితమైన మాటలు చెప్పిన బాబు, ఆయన కార్చిన మొసలి కన్నీళ్ళు అవన్నీ రాజకీయ ప్రేరేపిత డైలాగులే తప్పించి, మనసు నుండి వచ్చిన మాటలు కావని స్పష్టమైంది. ఆంధ్రులు ఆరంభ శూరులు - చంద్రబాబు ఆంధ్రుల పాలిటి ఔరంగజేబు తనకు ఓట్లు వేసి తనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన కోట్లాది ఆంధ్రోళ్ల కంటే, ప్రధాని మోడీనే ఎక్కువన్న విషయాన్ని తాజాగా ఆయన తన చేతలతో రుజువు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు అదో శిక్ష అయ్యిందన్న విషయం విభజన సందర్భంగా తేలింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే, రాష్ట్రం అభివృద్ది పధం లో దూసుకెళ్లటం, ఆ విషయంలో గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు జరిగే కీడుతో నష్టంతో రాజకీయంగా తమకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయన్న భావన తో మోడీ ఏపీకి ఇస్తామన్న హోదా మాటల మూటను అటకెక్కించారు. ఆంధ్రులు ఆరంభ శూరులు - చంద్రబాబు ఆంధ్రుల పాలిటి ఔరంగజేబు ఏపీకి జరిగిన విభజన అన్యాయానికి బదులు తీర్చు కుంటామని, అంతవరకూ నిద్రపోనంటూ చాలానే కబుర్లు చెప్పిన చంద్రబాబు, తనకు ఏపీ ప్రజల ప్రయోజనాలు అస్సలు అక్కర్లేదన్న విషయాన్ని తన చర్యతో తేల్చి చెప్పారు. అంతే కాకుండా ఓటుకు నోటు కేసులో తానిరుక్కొని దాని దుష్ఫలితాన్ని ఏపి పై రుద్ది తాను మాత్రం హైదరాబాద్ నగరములో సంపన్నులైన తన కులపోళ్ళు అధికంగా నివసించే ప్రాంతములో మహా సౌధాన్ని వందల కోట్ల రూపాయిల ఖర్చుతో భువన మోహనంగా నిర్మించుకున్నారు. దీనితో అమరావతి బాబు గారికి నివాస యోగ్యం కాదని ఋజువౌతుంది.

ఆంధ్రులు ఆరంభ శూరులు - చంద్రబాబు ఆంధ్రుల పాలిటి ఔరంగజేబు ఓటుకు నోటు కేసుతో తెలంగాణా నుండి పారిపోయిన అపర గజని మహమ్మద్ చంద్రబాబు అమరావతి పేరు చెప్పి కొంతకాలం బ్రతికి పోయి - అక్కడి పితలాటకం తన తలకు చుట్టుకొంటున్న తరుణములో ఆంధ్రప్రదెశ్ నుండి తెలంగాణా కి తిరిగి పారిపోవటానికి నూతన గృహం సిద్ధం చేసుకుంటున్నట్లు తేటతెల్లమౌతుంది. అందుకే తన నివాసాన్ని అమరావతిలో నిర్మించుకోలేదు. దీన్ని బట్టి అమరావతి ఒక ముగిసిన అధ్యాయమేమోనని పిస్తుంది. "చెప్పలేం బాబు గారి - గాలి చిత్తముల్ క్షణమొక తీరు కదా!" ఆంధ్రులు ఆరంభ శూరులు - చంద్రబాబు ఆంధ్రుల పాలిటి ఔరంగజేబు "అమరావతి కాదది ఆంధ్ర ప్రజల భ్రమరావతి" ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మంగళవారం రాజ్యసభలో చర్చ జరిగితే, దీనికి ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. అంతేనా! సభలో ఉన్న కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గారు నోరు మెదపకుండా, మౌనంగా ఉండిపోయారు. అందుకే జనమంతా దీని భావమేమి తిరుమలేశా! అని అంటున్నారు. ఆంధ్రులు ఆరంభ శూరులు - చంద్రబాబు ఆంధ్రుల పాలిటి ఔరంగజేబు తన రాజకీయ ప్రయోజనం కోసం సొంత మామకు వెన్నుపోటు పొడిచేందుకు కూడా వెనుకాడని చరిత్ర పురుషుడు చంద్రబాబు, తాజాగా తన రాజకీయ లబ్థి కోసం, కోట్లాది మంది ఆంధ్రుల్ని వెన్నుపోటు పొడిచేందుకు ఏమాత్రమూ మొహమాట పడలేదు, కనీసం సంకోచించలేదు. అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే, ఏపీకి ఇచ్చిన ప్రత్యెక హోదా హామీని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీలు కోరినా, కూడా మోడీ ప్రభుత్వం "ససేమిరా" అనటం ఒక ఎత్తు అయితే, అసలు ఆంద్రోళ్ల ప్రయోజనాల్ని కాపాడటమే తన జీవిత పరమార్ధంగా లక్ష్యంగా అనునిత్యం చెప్పుకునే "నిప్పు లాంటి చంద్రబాబు", మాట వరసకు కూడా ప్రత్యెక హోదా మీద జరిగిన చర్చలో తన సభ్యుల్ని పాల్గొనేలా చేయలేకపోయారు. ఆంధ్రులు ఆరంభ శూరులు - చంద్రబాబు ఆంధ్రుల పాలిటి ఔరంగజేబు ప్రత్యేక హోదా మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు, కాంగ్రెస్, వామపక్ష నేతలు బలంగా వాదించినప్పటికీ, కేంద్రం తన పట్టు వీడకపోగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చింది. ఏపీతో సహా మరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన లేదని కేంద్రం పునరుద్ఘాటించటం గమనార్హం.

ప్రత్యెక హోదా అన్నది ఇచ్చేది లేదంటూ కుండబద్ధలు కొట్టేసిన మోడీ పరివారం బరితెగింపు మాటల్ని చూసి కూడా మౌనంగా ఉన్న సిగ్గుమాలి మగతనం చచ్చిన టీడీపీ తమ్ముళ్ల తీరు చూసినప్పుడు అనిపించేది ఒక్కటే, బాబుకు అధికారాన్ని ఇచ్చినందుకు ప్రతి ఆంధ్రోడు తన చెప్పుతో తాను కొట్టుకోవాల్సిందే అని. ఆంధ్రులు ఆరంభ శూరులు - చంద్రబాబు ఆంధ్రుల పాలిటి ఔరంగజేబు తమ ప్రజల ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ ఎంపీలు సైతం ఆంధ్రోళ్ల ప్రయోజనాల కోసం గళం విప్పితే, ఆంధ్రోళ్ల కోసమే తాము ఉందని మాటలు చెప్పే బాబు ఎంపీలు, కనీసం ప్రత్యేక హోదా చర్చకు సభకు రాకుండా మొహం చాటేసిన వైనం చూసినప్పుడు అనిపించేది ఒక్కటే, ఆంధ్రోళ్ల ప్రయోజనాల్ని సమాధి కట్టే బాబుకు చేజేతులారా అధికారాన్ని కట్టబెట్టినందుకు కోట్లాది మంది ప్రజలు మరోసారి పశ్చాతాపం చెందాల్సిందే. అసలు బాబుకు ఆంధ్రుల ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమన్నది గ్రహించని ఆంధ్రులను "ఆరంభశూరులన్న చారిత్ర మాటలు సత్యాలే" నని మరోసారి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పొచ్చు.

రక్షకభటుడు సినిమా మా సంస్థ పేరు నిలబెట్టే సినిమా అవుతుంది - ఎ.గురురాజ్‌

-- Hyderabad Published:12 April 2017 05:51:34 PM

తెలుగు సినిమాల్లోకి నటుడుగా ఎంట్రీ కావాలనుకున్నాడు, కానీ వీలుకాలేదు. దాంతో ఏం చేయాలో తెలియక రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి అడుగు పెట్టి సుఖీభవ ప్రాపర్టీస్‌ పేరుతో ప్రజలకు దగ్గరయ్యారు ఎ.గురురాజ్‌ అయితే సినిమాలపై ప్రేమతో 'రక్షకభటుడు' సినిమాతో నిర్మాతగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. సుఖీభవ మూవీస్‌ బ్యానర్‌పై రక్ష, జక్కన్న'చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో రక్షకభటుడు సినిమా రూపొందుతోంది. ఈ చిత్ర నిర్మాత ఎ.గురురాజ్‌ పుట్టినరోజు ఏప్రిల్‌ 11. ఈ సందర్భంగా నిర్మాత పాత్రికేయులతో సినిమా గురించి విశేషాలను తెలిపారు.. 
సినిమా రిలీజ్‌ ఆలస్యానికి కారణాలు.. 
 
- ముందు రక్షకభటుడు సినిమాను ఏప్రిల్‌ 7న రిలీజ్‌ చేయాలనుకున్నాం. కానీ సెన్సార్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌ కావడంతో సెన్సార్‌ ఆలస్యమవుతుంది. అదీగాక క్లైమాక్స్‌లో ఆంజనేయస్వామి పాత్ర తాలూకు గ్రాఫికల్‌ వర్క్‌ ఇంకా పూర్తి కాకాపోవడంతో రిలీజ్‌ ఆలస్యమయ్యింది. ఇప్పుడు సినిమాను మే నెల 5వ తారీఖున రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నాము. అప్పటికి గ్రాఫికల్‌ వర్క్‌, సెన్సార్‌ వర్క్‌ అన్నీ పూర్తైపోతాయి కనుక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. 
మా సంస్థ పేరును నిలబెట్టే సినిమా..
 
- ప్రస్తుతం చాలా సినిమాలన్నీ కుటుంబంతో కలిసి చూసే పరిస్థితి లేదు. అసలు ఏది కామెడీయో, ఏది చూడదగినదో తెలీడం లేదు. అందుకే ఈ సినిమాని కుటుంబం మొత్తం చూడదగిన సినిమాగా రూపొందిస్తున్నాం. మా సుఖీభవ సంస్థ నిర్మించే సినిమాలన్నీ ఇలానే కుటుంబ సమేతంగా చూడదగిన విధంగా ఉంటుంది. ఈ సినిమాలో చాలా వరుకు కామెడీ ఉంటుంది. క్లైమాక్స్‌ కూడా మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ఈ సినిమాకి కథే బలం. 
అన్నీ ఎలిమెంట్స్‌ ఉండే సినిమా... 
 
- ఇప్పుడు వస్తున్న చాలా సినిమాల్లో సరైన కథ ఉండదు. ప్రేమ ఉంటే కామెడీ ఉండదు. కానీ ఈసినిమాలో అన్నీ ఉంటాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌. ఇలాంటి సినిమాలని నిర్మించాలనే నేను మా సుఖీభవ సంస్థపై నిర్మించాం. మా సంస్థకు చాలా మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది. 
ఆంజనేయుడు పాత్రే కీలకం.. 
 
- నేను ఆంజనేయస్వామి ఉపాసకుడిని. ఆయన ముఖ్యమైన రోల్‌లో కనిపించే రక్షకభటుడు సినిమాను నేను నిర్మించడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమాలో క్లైమాక్స్‌లో ఆంజనేయుడి పాత్ర చాలా ముఖ్యమైనది. అందులో మనకు బాగా తెలిసిన ఒక స్టార్‌ నటుడు నటించారు. అలాగే ఇంకొక కీలకమైన పాత్ర కూడా ఉంది. అందులోనూ స్టార్‌ హీరో నటించారు. ఆ రెండింటినీ ఇప్పుడే రివీల్‌ చేయం. సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఎంత సీక్రెటో ఇది కూడా మా సినిమాకు అంతే సీక్రెట్‌. 
 
నటీనటులు గురించి... 
- అరకు లోయలోని ఒక పోలీస్‌ స్టేషన్‌ లో జరిగే కథ. ఇందులో చాలా మంది తెలిసిన నటీనటులున్నారు. బహ్మానందం, బ్రహ్మాజీ, బాహుబలి ప్రభాకర్‌, సుప్రీత్‌ వంటి స్టార్‌ నటులు నటించారు. ఇందులో అన్ని రకాల అంశాలు ఉంటాయి. అలాగే నేను కూడా ఇందులో ఒక చిన్న పాత్ర చేశాను. మొదట్లో నేను కూడా నటుడిని అవుదామనే ఇక్కడకొచ్చాను. కానీ దురద ష్టవశాత్తు కాలేకపోయాను. ఆ తర్వాత మార్కెటింగ్‌ రంగంలోకి దిగి ఈ సంస్థను స్థాపించాను. స్వచ్ఛంద సంస్థలకు కూడా సహాయం అందిస్తాను. కానీ కళామతల్లి మీదున్న ప్రేమ పోలేదు కనుక నిర్మాతగా సినిమాలు చేస్తున్నాను. ఆ పఇష్టంతోనే ఇందులో ఒక చిన్న పాత్ర చేశాను. 
 
బడ్జెట్‌, బిజినెస్‌ గురించి... 
సినిమాను మంచి బడ్జెట్‌లోనే పూర్తి చేశాం. ఆంజనేయుడు పాత్ర వేసింది ఎవరో చెబితే మేం అడిగిన దాని కంటే ఎక్కువే ఇస్తామని బయ్యర్స్‌ వస్తున్నారు. కానీ నిజానికి ఇంకా బిజినెస్‌ స్టార్ట్‌ చేయలేదు. గ్రాఫికల్‌ వర్క్‌, సెన్సార్‌ అయ్యాక బిజినెస్‌ స్టార్ట్‌ చేయాలని అనుకుంటున్నాం. 
తదుపరి చిత్రం.. 
- ఓ స్టార్‌ హీరో డిస్కషన్స్‌ చేస్తున్నాం. అన్నీ కుదిరిన తర్వాత అనౌన్స్‌ చేస్తాం.

స్ట్ర‌యిట్ త‌మిళ‌ సినిమా చేస్తా - ప్ర‌భాస్‌

-- Hyderabad Published:12 April 2017 05:31:51 PM

బాహుబ‌లి చిత్రంతో టాలీవుడ్‌లోనే కాదు, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్‌. ఈ టాలీవుడ్ డార్లింగ్ ఇప్పుడు బాహుబ‌లి ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నాడు. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళంలో గ్రాండ్ లెవల్లో ఏప్రిల్ 28న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చెన్నైలో మీడియా వ‌ర్గాల‌తో ప్ర‌భాస్ మాట్లాడారు. బాహుబ‌లి చిత్రాన్ని ఆదరించినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని, ఇప్పుడు అదే విధంగా బాహుబ‌లి 2ను కూడా త‌మిళ ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను. నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే, త‌ప్ప‌కుండా ఒక‌రోజు త‌మిళంలో స్ట్ర‌యిట్ సినిమా చేస్తాను అంటూ ప్ర‌భాస్ తెలిపారు. 

విల‌న్‌గా అందాల తార‌క‌...

-- Hyderabad Published:12 April 2017 05:30:07 PM

 
హీరోలు నెగ‌టివ్ షేడ్స్‌లో న‌టించ‌డం సినీ ప్రేక్ష‌కుల‌కు కొత్త‌మీ కాదు, అయితే హీరోయిన్స్ నెగ‌టివ్ షేడ్స్ లో న‌టిస్తేనే ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ క‌లుగుతుంది. ర‌మ్య‌కృష్ణ‌, సౌంద‌ర్య ఇలా అగ్ర తార‌లంద‌రూ నెగ‌టివ్ షేడ్స్‌తో న‌టించిన‌వారే. ఇప్పుడు వీరి బాట‌లో రాశిఖ‌న్నా అడుగు పెడుతుంది. వివ‌రాల్లోకెళ్తే..మోహ‌న్ లాల్ హీరోగా మ‌ల‌యాళంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రంలో రాశిఖ‌న్నా ఓ పోలీస్ పాత్ర‌లో న‌టిస్తుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, ఈ పాత్ర‌కు నెగ‌టివ్ షేడ్స్ ఉంటాయ‌ట‌. అందాల బొమ్మ నెగ‌టివ్ షేడ్స్‌లో న‌టించ‌డ‌మంటే ఎలా చేస్తుంద‌నే ఆస‌క్తి అయితే క‌చ్చితంగా ఉంటుంది. ఇలాంటి ఆస‌క్తి రాశిఖ‌న్నాకు పాత్ర వినేట‌ప్పుడే క‌లిగింద‌ట‌. అందుకే వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ట‌. ఈ చిత్రంలో మోహ‌న్‌లాల్‌తో పాటు విశాల్‌, తెలుగు సీనియ‌ర్ హీరో శ్రీకాంత్‌, హ‌న్సిక మోత్వాని ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. 

దేవి అవుట్‌..థ‌మ‌న్ ఇన్‌...

-- Hyderabad Published:12 April 2017 05:29:43 PM

రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతంలో ప‌నిచేయాల‌నే కోరిక ఈ త‌రం హీరోల‌కు ఉంటుంది. సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ ప్ల‌స్ అవుతుంద‌న‌డంలో సందేహం ఉండ‌దు. ప్రాజెక్ట్ ఈ అనౌన్స్ చేయ‌గానే అవ‌కాశం మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌కు త్వ‌ర‌గానే వ‌చ్చేసింద‌ని అనుకున్నారు అంద‌రూ, వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. ఈ చిత్రానికి ముందుగా దేవిశ్రీప్ర‌సాద్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా అనుకున్నారు. అయితే దేవి బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఇంకా స‌మ‌యం ప‌డుతుండ‌టంతో నిర్మాత‌లు దేవి స్థానంలో థ‌మ‌న్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తీసుకున్నార‌ట‌. 

ర‌జ‌నీకాంత్ నెక్ట్స్ మూవీ డైరెక్ట‌ర్ మారుతున్నాడా..?

-- Hyderabad Published:12 April 2017 05:29:23 PM


ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో సినిమా చేయాల‌ని అంద‌రి ద‌ర్శ‌కులు కోరుకుంటారు. అలాంటి స్టార్‌తో సినిమా చేయాల‌ని త‌హ త‌హ‌లాడుతారు. కానీ డైరెక్ట‌ర్ శివ ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడ‌ట‌. ఇంత‌కు డైరెక్ట‌ర్ శివ ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు..తెలుగులో శౌర్యం, శంఖం వంటి సినిమాలు చేశాడు. త‌మిళంలో అజిత్‌తో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్ చేస్తున్నాడు. క‌బాలి స‌మ‌యంలో ర‌జ‌నీకాంత్ డైరెక్ట‌ర్ శివ‌ను ఓ క‌థ ఉంటే చెప్ప‌మ‌ని అన్నాడ‌ట‌. ఆ స‌మ‌యంలో శివ ద‌గ్గ‌ర ర‌జ‌నీకాంత్‌కు సూట‌య్యే క‌థ లేక‌పోవ‌డంతో అవ‌కాశం చేజారింది. ఇప్పుడు ర‌జ‌నీకాంత్ కోసం శివ ఓ క‌థ‌ను సిద్ధం చేశాడ‌ట‌. ర‌జ‌నీకాంత్ కూడా శివ క‌థ విన‌డానికి ఆస‌క్తిగా ఉన్నాడ‌ట‌. క‌థ న‌చ్చితే ర‌జ‌నీ నెక్స్‌ట్ ప్రాజెక్ట్ అదే కావ‌చ్చునని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. మ‌రి పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీతో హీరో ధ‌నుష్ నిర్మించ‌బోయే సినిమా ఏమైందో ఏమో..దానికి ఇంకా స‌మ‌యం ప‌డుతుందా?  తెలియాలంటే కొంత‌కాలం ఆగాల్సిందే...

ర‌జ‌నీకాంత్‌తో సినిమా తీస్తా - రాజ‌మౌళి

-- Hyderabad Published:12 April 2017 04:52:57 PM

ర‌జ‌నీకాంత్‌తో సినిమా తీస్తా - రాజ‌మౌళి
 
రాజ‌మౌళి, ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి చిత్రంలో పార్ట్ 2 ఏప్రిల్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. యూనిట్ నిన్న చెన్నైలో పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు. వెయ్యేళ్ళ క్రితం జ‌రిగిన క‌థ‌గా బాహుబ‌లిని ఉహించుకుని రాశారు. అప్ప‌టి సంస్కృతి, వేష‌ధార‌ణ‌, ఆయుధాలు ఇలా అన్ని ఎలా ఉండేవో ఉహించి అలా ఉప‌యోగించాం. సినిమాను రెండు భాగాలుగా తీయాల‌నే స్టార్ట్ చేశాం. ప్ర‌తి పాత్ర‌ను ఇంకా వివ‌ర‌ణాత్మ‌కంగా వివ‌రించేందుకు టీవీ సిరీస్‌, కామిక్ బుక్స్‌, గేమ్స్ ఇలా అన్నీ రూపాల్లోకి తీసుకొస్తాం. ప్ర‌స్తుతానికి నా ఆలోచ‌న‌లంతా బాహుబ‌లిపైనే. మ‌హాభార‌తం తీయాల‌నే కోరిక ఉంది. వివ‌రాలు త్వ‌ర‌లోనే చెబుతాను. ఇక సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో త‌ప్ప‌కుండా ఓ సినిమా తీస్తాను అంటూ చెప్పుకొచ్చారు. 

ఏప్రియల్‌ 21న ఇద్దరి మధ్య 18 విడుదల

-- Hyderabad Published:12 April 2017 04:45:54 PM

ఏప్రిల్‌ 21న ఇద్దరి మధ్య 18 విడుదల 
ఎస్‌.ఆర్‌.పి విజువల్‌ పతాకంపై సాయితేజ పాటిల్‌ సమర్పణలో రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి జంటగా బిత్తిరి సత్తి ప్రధానపాత్రలో నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్‌ పాటిల్‌ నిర్మించిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం 'ఇద్దరి మధ్య 18'. తెలంగాణ మంత్రి వర్యులు హరీష్‌రావు గారు, మరియు సెన్సార్‌ సభ్యుల అభినందనలను అందుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 21న విడుదలకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివరాజ్‌ పాటిల్‌ మాట్లాడుతూ..''ఇద్దరి మధ్య 18'' చిత్రం మంచి మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీ. చిత్రం అంతా అద్భుతంగా వచ్చింది. ఇటీవలె సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్‌ సభ్యులు ఈ సినిమాపై ప్రత్యేక అభినందనలు తెలుపడంతో పాటు, తెలంగాణ మంత్రి వర్యులు హరీష్‌రావుగారు సినిమా చూసి..మంచి మెసేజ్‌ ఇస్తున్నారని మమ్మల్ని అభినందించడం ఎంతగానో ఆనందాన్నిచ్చింది. దర్శకుడు నాని ఆచార్య సినిమాని తెరకెక్కించిన విధం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఏప్రిల్‌ 21న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము. ప్రేక్షకులు ఆదరించి, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము..'' అని అన్నారు. 
రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి, బిత్తిరిసత్తి, రవిప్రకాష్‌, శివన్నారాయణ, బాబీలహరి, రఘు, రాము, అప్పారావు, చిట్టిబాబు, చమ్మక్‌చంద్ర మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, ఎడిటింగ్‌: మార్తాండ్‌.కె.వెంకటేష్‌, కెమెరా: జి.ఎల్‌.బాబు, కొరియోగ్రఫీ: నిక్సన్‌ డిక్రూజ్‌, భాను, గణేష్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, పాటలు: కందికొండ, వరికుప్పల యాదిగిరి, రామ్‌ పైడిశెట్టి, చిలుకరెక్క గణేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శివకుమార్‌, కో-డైరెక్టర్‌: జి.భూపతి, సమర్పణ: సాయితేజ పాటిల్‌, నిర్మాత: శివరాజ్‌ పాటిల్‌, స్టోరీ-డైరెక్షన్‌: నాని ఆచార్య. 


`మిస్ట‌ర్`... ప్రేక్ష‌కుల‌కు నచ్చే ట్రయాంగిల్ ట్రావెల్ ల‌వ్ స్టోరీ - శ్రీనువైట్ల‌

-- Hyderabad Published:12 April 2017 04:18:42 PM

`మిస్ట‌ర్`.. ప్రేక్ష‌కుల‌కు నచ్చే ట్రయాంగిల్ ట్రావెల్ ల‌వ్ స్టోరీ - శ్రీనువైట్ల‌
వరుణ్‌తేజ్‌ హీరోగా బేబి భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై శ్రీనువైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్‌ మధు నిర్మించిన చిత్రం 'మిస్టర్‌'. ఏప్రిల్‌ 14న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనువైట్లతో ఇంటర్వ్యూ.... 
 
ట్రావెల్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ...
-  నేను చాలా రోజులుగా ఎమోషన్స్‌తో కూడిన ట్రావెల్‌ మూవీ చేయాలనుకుంటున్నాను. అలాంటి సమయంలో 'మిస్టర్‌' సినిమా లైన్‌ను గోపీమోహన్‌ నాకు చెప్పాడు. అలా 'మిస్టర్‌' సినిమా జర్నీ స్టార్ట్‌ అయ్యింది. 'మిస్టర్‌' ఓ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ, గోపీమోహ‌న్ చెప్పిన లైన్‌ వినగానే ఎవరైతే బావుంటారు అనుకోగానే, వరుణ్‌ బావుంటాడని నేను చెప్పాను. గోపీమోహన్‌ కూడా వరుణ్‌ తేజ్‌ అయితే ఈ కథకు సూట్‌ అవుతాడని అన్నాడు. అలా వరుణ్ తేజ్ ను హీరోగా అనుకుంటుండగా, నిర్మాతలు బుజ్జి, మధుగారు సినిమా చేయడానికి అప్రోచ్ అయ్యారు. మిస్టర్ కథ వరుణ్ తో అనుకుంటున్నానని వారికి చెప్పాను. వారు కూడా సినిమా చేయడానికి ఒప్పుకోవడంతో హ్యాపీగా అనిపించింది. అక్కడ నుండి ఎనిమిది నెలలు సమయం తీసుకుని సినిమా చేశాం. 
ఎగ్జయిటింగ్‌గా అనిపించింది..
 
- నాకు మిస్ట‌ర్ సినిమా చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. సాధారణంగా మనం షూటింగ్‌ కోసం ఎక్కడైనా విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక దగ్గర షూటింగ్‌ చేసుకుని వచ్తేస్తాం. కానీ 'మిస్టర్‌' సినిమా కోసం స్పెయిన్‌లోని 11 సిటీస్‌లో సినిమా షూటింగ్‌ చేశాం. తర్వాత మన దేశంలో చిక్‌ మంగళూరులో షూట్‌ చేశాం. ట్రావెల్‌ బ్లాక్‌ అంతా ఈ ప్రాంతాల్లో చేశాం. అలా ఊటీ, కేరళ ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. ఓ కొత్త లుక్‌తో సినిమా చేయాలని ముందుగానే అనుకుని చేశాను. డైరెక్ట‌ర్‌గా శాటిస్పాక్ష‌న్ ఇచ్చిన సినిమా `మిస్ట‌ర్‌`.
 
వరుణ్‌ను ఎక్స్‌ట్రార్డిన‌రీగా చశాడు.
 
- ఓసారి వ‌రుణ్‌ను చూసి కుర్రాడు బావున్నాడు అన్న‌య్య అని నాగ‌బాబుగారితో అన్నారు. ..నాగబాబుగారు నువ్వు తనతో సినిమా చెయ్యొచ్చు కదా అని నవ్వుతూ అనేవారు,తప్పకుండా చేస్తాను అన్నయ్య అనేవాడిని.,ముకుంద సినిమా తర్వాత నేను నాగబాబుగారికి ఫోన్‌ చేసి వరుణ్‌ చాలా బావున్నాడని అన్నాను. ఇక మిస్ట‌ర్ క‌థ అనుకోగానే వ‌రుణ్ అయితే స‌రిపోతాడ‌ని అనిపించ‌డం, అన్నీ అనుకున్న విధంగా కుద‌ర‌డంతో మా కాంబినేషన్‌  'మిస్టర్‌' సినిమాకు కుదిరింది. వరుణ్‌ ఈ సినిమాలో అన్నీ యాంగిల్స్‌లో చూపించే ప్రయత్నం చేశాను. తను కూడా ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడు. కామెడి చేయడం చాలా కష్టం., కానీ వరుణ్‌ కామెడి ట్రాక్‌లో చక్కగా నటించాడు. 
ఫ్రెష్ ల‌వ్ స్టోరీ...
 
-నేను ఇప్పటి వరకు చేయని ఫ్రెష్‌ లవ్‌స్టోరీ మిస్ట‌ర్‌. అదీ కాక నా గత చిత్రంలో నా నుండి ఆశించిన కామెడి ప్రేక్షకులకు దొరకలేదు. కాబట్టి ప్రేక్షకులు నా సినిమాల్లో కామెడి ఉండాలని ఆశిస్తారు. అది ఈ సినిమాలో చాలా మంచి కామెడి ఉంది. 
హీరోయిన్స్ గురించి...
- సినిమాలో లావ‌ణ్య‌త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ హీరోయిన్స్‌..ఇద్ద‌రికీ క‌థ ప‌రంగా మంచి ఇంపార్టెన్స్ ఉంది. చంద్ర‌ముఖి అనే క్యారెక్టర్‌ను లావణ్య చేసింది. మీరా అనే క్యారెక్టర్‌లో హెబ్బాపటేల్‌ నటించింది. ఇద్దరూ వారి పాత్రల్లో హండ్రెడ్‌ పర్సెంట్ ఒదిగిపోయారు. 
 
మిక్కి అందుకోసం....
- సినిమా కొత్త‌గా ఉండాలని సినిమా చేయ‌క ముందు నుండే అనుకున్నాను.  అందువ‌ల్ల మిక్కి జె.మేయర్‌ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తీసుకున్నాను. తను ఎలా చేస్తాడోనని చాలా మంది అనుకున్నారు. కానీ తను నాకు చాలా బాగా సింక్‌ అయ్యాడు. అన్నీ పాటలకు అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చాడు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కు 60 రోజులు తీసుకుని చేశాడు. పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. 
అలాంటి క్యారెక్టర్స్‌ లేవు... 
- రెడీ సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్‌ ఉంటాయో, ఈ సినిమాలో కూడా అన్ని క్యారెక్టర్స్‌ ఉంటాయి. ఎవ‌రినో రెఫ‌ర్ చేసే క్యారెక్ట‌ర్స్ సినిమాలో లేవు. 
నిర్మాతలతో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్...
- నిర్మాతలు దర్శకుడిగా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నాకు ఏం కావాలో దాన్ని సమకూర్చారు. 
సినిమాల ప‌రంగా అప్ డేట్ అవుతుంటాను...
- 'బ్రూస్‌లీ' చిత్రం నేను అనుకున్న విధంగా ఎందుకనో కుదరలేదు. అందుకని ఎవరినీ బ్లేమ్‌ చేయలేదను. నేను మంచి సినిమా చేయలేదు కాబట్టి ప్రేక్షకులు రిజెక్ట్‌ చేశారని నేను అనుకుంటాను. నేను సక్సెస్‌ కోసం కాకుండా ప్రేక్షకుల ప్రేమ కోసం చేసిన సినిమా 'మిస్టర్‌'. నాకు సినిమా అంటే ప్రాణం. సినిమాల పరంగా నేనెప్పుడూ అప్‌డేట్‌ అవుతుంటాను. అదెలా అయ్యానో తెలుసుకోవాలంటే 'మిస్టర్‌' సినిమా చూడాల్సిందే. 
 
అప్పుడే ఎక్కువ సీిరియస్ గా పనిచేస్తాను...
- సాధారణంగా సక్సెస్‌ కంటే ఫెయిల్యూర్‌ నుండి ఎక్కువగా నేర్చుకుంటాం. నా కెరీర్‌లో గెలుపు ఓటమి..రెండింటినీ చూశాను. ఓటమి వచ్చినప్పుడే ఎక్కువ సీరియస్‌గా పనిచేస్తాను. 
తదుపరి చిత్రాలు..  
 
- ప్రస్తుతం 'మిస్టర్‌' సినిమా విడుదల అవుతుంది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అలాగే రెండు లైన్స్‌తో రెండు కథలను సిద్ధం చేసుకున్నాను  

అల్లు శిరీష్, వి.ఐ.ఆనంద్, చక్రి చిగురుపాటి కాంబినేషన్ లో కొత్త చిత్రం ప్రారంభం

-- Hyderabad Published:12 April 2017 04:02:58 PM

అల్లు శిరీష్వి.ఐ.ఆనంద్చక్రి చిగురుపాటి కాంబినేషన్ లో కొత్త చిత్రం ప్రారంభం

 

అల్లు శిరీష్ హీరోగాసురభిసీరత్ కపూర్ హీరోయిన్లుగాశ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో విఐ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.5 చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగానిర్మాత చక్రి తండ్రి శంకర్ చిగురుపాటి కెమెరా స్విఛాన్ చేశారు. చిత్ర దర్శకుడు విఐ ఆనంద్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం కావడంఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మణిశర్మఅబ్బూరి రవిఛోటా కె ప్రసాద్సుజిత్నాగేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. సతీష్ వేగేశ్నరాజేష్  దండ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు.  

 

హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ .. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న చిత్ర పూజా కార్యక్రమాలు ఫిలింనగర్ దైవసన్నిధానంలో చేశాం. నాన్న క్లాప్ కొట్టారు. ఈనెలాఖరులో షూటింగ్ ప్రారంభిస్తున్నాం. రొమాంటిక్ థ్రిల్లర్ కథ ఇది. సైన్స్ ఫిక్షన్ కూడా ఉంటుంది. మంచి టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. మలయాళంలో నేను నటించిన 1971సూపర్ హిట్ దృశ్యం లాంటి చిత్రాలకు పని చేసిన సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. అలాగే మణిశర్మగారు సంగీతం అందిస్తున్నారు. మంచి టీం కుదిరింది. అన్ని వర్గాల్ని మెప్పించే కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. అని అన్నారు.

 

దర్శకుడు విఐ ఆనంద్ మాట్లాడుతూ - అల్లు శిరీష్ హీరోగా లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురు పాటి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.5 చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ఫిలినంగర్ దైవ సన్నిధానంలో జరిగాయి. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ గా సాగే సైంటిఫిక్ ఫిక్షన్ స్టోరీ. ఈ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాం. ఇందులో ప్రతీ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు.

 

సురభి మాట్లాడుతూ - మంచి కథలో భాగం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎగ్జైటెడ్ గా ఉన్నాను. ఎనర్జిటిక్ టాలెంటెడ్ టీంతో వర్క్ చేస్తున్నాను. ఈసినిమా టీం అందరికి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. అని అన్నారు.

సీరత్ కపూర్ మాట్లాడుతూ... విఐ ఆనంద్ తో ఇది నా రెండో చిత్రం. స్క్రిప్ట్ ఎంగేజింగ్ గా ఉంటుంది. అని అన్నారు.

 

శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ... కథ అద్భుతంగా వచ్చింది. నా క్యారెక్టరైజేషన్ చాలా బాగా ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎగ్జేటెడ్ గా ఉన్నాను. శిరీష్ తో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. సురభితో ఆల్రెడీ వర్క్ చేశాను. టీం అందరికి ఆల్ ది బెస్ట్. అని అన్నారు. 

 

అల్లు శిరీష్సురభిసీరత్ కపూర్శ్రీనివాస్ అవసరాలవెన్నెల కిషోర్సత్యప్రవీణ్కాశీ విశ్వనాథ్,రోహిణి తదితరులు న‌టిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్స్ - సతీష్ వేగేశ్నరాజేష్ దండసంగీతం - మణిశర్మడిఓపి - సుజిత్ వాసుదేవ్డైలాగ్స్ - అబ్బూరి రవిఎడిటర్ - ఛోటా కె ప్రసాద్ఆర్ట్ - నాగేంద్ర ప్రసాద్కో డైరెక్టర్ - విజయ్ కామిశెట్టిబ్యానర్ - లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నెం.5,నిర్మాత - చక్రి చిగురు పాటిస్టోరీస్క్రీన్ ప్లేడైరెక్షన్ - విఐ ఆనంద్.

అకీరా తండ్రిలా కాకూడ‌దంటున్న రేణుదేశాయ్‌...

-- Hyderabad Published:08 April 2017 05:58:24 PM

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న‌యుడు అకీరానంద్ ఈరోజు పుట్టిన‌రోజు సెల‌బ్రేట్ చేసుకంటున్నాడు. ఈ ఏడాదితో 13 ఏట అడుగుపెడుతున్న అకీరానంద్ గురించి త‌ల్లి రేణుదేశాయ్ త‌న సోష‌ల్ మీడియాలో తెలియ‌జేస్తూ..నా కుమారుడు 13వ వ‌సంతంలోకి అడుగు పెట్టాడు. ఆనందంతో కూడిన ఎమోష‌న్‌లో మాట‌లు రావ‌డం లేదు. అకీరా త‌ల్లిదండ్రుల నీడ‌లో త‌న కాళ్ళ‌పై త‌ను నిల‌బ‌డాలి. జూనియర్ ప‌వ‌ర్‌స్టార్‌లా కాకుండా త‌న సొంత గుర్తింపు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నాను అని అకీరాతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. అంటే రేణుదేశాయ్‌ త‌న కొడుకు త‌న‌కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాల‌ని కోరుకుంటుంది. ఇలా కోరుకోవ‌డం కూడా మంచి విష‌య‌మే మ‌రి. ఏనీ హౌ..హ్య‌పీ బ‌ర్త్ డే టు అకీరానంద్‌.

జ‌వాన్ మొద‌టి షెడ్యూల్ పూర్తి...

-- Hyderabad Published:08 April 2017 05:54:40 PM

సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా బి.వి.ఎస్‌.ర‌వి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభ‌మైన ఈ సినిమాలో మెహ‌రీన్ కౌర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. బి.వి.ఎస్‌.ర‌వి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం మొద‌టి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో న‌టి స్నేహ భ‌ర్త ప్ర‌స‌న్న విల‌న్‌గా న‌టిస్తుండ‌టం విశేషం. జ‌వాన్ అన‌గానే అంద‌రూ ఇది జ‌వాన్ల క‌థ అని అనుకుంటారు. కానీ మా క‌థ అది కాదు. మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడి క‌థ‌. కుటుంబానికి ఓ క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు ఆదుకోవ‌డానికి ఓ కుర్రాడు ఉండాలి. మా హీరో అలాంటి వ్య‌క్తి. ఇంటికొక‌డు అనేది మా సినిమాకు క్యాప్ష‌న్‌. దేశానికి జ‌వాన్ ఎంత ముఖ్య‌మో, ప్ర‌తి ఇంటికి ఇలాంటి ఒక కుర్రాడు ముఖ్యం. పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామా ఇది అని ద‌ర్శ‌కుడు బి.వి.ఎస్‌.ర‌వి తెలియ‌జేశారు.

అన్న దారిలో ఇప్పుడు చెల్లెలు కూడా....

-- Hyderabad Published:08 April 2017 05:28:26 PM

తెలుగు సినిమాల్లో కోన వెంక‌ట్‌కు ర‌చ‌యిత‌గా మంచి పేరుంది. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించిన కోన‌వెంక‌ట్‌కు గ‌త కొంత‌కాలంగా అనుకున్న‌స్థాయిలో హిట్ లేదు. దాంతో ర‌చ‌యిత‌గా కామ్ అయ్యాడు కోన‌. ఇప్పుడు అన్న‌ను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకున్న ఆయ‌న చెల్లెలు నీర‌జ కోన ర‌చ‌యిత‌గా మార‌నుంది. ర‌చ‌యిత‌ల సంఘంలో రీసెంట్‌గా స‌భ్య‌త్వం తీసుకున్న నీర‌జ కోన‌, స్టార్ హీరోయిన్స్ స్టైలిస్ట్‌గా మంచి పేరే ఉంది. అయితే సాయిధ‌ర‌మ్ తేజ్ తిక్క సినిమాకు ఓ పాట‌ను రాసిన నీర‌జ త్వ‌ర‌లోనే ఫుల్ టైమ్ ర‌చ‌యిత‌గా మార‌నుంద‌ట‌. ప్ర‌స్తుతానికి నీర‌జ ఓ సంస్థ‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతుంద‌ట‌. మ‌రి ఈ చ‌ర్చ‌లు ఏ మేర కొలిక్కి వస్తాయో చూడాలి.

అవార్డుల క‌మిటీపై స్టార్ డైరెక్ట‌ర్ ఫైర్‌....

-- Hyderabad Published:08 April 2017 05:25:09 PM

గ‌జినీ, తుపాకీ, క‌త్తి స‌హా ప‌లు సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ నిన్న కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన జాతీయ అవార్డుల‌పై పెద‌వి విరిచాడు. ఇందుకు త‌న ట్విట్ట‌ర్‌ను వేదిక‌గా చేసుకున్నాడు. సాధార‌ణంగా జాతీయ అవార్డులు ప్ర‌క‌టించిన ప్ర‌తిసారి జ్యూరీ వివాదాల‌కు కేంద్ర‌బిందువు అవుతుంటుంది. అలాగే ఈసారి మురుగుదాస్‌, జ్యూరీ ప‌నితీరుని ద‌య్య‌బ‌ట్టారు. జ్యూరీపై ఉన్న ప్రెష‌ర్‌కు ఈ అవార్డుల ప్ర‌క‌ట‌నతో క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతుంది. ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాలంటూ త‌న ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.

బాల‌య్య‌తో శ్రియ మూడోసారి...

-- Hyderabad Published:08 April 2017 05:22:11 PM

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ధ‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. బాల‌కృష్ణ న‌టిస్తున్న 101వ చిత్ర‌మిది. ప్ర‌స్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. కోటిన్న‌ర రూపాయ‌ల‌తో వేసిన మార్కెట్ సెట్‌లో షూటింగ్ చేస్తున్నారు. బాల‌య్య గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో ముస్కాన్ అనే హీరోయిన్ ప‌రిచ‌యం అవుతుంది. అయితే మెయిన్ హీరోయిన్‌గా శ్రియా శ‌ర‌న్ న‌టిస్తుంది. గ‌తంలో బాల‌కృష్ణ‌తో చెన్న‌కేశ‌వ‌రెడ్డి చిత్రంతో పాటు బాల‌కృష్ణ 100వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిలో శ్రియా హీరోయిన్‌గా న‌టించింది. ఇప్పుడు బాల‌య్య‌తో మూడోసారి స్క్రీన్‌పై జోడిగా సంద‌డి చేయ‌నుంది. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ర‌జ‌నీకాంత్ ఇప్ప‌ట్లో వారిని క‌ల‌వ‌డ‌ట‌....

-- Hyderabad Published:08 April 2017 05:20:30 PM

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కు ద‌క్షిణాది, ఉత్త‌రాదినే కాకుండా మ‌లేషియా, సింగ‌పూర్‌, జ‌పాన్ వంటి దేశాల్లో కూడా అభిమానులు మెండుగా ఉన్నారు. అభిమానుల‌ను అరుదుగా క‌లిస్తుంటాడు ర‌జ‌నీకాంత్‌..అయితే అభిమానులంద‌రినీ క‌లిసి దాదాపు ప‌దేళ్ళు అవుతుంద‌ని, వారితో క‌ల‌వ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ప‌నిలో పనిగా రజ‌నీకాంత్ రాజ‌కీయాల‌కు సంబంధించిన వార్త‌లు కూడా వినిపించాయి. కానీ ఈ వార్త‌ల‌ను ఖండించిన ర‌జనీకాంత్‌..అభిమానుల‌ను మాత్ర‌మే క‌లుసుకుంటానని అన్నాడు. అయితే తాజాగా ర‌జనీకాంత్ త‌న అభిమానులను ఒకేసారి కాకుండా మండ‌లాల వారీగా వ‌చ్చి క‌లుసుకుంటాన‌ని, వారితో ప్ర‌త్యేకంగా ఫోటోలు కూడా దిగుతాన‌ని చెప్పాడు. ఇది ఓ ర‌కంగా ర‌జ‌నీకాంత్ అభిమానులను నిరాశ ప‌రిచ‌నట్లే.

మిస్ట‌ర్‌ మూవీ అన్నీ అంద‌రినీ ఆక‌ట్టుకునే స‌క్సెస్‌ఫుల్ మూవీ అవుతుంది

-- Hyderabad Published:08 April 2017 05:15:00 PM

ముకుంద‌, కంచె, లోఫ‌ర్ వంటి డిఫ‌రెంట్ చిత్రాల త‌ర్వాత మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం `మిస్ట‌ర్‌*. సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ కార్య‌క్ర‌మం అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా.... వ‌రుణ్ అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే సినిమాలు చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - ``నేను ఎప్పుడూ వ‌రుణ్‌కు ఓ విష‌యం చెబుతుంటాను. నీ వెనుక మేమున్నాం, మా వెనుక అభిమాలున్నారు క‌దా, మా కేంటి అనుకుని ఈజీగా తీసుకోకుండా, వ‌చ్చిన అవ‌కాశాన్ని క‌ష్టంతో స‌ద్వినియోగం చేసుకోవాలి. ప్ర‌తి సినిమాను ఫస్ట్ సినిమాలాగా పనిచేయాలి. క‌ష్టాన్ని న‌మ్ముకో అని. అలాగే వ‌రుణ్ నిరంతరం క‌ష్ట‌ప‌డుతున్నాడు. వ‌రుణ్ అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే సినిమాల‌ను చేస్తున్నాడు.

త‌ను అచితూచి, జాగ్ర‌త్త‌గా సినిమాలు చేస్తున్నాడు. ముకుంద‌లో విలేజ్ కుర్రాడిగా న‌టించాడు. త‌ర్వాత కంచె అనే క్లాస్ మూవీ చేశాడు. నాకు ఎంతో ఇష్ట‌మైన మూవీ. త‌ర్వాత మ‌ద‌ర్ సెంటిమెంట్ ఉన్న లోఫ‌ర్ అనే ప‌క్కా మాస్ మూవీ చేశాడు. ఇప్పుడు మిస్ట‌ర్ సినిమా అంద‌రినీ అల‌రించే సినిమా అవుతుంది. చిత్ర నిర్మాత‌లు బుజ్జి, మ‌ధులు ఇద్ద‌రూ సినిమాల‌పై మంచి అవ‌గాహ‌న ఉన్న వ్య‌క్తులు. `మిస్ట‌ర్` వారికి మ‌రో పెద్ద స‌క్సెస్ మూవీగా నిలుస్తుంది. శ్రీనువైట్ల, కామెడి టింజ్ ఉన్న డైరెక్ట‌ర్‌. నాతో `అంద‌రివాడు` సినిమా చేశాడు. త‌ర్వాత త‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ్రూస్‌లీ చిత్రంలో చిన్న అతిథి పాత్ర‌లో న‌టించాను. ఖైదీ నంబ‌ర్ 150 కంటే ముందు బ్రూస్‌లీ చిత్రంలో న‌న్ను నేను తెర‌పై చూసుకుని ప‌రావాలేదు అనుకునేలా చేసిన ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌. మాస్ ప‌ల్స్ తెలిసిన డైరెక్ట‌ర్‌. క‌మెడియ‌న్స్‌కు కూడా స్టార్ స్టేట‌స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు. ఢీ, రెడీ, దూకుడు చిత్రాలు శ్రీనుకు ఎంతో పెద్ద హిట్ చిత్రాలుగా నిల‌వ‌డ‌మే కాకుండా త‌న స్టామినాను ప్రూవ్ చేశాయి. కొద్ది గ్యాప్ త‌ర్వాత శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న‌ మిస్ట‌ర్‌తో త‌నెంటో ప్రూవ్ చేసుకుంటాడు. అందులో ఏ డౌట్ లేదు. మిక్కి జె.మేయ‌ర్ ఎంతో చ‌క్క‌టి మ్యూజిక్ ఇచ్చాడు. త‌ను క్లాస్ ట‌చ్ ఉన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ఈ మిస్ట‌ర్ సినిమాలో అన్నీ సాంగ్స్ బావున్నాయి. అలాగే క‌థ‌ను అందించిన గోపీమోహ‌న్‌, డైలాగ్స్ రాసిన శ్రీధ‌ర్ సీపాన‌కు ప్ర‌త్యేక‌మైన అభినంద‌నలు. లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ చాలా గ్లామ‌ర్‌గా క‌న‌ప‌డ్డారు. వారికి కూడా నా అభినంద‌న‌లు. ఈ సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ అభినంద‌న‌లు`` అన్నారు. ఇచ్చిన మాట ప్ర‌కారం సినిమా చేశారు మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు మాట్లాడుతూ - ``చాలా కాలం క్రితం వ‌రుణ్‌తేజ్‌తో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. అనుకున్న మాట ప్ర‌కారం ఆయ‌న వ‌రుణ్‌తో `మిస్ట‌ర్‌` సినిమా చేశాడు. వ‌రుణ్‌తేజ్‌తో సినిమా చేసిన డైరెక్ట‌ర్ శ్రీనువైట్ల‌, నిర్మాత‌లు న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌, మ‌ధుల‌కు థాంక్స్‌. మిక్కి మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం. మిస్ట‌ర్ సినిమాకు ఎంతో మంచి మ్యూజిక ఇచ్చారు. ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు`` అన్నారు. `మిస్ట‌ర్` అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ - ``ప్ర‌తి సినిమా ఏదో కొత్త‌గా చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తుంటాను. అభిమానులు ఎప్పుడూ స‌పోర్ట్ చేస్తున్నారు. మిస్ట‌ర్ సినిమా డైరెక్ట‌ర్ శ్రీనువైట్లగారు నేను బావున్నాన‌ని నాన్న‌తో అన్నారు. నాన్న‌, ఆయ‌న‌తో న‌న్ను డైరెక్ట్ చేయ‌మ‌ని అంటే త‌ప్ప‌కుండా అని అప్పుడెప్పుడో మాట ఇచ్చారు. ఆ మాట‌ను ఇప్పుడు నిల‌బెట్టుకున్నారు. మిస్ట‌ర్ సినిమా చాలా బాగా వ‌చ్చింది. అంద‌రం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మిక్కిగారు నాకు మంచి మిత్రుడు. ముకుంద త‌ర్వాత మిస్ట‌ర్‌తో మ‌రోసారి మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే నిర్మాత‌లు బుజ్జి, మ‌ధుగారికి, లావ‌ణ్య‌, హెబ్బా ప‌టేల్ స‌హా అంద‌రికీ థాంక్స్‌. ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా ఎవ‌రిని పిల‌వాల‌నుకున్న‌ప్పుడు నాకు డాడీ(చిరంజీవి)యే గుర్తుకు వ‌చ్చారు. అడగ్గానే వ‌స్తాన‌న్నారు. ఆయ‌న‌కు నేను పెద్ద అభిమానిని. ఆయ‌న మ‌ళ్ళీ సినిమాల్లోకి రావ‌డం మా అంద‌రికీ ఎంతో బ‌లాన్నిచ్చింది. అలాగే క‌ళ్యాణ్ బాబాయ్‌కి, చ‌ర‌ణ్ అన్న‌, బ‌న్ని అంద‌రూ బాగా స‌పోర్ట్ చేస్తుంటారు. ఇక ఏప్రిల్ 14న రానున్న మిస్ట‌ర్ సినిమాతో మంచి సినిమా చేయాల‌ని అంద‌రూ క‌ష్ట‌ప‌డి చేశాం. అంద‌రినీ ఎంటైర్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు. `మిస్ట‌ర్‌`లో వ‌రుణ్‌తేజ్‌ను డిఫ‌రెంట్ యాంగిల్‌లో చూస్తారు డైరెక్ట‌ర్ శ్రీనువైట్ల మాట్లాడుతూ - ``చిరంజీవిగారు గుర్తుకు రాగానే నాకు గుర్తుకు వ‌చ్చేది ఖైదీ సినిమా. 34 ఏళ్ల‌కు ముందు ఖైదీ సినిమాతో ఒక సంచ‌ల‌న క్రియేట్ చేస్తే, మ‌ళ్ళీ 34 ఏళ్ళ త‌ర్వాత మ‌రో ఖైదీతో మ‌రో సంచ‌ల‌నం క్రియేట్ చేశారు. అందుకు కార‌ణం ప్రేక్ష‌కుల హృద‌యాల్లో జీవిత ఖైదీ. ఈ వేడుక‌కు ఆయ‌న రావ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. స‌క్సెస్ కోసం కాకుండా ప్రేక్ష‌కుల ప్రేమ కోసం మిస్ట‌ర్ సినిమాను చేశాను. నిర్మాత‌లు బుజ్జి, మ‌ధులు ఎంతో స‌హ‌కారం అందించారు. గోపీమోహ‌న్ లైన్ చెప్పిన‌ప్ప‌టి నుండి ట్రావెల్ అవుతున్నాం. శ్రీధ‌ర్ సీపాన మంచి డైలాగ్స్ అందించారు. మిక్కి అద్భుత‌మైన పాట‌లు అందించారు. అంతే కాకుండా ఓ స‌ర్‌ప్రైజింగ్ రీరికార్డింగ్ కూడా చేశాడు.

ఆర్ట్ డైరెక్ట‌ర్ ప్ర‌కాష్‌. ఎడిట‌ర్ వ‌ర్మ‌, సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ స‌హా అంద‌రికీ థాంక్స్‌. వ‌రుణ్‌తో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుండో అనుకున్నాను. ఇప్ప‌టికి కుదిరింది. జెన్యూన్ యాక్ట‌ర్‌. చాలా రియ‌ల్‌గా న‌టిస్తాడు. త‌న‌లో డిఫ‌రెంట్ యాంగిల్స్‌ను ఈ సినిమాలో చూస్తారు. ఈ సినిమా క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది. ఏప్రిల్ 14న సినిమా విడుద‌ల కానుంది`` అన్నారు. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌ మిక్కి జె.మేయ‌ర్ మాట్లాడుతూ - ``మిస్ట‌ర్ సినిమాకు శ్రీనువైట్ల‌తో తొలిసారి ప‌నిచేస్తున్నాను. వ‌రుణ్‌తో నేను చేస్తున్న రెండో సినిమా. ఇలాంటి ఒక మంచి సినిమాలో అవ‌కాశం ఇచ్చిన శ్రీనువైట్ల‌గారికి థాంక్స్‌. శ్రీనువైట్ల‌గారికి మిస్ట‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావాలి. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు. చంద్ర‌ముఖి అనే డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ చేశాను లావ‌ణ్య త్రిపాఠి మాట్లాడుతూ - `` మిస్ట‌ర్‌లో చంద్ర‌ముఖి అనే క్యారెక్ట‌ర్ చేశాను. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్. అంద‌రూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది.

శ్రీనువైట్ల వంటి డైరెక్ట‌ర్‌తో ప‌నిచేయ‌డం క‌ల నేర‌వేరిన‌ట్ల‌య్యింది. నా క్యారెక్ట‌ర్‌తో ఎంతో అందంగా డిజైన్ చేశారు. వ‌రుణ్‌తో వ‌ర్క్ చేయ‌డం ఎంజాయ్ చేశాను. హెబ్బా నా బెస్ట్ కో హీరోయిన్‌. గుహ‌న్‌గారు ఎంతో అందంగా చూపించారు మిక్కిగారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. నిర్మాత‌లు బుజ్జి, మ‌ధులు ఎంతో కేర్ తీసుకుని ఈ సినిమా చేశారు. టీం అంద‌రికీ అభినంద‌నలు`` అన్నారు. స్క్రిప్ట్ విన‌కుండా సినిమా ఒప్పుకున్నాను హెబ్బా ప‌టేల్ మాట్లాడుతూ - ``కుమార్ 21 ఎఫ్ సినిమా త‌ర్వాత శ్రీనువైట్ల‌గారితో మిస్ట‌ర్ సినిమా అన‌గానే క‌నీసం స్క్రిప్ట్ కూడా విన‌కుండా ఓకే చేశాను. లైఫ్ చేంజింగ్ మూవీ అవుతుంది. నా కొత్త విష‌యాలు నేర్చుకున్నాను. వ‌రుణ్ అంద‌రికీ డ్రీమ్ హీరో. మిస్ట‌ర్ జ‌ర్నీని నా మెమ‌ర‌బుల్ చేశారు`` అన్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``ఈ సినిమా క‌థ గురించి నాతో వ‌రుణ్ డిస్క‌స్ చేస్తూనే ఉన్నాడు. మంచి ఎంట‌ర్‌టైనింగ్ మూవీ. ట్రెండ్ సెట్ విజువ‌ల్స్‌తో సినిమా ఉంటుంది. మిక్కి అన్నీ టైప్ ఆఫ్ సాంగ్స్‌కు మ్యూజిక్ అందించాడు. ఏప్రిల్ 14న సినిమా రిలీజ్ కానుంది. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు. శేఖర్ క‌మ్ముల మాట్లాడుతూ - ``వ‌రుణ్‌తేజ్‌తో నేను ఫిదా సినిమాకు ప‌నిచేస్తున్నాను. ఇక మిస్ట‌ర్ విష‌యానికి వ‌స్తే విజువ‌ల్స్ చాలా బావున్నాయి. సినిమా రాకింగ్ హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో శ్రీధ‌ర్ సీపాన‌, ప్రిన్స్‌, శ్రీనివాస‌రెడ్డి, స‌త్యంరాజేష్‌, గోపి మోహన్‌, బెన‌ర్జీ, పృథ్వీ త‌దిత‌రులు పాల్గొని చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

మ‌హేష్‌తో అల్ల‌రోడి కిత‌కిత‌లు...

-- Hyderabad Published:08 April 2017 05:06:56 PM

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ అంటే..సినిమాపై ఎన్ని అంచ‌నాలు ఉంటాయో తెలిసింది. టాలీవుడ్‌లో మ‌రే హీరో మ‌హేష్ సినిమాలో న‌టించినా ఆన‌లేడు. ఇందుకు ఉదాహ‌ర‌ణ శ్రీమంతుడు చిత్రం. ఈ చిత్రంలో మ‌హేష్‌తో పాటు రాహుల్ ర‌వీంద్ర‌న్ న‌టించినా, రాహుల్ పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేకుండా పోయింది. ఇప్పుడు అలాంటిదే మ‌రోసారి పున‌రావృత్తం కానుంది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్, ఊపిరి ఫేమ్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కాల్సి ఉంది. ఈ సినిమా కోసం వంశీ న‌టీన‌టుల‌ను ఎంపిక చేసుకునే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా త‌న క‌థ‌లోని ముఖ్య‌మైన పాత్ర కోసం అల్లరి న‌రేష్‌ను సంప్ర‌దించాడ‌ట‌. న‌రేష్ కూడా న‌టించే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయి. మ‌హేష్‌, మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `స్పైడ‌ర్‌`(విన‌ప‌డుతున్న పేరు) త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `భ‌ర‌త్ అనే నేను` సినిమా చేస్తాడు. ఈ సినిమా త‌ర్వాతే వంశీ పైడిప‌ల్లి సినిమా స్టార్ట్ అవుతుంది.

మ‌రోసారి జ‌త క‌డుతున్న హిట్ కాంబో...

-- Hyderabad Published:08 April 2017 04:55:41 PM

కార్తికేయ వంటి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌తో తొలి స‌క్సెస్ కొట్టిన ద‌ర్శ‌కుడు చందు మొండేటి త‌న త‌దుప‌రి చిత్రంగా నాగ‌చైత‌న్య‌తో మ‌ల‌యాళం హిట్ ప్రేమ‌మ్‌ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు చందు మొండేటి త‌న మూడో సినిమాను కూడా నాగ‌చైత‌న్య‌తోనే తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌. రీసెంట్‌గా నాగ‌చైత‌న్య‌ను క‌లిసి క‌థ కూడా వినిపిస్తే, క‌థ న‌చ్చ‌డంతో చైతు చందుకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. పూర్తి స్క్రిప్ట్‌ను త‌యారు చేస్తున్నాడ‌ట చందు మొండేటి. అయితే కొన్ని రోజులుగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున‌, నిఖిల్ కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్న నేప‌థ్యంలో చందు ఇలా యూ ట‌ర్న్ తీసుకుని మ‌ళ్ళీ చైతుతో సినిమా చేయ‌నుండ‌టం గ‌మ‌నార్హం. నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేమ్ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రా రండోయ్ వేడుక చూద్దాం సినిమాతో పాటు కొత్త ద‌ర్శ‌కుడు కృష్ణ డైరెక్ష‌న్‌లో మ‌రో సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల త‌ర్వాత‌నే చైతు, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఉంటుంద‌ని టాక్‌.

గ‌జేంద్రుడు ఆర్య కెరీర్‌లోనే టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది - ఆర్‌.బి.చౌద‌రి

-- Hyderabad Published:08 April 2017 04:52:38 PM

ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. సీజీ వ‌ర్క్ అందుబాటులోకి రావ‌డం ఒక ప‌క్క మంచిదే అయినా, మ‌రో ప‌క్క అంతే రేంజ్‌లో సినిమాలోని రియాల్టీకి కాలం చెల్లింది. అడ‌పా ద‌డ‌పా ఒక‌ట్రెండు సినిమాలు మాత్ర‌మే ఓరిజిన‌ల్ లోకేష‌న్స్‌లో చిత్రీక‌రిస్తున్నారు. అలాంటిది ఓ సినిమాను అడ‌విలోనే షూట్ చేయ‌డ‌మంటే చిన్న విష‌యం కాదు...త‌మిళ ద‌ర్శ‌కుడు రాఘ‌వ చేసిన ప్ర‌య‌త్న‌మ‌దే. రాఘ‌వ‌కు ఆర్యలాంటి హీరో అండ దొర‌క‌డం ఓ ర‌కంగా అదృష్ట‌మ‌నే చెప్పాలి. అంతే కాకుండా హీరో ఆర్య సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయ‌డం విశేషం. ముఖ్యంగా క‌నీస వ‌స‌తులు ఉండ‌ని అడ‌వుల్లో క్యాథ‌రిన్ వంటి సొగ‌స‌రి సినిమా కోసం ప‌నిచేసిందంటే సినిమాలో ఏ రేంజ్ కంటెంట్ ఉందో మ‌రి. ఇదంతా త‌మిళంలో రూపొందిన క‌దంబ‌న్ చిత్రం గురించి. మూడ ద‌శాబ్దాలుగా ఎన్నో సూప‌ర్ డూప‌ర్ చిత్రాల‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.బి.చౌద‌రి నిర్మాత‌గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో `గ‌జేంద్రుడు` అనే పేరుతో విడుద‌ల చేస్తున్నారు.

ఏప్రిల్ 14న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో ఏప్రిల్ 6న జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌.బి.చౌద‌రి, వంశీపైడిప‌ల్లి, రానా, ఆర్య‌, ఎస్‌.వి.కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, సి.క‌ళ్యాణ్‌, పార‌స్‌జైన్‌, వాకాడ అప్పారావు, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, భీమినేని శ్రీనివాస‌రావు, గుణ‌శేఖ‌ర్‌, క్యాథ‌రిన్ థెస్రా త‌దిత‌రులు పాల్గొన్నారు. రానా బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. తొలి ఆడియో సీడీని వంశీ పైడిప‌ల్లి అందుకున్నారు. మా సూప‌ర్‌గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్లో వ‌స్తున్న 89వ సినిమా `గ‌జేంద్రుడు`. ఈ చిత్రం ఆర్య కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది. క్యాథ‌రిన్ ఎంతో చ‌క్క‌గా న‌టించింది. యువ‌న్ మంచి సంగీతాన్ని అందించారు. యువ‌న్ శంక‌ర్ రాజా మా బ్యాన‌ర్‌లో తొలిసారి వ‌ర్క్ చేస్తున్నారు. త‌మిళంలో కదంబ‌న్ ఆడియో మంచి హిట్ అయ్యింది. అలాగే తెలుగులో గ‌జేంద్ర‌న్ ఆడియో పెద్ద హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను. డైరెక్ట‌ర్ రాఘ‌వ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశారని నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి తెలిపారు. కంటెంట్ బేస్‌డ్ సినిమాల‌ను చేసే నిర్మాత‌ల్లో ఆర్‌.బి.చౌద‌రిగారు ముందుంటారు. అందుకు నేను ఆయ‌న‌కు పెద్ద ఫ్యాన్‌ని. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా మొత్తం చేయాలంటే అంత సుల‌భం కాదు. చౌద‌రిగారి స‌పోర్ట్ లేకుంటే ఈ సినిమా చేసేవాళ్ళం కాదు.

క్యాథ‌రిన్ ఎంతో స‌పోర్ట్ చేసింది. త‌న అమ్మాయి అయినా, క‌నీస వ‌స‌తులు లేని అడ‌విలో ఎక్క‌డా ఇబ్బంది పెట్ట‌కుండా న‌టించింది. అందుకు త‌న‌కు థాంక్స్‌. డైరెక్ట‌ర్ రాఘ‌వ రెండో సినిమానే ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌తో చేశాడు. త‌న మంచి ప‌ట్టున్న ద‌ర్శ‌కుడు త‌ను భ‌విష్య‌త్‌లో తెలుగు, త‌మిళంలో పెద్ద ద‌ర్శ‌కుడుగా ఎదుగుతాడు అని హీరో ఆర్య అన్నారు. వెంక‌టేష్ బాబాయ్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఎలాగో, సూప‌ర్‌గుడ్ ఫిలింస్ కూడా త‌న‌కు అలాగేన‌ని అంటుంటారు. ఆయ‌న సూప‌ర్‌గుడ్ ఫిలింస్‌లో చేసిన సినిమాలు మంచి స‌క్సెస్‌ల‌ను సాధించాయి. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు కొత్త జోన‌ర్ సినిమాల‌ను ఆద‌రిస్తుంటారు. అలాంటి కొత్త జోన‌ర్‌లో ఏప్రిల్ 14న రానున్న సినిమా గ‌జేంద్రుడు. ట్రైల‌ర్ అవుట్ స్టాండింగ్‌గా ఉంది. ఆర్య, నేను క‌లిసి బెంగ‌ళూర్ నాట్క‌ల్ సినిమాలో న‌టించాం. త‌ను నాకు మంచి మిత్రుడు. ఆర్య న‌టించిన `గ‌జేంద్రుడు` చిత్రంతో తెలుగులో సూప‌ర్‌స్టార్ రేంజ్ చేరుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నానని ద‌గ్గుబాటి రానా చెప్పారు. నా, ఆర్య కాంబినేష‌న్‌లో నేను, ఆర్య క‌లిసి చేస్తున్న 10వ గ‌జేంద్రుడు. ప‌దకొండ‌వ సినిమా కూడా రానుంది. ఏప్రిల్ 14న రానున్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నానని మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్ రాజా అన్నారు. గ‌జేంద్రుడు సినిమాలో న‌టించ‌డం వ‌ల్ల చాలా విష‌యాలు నేర్చుకున్నాను. సినిమా కోసం అంద‌రూ బాగా క‌ష్ట‌ప‌డ్డారు. డైరెక్ట‌ర్ రాఘ‌వ‌గారు సినిమాలో ప్ర‌తి సీన్‌ను అమేజింగ్‌గా తెర‌కెక్కించారు. అడ‌విలో సినిమాను తీయ‌డం అంత సుల‌భం కాదు. ఆర్‌.బి.చౌద‌రిగారికి ధ‌న్య‌వాదాలు అని క్యాథ‌రిన్ థెస్రా తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథులు చిత్ర‌యూనిట్‌కు శుభాకాంక్ష‌ల‌ను అంద‌జేసి, ఏప్రిల్ 14న తెలుగు, త‌మిళంలో విడుద‌ల‌వుతున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని అభిల‌షించారు.

ఎన్టీఆర్ సినిమాలో విల‌న్‌గా విజ‌య్‌...

-- Hyderabad Published:08 April 2017 04:49:34 PM

త‌మిళ హీరో విజ‌య్ కాదు లెండి. అస‌లు విష‌య‌మేంటంటే..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న `జై ల‌వ‌కుశ‌` విష‌యంలో ఇప్పుడు ఎంతో ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకెళుతున్నాడు. ఎందుకో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్ వంటి స‌క్సెస్‌లు త‌ర్వాత చేస్తున్న సినిమా కావ‌డంతో ప్ర‌తి విష‌యంలోనూ ఎంతో కేర్‌ఫుల్‌గా ఉంటున్నాడు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టైటిల్ లోగో అంద‌రిలో ఆస‌క్తిని రెట్టింపు చేసింది. ఈ చిత్రంలో క‌న్న‌డ వివాద‌స్ప‌ద న‌టుడు దునియా విజ‌య్‌ను తీసుకోవాల‌ని యూనిట్ అనుకుంటుంది. రీసెంట్‌గా కొన్ని రోజుల క్రితం క‌న్న‌డ సినిమాలో ఇద్ద‌రు స్టంట్ మాస్ట‌ర్స్ స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా దునియా విజ‌య్‌దే కావ‌డంతో క‌న్న‌డ సినీ ఇండ‌స్ట్రీ అత‌న్ని బ్యాన్ చేసింది. ఇప్పుడు దునియా విజ‌య్‌ను `జై ల‌వ‌కుశ‌`లో తీసుకోనున్నార‌నేది అధికార‌కంగా విష‌యం బ‌య‌ట‌కు రానుంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న ఈ సినిమాలో రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. గెస్ట్ రోల్‌లో స‌మంత కూడా క‌నిపించ‌నుంద‌ని టాక్‌. ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఆగ‌స్టులో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

శృంగార‌తార‌తో రాజ‌శేఖ‌ర్ చిందులు....

-- Hyderabad Published:08 April 2017 04:45:46 PM

అంకుశం, అగ్ర‌హం, మ‌గాడు వంటి ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మేన్‌గా వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లు ఊగించిన డా.రాజ‌శేఖ‌ర్ ట‌ఫ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నచిత్రం ``పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ‌``. ఇది వ‌ర‌కు విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కు ఆడియెన్స్ నుండి మంచి స్పంద‌న వ‌చ్చింది. చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు రాజశేఖ‌ర్‌ను స్టైలిష్ లుక్స్‌తో సరికొత్త‌గా ప్రజెంట్ చేస్తున్నాడ‌ని, క‌చ్చితంగా రాజ‌శేఖ‌ర్‌కు ఇది కంబ్యాక్ ఫిలిం అవుతుంద‌ని అంటున్నారు. శృంగార తార సన్నిలియోన్ గ‌రుడ వేగ‌లో ఓ ప్రత్యేక‌మైన సాంగ్‌లో న‌టిస్తుంది. తాజాగా చిత్ర యూనిట్ ముంబై ఫిలింసిటీలో ఈ పాట కోసం వేసిన భారీ సెట్టింగ్‌లో చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. `గందిబాత్‌...`, `రాం చాహే లీల చాహే...` వంటి బాలీవుడ్ సూప‌ర్‌హిట్స్‌కు కొరియోగ్ర‌ఫీ అందించిన విష్ణుదేవా ఈ పెప్పి బీట్‌కు న‌త్య‌రీతుల‌ను స‌మ‌కూరుస్తున్నారు. ఇంత‌కు ముందు తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకు కొరియోగ్ర‌ఫీ అందించిన‌ విష్గ్ణుదేవా చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో మాస్ నంబ‌ర్‌కు కొరియోగ్ర‌ఫీ చేయ‌నున్నారు. చంద‌మామ క‌థ‌లు, గుంటూరు టాకీస్ చిత్రాల‌తో విమ‌ర్శ‌కులు, ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు, యాంగ్రీ యంగ్ మేన్ రాజ‌శేఖ‌ర్ కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రం మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు స‌న్నిలియోన్ స్పెష‌ల్ సాంగ్ గ‌రుడ వేగ‌పై అంచ‌నాల‌ను ఇంకా పెంచుతుంది. జ్యోస్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ చిత్రం``పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ‌``ను నిర్మాత‌లు ఖ‌ర్చుకు ఏ మాత్రం వెనుకాడ‌కుండా రూపొందిస్తున్నారు.

బాలీవుడ్ భామతో మహేష్...

-- Hyderabad Published:08 April 2017 04:38:52 PM

సూపర్‌స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీమంతుడు త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. `భ‌ర‌త్ అనే నేను..` అనే టైటిల్‌లో రూపొంద‌నున్న ఈ చిత్రంలో మ‌హేష్ ఎమ్మెల్యే పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు. ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్ర‌సాద్ అల్రెడి మ్యూజిక్ ట్యూన్స్ రెడీ చేసేశాడు. లండ‌న్‌, స్పెయిన్‌, ఇట‌లీలో సినిమా లోకేష‌న్స్ వేట కూడా పూర్త‌య్యింది. సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా యూర‌ప్‌లోనే జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. ఈ చిత్రంలో మ‌హేష్ ఎన్నారై యువ‌కుడిగా ముందు తెర‌పై క‌న‌ప‌డ‌తాడ‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా మ‌హేష్ స‌ర‌స‌న ఏ హీరోయిన్ అయితే స‌రిపోతుందా అని యూనిట్ వ‌ర్గాలు బాగానే అన్వేషించాయి. బాలీవుడ్ బ‌యోపిక్ `ధోని` చిత్రంలో న‌టించిన కైరా అద్వానిని న‌టింప చేసే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై ఓ క్లారిటీ రానుంది.

లంక రివ్యూ...

-- Hyderabad Published:29 April 2017 03:48:27 PM

నిర్మాత‌లుః నామ‌న దినేష్‌, నామ‌న విష్ణుకుమార్‌

క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః శ్రీముని

నిర్మాణ సంస్థః రోలింగ్ రాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌

తారాగ‌ణంః రాశి, సాయి రోన‌క్‌, ఐనా సాహ‌, సిజ్జు, సుప్రీత్‌, లీనా సిద్ధు, స‌త్యం రాజేష్‌, స‌త్య త‌దిత‌రులు

సంగీతంః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌

సినిమాటోగ్ర‌ఫీః వి.ర‌వికుమార్‌

క‌ళః హ‌రివ‌ర్మ‌

సీనియ‌ర్ హీరోయిన్స్ అంద‌రూ ఇప్పుడు యంగ్ జ‌న‌రేష‌న్ హీరో, హీరోయిన్స్‌కు అమ్మ‌లుగా, నాన్న‌లుగా, అంటీ, అంకుల్‌గానో క‌న‌ప‌డుతున్నారు. క‌ళ్యాణ వైభోగ‌మే చిత్రంతో ఆ జాబితాలోకి చేరింది సీనియ‌ర్ హీరోయిన్ రాశి. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పుడు రాశి చేసిన కొత్త ప్ర‌య‌త్నం `లంక‌`. మ‌నిషి మెదడుని చ‌దివి కంట్రోల్ చేసే టెలిప‌తి అనే విద్యను ఎలా ఉప‌యోగించ‌వ‌చ్చు అనే పాయింట్‌లో చేసిన `లంక‌` చిత్రం మ‌రి రాశికి ఎలాంటి గుర్తింపు తెస్తుందో తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థః ఓ ఇంట్లో ఒంటిరిగా నివ‌సిస్తూ ఉంటుంది రెబెకా విలియ‌మ్స్‌(రాశి). రెబెకా టెలిప‌తిలో నిపుణురాలు. ద‌ర్శకుడిగా రాణించాలంటే షార్ట్ ఫిలిం ద్వారా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకోవాల‌నుకునే సాయిరోన‌క్ రెబెకా ఇంటి ద‌గ్గ‌ర‌కు షార్ట్ ఫిలిం చేయ‌డానికి స్వాతి(ఐనా సాహా), త‌న మిత్రులు స‌త్య‌, సుద‌ర్శ‌న్‌ల‌తో క‌లిసి వ‌స్తాడు. వారం రోజులు పాటు జ‌రిగే షూటింగ్‌లో రెబెకా, స్వాతి మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డుతుంది. షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత అమెరికా వెళ్ళడానికి కంటే ముందుగానే స్వాతిని, సాయి క‌ల‌వాల‌నుకుంటాడు. కానీ స్వాతి రాదు. స్వాతికి ఫోన్ చేస్తే, మొబైల్ స్విచ్చాప్ అని వ‌స్తుంది. రెండు రోజుల త‌ర్వాత స్వాతి మ‌ల‌యాళంలో పెద్ద హీరోయిన్ కావ‌డంతో పోలీసులు వ‌స్తారు. స్వాతి కేసును ఇంటార‌గేట్ చేస్తారు. అయితే రెబెకా కార‌ణంగానే స్వాతి క‌న‌ప‌డ‌కుండా పోయింద‌ని, స్వాతి పాండిచ్చేరిలో ఉంద‌ని పోలీసుల‌కు తెలుస్తుంది. పాండిచ్చేరి చేరుకున్న పోలీసుల‌కు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. అస‌లు రెబెకా ఎవ‌రు? శ‌ర‌త్ ఎవ‌రు? స్వాతి, రెబెకా, శ‌ర‌త్ మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏంటి అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

బ‌లాలుః -

క‌థ‌ 

సినిమాటోగ్ర‌ఫీ 

రాశి పెర్‌ఫార్మెన్స్‌

బ‌ల‌హీన‌త‌లు

- క‌థ‌నం

- ఎడిటింగ్

- సీన్స్‌సాగ‌తీత‌గా అనిపించ‌డం

స‌మీక్షః ద‌ర్శ‌కుడు శ్రీముని టెలిప‌తి అనే టెక్నాల‌జీకి, హ్యుమ‌న్ ట్రాఫికింగ్‌కు లింక్ పెడుతూ రాసుకున్న క‌థ బావుంది. ఈ లింక్‌ను క్లైమాక్స్‌లో రివీల్ చేసిన తీరు ఇంకా బావుంది. సినిమాను ప్రేక్ష‌కులు ప‌సిగ‌ట్ట‌లేని విధంగా తీయాల‌నే త‌ప‌న కొద్ది చేసిన ట్విస్టులు సినిమాలో తిక‌మ‌క‌ను క్రియేట్ చేశాయి. నెరేష‌న్ విష‌యంలో ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాడు. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ , సెకండాఫ్‌లోసీన్స్ కొన్ని అన‌వ‌స‌రంగానూ, సాగ‌దీత‌గానూ క‌నిపిస్తాయి. థ్రిల్ల‌ర్ సినిమాలు ప‌రుగు పెట్టేలా ఉండాలి. కానీ లంక నిడివి ఎక్కువ కావ‌డం కూడా పెద్ద మైన‌స్. ర‌వికుమార్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ప్ర‌తీ సీన్ ను కెమెరాలో ర‌వికుమార్ చిత్రీక‌రించిన తీరు మెచ్చుకోలుగా ఉంది. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూప‌ర్బ్ అని చెప్ప‌లేం కానీ ప‌రావాలేదు అనొచ్చు. ఇక సినిమా అంత‌టినీ రాశి త‌న భుజాల‌పై వేసుకుని న‌డిపించింది. సిజ్జు, సుప్రీత్, గిరిబాబు, ఐనా సాహా, సాయి రోన‌క్, స‌త్య‌, సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. హీరో, హీరోయిన్ అండ్ గ్యాంగ్‌ను రాశి చంపేలా వ‌చ్చే క‌ల‌, సెకండాఫ్‌లో హీరోయిన్ పోలీసులు వెంట‌ప‌డే స‌న్నివేశాలు అన‌వ‌ర‌సంగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు క‌థ‌నంపై కాస్తా శ్ర‌ద్ధ పెట్టి ఉంటే బావుండేద‌నిపించింది. టెలిప‌తి అనే కాన్సెప్ట్ సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు ఏ మేర అర్థం అవుతుందో చెప్ప‌లేం.

చివ‌రాఖ‌రుగా..మోతాదు మించిన ట్విస్టుల‌తో `లంక` గంద‌రగోళం

 

రేటింగ్ః 2.25/5

బాహుబలి 2 రివ్యూ

-- Hyderabad Published:29 April 2017 10:47:29 AM

సమర్పణ: కె.రాఘవేంద్రరావు

నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్‌  

తారాగణం: ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా, సత్యరాజ్‌, నాజర్‌, రమ్యకృష్ణ , సుబ్బరాజు తదితరులు

సంగీతం: ఎం.ఎం.కీరవాణి

సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌కుమార్‌

కథ: వి.విజయేంద్రప్రసాద్‌

ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబుశిరిల్‌

వి.ఎఫ్‌.ఎక్స్‌: కమల్‌ కణ్ణన్‌

కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు

యాక్షన్‌: కింగ్‌ సాల్మాన్‌

సౌండ్‌ డిజైనర్‌: పి.ఎం.సతీష్‌

క్యాస్టూమ్స్‌: రమారాజమౌళి, ప్రశాంతి త్రిపురినేని

లైన్‌ ప్రొడ్యూసర్‌: శ్రీవల్లీ

నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని

దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌నే ప్ర‌శ్న బాహుబ‌లి 2తో ఎట్ట‌కేల‌కు విడిపోయింది. గ‌త రెండేళ్ళుగా అంద‌రూ ఎదురుచూసిన స‌మాధానం. అయితే ఒక సీన్‌తో ముగిసిపోయే సమాధానం కాదు, ప్రీ క్లైమాక్స్‌లో వ‌చ్చే స‌న్నివేశం కావ‌డంతో సినిమా అంతా చూసేలా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి బాహుబ‌లి 2 చిత్రాన్ని తెర‌కెక్కించాడు. రాజాజ్ఞ‌ను పాటించే క‌ట్ట‌ప్ప రాజునే ఎందుకు చంపాడు. మొద‌టి పార్ట్‌లో నా త‌ప్పుల‌ను క్ష‌మించు అని శివ‌గామి ఎందుకు చెప్పింది? ఇంత‌కు ఆమె చేసిన త‌ప్పేంటి? మ‌రి క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని చంపేంత ఎం వ‌చ్చింది? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కావాలంటే బాహుబ‌లి 2 చూడాల్సిందే. విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన బాహుబ‌లి రెండో భాగం కోసం సినీ ప్ర‌పంచంతో పాటు అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూశారు. తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి తెలియ‌జేసిన బాహబ‌లి సినిమా గురించి తెలుసుకోవాలంటే ముందు క‌థ తెలుసుకుందాం...

క‌థః

మ‌హిష్మ‌తి రాజ్యానికి వార‌సుడు అయిన మ‌హేంద్ర బాహుబ‌లి( ప్ర‌భాస్‌), శివుడుగా అట‌వికుల‌తో పెంచ‌బ‌డుతాడు. అవంతిక ప్రేమ కోసం మ‌హిష్మ‌తి రాజ్యంలోకి ప్రవేశించిన బాహుబ‌లి, త‌న త‌ల్లి ఎవ‌రో తెలియ‌కుండానే ఆమెను ర‌క్షిస్తాడు. దేవ‌సేన‌ను ర‌క్షించే ప్ర‌య‌త్నంలో భాగంగా క‌ట్ట‌ప్ప‌(స‌త్య‌రాజ్‌)తో గొడ‌వ‌ప‌డ‌తాడు. మ‌హిష్మ‌తి మ‌హారాజు భ‌ళ్ళాలదేవుడు(రానా) త‌న‌యుడు భ‌ద్ర‌ను చంపేస్తాడు. మ‌హేంద్ర బాహుబ‌లి చూసిన క‌ట్ట‌ప్ప వారి రాజు, దైవం అమ‌రేంద్ర బాహుబ‌లి గురించి క‌థ చెబుతాడు.

కాళ‌కేయుల‌ను యుద్ధంలో ఓడించిన అమ‌రేంద్ర బాహుబ‌లి మ‌హారాజుగా నిర్ణ‌యింప‌బ‌డ‌తాడు. రాజ‌మాత శివ‌గామి మాట‌పై క‌ట‌ప్ప‌తో క‌లిసి దేశాట‌న బ‌య‌లుదేరుతాడు. కుంత‌ల దేశం చేరుకున్న అమరేంద్ర బాహుబ‌లి యువ‌రాణి దేవ‌సేన‌(అనుష్క‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె ప్రేమ పొంద‌డం కోసం బాహుబ‌లి కుంత‌ల రాజ్యంలోనే ఉండిపోతాడు. ఈలోపు దేవ‌సేన అందచందాలు, తెలివి తేట‌లు గురించి తెలుసుకున్న భ‌ళ్ళాల‌దేవుడు, దేవ‌సేనను త‌న భార్య‌గా చేయ‌మ‌ని త‌ల్లి శివ‌గామిని కోరుతాడు. శివ‌గామి కూడా స‌రేన‌ని మాట ఇచ్చేసి కోడ‌లు క‌మ్మని దేవ‌సేన‌కు వ‌ర్త‌మానం పంపుతుంది. భ‌ళ్ళాల‌దేవుడు కుతంత్రం తెలియ‌ని దేవ‌సేన, శివ‌గామికి ఎదురుచెబుతుంది. దాంతో కోపం తెచ్చుకున్న శివ‌గామి దేవ‌సేన‌ను బంధించ‌మ‌ని కుంత‌ల రాజ్యంలోని బాహుబ‌లికి వ‌ర్త‌మానం పంపుతుంది.

తాను భార్య‌గా ఎంతదూరం అయినా వ‌స్తాను కానీ ఆత్మమాభినం చంపుకుని బంధీగా రాలేన‌ని దేవ‌సేన‌, బాహుబ‌లితో అంటుంది. దేవ‌సేన మాన ప్రాణాల‌ను బాధ్య‌త‌గా తీసుకున్న బాహుబ‌లి ఆమెకు మాట ఇచ్చి, దేవ‌సేన‌ను మ‌హిష్మ‌తికి తీసుకుని వ‌స్తాడు. రాజ్య‌స‌భ‌లో బాహుబ‌లి దేవ‌సేన వైపు నిల‌వ‌డంతో శివ‌గామి దేవ‌సేన కావాలంటే మ‌హారాజుగా ఉండ‌కూడ‌ద‌నే ష‌ర‌తు పెడుతుంది. దేవ‌సేన‌కు ఇచ్చిన మాట కోసం త‌న మ‌హారాజ ప‌ద‌వినే వ‌దులుకుని స‌ర్వ సైన్యాధ్య‌క్షుడుగా ప‌నిచేయ‌డానికి సిద్ద‌ప‌డ‌తాడు బాహుబ‌లి. అయితే భ‌ళ్ళాల‌దేవుడు కుటిల బుద్ధితో శివ‌గామికి, బాహుబ‌లిపై అనుమానం వ‌చ్చేలా సృష్టించడంతో, శివ‌గామి, బాహుబ‌లిని చంప‌మ‌ని క‌ట్ట‌ప్ప‌కు ఆదేశం ఇస్తుంది.

ఆమె ఆదేశాన్ని అమ‌లు చేసిన క‌ట్ట‌ప్ప‌, అస‌లు విష‌యాన్ని శివ‌గామికి చెప్ప‌డంతో ఏమవుతుంది? భ‌ళ్ళాలదేవుడు ఏం చేస్తాడు? చివ‌ర‌కు త‌న తండ్రి అమ‌రేంద్ర బాహుబ‌లి క‌థ‌ను తెలుసుకున్న మ‌హేంద్ర బాహుబ‌లి ఏం చేస్తాడు? భ‌ళ్ళాల‌దేవుడుని మ‌హేంద్ర బాహుబ‌లి ఏం చేస్తాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

బలాలు:

- కథనం

- ఎమోషనల్‌ డ్రామా

- సంగీతం

- బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్

- సినిమాటోగ్రఫీ

- విఎఫెక్స్‌

బలహీనతలు:

- నిడివి ఎక్కువగా ఉండటం

స‌మీక్షః

ప్ర‌భాస్‌, అనుష్క‌, రానా, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్‌, స‌త్య‌రాజ్ స‌హా న‌టీన‌టులంద‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో చక్క‌గా న‌టించారు. గ్రాఫిక్స్ ఫ‌స్ట్ పార్టును త‌ల‌ద‌న్నేలా ఉన్నాయి. పాట‌లు బావున్నాయి. రీరికార్డింగ్ కూడా బావుంది. మాహిష్మ‌తి రాజాస్థానం, భ‌ల్లాల‌దేవుడి పాల‌న‌, ప్ర‌జ‌లు, సినిమా ప్రారంభంలో అమ‌రేంద్ర బాహుబ‌లి ఏనుగు పొగ‌రు అణ‌చే స‌న్నివేశం వంటివ‌న్నీ ఆక‌ట్టుకుంటాయి. దానికి తోడు ఎద్దుల కొమ్ముల‌కు నిప్పంటించి చేసిన ఫైటు, కుంత‌ల సామ్రాజ్యాన్ని కాపాడ‌టం కోసం ఆన‌క‌ట్ట‌ను ప‌గ‌ల‌కొట్టే విధానం, బాహుబ‌లికి వైజ్ఞానిక శాస్త్రం పట్ల ఉన్న అభిలాష వంటివ‌న్నీ మెప్పిస్తాయి. అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ ఉన్న స‌న్నివేశాల్లో పోటాపోటీగా న‌టించిన వైనం క‌నిపిస్తుంది. చాలా కాలం త‌ర్వాత ఇద్ద‌రు మ‌హిళ‌లు ఎదురెదురుగా త‌ల‌ప‌డి న‌టించిన‌ట్టు అనిపిస్తుంది.

కుంత‌ల దేశం చూడ‌చ‌క్క‌గా అనిపిస్తుంది. కుంత‌ల సామ్రాజ్యంలో స్త్రీలు జ‌రుపుకునే గోపిక పూర్ణిమ పండుగ బావుంది. క‌న్న‌య్య‌ను నిద్ర‌పుచ్చుతూ పాడే పాట‌లో అనుష్క చాలా అందంగా క‌నిపించింది. అనుష్క‌, ప్ర‌భాస్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల్లో రొమాన్స్ గుంభ‌నంగా ఉంది. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడిని మెచ్చుకోవాలి. న‌టులంద‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో చక్క‌గా న‌టించారు. గ్రాఫిక్స్ ఫ‌స్ట్ పార్టును త‌ల‌ద‌న్నేలా ఉన్నాయి. పాట‌లు బావున్నాయి. రీరికార్డింగ్ కూడా బావుంది. మాహిష్మ‌తి రాజాస్థానం, భ‌ల్లాల‌దేవుడి పాల‌న‌, ప్ర‌జ‌లు, సినిమా ప్రారంభంలో అమ‌రేంద్ర బాహుబ‌లి ఏనుగు పొగ‌రు అణ‌చే స‌న్నివేశం వంటివ‌న్నీ ఆక‌ట్టుకుంటాయి. దానికి తోడు ఎద్దుల కొమ్ముల‌కు నిప్పంటించి చేసిన ఫైటు, కుంత‌ల సామ్రాజ్యాన్ని కాపాడ‌టం కోసం ఆన‌క‌ట్ట‌ను ప‌గ‌ల‌కొట్టే విధానం, బాహుబ‌లికి వైజ్ఞానిక శాస్త్రం పట్ల ఉన్న అభిలాష వంటివ‌న్నీ మెప్పిస్తాయి. అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ ఉన్న స‌న్నివేశాల్లో పోటాపోటీగా న‌టించిన వైనం క‌నిపిస్తుంది. చాలా కాలం త‌ర్వాత ఇద్ద‌రు మ‌హిళ‌లు ఎదురెదురుగా త‌ల‌ప‌డి న‌టించిన‌ట్టు అనిపిస్తుంది. సినిమాలో మైన‌స్ పాయింట్లు అని వేలెత్తి చూపించ‌ద‌గ్గ‌వి పెద్ద‌గా ఉండ‌వు. కాక‌పోతే ఈ రెండో భాగంలో అక్క‌డ‌క్క‌డా కొంద‌రికి, ప్ర‌త్యేకించి అనుష్క‌కు త‌ప్ప కాస్ట్యూమ్ డిజైన‌ర్స్ ప్ర‌త్యేకంగా చేసిందేమీ లేదు.

కుమార‌వ‌ర్మ పాత్ర ద్వారా న‌వ్వు తెప్పించాల‌నుకున్నారు కానీ ఆ ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైన‌ట్టు అనిపిస్తుంది. ఆ పాత్ర స‌రిగా న‌వ్వించ‌లేక‌పోయింద‌న్న‌ది వాస్త‌వం. తొలిస‌గంలో `ఇది నా మాట‌. నా మాటే శాస‌నం` అని అన్నీ తెలుసుకుని మ‌స‌లుకున్న శివ‌గామి ఇందులో చెప్పుడు మాట‌లు వింటూ, త‌న చుట్టూ ఏం జ‌రుగుతుందో తెలుసుకోలేని అశ‌క్తురాలిగా క‌నిపిస్తుంది. అప్ప‌టిదాకా ప్రాణంగా చూసుకున్న క‌ట్ట‌ప్ప కేవ‌లం రాజాజ్ఞ కోసం బాహుబ‌లిని చంప‌డం అనేది ఎవ‌రూ ఊహించ‌రు. ప‌దుల బాణాలు గుచ్చుకున్నా లెక్క‌చేయ‌ని బాహుబ‌లి కట్ట‌ప్ప క‌త్తితో పొడ‌వ‌గానే చ‌నిపోవ‌డం చాలా పేల‌వంగా అనిపిస్తుంది. క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడ‌న్న‌ది ఊరించి ఊరించి చివ‌రికి ద‌ర్శ‌కుడు తేల్చేసేశాడ‌న్న‌ది ఇట్టే అర్థ‌మైపోతుంది. ప్రేక్ష‌కుడికి ద‌ర్శ‌కుడు చెప్పిన కార‌ణం పెద్ద మెప్పించేలా అనిపించ‌లేదు.

దాదాపు మూడు గంటల నిడివి ఇప్ప‌టి ప్రేక్ష‌కుడిని కాస్తా ఇబ్బంది పెట్టేదే. అయితే తెలుగు సినిమా అయిన బాహుబ‌లి ఒక మామూలు సినిమా స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగింది. తాజాగా బాహుబ‌లి ది కంక్లూజ‌న్ కూడా ఆ స్థాయిని చేరుకునేలా తెర‌కెక్కింది. తొలి భాగంలో మాహిష్మ‌తి సామ్రాజ్యం మాత్ర‌మే క‌నిపించింది. కానీ పార్ట్ 2 లో కుంత‌ల సామ్రాజ్యం కూడా క‌నుల‌పండువ‌గా అనిపించింది. ప్ర‌భాస్‌, అనుష్క జంట‌గా ఇంత‌కు ముందు చిత్రాల్లో క‌న్నా ఈ సినిమాలో మ‌రింత‌గా అల‌రించారు. ప్ర‌భాస్‌, రానా ఇద్ద‌రూ యుద్ధ స‌న్నివేశాల్లో ఒక‌రిని మించేలా మ‌రొక‌రు క‌నిపించారు. అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు పోటాపోటీగా అనిపించాయి.

ఫ‌స్ట్ పార్ట్ ను శ్ర‌ద్ధ‌గా చూసిన ఎవ‌రైనా సెకండ్ పార్ట్ ను ఇట్టే ఊహించేయ‌వ‌చ్చు. కేవ‌లం రెండు డైలాగుల మీద సెకండాఫ్‌ను అల్లుకున్నారు. కొన్ని సీన్లు ర‌క్తి క‌ట్టించాయి. బిజ్జ‌ల‌దేవుడిగా ఎడ‌మ‌చేయి బాగాలేనివాడిగా నాజ‌ర్ న‌ట‌న కూడా అద్భుతం. ఇందులో ఏ పాత్రా వృథాగా అనిపించ‌లేదు. రాజ‌ప్రాసాదాల‌కు, రాజ స‌భ‌ల‌కు, అంతఃపురాల‌కు సంబంధించి సాబు సిరిల్ ఎక్కువ‌గా ఆగ్రా ఫోర్ట్ ను మోడ‌ల్‌గా తీసుకున్న‌ట్టు ఇట్టే తెలిసిపోతుంది. అహంకారం వ‌ల్ల‌, త‌న మాట నెగ్గాల‌నుకోవ‌డం వ‌ల్ల‌, ఈర్ష్య‌, అసూయ‌ల వ‌ల్ల రాజ్యాలు కూలిపోయాయ‌ని చ‌రిత్ర చెబుతోంది. దాన్ని ఊహాత్మ‌కంగా జాన‌ప‌దానికి జోడించి ఈ క‌థ‌ను అల్లారు. అక్క‌డ‌క్క‌డా భావోద్వేగాలు పండాయి. క‌థ‌ను, స‌న్నివేశాల బ‌లాన్ని, సినిమా నిడివిని ప‌క్క‌న‌పెడితే తొలిస‌గంలో ప్రేక్ష‌కుడికి క‌లిగిన ప్ర‌శ్న‌ల‌కు ఈ చిత్రం స‌మాధాన‌మ‌వుతుంది. విజువ‌ల్ వండ‌ర్‌గా ప్రేక్ష‌కుడిని థియేట‌ర్‌లో క‌ట్టి ప‌డేస్తుంది. చివ‌రాఖ‌రుగా....భ‌ళిరా బాహుబ‌లి..సాహోరే రాజ‌మౌళి...

 

రేటింగ్ః 4/5

పిల్ల‌ల గురించి చెప్పిన స‌మంత‌!

-- Hyderabad Published:29 April 2017 10:09:11 AM

ఆక‌లైతే అన్నం పెడ‌తారు.. పేద‌ల‌కు ఇంకోర‌కంగానో, ఇంకో ర‌కంగానో సాయం చేస్తారు. కానీ స‌మంత మాత్రం త‌ను ద‌త్త‌త తీసుకున్న పిల్ల‌ల‌కు కొత్త త‌ర‌హా గిఫ్ట్ ఇచ్చింది. శుక్ర‌వారం పుట్టిన‌రోజు జ‌రుపుకున్న స‌మంత త‌న ద‌త్త‌త తీసుకున్న పిల్ల‌ల‌తో హ్యాపీగా గ‌డిపింది. అదీ బిగ్ సినిమాస్‌లో. బిగ్ సినిమాస్‌కు త‌ను ద‌త్త‌త తీసుకున్న అనాథ పిల్ల‌ల‌ను తీసుకెళ్లింది. వారికి బాహుబ‌లి ది కంక్లూజ‌న్‌ను చూపించింది. స‌మంత మాట్లాడుతూ ``పిల్ల‌ల క‌ళ్ల‌ల్లో ఆనందం చూశాను. ఇంట్లో పిల్ల‌ల‌ను సినిమాల‌కు తీసుకెళ్ల‌డానికి అమ్మానాన్న‌లుంటారు . కానీ అనాథ పిల్ల‌ల‌ను థియేట‌ర్ల‌కు ఎవ‌రు తీసుకెళ్తారు? అందుకే నేను తీసుకెళ్లాను. పెద్ద‌ల క‌న్నా చిన్న పిల్ల‌ల‌కే ఫాంట‌సీ సినిమాల‌మీద మోజు ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే నేను పిల్ల‌ల‌ను సినిమాల‌కు తీసుకొచ్చి వారి కోరిక తీర్చాను`` అని చెప్పింది స‌మంత‌.

వ‌రుణ్ చిత్రంలో అత‌నేం చేస్తాడు?

-- Hyderabad Published:29 April 2017 10:04:07 AM

వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టిస్తున్న సినిమా ఫిదా. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. ఈ సినిమాలో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. సాయిప‌ల్ల‌వి నాయిక‌. ఎన్నారై అబ్బాయికి, తెలంగాణ అమ్మాయికి మ‌ధ్య జ‌రిగే ప్రేమ క‌థ ఇది. ఇందులో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే పాత్ర ఏంటి? ఆరా తీశాం.. ``నేను తెలుగబ్బాయిగా మాత్రం న‌టించ‌డం లేదు. తెలుగు అబ్బాయిగా క‌నిపించ‌కూడ‌ద‌నే న‌న్ను శేఖ‌ర్ క‌మ్ముల‌గారు ఈ రోల్‌కి తీసుకున్నారు. నేను ఇంత‌కు ముందు అనామిక కోసం ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేశాను. ఇప్పుడు ఈ సినిమా కోసం శేఖ‌ర్ నాకు ఫోన్ చేయ‌గానే ``ఎవ‌రో, ఏంటో నాకు అన‌వ‌స‌రం. మీరు ఫోన్ చేశారు. అంతే చాలు.. నేను వ‌చ్చి న‌టిస్తాను` అని అన్నా. కొన్నాళ్ల త‌ర్వాత ఇప్పుడు హైద‌రాబాద్‌కి రావ‌డం ఆనందంగా ఉంది`` అని అన్నారు. త‌న పాత్ర మొత్తం చిత్రానికే కొత్త క‌థ‌లా అనిపిస్తుంద‌ని కూడా హ‌ర్ష చెప్పారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సూచ‌న‌లు

-- Hyderabad Published:29 April 2017 10:03:34 AM

అనంత‌పురం జిల్లాలోని ఎర్ర‌తిమ్మ‌రాజు చెరువులో తెప్ప బోల్తా ప‌డి ఒకే కుటుంబంలోని 13 మంది చ‌నిపోయిన దుర్ఘ‌ట‌న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. చెరువు లోతు ప్రాణాలు తీసేంత‌గా ఉన్న‌ప్పుడు స్థానిక పాల‌కులుగానీ, అధికార గ‌ణం కానీ స‌రైన ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవ‌ని విమ‌ర్శించారు. ఇక‌నైనా ప్ర‌జా ప్ర‌తినిధులు మేల్కొనాల‌ని అన్నారు. ఇటువంటి విషాద ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న తెలిపారు. బాధితుల కుటుంబానికి వెంట‌నే సాయం చేయాల‌ని ఆయ‌న సూచించారు.

కాంగ్రెస్ నేత‌ల‌ను నిల‌దీయండి - కె.సి.ఆర్‌

-- Hyderabad Published:28 April 2017 05:24:03 PM

తెలంగాణ 16వ ఆవిర్భావ స‌భ వ‌రంగ‌ల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. భ‌విష్య‌త్, 2019లో జ‌రిగబోయే ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ విజ‌యం సాధించే దిశ‌గా అంద‌రూ కృషి చేయాల‌ని కేడ‌ర్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాజెక్టులు క‌డుతుంటే, కాంగ్రెస్ నాయ‌కులు అడ్డు త‌గులుతున్నారు. కాబ‌ట్టి వారిని గ్రామ ప్ర‌జ‌లు నిల‌దీయాల‌ని సూచించారు. కాంగ్రెస్ పాల‌న కాలంలో ముఖ్య‌మంత్రులు వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, కిర‌ణ్‌కుమార్ రెడ్డిలు తెలంగాణ ప్ర‌జ‌లు, నాయ‌కుల‌ను కించ‌ప‌రిచినా ప‌ట్టించుకోని కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు మాత్రం ఎందుకు అడ్డు త‌గులుతున్నార‌ని ప్ర‌శించారు. ఇలాంటి కాంగ్రెస్ నాయ‌కుల కార‌ణంగా తెలంగాణ పరిస్థితి దారుణంగా త‌యార‌య్యింద‌ని, ప్ర‌జ‌లు పొట్ట కూటి కోసం వేరే ప్రాంతాల‌కు వ‌ల‌స‌లు వెళ్ళార‌ని కూడా అన్నారు.

సి.బి.ఐ కోర్టులో జ‌గ‌న్‌కు ఊర‌ట‌..

-- Hyderabad Published:28 April 2017 05:23:26 PM

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సి.బి.ఐ ప్ర‌త్యేక‌కోర్టులో ఊర‌ట ల‌భించింది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ సిబిఐ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కోర్టు కొట్టేసింది. సిబిఐ వాద‌న‌లు విన్న కోర్టు వారి వాద‌న‌ల‌ను తిరస్క‌రించింది. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారంటూ సిబిఐ త‌ర‌పున న్యాయ‌వాది కోరిన బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌ను కొట్టేసింది. ఆక్ర‌మాస్థుల కేసులో సాక్షిగా ఉన్న మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌మాకాంత్ రెడ్డి సాక్షి ఛానెల్‌లో ఇచ్చిన ఇంట‌ర్వ్యూను వివాదానికి కార‌ణ‌మైంది. జ‌గ‌న్ కావాల‌నే విచార‌ణ తీరును త‌ప్పు ప‌ట్టించేలా మాట్లాడించార‌ని సిబిఐ త‌ర‌పున లాయ‌ర్ వాదించారు. అయితే ఛానెల్ ఎడిట‌ర్ తీసుకునే నిర్ణ‌యాలకు, జ‌గ‌న్‌కు సంబంధం లేదంటూ కోర్టు తెలిపింది. ఇరు ప‌క్షాల వాద‌న‌ను విన్న కోర్టు సిబిఐ పిటీష‌న్‌ను కొట్టేసింది

భార‌త్ డిమాండ్‌ను తోసిపుచ్చిన పాక్‌...

-- Hyderabad Published:28 April 2017 05:21:59 PM

ముంబై ఉగ్ర‌వాది దాడిపై మ‌ళ్ళీ విచార‌ణ జ‌ర‌పాల‌న్న భార‌త్ డిమాండ్‌ను పాకిస్థాన్ తోసిపుచ్చింది. దాడికి కార‌ణ‌మైన కీల‌క సూత్ర‌ధారి జ‌మాత్ ద‌వా చీఫ్ హ‌ఫీజ్ సయీద్ పాత్ర‌పై వాస్త‌వ‌మైన ఆధారాలుంటే త‌ప్ప విచార‌ణ చేయాలేమ‌ని పాక్ తోసిపుచ్చింది. తొమ్మిదేళ్ళ క్రితం జ‌రిగిన ముంబై దాడిలో 24 మంది భారత సాక్షుల‌ను విచారించి వారి వాంగ్మూలాల‌ను న‌మోదు చేయ‌డం మిన‌హా, కేసు విచార‌ణ మొత్తం పూర్త‌య్యిందని పాక్ తెలిపింది. ముంబై ఉగ్ర‌వాది దాడిలో 166 మంది మ‌ర‌ణించారు. స‌యీద్ ఈ దాడికి ప‌థ‌కం ర‌చించాడ‌ని భార‌త్ ఆరోపిస్తుంది.

ఉత్త‌ర‌కొరియాలో ఐరాస క‌మిటీ ప‌ర్య‌ట‌న‌..

-- Hyderabad Published:28 April 2017 05:21:26 PM

ఎట్ట‌కేల‌కు ఉత్త‌ర కొరియా దేశంలో ఐక్య‌రాజ్య‌స‌మితి ఆధ్వ‌ర్యంలో మాన‌వ హ‌క్కుల బృందం ప‌ర్య‌టించ‌నుంది. కేట‌లినా అగిల‌ర్ నేతృత్వంలో హ‌క్కుల బృందం దేశంలోని వివిధ కార‌ణాల‌తో వైక‌ల్యం పొందిన పౌరుల స్థితిగ‌తుల‌పై అధ్య‌యనం చేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌ర్జాతీయ స్థాయిలో ఓ పౌర హ‌క్కుల సంఘాన్ని త‌మ దేశ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తించ‌లేదు. ఆరురోజుల పాటు ఐక్య‌రాజ్య స‌మితి బృందం ప‌ర్య‌ట‌న చేయ‌నుంది. ప‌ర్య‌ట‌న నివేదిక‌ను ఉత్త‌ర‌కొరియా రాజ‌ధాని ప్యాంగ్ యాంగ్‌లో మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు.

ఫోన్‌కు రెస్పాండ్ కాకుండే చ‌ర్య‌లు త‌ప్ప‌వు..

-- Hyderabad Published:28 April 2017 05:09:27 PM

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కొత్త ముఖ్య‌మంత్రి యోగి అదిత్య‌నాథ్ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను స‌రైన ట్రాక్‌లో పెట్ట‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బయోమెట్రిక్ విధానంలో అటెండెన్స్ ఉండాల‌న్న నిర్ణ‌యం త‌ర్వాత ఆక‌స్మిక చ‌ర్య‌లు చేప‌ట్టారు. అంతంటితో ఆగ‌కుండా ఏ స‌మ‌యంలోనైనా ఉద్యోగులు విధుల్లో ఉన్నారో లేదో తెలుసుకోవ‌డానికి సీఎం సంబంధిత అధికారి ఆఫీస్ ల్యాండ్ లైన్‌కు ఫోన్ చేస్తాన‌ని, ఉద‌యం 9 గంట‌లు నుండి సాయంత్రం 6 గంట‌లు వ‌ర‌కు ఫోన్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఫోన్‌కు స‌మాధానం ఇవ్వ‌కుంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీనియ‌ర్ మినిష్ట‌ర్ శ్రీకాంత్ శ‌ర్మ తెలిపారు. త‌నిఖీలు, సూప‌ర్‌వైజింగ్‌లో ఉండే పోలీసు అధికారులు, ఇత‌ర ఫీల్డ్ వ‌ర్క్‌లోని ఉద్యోగుల‌కు ఇందులో మిన‌హాయింపు ఉంటుంద‌ని పెర్కొన్నారు.

అమ్మాయి ప్రేమలో పడితే ప్రారంభం

-- Hyderabad Published:27 April 2017 05:43:47 PM

హర్షవర్ధన్ ప్రొడక్షన్ హౌస్ లో హర్షవర్ధన్ నిర్మాతగా మణి దర్శకత్వం వహించి నటించిన చిత్రం `అమ్మాయి ప్రేమలో పడితే`. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ప్రముఖ నిర్మాత కె.ఎల్‌.దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు వీరశంకర్ క్లాప్ నివ్వడం తో ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. ఈ సందర్బంగా దర్శకుడు మణి మాట్లాడుతూ నాకు ఇది రెండవ సినిమా.. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత హర్ష కు ప్రత్యేక కృతఙ్ఞతలు. ఒక జంట ప్రేమలో ఉంటే ఎలా ఉంటారు ప్రేమలో లేకపోతే ఎలా ఉంటారు అనే ట్రూ లవ్ పైన ఈ చిత్ర కాన్సెప్ట్. మంచి కథ మరియు మంచి మ్యూజిక్ తో ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యం తో సినిమాను చేస్తున్నాం. మే లో అరకు ప్రాంతాలల్లో షూటింగ్ ప్రారంభిస్తామ‌ని తెలిపారు. ఈ చిత్రం లో 5 పాటలుంటాయి. తప్పకుండా సంగీతం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం తో ఉన్నానంటూ ఈ చిత్ర సంగీత దర్శకుడు భాను ప్రసాద్ తెలిపారు. ఇక ఈ చిత్ర కెమెరామెన్ ఫణి మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రుడు మణి కు నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా లో విసువల్ పరంగా చాలా అద్భుతంగా తెరకెక్కించాలని అనుకుంటున్నా.. అది ఈ సినిమా కు ప్లస్ అవుతుందని భావిస్తున్నా అని చెప్పారు. ఇంకా ఈ ప్రారంభిత్సవం లో హీరోయిన్ షాను తో పాటు నిర్మాత హర్షవర్ధన్, శ్రీనివాసరెడ్డి లు పాల్గొని అభినందనలు మరియు అభిప్రాయాలను తెలియ చేసారు.

ఈ చిత్రానికి హీరో - మణి, హీరోయిన్- షాను, సంగీతదర్శకుడు- భానుప్రసాద్, రైటర్- బండోజి, కెమరామెన్ - ఫణి, కారియోగ్రఫర్ -సూర్య, నిర్మాతలు -హర్షవర్ధన్ మరియు రమేష్ ,దర్శకుడు- మణి.

వినోద్ ఖ‌న్నా క‌న్నుమూత‌

-- Hyderabad Published:27 April 2017 05:34:14 PM

సీనియ‌ర్ బాలీవుడ్ హీరో వినోద్ ఖ‌(70)న్నా క్యాన్స‌ర్‌తో క‌న్నుమూశారు. 1968లో మ‌న్ కా మీత్ చిత్రంతో తెరంగేట్రం చేసిన వినోద్ ఖ‌న్నా2015 వ‌ర‌కు విల‌న్‌గా, హీరోగా 140 చిత్రాల‌కు పైగా న‌టించారు. ‘మేరే గావ్‌ మేరా దేశ్‌’, ‘గ‌ద్దార్‌’(1973), ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’, ‘రాజ్‌పుత్‌’, ‘ఖుర్బానీ’, ‘దయావన్‌’ తదితర చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచుకున్నారు. వినోద్ ఖ‌న్నా న‌టించిన చివ‌రి చిత్రం దిల్‌వాలే. సినీ రంగంతో పాటు రాజ‌కీయ రంగంలో కూడా వినోద్ ఖ‌న్నా త‌న‌దైన ముద్ర వేశారు. ప్ర‌స్తుతం గురుదాస్ పూర్ పార్ల‌మెంట్ స‌భ్యుడుగా కొన‌సాగుతున్నారు. 141 చిత్రాల్లో పలు పాత్రల్లో కన్పించిన వినోద్‌ ఖన్నా.. ఫిలింఫేర్‌ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఫిలింఫేర్‌ అవార్డు, స్టార్‌ డస్ట్‌ అవార్డు, జీ సినిమా లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నటించిన మేరే అప్నే అనే హిందీ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు.

ఇండియ‌న్ సినిమా అంటే బాహుబ‌లి అనే రేంజ్‌కు చేర‌డం గ‌ర్వంగా ఉంది - ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి

-- Hyderabad Published:27 April 2017 05:30:34 PM

బాహుబలితో తెలుగు సినిమాకు కొత్త సొబగులు అద్దారు దర్శకుడు రాజమౌళి. తెలుగు వాడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. బాహుబలి స్వప్నాన్ని నెరవేర్చుకోవడానికి ఐదేళ్ల పాటు మహా యజ్ఞమే చేశారాయన. ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు... అన్నింటిని దాటుకొని బాహుబలి ది బిగినింగ్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రాజమౌళి. దేశంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలబెట్టారు. ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన చిత్రం బాహుబలి ది కన్‌క్లూజన్‌. ఆర్కా మీడియా పతాకంపై రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందఠంగా దర్శకుడు రాజమౌళి బుధవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ సంగతులివి...

బాహుబలి ప్రపంచ స్థాయి గుర్తింపుకు కారణం?

 - సాధారణ సినిమాలతో పోలిస్తే ఈ కథలో ఉన్న భారీతనం, గ్రాఫిక్స్‌, పోరాట ఘట్టాలతో పాటు పలు అంశాలు సినిమా పట్ల అందరిలో ఆసక్తిని పెంచాయి. అన్నింటి కంటే ముఖ్యంగా పాత్రల్లో ఉన్న బలం ప్రేక్షకుల మనసుల్లో బాహుబలిని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది. ఓ సినిమాను చూస్తూ ఎంజాయ్‌ చేస్తే అది మంచి సినిమా అవుతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అందులోని పాత్రలను మరచిపోలేక పోతే అది గొప్ప సినిమా అవుతుంది. బాహుబలి రెండో కోవకు చెందిన సినిమా.

బాహుబలి కోసం ఐదేళ్ళు సమయం కేటాయించే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది?

- బాహుబలి సినిమా ప్రారంభించిన రోజు ఐదేళ్లు పడుతుందని ఊహించలేదు. ఒకసారి మొదలుపెట్టిన తర్వాత వెనక్కి వెళ్లలేము కదా..అందుకు ముందుకెళ్ళాం. అయితే మంచి టీం దొరికింది. ప్రొడ్యూసర్‌ నుంచి లైట్‌బాయ్‌ వరకు కుటుంబంలా కలిసిపోయి పనిచేశాం. అందుకే నాపై చాలా భారం ఉన్నా ఎప్పుడూ దానిని బరువుగా ఫీలవ్వలేదు.

కట్టప్ప బాహుబలిని చంపాడనే ప్రశ్న ఇన్ని రోజులు ఆసక్తిని క్యారీ చేస్తుంని అనుకున్నారా?

-బాహుబలిని ప్రారంభించినపుడు ఆ ఆలోచన లేదు. ఎలాంటి గందరగోళం లేకుండా బాహుబలిని అందరూ కీర్తించే సన్నివేశంతో తొలి భాగాన్ని ముగించాలని అనుకున్నాం. కానీ సాదాసీదా ముగింపు కాకుండా సినిమాలోని ప్రధాన పాత్రలను చూపిస్తూ జనాలకు ఓ ట్విస్ట్‌లాంటిది ఇస్తే బాగుంటుందని అనిపించింది. ఆ ఆలోచనతోనే కట్టప్ప బాహుబలిని చంపే సన్నివేశాన్ని చూపించాం. అది మంచి జలక్‌ అవుతుందని అనుకున్నాం కానీ ఆటంబాంబులా పేలి జనాల మనసులో బలంగా నిలిచిపోతుందని ఊహించలేదు.

బాహుబలి 2 విడుదలకు దాదాపు రెండేళ్ళ సమయం పట్టినట్టు ఉంది?

-రెండు భాగాల మధ్య పద్దెనిమిది నెలల పాటు గ్యాప్‌ వస్తుందని ఊహించలేదు. తొలి భాగాన్ని విడుదల చేసిన నాలుగు నెలల తర్వాతగానీ ఆరు నెలలు తర్వాతగానీ రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించాం. కానీ బాహుబలి ది బిగినింగ్‌తోనే మా వద్ద ఉన్న డబ్బులు మొత్తం అయిపోవడంతో సెకండ్‌ పార్ట్‌ చిత్రీకరణ ఆలస్యమైంది. ప్రేక్షకులు గుర్తించుకుంటారో లేదో అనే ఆలోచనలకు తావులేకుండా మేము నమ్మింది చేసుకుంటూ వెళ్లాం.

దర్శకుడిగా, కథకుడిగా బాహుబలి మీకు సంత ప్తిని మిగిల్చిందా?

-ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలతో పోలిస్తే కథకుడిగా బాహుబలి నాకు ఎక్కువ సంత ప్తిని మిగిల్చింది. నా గత సినిమాలన్నీ హీరోయిజం నేపథ్యంలో రూపొందాయి. కానీ వాటికి భిన్నంగా ఐదారు బలమైన పాత్రల ఆధారంగా బాహుబలి సినిమా చేశాను. నాకు బాగా ఇష్టమైన హీరోయిజాన్ని ఉన్నతంగా చూపించే అవకాశం ఈ సినిమాతో దొరికింది.

దర్శకుడిగా అనుకున్నదాన్ని తెరపై చూపించగలిగారా?

-ఏ దర్శకుడు తన మస్తిష్కంలో ఉన్న ఆలోచనలను హండ్రెడ్‌ పర్సెంట్‌ తెరపై చూపించలేదు. మనసులో చాలా ఆలోచనలు ఉంటాయి. కానీ వాస్తవంగా వాటిని తెరపై చూపించే విషయంలో హీరోలు, బడ్జెట్‌, డేట్స్‌.. ఇలా పలు అంశాల ప్రభావం వాటిపై ఉంటుంది. ఆ పరిధిలను ద ష్టిలో పెట్టుకునే మనం అనుకున్న అంశాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేయాలి. బాహుబలి-2 విషయంలో నా మనసులో ఉన్న కథను దాదాపు చూపించానని అనుకుంటున్నాను. స్టోరీ టెల్లర్‌గా, డైరెక్టర్‌గా బాహుబలి నాకు శాటిస్పాక్షన్‌ ఇచ్చిన సినిమా.

బాహుబలి మొదలుపెట్టినపుడు ఈ స్థాయికి చేరుకుంటుందని ఊహించారా?

-ఈ సినిమా విషయంలో మేము ఊహించిన దానికంటే ప్రేక్షకులు ఎన్నో రేట్లు ఎక్కువ తిరిగిఇచ్చారు. సినిమా హిట్టవుతుందని అనుకున్నాం కానీ ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుందని ఊహించలేదు. భిన్న భాషలకు చేరువ అవుతుందని, పలు దేశాల వారు మమ్మల్ని గౌరవించే స్థాయికి తీసుకెళ్తుందని ఊహించలేదు.

పార్ట్‌ 1కు వచ్చిన రెస్పాన్స్‌ చూసి పార్ట్‌ 2 కథలో మార్పులేమైనా చేశారా?

- నా దృష్టిలో బాహుబలి మొత్తం ఒకే కథ. ప్రేక్షకుడికి సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పాలనే ఉద్దేశ్యంతోనే రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందించాం.ఇప్పటికే సగం చెప్పాను. మిగతా దానిని రెండో భాగంలో చూపించబోతు న్నాననే ఆలోచనే ఎప్పుడూ నా మనసులో ఉండేది. అంతే తప్ప తొలి భాగం విజయవంతమైందని రెండో భాగంలో ప్రేక్షకుడిని మెప్పించడం కోసం ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. కథ అనుకున్నప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానో దానినే చూపించాను. కథలో బలం ఉంది కాబట్టి ఎప్పుడూ భయపడలేదు.

బాహుబలితో దర్శకుడిగా మీ లక్ష్యం నెరవేరిందా?

-నా లక్ష్యాలు, గమ్యాలు అన్ని ఎప్పుడో నెరవేరాయి. పెద్ద దర్శకుడిని కావాలని అనుకొని చిత్రసీమలో అడుగుపెట్టాను. తొలి నాళ్లలోనే ఆ కోరిక నెరవేరింది. మహాభారతాన్ని తెరకెక్కించాలన్న లక్ష్యమొక్కటే మిగిలింది. కానీ ఇంకో పదేళ్ల వరకు ఆ సినిమా చేయలేను కావచ్చు.

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం ఎలా అనిపిస్తుంది?

-తెలుగుతో పాటు దక్షిణాది చిత్రసీమ అంటూ ఒకటుందని ప్రపంచంలో చాలా దేశాల వారికి తెలియదు. ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ మాత్రమే గుర్తుకువస్తుంది. కానీ అసలైన భారతీయ సినిమా అంటే బాహుబలి అని చెప్పుకునే స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లినందుకు గర్వపడుతున్నాను.

ఇంతటి భారీ చిత్రాన్ని రూపొందించడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలేవి?

-నిర్మాతలు, ప్రభాస్‌తో పాటు కుటుంబ ప్రోత్సాహంతోనే ఈ సినిమా పూర్తి చేయగలిగాను. నన్ను, నా కథను, ప్రతిభను నమ్మి వారి జీవితాల్ని రిస్క్‌లో పెట్టి మరో ఆలోచన లేకుండా నిర్మాతలు ముందుకు వచ్చారు. మా కుటుంబం నన్ను ఐదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడింది. నేను కన్న కలను సాకారం చేసుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ నాకు అండగా నిలిచారు.కుటుంబం లేనిదే నేను లేను. అలాగే ప్రభాస్‌ సినిమాను పెద్ద స్థాయిలో నిలబెట్టడం కోసం చాలా కష్టపడ్డాడు.

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌..?

- ఇంకా ఏం ఆలోచించలేదే. హాలీడే ట్రిప్‌ వెళ్ళి వచ్చి ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తాను.

భార‌త్‌,శ్రీలంక మ‌ధ్య సంబంధాలు మ‌రింత మెరుగు...

-- Hyderabad Published:27 April 2017 10:51:22 AM

భార‌త్ పొరుగు దేశ‌మైన శ్రీలంక ప్ర‌ధాని ర‌ణిల్ విక్ర‌మ సింఘె భార‌త్‌లో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో రెండు దేశాల మ‌ధ్య సంబంధ బాంధ‌వ్యాల గురించి ప్ర‌ధానుల మ‌ధ్య విస్తృత‌మైన చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఆర్ఢిక ప‌ర‌మైన సంబంధాల‌ను మెరుగు ప‌రుచుకునేందుకు ఒప్పందాలు కుదిరాయి. ఇదే సంద‌ర్భంలో భార‌త జాల‌ర్ల ప‌ట్ల మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించాల‌ని భార‌త విదేశాంగ శాఖ తెలిపింది. ప్ర‌ధాని మోదీ ఏర్పాటు చేసిన విందును శ్రీలంక ప్ర‌ధాని ర‌ణిల్ విక్ర‌మ్ సింఘె స్వీక‌రించారు. ద‌క్షిణాసియాలో ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్ర‌వాద సంస్థ‌తో ఉన్న ముప్పును ఎలా ఎదుర్కొవాల‌నే దానిపై భార‌త హోం మంత్రి, విక్ర‌మ సింఘె మ‌ద్య చర్చ‌లు జ‌రిగాయి. ఐఎస్ ముప్పైపై ఇరు దేశాల భ‌ద్ర‌త సంస్థ‌ల మ‌ధ్య సంప్ర‌దింపులు నిరంతరొ కొన‌సాగాల‌ని ఇద్ద‌రు నాయ‌కులు తెలిపారు.

స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌పై సుప్రీం కొర‌డా

-- Hyderabad Published:27 April 2017 10:49:00 AM

స్వ‌చ్ఛంద సంస్థ‌ల నిధుల దుర్వినియోగంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ అన్నా హజారే అధ్వ‌ర్యంలో హింద్ స్వ‌రాజ్ ట్ర‌స్ట్ దాఖ‌లు చేసిన ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీం కోర్టు స్వ‌చ్ఛంద సంస్థ‌ల నియంత్ర‌ణ‌పై నూత‌న చ‌ట్టం తీసుకు రావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది. సంస్థ‌ల‌కు నిధులు మంజూరు, నిధులు మిగ‌లుపై తీసుకోవాల్సిన చర్య‌లు త‌దిత‌ర అంశాల‌పై ఎనిమిది వారాల్లో నివేదిక స‌మ‌ర్పించాల‌ని జ‌స్టిస్ జె.ఎస్‌.ఖెహ‌ర్‌, డి.వై.చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ ఎస్‌.కె.కౌల్‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఉత్త‌ర్వులు కోరింది. కౌన్సిల్ ఫ‌ర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ పీపుల్ యాక్ష‌న్ అండ్ రూర‌ల్ టెక్నాల‌జీ(క‌పార్ట్‌) నివేదిక నిధులు దుర్వినియోగం చేసిన 159 సంస్థ‌లపై కేసులు న‌మోదు చేయాల‌ని సిపార్స్ చేసిన‌ట్టు తెలిపింది. నిషిద్ధ జాబితాలోని 718 సంస్థ‌ల్లో వ్య‌య వివ‌రాలు సమ‌ర్పించిన 15 సంస్థ‌ల‌ను జాబితా నుండి తొల‌గించామ‌ని తెలిపాం.

హుగ్లీలో కూలిన బ్రిడ్జ్‌..

-- Hyderabad Published:27 April 2017 10:46:31 AM

ప‌శ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. భ్రందేశ్వ‌ర్ ప్రాంతంలో ఓడ‌లో ఎక్కేందుకు నిర్మించిన బ్రిడ్జ్ కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మ‌ర‌ణించ‌గా 65 మంది గ‌ల్లంత‌య్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లాన్ని చేరుకుని స‌హాయ చర్య‌లు చేప‌ట్టారు. స‌ముద్రంలో భారీ అల‌లు కార‌ణంగా వంతెన కూలిపోయింద‌ని అధికారులు పెర్కొన్నారు. గ‌ల్లంతైన వారి కోసం గ‌జ ఈత‌గాళ్ళు గాలింపు చర్య‌లు చేప‌ట్టారు

2014 త‌ర్వాత టీచ‌ర్ డిగ్రీలు చెల్ల‌వు

-- Hyderabad Published:27 April 2017 10:42:23 AM

2014లో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండ‌లి జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం తెలుగు పండిత, ఉర్దూ, హిందీ పండిత శిక్ష‌ణ కోర్సులేవీ చెల్ల‌వు. 2014కు ముందు ఎస్‌సిఇటి గుర్తింపు క‌లిగి ఉండే మాత్ర‌మే మిన‌హాయింపు ఉంటుంది. ఈ డిగ్రీతో స‌మానంగా ఉన్న 16 ర‌కాల కోర్సులు కూడా చెల్లుబాటు కావ‌ట‌. తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్‌, గురుకుల టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీకి దర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొత్త పేర్ల‌తో డిగ్రీలు పెట్టిన ద‌ర‌ఖాస్తులు వ‌స్తుండ‌టంతో ఎస్‌సిఇఆర్‌టి నుండి స్ప‌ష్ట‌త తీసుకురావాల‌ని టిఎస్‌పీఎస్పీ స్ప‌ష్టం చేసింది. అభ్య‌ర్థులు దీనిపై విద్యాశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రంజీవి్ ఆర్ ఆచార్య‌, పాఠ‌శాల విద్య డైరెక్ట‌ర్ కిష‌న్‌, ఎస్‌సిఇఆర్‌టి డైరెక్ట‌ర్ జ‌గ‌న్నాథ‌రెడ్డిని క‌లిశారు. యూజిసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. ఆ కోర్సుల్లో 16 డిగ్రీల‌కు యూజిసి గుర్తింపు లేద‌ని, మ‌రో 7 ర‌కాల డిగ్రీల‌పై సందేహాలున్నాయ‌ని తెలిపారు. దీంతో డిగ్రీల విష‌యంలో ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా మెల్కొనాల‌ని విద్యాశాఖ వ‌ర్గాలు పెర్కొన్నాయి.

స‌మ్మ‌ర్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న రాజ‌శేఖ‌ర్‌, ప్ర‌వీణ్ స‌త్తారు పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ 126.18M

-- Hyderabad Published:27 April 2017 10:31:25 AM

అంకుశం, అగ్ర‌హం, మ‌గాడు వంటి ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మేన్‌గా వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన డా.రాజ‌శేఖ‌ర్ ట‌ఫ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా జ్యోస్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ చిత్రం``పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ 126.18M``. పూజా కుమార్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. రీసెంట్‌గా శృంగార తార స‌న్నిలియోన్‌పై చిత్రీక‌రించిన స్పెష‌ల్ సాంగ్ పూర్త‌వ‌డంతో ఈ చిత్రం ఏడు రోజులు మిన‌హా షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను స‌మ్మ‌ర్ సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.                                   చంద‌మామ క‌థ‌లు, గుంటూరుటాకీస్ వంటి విల‌క్ష‌ణ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు రూపొందిస్తున్న ఈ చిత్రం కోసం ముంబై పిలింసిటీలో భారీ సెట్ వేసి స‌న్నిలియోన్‌పై స్పెష‌ల్ సాంగ్‌ను చిత్రీక‌రించారు. గందిబాత్‌...`, `రాం చాహే లీల చాహే...` వంటి బాలీవుడ్ సూప‌ర్‌హిట్స్‌కు కొరియోగ్ర‌ఫీ అందించిన విష్ణుదేవా నేతృత్వంలో 50 డ్యాన్స‌ర్స్‌తో మూడు రోజుల పాటు సాంగ్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రిపారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు, యాంగ్రీ యంగ్ మేన్ రాజ‌శేఖ‌ర్‌ను స‌రికొత్త లుక్‌లో ప్రెజంట్ చేస్తున్నారు. అల్రెడి విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌కు ఆడియెన్స్‌ను నుండి మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. క్రేజీ కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రం మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు స‌న్నిలియోన్ స్పెష‌ల్ సాంగ్ చేయ‌డం గ‌రుడ వేగ‌పై అంచ‌నాల‌ను ఇంకా పెంచుతుంది. డా.రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, అరుణ్ అదిత్‌, కిషోర్‌, ర‌వివ‌ర్మ‌, చ‌ర‌ణ్ దీప్‌, నాజ‌న్‌, షాయాజీ షిండే, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఆర్ట్ః శ్రీకాంత్‌, సినిమాటోగ్ర‌ఫీః అంజి, మ్యూజిక్ః శ్రీచ‌ర‌ణ్‌, జ్యోస్టార్ ఎంట‌ర్ ప్రైజెస్, నిర్మాతః కోటేశ్వ‌ర‌రాజు, ద‌ర్శ‌క‌త్వంః ప్ర‌వీణ్ స‌త్తారు.

కె.విశ్వ‌నాథ్ 12 చిత్రాల డిస్క్ విడుద‌ల చేస్తార‌ట‌.

-- Hyderabad Published:26 April 2017 03:30:28 PM

క‌ళా త‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్‌కు దాదా సాహెబ్ పాల్కే అవార్డు రావ‌డం ప‌ట్ల తెలుగు ఇండ‌స్ట్రీ అంతా సంతోషాన్ని వ్య‌క్తం చేస్తుంది. జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కె.విశ్వ‌నాథ్‌ను క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కూడా ప‌వ‌న్‌తో కలిసి కె.విశ్వ‌నాథ్ ఇంటికి వెళ్ళారు. విశ్వ‌నాథ్‌కు దాదా సాహెబ్ పాల్కే అవార్డు రావ‌డం తెలుగువారికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్న ప‌వ‌న్‌, తాను శంక‌రాభ‌ర‌ణం సినిమాను చాలా సార్లు చూశాన‌ని, విశ్వ‌నాథ్ తీసిన శుభ‌లేఖ‌, స్వాతిముత్యం, శంక‌రాభ‌ర‌ణం త‌న‌కు చాలా ఇష్ట‌మైన చిత్రాల‌నీ అన్నారు. విశ్వ‌నాథ్ తీసిన 12 చిత్రాల‌తో ఓ డిస్క్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు కూడా ప‌వ‌న్ తెలిపారు.

అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌పై సౌదీ కొర‌డా...

-- Hyderabad Published:26 April 2017 03:26:41 PM

దేశంలోని అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌పై సౌదీ అరేబియా కొర‌డా ఝులిపించింది. జూన్ 30 వ‌ర‌కు నిర్ణీత గ‌డువును విధించిన సౌదీ ఆలోపు దేశంలోని అక్ర‌మ వ‌ల‌స‌దారులందరూ వెళ్ళిపోవాల‌ని ఆర్డ‌ర్ జారీ చేసింది. దీంతో ఇప్ప‌టికే 12000 వేల మంది బంగ్లాదేశీయులు స్వదేశానికి ప‌య‌నం కావ‌డానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇచ్చిన గ‌డువులోగా వెళ్ల‌ని వారికి జైలు శిక్ష‌తో పాటు, జ‌రిమానా కూడా విధిస్తామ‌ని సౌదీ ప్ర‌క‌టించింది. ఇటువంటి వారి కోసం ప్ర‌త్యేక‌మైన జైళ్ళ‌ను కూడా సిద్ధం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. అనుకున్న గ‌డువులోగా ప‌ది ల‌క్ష‌ల మందిని దేశం బ‌య‌ట‌కు పంపాల‌నే కృత నిశ్చ‌యం తీసుకుంది.

స్లొవేనియా వెళ్తున్న గంటా రవి, జయంత్‌ సి. పరాన్జీల జయదేవ్‌

-- Hyderabad Published:26 April 2017 03:23:59 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్‌'. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే చివరి వారంలో విడుదల చేయడానికి నిర్మాత కె.అశోక్‌కుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

ఏప్రిల్‌ 27న 'జయదేవ్‌' టీజర్‌

నిర్మాత కె.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ - ''జయంత్‌ దర్శకత్వంలో ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్‌ తర్వాత మూడో చిత్రంగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుగారి తనయుడు గంటా రవి హీరోగా పరిచయం చేస్తూ పవర్‌ఫుల్‌, పర్పస్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా 'జయదేవ్‌' చిత్రాన్ని నిర్మిస్తున్నాము. వివిధ లొకేషన్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ భారీ లెవ్‌ల్‌లో చేశాం. ఏప్రిల్‌ 27 సాయంత్రం గం 4.25లకు 'జయదేవ్‌' టీజర్‌ను విడుదల చేస్తున్నాం. అలాగే ఏప్రిల్‌ 30న ఈ చిత్రంలోని ఫస్ట్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేస్తున్నాం. ఏప్రిల్‌ 30 నుంచి మే 8 వరకు స్లొవేనియాలో రెండు పాటల్ని చిత్రీకరించడం జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. మే చివరి వారంలో చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ మాట్లాడుతూ - ''అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఎలిమెంట్స్‌ ఈచిత్రంలో వున్నాయి. ఇది ఒక సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కథ. విధి నిర్వహణ కోసం తమ కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసే ఎంతో మంది పోలీస్‌ ఆఫీసర్ల ఇన్‌స్పిరేషన్‌తో 'జయదేవ్‌' క్యారెక్టర్‌ని డిజైన్‌ చెయ్యడం జరిగింది. ఈ చిత్రంలో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే పది భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ వున్నాయి. కథతో లింక్‌ అయి వున్న ఈ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ సినిమాకి హైలైట్‌ అవుతాయి. అశోక్‌కుమార్‌గారి బేనర్‌లో 'ఈశ్వర్‌'తో ప్రభాస్‌ని హీరోగా పరిచయం చేశాం. మళ్ళీ ఇదే బేనర్‌లో 'జయదేవ్‌' చిత్రంతో గంటా రవిని హీరోగా నా దర్శకత్వంలో ఇంట్రడ్యూస్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.

గంటా రవి, మాళవిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్‌కుమార్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్‌, హరితేజ, శ్రావణ్‌, సుప్రీత్‌, కోమటి జయరామ్‌, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్‌, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్‌, అరవింద్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి

సంగీతం: మణిశర్మ,

సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి,

మూల కథ: అరుణ్‌కుమార్‌,

రచన: పరుచూరి బ్రదర్స్‌,

ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌,

ఫైట్స్‌: వెంకట్‌,

ఆర్ట్‌: కృష్ణమాయ, స్టిల్స్‌ నారాయణ,

కో-డైరెక్టర్‌: ప్రభాకర్‌ నాగ్‌,

ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి.రామమోహన్‌రావు,

నిర్మాత: కె.అశోక్‌కుమార్‌,

దర్శకత్వం: జయంత్‌ సి. పరాన్జీ.

విడుదలకు ముస్తాబవుతున్న సందీప్ కిషన్ నక్షత్రం

-- Hyderabad Published:26 April 2017 03:14:12 PM

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”.

'నక్షత్రం' చిత్రం ఒక్క పాట మినహా పూర్తయింది. ఈ గీతాన్ని ఓ ప్రముఖ కథానాయిక పై త్వరలోనే చిత్రీకరించ నున్నామని చిత్ర నిర్మాతలు తెలిపారు.అలాగే చిత్రం టీజర్ విడుదల ను ఓ వేడుకగా నిర్వహించనున్నామని తెలిపారు. ఈ చిత్రం లో సుప్రీం హీరో 'సాయి ధరమ్ తేజ్' పోషిస్తున్న పాత్ర అభిమానులను ఎంతగానో అలరిస్తుందన్నారు. మే నెలలో ఆడియో, అదేనెలలో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తు న్నట్లు తెలిపారు. 'పోలీస్ 'అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ 'నక్షత్రం' చిత్రమని తెలిపారు దర్శకుడు కృష్ణవంశీ. సందీప్ కిషన్, రెజీనా,ప్రగ్య జైస్వాల్,తులసి,జె.డి.చక్రవర్తి,ప్రకాష్ రాజ్,శివాజీరాజా, రఘుబాబు,తనీష్,ముఖ్తర్ ఖాన్,సాయికిరణ్, ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి

మాటలు: తోట ప్రసాద్,పద్మశ్రీ,కిరణ్ తటవర్తి,

సంగీతం: భీమ్స్,భారత్,

పాటలు: అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్,

కెమెర:శ్రీకాంత్ నారోజ్,

ఎడిటర్: శివ.వై.ప్రసాద్,

కొరియోగ్రఫీ: గణేష్,స్వామి;

పోరాటాలు:జాషువా మాస్టర్,జాలి బాస్టియన్,శ్రీధర్;

ఆర్ట్: పురుషోత్తం,

పబ్లిసిటీ: ఓంకార్ కడియం,

స్టిల్స్: మల్లిక్

నిర్మాతలు:ఎస్.వేణుగోపాల్,సజ్జు,కె.శ్రీనివాసులు

కధ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం; కృష్ణవంశీ

ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న అంటూ బెదిరిస్తున్న బిజెపి నాయ‌కులు

-- Hyderabad Published:26 April 2017 12:53:35 PM

ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేసిన బిజెపి..ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కుల‌కు గాలం వేస్తుంది. ఈ విష‌యాన్ని చాందిని చౌక్ ఎమ్మెల్యే అల్కా లంబా ఆరోపించారు. త‌న‌కు కూడా లోక్‌స‌భ సీటు ఇస్తామ‌ని ఆశ చూపార‌ని ఆమె మీడియా స‌మావేశంలో తెలిపారు. ఆప్ ప‌నైపోయిందంటూ బిజెపి నాయ‌కులు ఫోన్లు చేస్తున్నార‌ని, ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధిస్తామ‌ని కూడా చెబుతూ బెదిరింపులకు పాల్ప‌డుతున్నారంటూ అల్కా లంబా ఆరోపించారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో క‌మ‌లం విజ‌యం ఈవీఎంల మోసం వ‌ల్లే అని ఆరోపిస్తున్నారు.

సైనా నెహ్వాల్ ఎవ‌రో తెలిసిపోయింది..

-- Hyderabad Published:26 April 2017 12:48:59 PM

బాడ్మింట‌న్ స్టార సైనా నెహ్వాల్ జీవిత క‌థ‌తో సినిమా రూపొంద‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతుంది. ద‌ర్శ‌కుడు అమోల్ గుప్తా తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాను భూష‌ణ్ నిర్మిస్తున్నారు. సైనా నెహ్వాల్ బ‌యోపిక్‌కు బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ అయితే న్యాయం చేస్తుంద‌ని భావించిన ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెను సంప్ర‌దించార‌ట‌. శ్ర‌ద్ధా కూడా ఏ మాత్రం ఆలోచించ‌కుండా న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ట‌. ఎంతో మందికి ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచిన సైనా నెహ్వాల్ బ‌యోపిక్ చేయ‌డం అదృష్టం అంటూ శ్ర‌ద్ధా త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసింది.

సందీప్ కిష‌న్‌తో బాలీవుడ్ హీరోయిన్...

-- Hyderabad Published:26 April 2017 11:21:22 AM

ధ‌నుష్‌తో అనేకుడు(త‌మిళంలో అనేగ‌న్‌) చిత్రంలో న‌టించి మెప్పించిన హీరోయిన్ అమైరా ద‌స్త‌ర్, త‌ర్వాత జాకీచాన్ కుంగ్‌ఫూ యోగ చిత్రంలో కూడా న‌టించింది. తెలుగులో మంచు విష్ణు స‌ర‌స‌న న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చినా ఏవో కార‌ణాల‌తో వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో అమైరా ఆ సినిమాల‌ను చేయ‌లేదు. అయితే తెలుగులో అమైరా ద‌స్త‌ర్ తొలి చిత్రం సందీప్ కిష‌న్ స‌ర‌స‌న న‌టించ‌నుంద‌ని స‌మాచారం. ముందుగా మంజుల ద‌ర్శ‌కత్వంలో రూపొంద‌నున్న ఈ సినిమాలో ముందుగా సాయిప‌ల్ల‌విని హీరోయిన్‌గా అనుకున్నారు కానీ సాయిప‌ల్ల‌బి బిజీ షెడ్యూల్ కార‌ణంగా డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోవ‌డంతో యూనిట్ వ‌ర్గాల అమైరాను సంప్ర‌దించాయట‌. త్వ‌ర‌లోనే అధికార‌క స‌మాచారం రావ‌చ్చు.

హ్యుజ్ రెస్పాన్స్ రాబ‌ట్టుకున్న రాజ్‌త‌రుణ్ అంధ‌గాడు టీజ‌ర్

-- Hyderabad Published:26 April 2017 10:30:28 AM

ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధ‌గాడు`. కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం-ఆడోర‌కం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర‌ప్రసాద్ కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు `అంధ‌గాడు` అల్రెడి విడుద‌లైన పోస్ట‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. తొలిసారి రాజ్‌త‌రుణ్ గుడ్డివాడి పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. నిన్న‌ విడుద‌లైన టీజ‌ర్‌కు హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. కంప్లీట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కామెడి, ల‌వ్‌, యాక్ష‌న్‌, సస్పెన్స్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ స‌మ‌పాళ్ళ‌లో ఉండేలా ద‌ర్శ‌కుడు వెలిగొండ శ్రీనివాస్ డిఫ‌రెంట్ స్క్రిప్ట్‌తో తెర‌కెక్కించారు. స్ట్రాంగ్ అండ్ ఎగ్జ‌యిట్‌మెంట్ పాయింట్‌తో సినిమా అంతా ర‌న్ అవుతుంది. మే 26న సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర‌, షాయాజీ షిండే, స‌త్య‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న

ఈ చిత్రానికి

కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌,

సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌,

ఆర్ట్ః కృష్ణ మాయ‌,

చీఫ్ కోడైరెక్ట‌ర్ః సాయి దాసం,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గ‌రికిపాటి,

స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌,

నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌,

క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు,దర్శ‌క‌త్వంః వెలిగొండ శ్రీనివాస్‌.

వ్యోమ‌గామి పాత్ర‌లో ప్రియాంక చోప్రా...

-- Hyderabad Published:26 April 2017 10:25:40 AM

భార‌త సంత‌తికి చెందిన తొలి మ‌హిళా వ్యోమ‌గామి కల్ప‌నా చావ్లా జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొంద‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా టైటిల్ పాత్ర‌లో న‌టించ‌నుందని సినీ వ‌ర్గాల స‌మాచారం. ప్రియా మిశ్రా అనే డెబ్యూ డైరెక్ట‌ర్ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ఈ సినిమాపై ప్రియా మిశ్రా ఏడేళ్ళుగా ప‌నిచేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే సినిమాను కొత్త నిర్మాణ సంస్థ నిర్మించ‌నుంది. క్వాంటికో సిరీస్‌తో పాటు హాలీవుడ్ మూవీ బేవాచ్‌లో ప్రియాంక న‌టిస్తుంది.

ఎన్టీఆర్ మూవీ శాటిలైట్ హ‌క్కులు అమ్ముడైపోయాయి...

-- Hyderabad Published:26 April 2017 10:22:32 AM

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం `జై ల‌వ‌కుశ`. సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్‌ను జ‌రుపుకుంటుంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రంలో రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్‌, నందిత‌రాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. జ‌న‌తాగ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా చిత్రీక‌ర‌ణలో ఉండ‌గానే శాటిలైట్ హ‌క్కులు అమ్ముడైపోవ‌డం సినిమాపై అంచ‌నాల‌కు తార్కాణం. టాలీవుడ్‌లో వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం జెమిని టీవీ, సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను 14 కోట్ల‌కు కోనుగోలు చేసింద‌ట‌.

ర‌ష్య‌న్ మూవీలో రానా..

-- Hyderabad Published:26 April 2017 10:20:58 AM

న‌టుడుగా ఏడేళ్ళ కెరీర్‌ను పూర్తి చేసుకున్న ద‌గ్గుబాటి రానా రీసెంట్‌గా `ఘాజీ`తో ఈ ఏడాది స‌క్సెస్ కొట్టాడు. ఏప్రిల్ 28న `బాహుబ‌లి2` కూడా రానుండ‌టం విశేషం. స్టార్ ప్రొడ్యూస‌ర్ మ‌న‌వ‌డైనా హీరోగానే నిల‌దొక్కుకోవాల‌ని కాకుండా విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా విభిన్న‌మైన పాత్ర‌ల్లో మెప్పించాడు. బాహుబ‌లిలో భ‌ళ్ళాల‌దేవుడుగా అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రానా ఓ ర‌ష్య‌న్ సినిమాలో న‌టించ‌బోతున్నాడు. ఆదిత్యాచార్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మూమెంట‌రీ లాప్స్ ఆఫ్ రీజ‌న్ అనే హ